For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కడుపు వికారం మరియు ఉబ్బరానికి సూచించదగిన 7 సహజసిద్దమైన గృహ చిట్కాలు

|

ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో, లేదా సందర్భంలో కడుపునొప్పి లేదా ఉబ్బరం వంటి సమస్యలను ఎదుర్కోవడం అత్యంత సాధారణమైన సమస్యగా ఉంటుంది. కడుపు నొప్పిని అనుభవించడానికి డజన్ల కొద్దీ కారణాలు ఉన్నాయి.

కానీ వీటిలో అనేక కారణాలు తీవ్రమైనవి కావు మరియు లక్షణాలు, చికిత్సా విధానాలు కూడా త్వరితగతినే ఉంటాయి. సాధారణంగా, ఇటువంటి సమస్యలకు పరిష్కారంగా మీ వంటగదే అన్నిటా అనువైన మార్గంగా ఉంటుంది.

1. బిట్టర్స్ మరియు సోడా:

1. బిట్టర్స్ మరియు సోడా:

వికారం నుండి ఉపశమనం కోసం సోడా అనేది చివరి స్థానంలో ఉంటుంది. కానీ అనేక మందికి టానిక్, క్లబ్ సోడా, లేదా జింజర్ ఏల్ మొదలైన వాటిలో కాక్టైల్ బిట్టర్స్ వంటివాటిని ఐదు లేదా ఆరు చుక్కలు జోడించడం అలవాటుగా కలిగిఉంటారు.

అత్యంత సాధారణమైన బిట్టర్స్ బ్రాండ్లలో, దాల్చినచెక్క, సోపు, పుదీనా, మరియు అల్లం వంటి మూలికల మిశ్రమాలను కలిగి ఉంటాయి. వికారాలను తగ్గించుట కొరకు వీటిని వినియోగిస్తుంటారు.

2. అల్లం:

2. అల్లం:

ప్రాచీన కాలం నుండి, ప్రజలు నొప్పి, వికారం మొదలైన అనేక సమస్యల నుండి బయటపడేందుకు, అల్లాన్ని అనుసరించేవారు అంటే ఆశ్చర్యం కలుగక మానదు. అలాగని చాదస్తం అంతకన్నా కాదు. కొన్ని రకాల కడుపు నొప్పులకి అల్లం అత్యంత ప్రభావవంతమైన చికిత్సగా ఉంటుందని అధ్యయనాలు సైతం సూచిస్తున్నాయి.

సహజ సిద్దమైన శోథ నిరోధకత కలిగిన అల్లం అనేక ఇతర రూపాల్లో కూడా మార్కెట్లో లభిస్తుంది., అనగా కాఫ్-డ్రాప్స్ మరియు కొన్నిరకాల సప్లిమెంట్స్ ద్వారా. అనేకమంది ప్రజలు పానీయం రూపంలో అల్లం వినియోగించడానికి ఇష్టపడతారు. సహజ సిద్దమైన జింజర్ ఏల్ ప్రయత్నించండి లేదా తాజా అల్లం ముక్కలను తురిమి, లేదా రసంగా చేసి, ఒక టీ వలె సేవించండి.

3. చామంతి టీ:

3. చామంతి టీ:

ఒక కప్పు చక్కని చామంతి టీ, కడుపు నొప్పి మరియు ఉబ్బరాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది, అంతేకాకుండా ఇది యాంటి ఇన్ఫ్లమేటరీగా కూడా పనిచేస్తుంది. దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మీ కడుపు కండరాల విశ్రాంతికి సహాయపడతాయి, క్రమంగా కడుపులో వాపు, నొప్పి, వికారం, పైత్య ప్రకోపాలు, ఉబ్బరం వంటి సమస్యలకు చెక్ పెట్టగలదు.

Most Read:యువతలో హెర్నియా సమస్యకుగల కారణాలేమిటి, చికిత్స ఎలా ?

4. బ్రాట్ ఆహార ప్రణాళిక:

4. బ్రాట్ ఆహార ప్రణాళిక:

పసిపిల్లల తల్లిదండ్రులకు అరటి, అన్నం, ఆపిల్ సాస్ మరియు టోస్ట్ (బ్రాట్) ఆహార ప్రణాళిక గురించిన వివరాలు ఖచ్చితంగా తెలిసే ఉంటాయి. ఇవి కడుపులో వికారాన్ని పోగొట్టి, శాంతింపచేయుటకు ఉత్తమంగా పనిచేస్తాయి. ఇది వికారానికే కాకుండా, అతిసారం చికిత్సలో కూడా సహాయపడుతుంది.

బ్రాట్ ఆహార ప్రణాళిక తక్కువ ఫైబర్ నిక్షేపాలను కలిగి, హై బైండింగ్ ఆహార పదార్ధాలను కలిగి ఉంటాయి. ఈ ఆహార ప్రణాళికలో ఉప్పు లేదా మసాలా దినుసులు ఉండవు. ఉప్పు మరియు మసాలా దినుసులు లక్షణాలను తీవ్రతరం చేస్తాయని గుర్తుంచుకోండి. మీరు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు కూడా, ఆకలిని ప్రేరేపించేలా ఈ ఆహార ప్రణాళిక ఉంటుంది. ఎక్కువగా వండిన టోస్ట్, చార్డ్ బ్రెడ్ వంటివి వికారాన్ని తగ్గించడంలో సహాయపడగలవు.

5. పుదీనా:

5. పుదీనా:

పుదీనా వికారం మరియు కడుపు ఉబ్బరానికి సత్వర పరిష్కారంగా ఉపయోగపడే ఉత్తమ ఆహారంగా ఉదహరించబడుతుంది. ఎందుకంటే దాని ఆకులలో మెంథోల్ అనే సహజ సిద్దమైన అనాల్జెసిక్ నొప్పి నివారిణిగా ఉంటుంది.

ఈవిధంగా ప్రయత్నించండి :

ఒక కప్పు పిప్పరమింట్ లేదా స్పియర్మింట్ టీ తీసుకోవడం.

పుదీనా వాసన చూడడం.

ఒక మింట్ కాండీ తీసుకోవడం.

పుదీనా ఆకులను నమలడం.

ఇవన్నీ త్రేన్పులు, వికారాలను తగ్గించడంలో ఉత్తమంగా పనిచేస్తాయి.

6. ఆపిల్ సైడర్ వెనిగర్:

6. ఆపిల్ సైడర్ వెనిగర్:

మీరు వికారం లేదా ఉబ్బరం వంటి సమస్యలతో ఉన్నట్లయితే, ఆపిల్ సైడర్ వెనిగర్ ఉత్తమంగా పనిచేస్తుంది. ఇది కడుపు వికారాన్ని తటస్తం చేయడానికి ఎంతగానో ఉపకరిస్తుంది. ఎక్కువ ఘాడత కూడుకుని ఉన్నట్లుగా అనిపిస్తే, ఒక కప్పు నీటిలో, ఒక టీ స్పూన్ ముడితేనె కలిపి, నెమ్మదిగా సిప్ చేయండి.

యాపిల్ సైడర్ వెనిగర్లోని ఆమ్లాలు పిండి పదార్ధాల జీర్ణక్రియలో సహాయపడతాయి, తద్వారా పిండి పదార్ధాలను ప్రేగులలో సజావుగా జీర్ణమయ్యేందుకు మరియు జీర్ణాశయంలో బాక్టీరియాను ఆరోగ్యవంతంగా ఉంచడానికి వీలును కల్పిస్తుంది. కొందరైతే ప్రతిరోజూ ఒక స్పూన్ నిండా తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు కూడా. వికారం, ఉబ్బరానికి నివారణ చర్యగా తీసుకుంటారు.

Most Read: మీ ఇంట్లో పదే పదే బల్లి కనిపిస్తే.. దేనికి సంకేతం..?

7. హీటింగ్ ప్యాడ్:

7. హీటింగ్ ప్యాడ్:

మీరు ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నప్పుడు హీటింగ్ ప్యాడ్ లేదా హాట్ వాటర్ బాటిల్ సహాయంతో అద్దడం వంటివి పాటించడం పరిపాటి. కొంతమంది మార్కెట్లో విరివిగా లభించే ఎలక్ట్రిక్ బ్లాంకెట్లను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇవి కొన్ని అనారోగ్య లక్షణాలను తగ్గించడంలో సయం చేస్తుంది.

మీ కడుపులో పెరిగే వెచ్చదనం వలన, ఎటువంటి కండరాల నొప్పి నుండి అయినా ఉపశమనాన్ని పొందవచ్చు. మరియు ఈ వేడి మీ కండరాలకు విశ్రాంతినివ్వడంతో పాటు, మీ వికారాన్ని కూడా తగ్గిస్తుంది. కానీ మితిమీరిన వేడి వద్దు. అది మీ చర్మాన్ని దెబ్బతీస్తుంది.

ఈ ఏడు సహజ సిద్దమైన చిట్కాలు, కడుపు నొప్పి, ఉబ్బరం, వికారం వంటి కొన్ని లక్షణాల నుండి తక్షణ ఉపశమనం పొందడంలో ఉత్తమంగా పనిచేస్తాయి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆరోగ్య, జీవన శైలి, ఆహార, ఆద్యాత్మిక, జ్యోతిష్య, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

7 Natural Remedies for Your Upset Stomach

Stomachaches are so common that everyone experiences them at one point or another. There are dozens of reasons why you might get a tummy ache. Most causes aren’t serious and the symptoms pass quickly. Generally, there’s no need to look further than your kitchen for a solution.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more