For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాత్రిపూట అల్లం -నిమ్మరసం జ్యూస్ తీసుకోవడం ద్వారా కలిగే 8 అద్భుతమైన ప్రయోజనాలు

|

అల్లం, పేరుకు కారంగా ఉన్నా, వంటల్లో అదనపు రుచిని తీసుకుని వచ్చేందుకు విస్తృతంగా ఉపయోగించే సుగంధద్రవ్యం వలె ఉంటుంది; ప్రధానంగా దీని యొక్క ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. మరోవైపు, నిమ్మకాయలలో జీవక్రియలను పెంచి, ఆరోగ్యాన్ని పెంపొందించే యాంటీఆక్సిడెంట్స్ నిల్వలు అధికంగా ఉంటాయి. ఈ వ్యాసంలో, రాత్రిపూట నిమ్మకాయతో కూడిన అల్లం రసం తీసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి తెలియజేయడమైనది.

జీర్ణక్రియలలో సహాయపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అల్లంలో పుష్కలంగా ఉంటాయి. అల్లం వేర్లు, బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది, జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది, శరీరంలోని అదనపు కొవ్వును కరిగించుటలో ప్రభావవంతమైన లక్షణాలను కలిగిఉంటుంది. జీవక్రియలు సక్రియంగా కొనసాగేలా చర్యలు తీసుకోవడంలో సహాయపడుతుంది.

8 Benefits Of Drinking Ginger Juice With Lemon In The Night

నిమ్మకాయ సహజసిద్దంగా సన్నబడటానికి విరివిగా వినియోగిస్తారు. మరియు విటమిన్ -సి యొక్క అద్భుతమైన వనరుగా భావించబడుతుంది. ఈ విటమిన్ –సి శరీరం నుండి వ్యర్థాలు మరియు విషాన్ని తొలగించడంలో అత్యంత సమర్థవంతమైనదిగా ఉంటుంది, నిర్విషీకరణను ప్రోత్సహిస్తుంది. శరీరంలో ఫ్లూయిడ్స్ నిలుపుదలకు పోరాడుతుంది మరియు ఉదర వాపును, స్వెల్లింగ్ మరియు మంటను తగ్గించడంలో కీలకపాత్రను పోషిస్తుంది.

నిమ్మ మరియు అల్లం బరువుతగ్గడంలో సహాయం చేస్తాయా ?

నిమ్మ మరియు అల్లం బరువుతగ్గడంలో సహాయం చేస్తాయా ?

ఈ రెండు పదార్ధాలు శరీరంలోని వ్యర్ధాల తొలగింపులో కీలకపాత్రను పోషిస్తాయి. మరియు ఈ రెండు పదార్థాలను మీ వెయిట్-లాస్ ఆహార ప్రణాళికలో చేర్చవచ్చు కూడా. ఒక శక్తివంతమైన సహజసిద్దమైన స్లిమ్మింగ్ ఫార్ములాగా వీటి కలయిక ఉంటుంది.

అల్లం మరియు నిమ్మకాయ నీరుతో కూడిన ప్రయోజనాలు ఏమిటి?

అల్లం మరియు నిమ్మకాయ నీరుతో కూడిన ప్రయోజనాలు ఏమిటి?

1. అల్లం రోగనిరోధక వ్యవస్థను ప్రోత్సహిస్తుంది

వర్షాకాలం మరియు చలికాలాలలో, తరచుగా గాలిలో చురుకుగా ఉన్న సూక్ష్మజీవుల కారణంగా అనారోగ్యాలు తలెత్తడం సర్వసాధారణం. క్రమంగా, జలుబు మరియు ఫ్లూ వంటి సమస్యలను ఎదుర్కొనడానికి సరైన రోగనిరోధక పనితీరును నిర్వహించడం కష్టతరం అవుతుంది. మీ ఆహారంలో అల్లం కలిపి తీసుకోవడం అలవాటుగా ఉంటే, ఇటువంటి సూక్ష్మజీవులు వీలైనంత వరకు తగ్గుముఖం పడుతాయి. అల్లం ఒక యాంటీమైక్రోబయాల్ ఏజెంట్గా పనిచేస్తుంది, అనగా అంతర్గత మరియు బాహ్య ప్రభావిత బ్యాక్టీరియాను చంపే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

2. అల్లం చికాకుపెట్టే పేగు వ్యాధి రోగులకు ఉపశమనాన్ని ఇవ్వడంలో సహాయపడుతుంది

2. అల్లం చికాకుపెట్టే పేగు వ్యాధి రోగులకు ఉపశమనాన్ని ఇవ్వడంలో సహాయపడుతుంది

చికాకుపెట్టే ప్రేగు సిండ్రోమ్ సమస్య, నొప్పి, వికారం, వాంతులు, అతిసారం మరియు ఇతర జీర్ణ సమస్యలతో కూడుకుని ఉంటుంది. వైద్యులు వాటి లక్షణాలను నియంత్రించడానికి ప్రేగు సిండ్రోమ్ రోగులకు అల్లాన్ని సూచించడం కూడా జరుగుతుంది. అయినప్పటికీ, ఈ లక్షణాలను అణచివేయడంలో అల్లం చేసే సహాయం పూర్తిస్థాయిలో ఏ పరిశోధనల్లోనూ వెల్లడించలేదు.

Most Read: ఇలా చేస్తే సెక్స్ లో కంటే ఎక్కువగా సంతృప్తి లభిస్తుంది, అక్కడ వేలు పెట్టుకుని కెలుక్కుంటే

3. జీవక్రియలను పెంచుతుంది:

3. జీవక్రియలను పెంచుతుంది:

అల్లం జీవక్రియలను పెంపొందించడంలో ఉత్తమ ప్రభావాలను కలిగి ఉంటుందని ఆహార నిపుణులు సూచిస్తుంటారు. అల్లం మరియు నిమ్మకాయలు కలిపినప్పుడు, అది మీ జీవక్రియలను పెంచడంలో సహాయం చేస్తుంది. బరువు పెరగడం గురించి ఆలోచిస్తున్నవారికి కడుపులో మరింత యాసిడ్ ఉత్పత్తి చేయడం ద్వారా ఆకలిని ప్రేరేపించగల లక్షణాలు అల్లంలో ఉంటాయి. క్రమంగా జీవక్రియలు పెరుగుతాయి. మరోవైపు, బరువు కోల్పోవాలని భావిస్తున్నవారికి కూడా అల్లం ఉపయోగకరంగా ఉంటుంది. కడుపు లోపలి ఆమ్లం జీవక్రియలపై ప్రభావాన్ని చూపుతాయి, ఇవి మరిన్ని కేలరీలను మరియు కొవ్వులను దహించేలా సహాయం చేస్తుంది.

4. అల్లం ఆరోగ్యకరంగా రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది:

4. అల్లం ఆరోగ్యకరంగా రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది:

రక్తంలో చక్కెర స్థాయిలలో స్పైక్ అనేది డయాబెటిస్ రోగులలో అత్యంత సాధారణమైన లక్షణంగా ఉంటుంది. మీ రక్తంలో చక్కెర స్థాయిలను పర్యవేక్షించడానికి, అధిక చక్కెర స్థాయిలను మరియు తక్కువ చక్కెర స్థాయిలను క్రమబద్దీకరించడానికి సహాయపడే ఒక గొప్ప మూలకంగా అల్లం ఉంటుంది.

ఇప్పుడు నిమ్మతో కూడిన ప్రయోజనాలను చూద్దాం :

ఇప్పుడు నిమ్మతో కూడిన ప్రయోజనాలను చూద్దాం :

1. నిమ్మకాయలు కిడ్నీ స్టోన్స్ నివారించడంలో సహాయపడతాయి :

రాత్రి సమయాల్లో నిమ్మరసం మరియు అల్లం రసం త్రాగడం ద్వారా మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడకుండా సహాయం చేస్తుంది. నిమ్మ రసం మూత్రంలో సిట్రేట్ స్థాయిలను పెంచుతుంది, ఇది మూత్రపిండాల్లో ఏర్పడే కాల్షియం రాళ్ళను విచ్ఛిన్నం చేయడం లేదా నివారించడంలో సహాయపడుతుంది. ఈ కాల్షియం రాళ్ళనే మూత్రపిండంలో రాళ్ళుగా సూచించబడతాయి.

Most Read: పెళ్లికి ముందు సెక్స్ లో పాల్గొన్నాం,పిల్స్ వేసుకుంది, ఇప్పుడు ఎంత సెక్స్ చేసినా పిల్లలు పుట్టడంలేదు

2. గొంతు సమస్యలకు నివారణిగా :

2. గొంతు సమస్యలకు నివారణిగా :

మీ రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నప్పుడు వర్షాకాలం మరియు శీతాకాలం సమయాలలో అల్లం మరియు నిమ్మరసం ఎంతో సహాయకంగా ఉంటుంది. కొందరు దగ్గు, పడిశం, గొంతుసమస్యలకు నివారణిగా అల్లం, నిమ్మ-టీ లను ఎక్కువగా సేవించడానికిగల కారణాలు కూడా ఇవే.

3. బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది :

3. బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది :

నిమ్మ రసం దాని బరువు తగ్గడంలో, మరియు జీర్ణ ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా ప్రసిద్ధి చెందింది. నిమ్మకాయలలో లభించే యాంటీఆక్సిడెంట్స్ జీర్ణ వ్యవస్థ మరియు కాలేయాలను శుభ్రపరచడానికి సహాయపడుతుంది. మీరు ఒక బరువు నష్టం సంబంధించిన వెయిట్-లాస్ ఆహార ప్రణాళికలో ఉన్నట్లయితే, మీ శరీరం నుండి విషాన్ని తొలగించడానికి మరియు మీ నడుమును నాజూగ్గా చేయడంలో మీ ఆహార ప్రణాళికలో నిమ్మను జోడించండి.

4. నిమ్మరసంలో ఉండే ఆల్కలీన్ లక్షణాలు

4. నిమ్మరసంలో ఉండే ఆల్కలీన్ లక్షణాలు

మీ శరీరం ఆల్కలీన్ అయితే, ఇది శరీర ఆమ్లత్వంలో పరిపూర్ణ సంతులనం అని అర్థం. మీ శరీరం ఎక్కువగా ఆమ్లతత్వాలతో నిండిపోయి ఉంటే, అది మొటిమలు, బరువు పెరుగుట, ఖనిజ నష్టం, మొదలైన వాటికి దారితీస్తుంది. నిమ్మకాయ కలిగి ఉన్న జ్యూసులు, శరీరంలోని pH స్థాయిలను సమతుల్యం చేస్తాయని చెప్పబడింది. నిమ్మ మీకు స్వచ్చమైన చర్మం, మరింత శక్తిని అందివ్వడమే కాక, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడంలో సహాయం చేస్తుంది.

Most Read: మనదేశంలోని ఆర్యులతో సెక్స్ లో పాల్గొంటున్న విదేశీయులు, బ్రోక్పా జాతి వారితో సంభోగం అంటే బాగా ఇష్టం

నిమ్మకాయ మరియు అల్లం జ్యూస్ తయారుచేసే విధానం :

నిమ్మకాయ మరియు అల్లం జ్యూస్ తయారుచేసే విధానం :

మొదటగా, నిమ్మరసం సిద్ధం చేసుకోండి. మరియు తీపికోసం ముడి తేనెను ఉపయోగించండి.

అందులో తురిమిన అల్లం ఒక టీస్పూన్ లేదా అల్లం రసాన్ని జోడించి సేవించండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆరోగ్య, జీవన శైలి, ఆహార, ఆద్యాత్మిక, జ్యోతిష్య, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

8 Benefits Of Drinking Ginger Juice With Lemon In The Night

8 Benefits Of Drinking Ginger Juice With Lemon In The Night,Ginger and lemon is very effective in removing the waste and toxins out from the body. Read here to know what is the benefits of ginger and lemon water.
Story first published: Saturday, October 27, 2018, 15:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more