For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డయేరియా చికిత్సలో భాగంగా సూచించదగిన హెర్బల్-టీ రకాలు

|

మీరు విరేచనాల వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు మీ శరీరం అన్ని జీవక్రియలకు, వ్యవస్థల పనితీరుకు అవసరమైన ద్రవాలను మరియు పోషకాలను అధిక స్థాయిలో కోల్పోవడం జరుగుతుంది. క్రమంగా శరీరంలో అసమతుల్యత, మైకము, శారీరక బలహీనత మరియు కడుపు నొప్పి వంటి లక్షణాలు ఏర్పడడానికి కారణాలుగా మారుతాయి. అతిసారం తీవ్రమైన స్థితి కానప్పటికీ, మీకు అసౌకర్యంగా ఉండడమే కాకుండా శరీరం అలసిపోయేలా చేస్తుంది. కావున, కొన్ని మూలికల నివారణలను అనుసరించడం మంచిదిగా సూచించబడుతుంది., ఇవి కేవలం డయేరియాను నయం చేయడమే కాకుండా, మీ శరీరాన్ని నిర్జలీకరణం కాకుండా నిరోధించగలవు.

మేరీల్యాండ్ మెడికల్ సెంటర్ విశ్వవిద్యాలయం ప్రకారం, పరాన్నజీవులు లేదా ప్రేగు మార్గాలను చికాకుపర్చగల వైరస్ల కారణంగా అంటువ్యాధులు, విరేచనాలు సంభవిస్తుంటాయి. ఈ వైరస్ల కారణంగా, తరచుగా ప్రేగు కదలికలు, వికారం, వాంతులు, కడుపు తిమ్మిరి, దాహం అధికమవడం, జ్వరం మొదలైన సమస్యలకు దారితీస్తుంది. ఇటువంటి సందర్భాలలో హెర్బల్-టీలు డయేరియా చికిత్సలో సహాయపడతాయి.

9 Best Herbal Teas That Can Help Treat Diarrhoea

నిర్జలీకరణంతో సంబంధం ఉన్న మైకము మరియు బలహీనతను ఆపడానికి, అనేక హెర్బల్-టీలు డయేరియా లక్షణాలను తగ్గించగలవు మరియు మీ శరీరాన్ని సౌకర్యవంతంగా మరియు హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడతాయి.

ఇక్కడ అతిసారం నివారణలో భాగంగా సూచించదగిన మూలికా-టీ జాబితా పొందుపరచబడి ఉన్నది.

నిర్జలీకరణంతో సంబంధం ఉన్న మైకము మరియు బలహీనతను ఆపడానికి, అనేకరకాల హెర్బల్-టీలు సహాయం చేయగలవు. క్రమంగా అతిసారం లక్షణాలను తగ్గించి శరీరం డీహైడ్రేషన్ గురికాకుండా కాపాడగలవు.

1. చామంతి-టీ:

1. చామంతి-టీ:

చామంతి-టీ అతిసారం చికిత్సలో సూచించదగిన ఉత్తమ టీలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది ప్రేగుశోథను తగ్గించే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. కండరాల నొప్పిని తొలగించడానికి సహాయపడే లక్షణాలను సైతం కలిగి ఉంటుంది.

తయారుచేయు విధానం :

1టీస్పూన్ పుదీనా ఆకులు మరియు చామంతి పూలరేకులను కప్పు వేడినీటికి జోడించండి. 10 నిమిషాలు అలాగే ఉండనివ్వండి. తర్వాత బాగుగా కలిపి, వడకాచి, రోజులో రెండుమూడు మార్లు సేవించండి.

2. దాల్చిన చెక్క- టీ:

2. దాల్చిన చెక్క- టీ:

దాల్చిన చెక్క-టీ మరొక ఉత్తమమైన హెర్బల్-టీ గా చెప్పబడుతుంది. ఇది ప్రేగు కదలికలను నియంత్రించడానికి సహాయపడే ఔషధ మరియు శోథనిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది మరియు ప్రేగుమార్గాలలో చికాకును తొలగిస్తుంది. తద్వారా కడుపును శాంతపరుస్తుంది. దాల్చినచెక్క కూడా పేగులలో గాస్ సమస్యల నుండి ఉపశమనం కలిగించే ఒక కార్మినేటివ్ ఏజెంట్ వలె పనిచేస్తుంది. క్రమంగా అతిసారం ఎదుర్కోవడంలో సూచించదగిన సాంప్రదాయక పద్దతిగా ఉంటుంది.

తయారుచేసే విధానం:

ఒక కప్పు వేడినీటిలో 1టీస్పూన్ దాల్చినచెక్క పొడి లేదా దాల్చిన చెక్క 2 చిన్న స్టిక్స్ వేసి కలపండి. 10 నిమిషాలు అలాగే ఉండనివ్వండి. లేదా సన్నని మంట మీద ఉంచండి. తర్వాత రెండు నిమిషాలు ఒక బ్లాక్-టీ బ్యాగ్ ఉంచండి. తర్వాత పలుమార్లు డిప్ చేసి, టీ బ్యాగ్ మరియు దాల్చిన చెక్కలను తొలగించి టీ సేవించండి. ఉత్తమఫలితాల కోసం రోజులో పలుమార్లు అనుసరించండి.

3. ఫెన్నెల్(సోపు)-టీ:

3. ఫెన్నెల్(సోపు)-టీ:

ఫెన్నెల్-టీ అనామ్లజనకాలలో ఉత్తమంగా ఉంటుంది. క్రమంగా ఉత్తమ జీర్ణవ్యవస్థను ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా కడుపులో, కలుషిత విషపదార్ధాలను తొలగించే లక్షణాలతో పాటు, వ్యాధికారక చర్యలకు వ్యతిరేకంగా పోరాడే గుణాలను కలిగి ఉంటుందని చెప్పబడింది. క్రమంగా, ఇది అతిసారం, అపానవాయువుల చికిత్సకే కాకుండా, మీ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి సైతం సహాయపడుతుంది. ఫెన్నెల్ విత్తనాలు పొటాషియం వంటి ఖనిజాల ఉనికిని, ఎలెక్ట్రోలైట్ స్థాయిలను నియంత్రించడంలో మరియు డీహైడ్రేషన్ వలన కలిగే అసౌకర్యాన్ని నివారించడంలో సహాయపడుతుంది.

తయారుచేయు విధానం:

ఒక కప్పు వేడినీటిలో 1 స్పూన్ ఫెన్నెల్ విత్తనాలను జోడించండి. 10 నిమిషాలు సన్నని మంట మీద మరగనివ్వండి, లేదా అలాగే వేడినీటిలో వదిలివేయండి. తర్వాత వడపోసి స్వీకరించండి. రోజులో కనీసం 2 కప్పుల ఫెన్నెల్-టీ తీసుకోవడం ఉత్తమం.

Most Read: కీప్ గా ఉంటానంది, తనే వచ్చి నాతో పడుకునేది, బలవంతంగా సెక్స్ చేశానని చెప్పింది, అమ్మాయినే నమ్ముతారా?

4. గ్రీన్-టీ :

4. గ్రీన్-టీ :

గ్రీన్-టీ ప్రేగుల శ్లేష్మ పొరలలో రక్తస్రావ నివారిణిగా పనిచేసే టానిన్లను కలిగి ఉంటాయి. శరీరం ద్రవాలను పీల్చుకునేందుకు సహకరిస్తూ, ప్రేగులలోని శోథను శాంతింపజేస్తుంది. కెఫిన్ యొక్క జీర్ణ సంబంధిత దుష్ప్రభావాలను తగ్గించడానికి, రోజులో ఒకసారి అల్పాహారానికి, భోజనానికి మధ్య గ్రీన్-టీ తీసుకోవడం ఉత్తమం.

తయారుచేయు విధానం :

ఒక టీస్పూన్ గ్రీన్-టీ ఆకులు లేదా ఒక గ్రీన్-టీ సంచిని ఒక కప్పు వేడినీటిలో చేర్చండి. 2-3 నిమిషాలు అలాగే ఉండనివ్వండి. గోరువెచ్చగా మారిన తర్వాత సంచిని తొలగించి, లేదా వడపోసి స్వీకరించండి. అధికంగా గ్రీన్-టీ తీసుకోవడం డీహైడ్రేషన్ సమస్యలకు దారితీస్తుంది. రోజులో ఒకటి లేదా రెండు కప్పుల వరకే తీసుకుంటున్నారని నిర్ధారించుకోండి.

5. పుదీనా-టీ:

5. పుదీనా-టీ:

పుదీనా-టీ అనేది సాధారణంగా కడుపును శాంతపరచే హీలింగ్ ప్రాపర్టీస్ కలిగి ఉన్నట్లుగా చెప్పబడుతుంది. ఎందుకంటే విరేచనాలు మరియు అపానవాయులతో సహా అనేక కడుపు వ్యాధులకు ఉపశమనం అందివ్వగలవు కాబట్టి. డయేరియాను తగ్గించడంలో పాటుగా, జీర్ణక్రియలను ప్రోత్సహిస్తుంది. అదనంగా, పుదీనా బాక్టీరియల్ లక్షణాలను సమతుల్యం చేసి, ఆమ్లరసాల ఉత్పత్తి తగ్గిస్తుంది.

తయారుచేయు విధానం:

ఒక కప్పు వేడినీటిని తీసుకుని, అందులో పుదీనా ఆకులను లేదా, రసాన్ని జోడించండి. 10 నిమిషాలు అలాగే ఉండనివ్వండి. తర్వాత వడపోసి, సేవించండి. ఉత్తమ ఫలితాలకై రోజులో కనీసం మూడుసార్లు సేవించండి.

6. అల్లం-టీ:

6. అల్లం-టీ:

అల్లం అనాల్జేసిక్, యాంటీబాక్టీరియల్ మరియు శోథనిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది కడుపునొప్పి చికిత్సలో సహాయపడుతుంది. ఈ స్పైస్ కడుపుని వెచ్చగా చేస్తుంది మరియు జీర్ణవ్యవస్థ పెరుగుదలకు సూచించదగిన గొప్ప టానిక్ వలె ఉంటుంది. తరచుగా అల్లం-టీ తీసుకోవడం ద్వారా మీ శరీరం డీహైడ్రేట్ సమస్యల నుండి దూరంగా ఉంటుంది. మరియు అతిసారం సమయంలో శరీరం కోల్పోయిన ద్రవాలను భర్తీ చేస్తుంది.

తయారుచేసే విధానం:

ఒక కప్పు వేడినీటిలో ఒక స్పూన్ తురిమిన అల్లం జోడించండి. 5 నిముషాలు అలాగే వదిలివేసి, కొద్దిగా నిమ్మరసం జోడించి స్వీకరించండి. ఉత్తమ ఫలితాలకై రోజులో రెండు మార్లు సేవించండి.

Most Read:అప్పట్లో యోనికి తాళాలు, ఈ కాలం అమ్మాయిలు వేసుకోవాలి, మీటూలాంటి గొడవలే ఉండవు

7. ఆరెంజ్ పీల్-టీ:

7. ఆరెంజ్ పీల్-టీ:

నారింజ పైతొక్క సైతం అతిసారానికి గొప్ప చికిత్సగా ఉంటుందని ఎవరికి తెలుసు ? వాస్తవానికి, నారింజ పైతొక్క పెక్టిన్స్ లో సమృద్ధిగా ఉంటుంది. ఇది ప్రేగులలో ప్రయోజనకరమైన బ్యాక్టీరియా లేదా ప్రోబయోటిక్స్ పెరుగుదలకు మద్దతు ఇస్తుంది, తద్వారా ఆరోగ్యకరమైన ప్రేగువ్యవస్థను నిర్వహిస్తుంది.

తయారుచేయు విధానం :

నారింజ తొక్కను తీసుకోండి, దీనిని ఒక కప్పు వేడినీటిలో చేర్చండి. 10 నిమిషాలు అలాగే ఉండనివ్వండి. లేదా మరగనివ్వండి. తర్వాత వడపోసి, స్వీకరించండి.

English summary

9 Best Herbal Teas That Can Help Treat Diarrhoea

When you suffer from diarrhoea, your body loses fluids and nutrients. This causes symptoms like dizziness, physical weakness and abdominal pain. So, it is necessary to take certain herbal remedies that will not only cure diarrhoea but will also prevent your body from getting dehydrated. The list includes chamomile tea, green tea, cinnamon tea, thyme tea, etc.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more