For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కలబంద గుజ్జు లేదా లేటెక్స్ లేదా రసం వలన కలిగే తొమ్మిది దుష్ప్రభావాలు!

కలబంద గుజ్జు లేదా లేటెక్స్ లేదా రసం వలన కలిగే తొమ్మిది దుష్ప్రభావాలు!

|

కలబంద ఎటువంటి పరిచయం అవసరం లేని ఒక సాధారణ సహజ సౌందర్య పోషక పదార్ధం. అంతేకాక దీనికి అందంతో పాటుగా, ఆరోగ్యపరమైన ప్రయోజనాలను పొందడానికి వినియోగిస్తారు. కలబంద అనేకమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. అయితే, దీని వలన కొన్ని దుష్ప్రభావాలు కూడా కలుగుతాయని బహుశా మీకు తెలియకపోవచ్చు.

కలబంద గుజ్జు శతాబ్దాలుగా ప్రజాదరణ పొందిన పదార్ధం. దీని కొరకు, కలబంద ఒక పంటగా పండించబడుతుంది. కలబంద ఆకు నుండి గుజ్జును తయారు చేస్తారు. ఈ మొక్కను విస్తృతంగా నేడు సుగంధ ద్రవ్యంగా, సౌందర్య పోషకంగా, మూలికా మందుల తయారీలో భాగంగా మరియు ఆహార పదార్ధాలలో వాడుతున్నారు.

9 Side Effects Of Aloe Vera You Should Know

కలబంద నుండి రెండు పదార్ధాలను ఉత్పత్తి చేస్తారు - గుజ్జు మరియు లేటెక్స్. వీటిని మందుల తయారీలో వాడతారు. కలబంద గుజ్జు మనందరికి తెలిసినట్లు, కలబంద ఆకులో ఉన్న స్పష్టమైన గుజ్జు వంటి పదార్ధం. కలబంద లేటెక్స్ పసుపు రంగులో ఉంటుంది. దీనిని ఆకు యొక్క పైపొర క్రింద నుండి తీస్తారు.

కలబంద గుజ్జు 96 శాతం నీటిని మరియు విటమిన్లు A, B, C మరియు E లను కలిగి ఉంటుంది . చాలామంది కలబంద గుజ్జును మధుమేహం, హెపటైటిస్, బరువు తగ్గడానికి, జీర్ణకోశ వ్యాధులు, కడుపులో అల్సర్లు, ఆస్టియో ఆర్థరైటిస్, ఉబ్బసం, జ్వరం, దురద మరియు వాపు, మొదలైనవాటి నివారణకు తింటారు. కలబంద గుజ్జులో తయారైన ఔషధాలను కూడా చర్మంపై పూతగా ఉపయోగిస్తారు.

చర్మ మరియు కేశ సంరక్షణ కొరకు కలబంద గుజ్జు చాలా ఉపయోగపడుతుంది. ఈ గుజ్జును, కలబంద రసం తయారీలో కూడా ఉపయోగిస్తారు. దీనిని అనేక ఆయుర్వేద చూర్ణాలు, టానిక్స్ మరియు ఔషధాలలో ఉపయోగిస్తారు.

కానీ, కలబంద రసంను అధికంగా తీసుకోవడం వలన మీ శరీరానికి హాని జరగవచ్చు మరియు వివిధ దుష్ప్రభావాలు కలగవచ్చు. కొంతమంది వ్యక్తులకు లేటెక్స్ వలన అలెర్జీ కలుగవచ్చు.

అయితే, కలబంద తినడం శ్రేయస్కరమేనా?

కలబంద రసాన్ని నోటి ద్వారా తీసుకోవడం వలన అతిసారం, పొత్తికడుపులో నొప్పి, కండరాల బలహీనత, గొంతులో వాపు వంటి తీవ్రమైన అనారోగ్య పరిస్థితులు తలెత్తవచ్చు. అతి తీవ్రమైన సందర్భాల్లో, దృష్టి కోల్పోవడం వంటివి జరగవచ్చు.

ఎక్కువ కాలం పాటు అతిగా కలబంద రసంను తీసుకోవడం వలన, మూత్రపిండ వైఫల్యానికి దారితీయవచ్చు.

కలబంద లేటెక్స్ యొక్క దుష్ప్రభావాలు ఏమిటి?

కలబంద లేటెక్స్, పసుపు రంగులో ఉంటుంది మరియు ఆకు యొక్క పైపొర క్రింద నుండి వస్తుంది. మీరు తక్కువ మోతాదులలో అయినా లేటెక్స్ సేవించడం సురక్షితం కాదు. కలబంద లేటెక్స్ సేవించడం వలన మూత్రపిండాల సంబంధిత సమస్యలు, కడుపు నొప్పి మరియు పొటాషియం స్థాయిలు పడిపోవడం వంటి దుష్ప్రభావాలు కలుగుతాయి.

1. చర్మ అలెర్జీ కలిగిస్తుంది:

1. చర్మ అలెర్జీ కలిగిస్తుంది:

దీర్ఘకాలం పాటు కలబంద గుజ్జును వాడటం వలన చర్మసంబంధిత అలెర్జీలు, వాపు, దద్దుర్లు మరియు కనురెప్పలలో ఎర్రదనం వంటి సమస్యలు ఎదురుకావచ్చు. చర్మం పొడిబారడం, గట్టిపడటం, ఊదా మచ్చల ఏర్పడటం మరియు పగలడం వంటి అనేక ఇతర దుష్ప్రభావాలు కూడా ఏర్పడతాయి.

అంతేకాకుండా, గుజ్జును రాసుకుని ఎండలోకి అడుగు పెట్టడం వలన చర్మం పై దద్దుర్లు మరియు దురద లేదా ఎరుపుదనం మరియు మంట కలగవచ్చు.

2. రక్తంలో చెక్కెరల స్థాయిని తగ్గిస్తుంది

2. రక్తంలో చెక్కెరల స్థాయిని తగ్గిస్తుంది

కలబంద రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది, అందువల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు, కలబంద తీసుకునేటప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి.

3. గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులలో సమస్యలు:

3. గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులలో సమస్యలు:

గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులు, కలబంద రసం, గుజ్జు లేదా లేటెక్స్ ఏది సేవించినా ప్రమాదకరమే! అస్సలు సురక్షితం కాదు. గర్భాశయ సంకోచాలను ప్రేరేపించి, గర్భస్రావం వంటి సమస్యలకు కారణమవుతుంది. పుట్టబోయే పిల్లలలో లోపాలు తలెత్తే ప్రమాదాన్ని పెంచుతుంది.

4. కాలేయ సమస్యలు:

4. కాలేయ సమస్యలు:

కలబంద అధిక మోతాదులో తీసుకుంటే కాలేయంలో మంట ఏర్పడుతుంది. కలబందలో ఉండే సి-గ్లైకోసైడ్స్, యాంత్రక్వినోన్స్, యాంత్రోన్స్, లెక్టిన్స్, పోలిమన్నన్స్ మరియు ఎసిటైలేటెడ్ మన్నన్స్ వంటి అనేక బయోయాక్టివ్ సమ్మేళనాలు కాలేయం యొక్క నిర్విషీకరణ ప్రక్రియలో జోక్యం చేసుకోవచ్చు, దీని.మూలంగా, కాలేయానికి హాని జరగవచ్చు.

5. మూత్రపిండాల వైఫల్యం:

5. మూత్రపిండాల వైఫల్యం:

కలబంద కొన్ని మందులతో (డైగోక్సిన్, యాంటీడయాబెటీస్ మందులు, సెవోఫ్లురేన్, డయూరిటిక్ ఔషధాలు) సంకర్షణ చెంది, దీర్ఘకాలంలో మూత్రపిండ వ్యాధులకి దారి తీస్తుంది. కలబంద లేటెక్స్ కూడా మూత్రపిండ వైఫల్యంతో సంబంధం కలిగి ఉంది. అందువల్ల, మూత్రపిండ సమస్యతో బాధపడుతున్న వ్యక్తులు కలబందను తప్పకుండా నివారించాలి.

6. ఎలక్ట్రోలైట్ అసమతుల్యత:

6. ఎలక్ట్రోలైట్ అసమతుల్యత:

అధిక మొత్తంలో కలబంద రసంను తీసుకోవడం వలన విరేచనాలు, అతిసారం మరియు తీవ్రమైన కడుపు నొప్పి కలిగి డీహైడ్రేషన్ మరియు ఎలక్ట్రోలైట్ అసమతుల్యతకు కారణమవుతుంది.

7. కడుపులో అసౌకర్యం:

7. కడుపులో అసౌకర్యం:

కలబంద రసం తాగడం యొక్క దుష్ప్రభావాలలో ఇది ఒకటి. కలబంద లేటెక్స్, అధిక నొప్పులు, కడుపు ఉబ్బడం మరియు కడుపు నొప్పికి కారణమవుతుంది. మీరు ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లైతే, కలబంద రసంకు దూరంగా ఉండండి.

8. క్రోన్స్ డిసీజ్ & అల్సరేటివ్ కొలిటిస్ వంటి ప్రేగు సంబంధిత వ్యాధులు:

8. క్రోన్స్ డిసీజ్ & అల్సరేటివ్ కొలిటిస్ వంటి ప్రేగు సంబంధిత వ్యాధులు:

మీరు క్రోన్స్ వ్యాధి మరియు అల్సరేటివ్ కొలిటిస్ వంటి ఈ ప్రేగు సంబంధిత వ్యాధులలో ఏదైనా ఉంటే, కలబంద రసంను తీసుకోవద్దు. కలబంద లేటెక్స్ ప్రేగులలో అసౌకర్యం కలిగిస్తుంది.

9. హెమరాయిడ్లు:

9. హెమరాయిడ్లు:

మీరు హెమరాయిడ్లు ఉన్నట్లైతే, కలబంద రసం మీ పరిస్థితులను మరీంత అధ్వాన్నంగా తయారు చేస్తుంది. శస్త్రచికిత్స సమయంలో మరియు తరువాత కూడా, కలబంద రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేయవచ్చు మరియు రక్త చక్కెర నియంత్రణలో జోక్యం చేసుకోవచ్చు. మీరు శస్త్రచికిత్స చేయించుకోబోతున్నట్లయితే, మీ శస్త్రచికిత్సకు రెండు వారాల ముందుగానే కలబంద రసం తీసుకోవడం ఆపేయాలి.

English summary

9 Side Effects Of Aloe Vera You Should Know

Aloe vera produces two substances- the gel and the latex both of which are used in medicines. But, the intake of excess of aloe vera can cause your body harm and lead to various side effects. These side effects include constipation, skin allergy, problems for pregnant and breast-feeding mothers, kidney failure, electrolyte imbalance, etc.
Desktop Bottom Promotion