For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకు తెలియని తొమ్మిది అసాధారణ నోటి ఆరోగ్య సమస్యలు!

మీకు తెలియని తొమ్మిది అసాధారణ నోటి ఆరోగ్య సమస్యలు!

|

నోటి చుట్టూ లోపల లేదా అభివృద్ధి చెందే రుగ్మతలు అనేక రకాలు ఉన్నాయి. ఇవి బాధాకరంగా లేదా తీవ్రమైనవిగా లేదా వికారంగా ఉండవచ్చు. ఈ వ్యాసం ద్వారా, నోటికి సోకే అసాధారణమైన వ్యాధుల గురించి తెలియజేయబోతున్నాము.

10 రోజుల్లోపు కనుక తగ్గకపోతే, ఈ నోటికి సంబంధించిన రుగ్మతలు తీవ్రమైనవో, కావో మీకే అర్థం అవుతుంది.

9 Uncommon Oral Health Problems You Didnt Know

అమెరికన్ డెంటల్ అసోసియేషన్ ప్రకారం నోటి వ్యాధుల యొక్క లక్షణాలు:

1. కాండిడయాసిస్:

1. కాండిడయాసిస్:

నోరు లేదా గొంతులో ఈస్ట్ పెరుగుదల వలన కలిగే ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ ను కాండిడయాసిస్ అంటారు. నోటి లోపల లేదా నాలుకపై తెల్ల మచ్చలు, గుటక వేసేటప్పుడు గొంతులో నొప్పి, కాండిడయాసిస్ యొక్క లక్షణాలు.

2. కోల్డ్ సొర్స్:

2. కోల్డ్ సొర్స్:

సాధారణంగా పెదాలపై పెరిగిన ఎర్రటి బొబ్బలు సమూహాలను కోల్డ్ సొర్స్ అంటారు. ఇవి ముక్కు కింద లేదా గడ్డం కింద కూడా అభివృద్ధి చెందుతాయి. అంతేకాకుండా, ఇవి వ్యాపించే గుణాన్ని కలిగి ఉంటాయి.

3. కేంకర్ సోర్స్:

3. కేంకర్ సోర్స్:

చుట్టూ ఎర్రగా, మధ్యలో తెలుపు లేదా పసుపు రంగులో కేంకర్ సోర్స్ ఉంటాయి. సాధారణంగా ఇవి నోటిలో, బుగ్గలు లోపల, నాలుక, పెదవులు, చిగుళ్ళు మరియు గొంతు ప్రాంతంలో కనిపిస్తారు. ఇవి వ్యాపించే గుణం కలిగి ఉండవు.

4. టూత్ అబ్సస్:

4. టూత్ అబ్సస్:

పంటి నరాలలో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు చీము కలగడాన్నే టూత్ అబ్సస్ అంటారు. లక్షణాలు తీవ్రమైన పంటి నొప్పి, వేడి మరియు శీతల పానీయాలు మరియు ఆహారం సేవించినప్పుడు పళ్ళల్లో సున్నితత్వం, లింఫ్ నోడ్స్ లో వాపు మరియు జ్వరం దీని ముఖ్య లక్షణాలు.

అసాధారణ నోటి ఆరోగ్య సమస్యలు

అసాధారణ నోటి ఆరోగ్య సమస్యలు

సాధారణంగా, దంత క్షయం మరియు చిగుళ్ల వ్యాధి, నోటి ఆరోగ్యాన్ని దెబ్బతీసే వ్యాధులు. ఇవి కాకుండా మీరు తెలుసుకోవలసిన ఇతర అసాధారణమైన నోటి ఆరోగ్య సమస్యలు చాలా ఉన్నాయి. వాటిని గురించిన సమాచారం కిందన తెలుపబడింది.

1. ఓరల్ హెర్పెస్:

1. ఓరల్ హెర్పెస్:

నోటి హెర్పెస్ అనేది ఒక వైరల్ అంటువ్యాధి . ఇది చాలామంది పిల్లలకు, పెద్దలకు సోకుతుంది. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (AAP) వారి ప్రకారం, చిగుళ్లలో కణజాలం ఎర్రగా, వాచి, నొప్పి కలుగుతుంది. మీరు మీ నోటి లోపల లాలాజల ఎక్కువగా ఊరడం మరియు బొబ్బలు పెరుగుదలను గమనించవచ్చు.

2. నోరు పొడిబారడం:

2. నోరు పొడిబారడం:

అకాడమీ ఆఫ్ జనరల్ డెంటిస్ట్రీ (AGD) వారి ప్రకారం, మీరు మీ నోటి నుండి ఏ హానికారక బాక్టీరియాను కూడా, లాలాజలం లేకుండా బయటకు పారద్రోలలేరు. లాలాజల స్రావాన్ని ప్రభావితం చేసే మందులను తీసుకోవడం, రేడియేషన్ చికిత్స, మరియు ఎయిడ్స్ వంటి ఆనారోగ్య పరిస్థితుల వలన నోరు పొడిబారడం జరుగుతుంది.

నోరు పొడిబారడం వలన శ్వాసలో దుర్వాసన, చిగుళ్ల వ్యాధి, నోటిలో పుళ్ళు మరియు దంత క్షయ ప్రమాదం అధికమయ్యేందుకు దారితీస్తుంది.

3. టెంపోరో మాండిబ్యులర్ జాయింట్ నొప్పి:

3. టెంపోరో మాండిబ్యులర్ జాయింట్ నొప్పి:

టెంపోరో మాండిబ్యులార్ జాయింట్లు మీ తలకు ఇరువైపులా ఉంటాయి. మీరు మీ నోరు మూయాలన్నా, తెరవాలన్నా, మాట్లాడాలన్నా నమలాలన్నా మరియు మింగాలన్నా, వీటి కదలిక ద్వారానే సాధ్యమవుతుంది. ఒకవేళ, ఈ జాయింట్లు మరియు వీటి పరిసర కండరాలు మరియు లిగమెంట్లు సరిగ్గా పని చేయకపోతే, ఇది అత్యంత బాధాకరమైన టెంపోరో మ్యాండిబ్లర్ జాయింట్ డిజార్డర్ కి దారి తీస్తుంది.

అమెరికన్ డెంటల్ అసోసియేషన్ ప్రకారం, దవడలు మరియు పళ్ల అమరిక అస్తవ్యస్తంగా ఉన్నా లేదా వాటి స్థానం నుండి అటుఇటు జరిగినా లేదా మీ దంతాలు అరిగిపోవడం వలన జాయింట్ లలో నొప్పి కలుగుతుంది.

4. నోటి క్యాన్సర్:

4. నోటి క్యాన్సర్:

భారతదేశంలోని వారికి కలిగే క్యాన్సర్లలో, నీటి క్యాన్సర్ మూడవ స్థానంలో ఉంది. మద్యపానం, ధూమపానం మరియు అతిగా సూర్యరశ్మికి గురవడం క్యాన్సర్ కు ప్రధాన కారణాలు. నోటి క్యాన్సర్ ను నివారించడానికి అప్పుడప్పుడు దంత వైద్య నిపుణుని వద్దకు వెళ్లి తనిఖీలు చేయించుకోవడం మంచిది.

5. బర్నింగ్ మౌత్ సిండ్రోమ్

5. బర్నింగ్ మౌత్ సిండ్రోమ్

ఈ పరిస్థితి ఎక్కువగా మధ్య వయస్కులైన స్త్రీలలో జరుగుతుంది. కారణాలు హార్మోన్లలో మార్పులు, పోషకాహార లోపాలు, నోరు పొడిబారడం, ఫంగల్ ఇన్ఫెక్షన్లు మరియు నరాలు దెబ్బతినడం వలన బర్నింగ్ మౌత్ సిండ్రోమ్ కలుగుతుంది. నాలుక మీద లేదా నోటి లోపల మంట, రుచిలో మార్పులు లేదా పొడిబారి, నొప్పెడుతున్న గొంతు దీని ముఖ్య లక్షణాలు.

English summary

9 Uncommon Oral Health Problems You Didn't Know

Tooth decay and gum disease, both of these are the most common oral diseases. But, there are other uncommon oral health problems that you should know of which are oral herpes, oral cancer, dry mouth, temporomandibular joint pain, burning mouth syndrome, etc. These are the different types of mouth disorders that can occur inside or develop around your mouth.
Story first published:Tuesday, July 24, 2018, 18:32 [IST]
Desktop Bottom Promotion