For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  మెదడు క్షయ వ్యాధికి సంబంధించి తెలుసుకోవలసిన పూర్తి వివరాలు

  |

  క్షయ అనగానే దగ్గు గుర్తుకు రావడం సహజం, తద్వారా కేవలం ఊపిరి తిత్తులకు మాత్రమే క్షయ వ్యాధి కలుగుతుందని అనేకమంది భావిస్తుంటారు. కానీ క్షయ వ్యాధి అనేది, శరీరంలో ఏ భాగానికైనా రావొచ్చు. ఉదాహరణకు చర్మం, గర్భాశయం మొదలైనవి.

  అదేవిధంగా మెదడుకు కూడా క్షయవ్యాధి సోకుతుంది. తద్వారా మెదడులోని రక్తనాళాలు వాపునకు గురవడం జరుగుతుంది. దీనిని మెనింజైటిస్ క్షయ వ్యాధిగా కూడా పిలుస్తారు.

  మెనింజైటిస్ క్షయ, మైక్రో బాక్టీరియం క్రిమి, నాడీ మండలాన్ని కప్పే పొర లేదా మెదడుపై ప్రభావాన్ని చూపిస్తుంది.

  ఈ మెదడు క్షయ వ్యాధి, చిన్నా పెద్దా సంబంధం లేకుండా అన్ని వయసుల వారికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరేదైనా ఇతర వ్యాధులతో భాధపడే వారికి ఈ వ్యాధి సోకిన ఎడల పరిస్థితి మరింత జఠిలo అయ్యే అవకాశాలు ఉన్నాయి. తద్వారా ప్రాణాంతకంగా మారే అవకాశo కూడా లేకపోలేదు.

  All You Need To Know About Brain Tuberculosis

  ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, 2015 సంవత్సరం నాటికి సుమారుగా భారత దేశంలో 2.2 మిలియన్ క్షయ వ్యాధిగ్రస్తులున్నారని అంచనా వేసింది. ప్రతి సంవత్సరం ఈ రోగుల సంఖ్య చాప కింద నీరులా పెరుగుతూ ఉందని అంచనా వేసింది.

  మెదడు క్షయ వ్యాధి గురించి తెల్సుకోవలసిన పూర్తి వివరాలు:

  మెదడు క్షయ వ్యాధి కారకాలు ప్రధానoగా :

  మెదడు క్షయ వ్యాధి కారకాలు ప్రధానoగా :

  1.ఎక్కువ మద్యం సేవించడం

  2.ఎయిడ్స్

  3.రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం

  4.డయాబెటిస్ మెల్లిటస్ (రక్తంలో చక్కర నిల్వలు అమాంతం పెరిగిపోవడం, ఇన్సులిన్ స్థాయిలు హీనంగా తగ్గిపోవడం)

  మెదడు క్షయ వ్యాధికి సంకేతాలు:

  మెదడు క్షయ వ్యాధికి సంకేతాలు:

  ఊపిరి తిత్తులకు సోకే క్షయ వ్యాది వలె ఇది అంటు వ్యాధి కాదు, మరియు ఈ వ్యాధి సంకేతాలు కూడా చాలా నెమ్మదిగా కనిపిస్తాయి. తద్వారా ఈ వ్యాధి సోకింది అని తెలుసుకోవడానికి కూడా చాలా సమయమే పడుతుంది. కానీ రాను రాను రోజులు గడిచే కొలదీ దీని పరిణామాలు తీవ్రతరంగా ఉంటాయి.

  ముఖ్యంగా క్రింది లక్షణాలు ప్రధాన సంకేతాలుగా ఉంటాయి:

  ముఖ్యంగా క్రింది లక్షణాలు ప్రధాన సంకేతాలుగా ఉంటాయి:

  •అలసట

  •తక్కువ జ్వరం

  •ఆయాసం

  •మానసిక గందరగోళం

  •వికారం మరియు వాంతులు

  •చిరాకు

  •నిద్ర మత్తు

  •స్పృహలో లేని ప్రవర్తనలు

  మెనింజైటిస్ క్షయ వ్యాధి సోకిన వారు తీసుకోవలసిన ఆహార ప్రణాళిక:

  మెనింజైటిస్ క్షయ వ్యాధి సోకిన వారు తీసుకోవలసిన ఆహార ప్రణాళిక:

  ఈ మెదడు క్షయ వ్యాధిని తగ్గించుకునే చికిత్సలో ప్రధాన భాగం ఆహార ప్రణాళికలలో మార్పులు చేయడమే. శరీరంలో రోగ నిరోధక శక్తి తత్వాలు పెరిగే కొలదీ, రోగాన్ని ఎదుర్కొనే శక్తిని శరీరo పొందగలదు. కావున ఈ వ్యాధికి గురైన వారు తమ ఆహార ప్రణాళికలో తాజా పండ్లు, కాయగూరలు, మరియు ఆరోగ్యకర ప్రోటీన్ నిల్వలు ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలు డైటీషియన్ సలహా మేరకు తీసుకొనవలసి ఉంటుంది. తద్వారా త్వరగా కోలుకునే అవకాశo ఉన్నది.

  ఆహార ప్రణాళికలో జత చేయదగిన పదార్ధాలు:

  ఆహార ప్రణాళికలో జత చేయదగిన పదార్ధాలు:

  •తాజా పండ్లైన ఆపిల్స్, పియర్స్, ద్రాక్ష, నారింజ, పీచ్, పుచ్చకాయ, అనాస పండు.

  •చికిత్సా సమయంలో ముఖ్యంగా పండ్లనే ఎక్కువ తీసుకొనవలసి ఉంటుంది. చికిత్స పూర్తయిన తర్వాత డాక్టర్ సలహా మేరకు పాలను కూడా తీసుకొనవచ్చు.

  •పాలలో అత్యధిక మోతాదులో కాల్షియం నిల్వలు ఉంటాయి, కావున మెదడు క్షయ వ్యాధికి గురైన వారికి మంచి ఆహారంగా సూచించబడుతుంది.

  •చక్కర, రీఫైండ్ ధాన్యాలు, బేకరీ పదార్ధాలు, పుడ్డింగ్స్, నిల్వ ఉంచిన పదార్ధాలకు దూరంగా ఉండాలి.

  •చిక్కటి టీ, కాఫీ, ఊరగాయలు, సాస్ లను కూడా దూరంగా ఉంచాలి.

  మెదడు క్షయ వ్యాధి చికిత్సా విధానం:

  మెదడు క్షయ వ్యాధి చికిత్సా విధానం:

  దట్లో ఈ వ్యాధిని కనుక్కోవడం కూడా క్లిష్టతరంగా ఉంటుంది. మరియు, వేరే నాడీ వ్యవస్థకు లేదా మరేదైనా మెదడుకు సంబంధించిన వ్యాధులుగా భ్రమిoపజేస్తుంది. తద్వారా చికిత్స ఆలస్యమవడం సహజం. కానీ వైద్యులకు మీరు మీ పరిస్థితిని పూర్తిగా వివరించడం ద్వారానే వైద్యులకు కూడా ఒక అవగాహన వస్తుంది. తద్వారా మీ వెన్నెముక నుండి ద్రవాన్ని సేకరించి లేబరేటరీ కి పంపి పరీక్షలు నిర్వహించడం ద్వారా వ్యాధిని కనుగొనే ఆస్కారం ఉంటుంది.

  మరికొన్ని పరీక్షలైన మెనింజెస్ బయాప్సీ, బ్లడ్ కల్చర్, ఎక్స్-రే, తల మరియు చర్మానికి సిటి-స్కాన్ పరీక్షల ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చు.

  ఈ మెదడు క్షయ వ్యాధి వలన కలిగే సమస్యలేమిటి :

  ఈ మెదడు క్షయ వ్యాధి వలన కలిగే సమస్యలేమిటి :

  ఈ మెనింజెటిస్ క్షయ వ్యాధి సమస్యలు అత్యంత జఠిలo గా ఉంటాయి. కొన్ని సందర్భాలలో ప్రాణాంతకం కూడా కావొచ్చు. అవి ముఖ్యంగా

  •మూర్చ

  •మెదడులో ఒత్తిడి

  •వినికిడి లోపం

  •మెదడు క్షీణత

  •గుండె పోటు

  •మరణం

  మెదడులో ఒత్తిడి అధికంగా పెరగడం మూలంగా, శాశ్వత మెదడు క్షీణతకు గురవుతుంది. తద్వారా కంటి చూపు మందగించడం, తలనొప్పులు వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి ఒత్తిడి సమస్యలు ఎదురైనప్పుడే వెంటనే వైద్యుని సంప్రదించడం అన్ని విధాలా మేలు.

  ఈ వ్యాధి రాకుండా అడ్డుకోలేమా :

  ఈ వ్యాధి రాకుండా అడ్డుకోలేమా :

  ఈ మెనింజైటిస్ క్షయ వ్యాధిని లేదా మెదడు క్షయ వ్యాధిని రాకుండా అడ్డుకోవాలి అంటే, క్షయ వ్యాధికి సంబంధించిన క్రిములు అంటకుండా చూసుకోవాలి. అనగా బిసిజి (బాసిల్లస్ కల్మెట్టే గ్యూరిన్ ) టీకా వేయించుకోవడం ద్వారా యువతలో ముఖ్యంగా క్షయ వ్యాధి రాకుండా మరియు విస్తరించకుండా కాపాడుకోవచ్చు.

  అప్పటికీ మన రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని పాఠశాలలోని పిల్లలకు ప్రతి సంవత్సరం ఎ.ఎన్.ఎం ల ద్వారా ఈ టీకాలను వేయించే చర్యలకు ఉపక్రమించింది కూడా. ఒకవేళ అలా వేయించుకోని వారు డాక్టర్ సలహా మేరకు మీ వయసును దృష్టిలో ఉంచుకుని టీకా వేయించుకోవలసి ఉంటుంది.

  చాప కింద నీరులా విస్తరించే ఈ క్షయ వలన, ఎంతో మంది మానసికంగా శారీరికంగా నలిగిపోతున్నారు. కావున దీనిని తగ్గించే క్రమంలో అందరమూ భాద్యత తీసుకొనవలసిన అవసరం ఎంతైనా ఉంది.

  English summary

  All You Need To Know About Brain Tuberculosis

  Tuberculosis can infect the brain which results in inflammation of the tissues that cover the brain and is called meningitis tuberculosis. Meningitis tuberculosis is caused by mycobacterium tuberculosis involving the meninges or coverings of the brain or the brain itself. Fresh juicy fruits and milk is good for TB patients.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more