మీ మిస్సెస్ కిస్‌మిస్ తింటే మీరు త్వరలోనే శుభవార్త వింటారు ! ఎండుద్రాక్షతో బోలెడన్నీ ప్రయోజనాలు!

Written By:
Subscribe to Boldsky

ఎండు ద్రాక్ష‌ను కిస్‌మిస్ అని కూడా అంటారని అందరికీ తెలిసింది. కిస్‌మిస్ ను మ‌నం చాలా ర‌కాల తీపి వంట‌కాల్లో వేసుకుంటాం. ఎందుకంటే అవి ఆయా వంట‌కాల‌కు చ‌క్క‌ని రుచిని అందిస్తాయి.

ఎండు ద్రాక్షను తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఎండు ద్రాక్షలను తీసుకోవడం ద్వారా రక్త హీనతను దూరం చేసుకోవచ్చు. తద్వారా శరీరంలో రక్తకణాల సంఖ్య పెరుగుతుంది. ఎండుద్రాక్షల్లో విటమిన్ బి, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. వయస్సుతో సంబంధం లేకుండా ఎవరైనా తీసుకోవచ్చు.

హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉంటే..

హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉంటే..

విటమిన్స్, అమినో యాసిడ్స్, మెగ్నీషియం, పోటాషియం అధికంగా ఉంటాయి. హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉంటే ఎండుద్రాక్షలను తీసుకోవడం ద్వారా ఆ సమస్య దూరమయ్యే అవకాశం ఉంది. క్యాల్షియం పిల్లల్లో ఎముకల పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పిల్లల పెరుగుదలకు, గర్భిణీలకు ఎండుద్రాక్షలు ఎంతగానో మేలు చేస్తాయి.

వెల్లుల్లి రేకుల్ని కూడా తింటే..

వెల్లుల్లి రేకుల్ని కూడా తింటే..

ఇక ఉదయాన్నే ఎండు ద్రాక్ష‌ల‌తోపాటు కొన్నివెల్లుల్లి రేకుల్ని ప‌చ్చిగా అలాగే తింటుంటే బీపీ అదుపులోకి వ‌స్తుంది.ఎండుద్రాక్ష‌లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్క‌లంగానే ఉంటాయి. ఇవి శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేస్తాయి. ఫ్రీ ర్యాడిక‌ల్స్ నుంచి శ‌రీరానికి ర‌క్ష‌ణ‌గా నిలుస్తాయి. ప‌లు ర‌కాల క్యాన్స‌ర్‌ల‌కు వ్య‌తిరేకంగా పోరాడుతాయి.

మలబద్దకం పోతుంది

మలబద్దకం పోతుంది

జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మ‌వుతాయి. మ‌ల‌బ‌ద్ద‌కం తొల‌గిపోతుంది. గ్యాస్‌, అసిడిటీ వంటివి త‌గ్గుతాయి. ఎండుద్రాక్ష‌లో యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు కూడా ఉంటాయి. ఇవి శ‌రీరాన్ని ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి ర‌క్షిస్తాయి. వైర‌ల్ జ్వ‌రాలు, ఇన్‌ఫెక్ష‌న్ల‌తో బాధ ప‌డే వారు కిస్ మిస్ పండ్ల‌ను తింటుంటే త్వ‌ర‌గా కోలుకుంటారు.

రక్తకణాల నిర్మాణం

రక్తకణాల నిర్మాణం

కిస్ మిస్ లోని విటమిన్ బి.. రక్తకణాల నిర్మాణంలో ఎంతో ఉపయోగపడుతుంది. ఆకలిని ఎక్కువ చేసే లెప్టిన్‌ ని ఎండు ద్రాక్షలు నియంత్రిస్తాయి. కాబట్టి డైటింగ్ చేసేవారు వీటిని తరచూ తీసుకుంటూ ఉంటే ఆహారాన్ని ఎక్కువ తీసుకోకుండా ఉండగలుగుతారు.

చర్మవ్యాధులు రాకుండా..

చర్మవ్యాధులు రాకుండా..

రక్తంలో ఉండే యాసిడోసిస్ అనే టాక్సిన్.. చర్మ వ్యాధులకు కారణమవుతుంది. ఎండు ద్రాక్షలో ఉండే పొటాషియం, మెగ్నీషియం యాసిడోసిస్‌ను నియంత్రించి చర్మవ్యాధులు రాకుండా కాపాడతాయని స్కిన్ స్పెషలిస్టులు చెబుతున్నారు. ఎండుద్రాక్షల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి తరచూ తినే వారికి ఎముకలు దృఢంగా ఉంటాయని, దంతక్షయాన్ని కూడా తగ్గిస్తుందని డాక్టర్లు అంటున్నారు.

ఎముకలు గట్టిపడతాయి

ఎముకలు గట్టిపడతాయి

పాలను వేడిచేసేటప్పుడు రెండు ఎండు ద్రాక్షలను వేసి మరిగించి, ఆపాలను వడ గట్టి పిల్లలకిస్తే.. ఎముకలకు గట్టిపడి పుష్ఠిగా తయారవుతారని పిల్లల వైద్యులు చెబుతున్నారు. పచ్చకామెర్ల(జాండిస్) వ్యాధిగ్రస్థులు రోజూ రెండు ఎండు ద్రాక్షలను తీసుకుంటే ఉపశమనం లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు.

కీళ్ల నొప్పులు ఉన్నవారు

కీళ్ల నొప్పులు ఉన్నవారు

ఎండుద్రాక్షలో బోరెన్ అనే ఖనిజ లవణం ఎక్కువగా ఉండటం వల్ల నడి వయసు మహిళలు, కీళ్ళ నొప్పులతో బాధపడేవారు ఎండుద్రాక్షని క్రమం తప్పక తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎండు ద్రాక్షల్లో సుక్రోజ్, విటమిన్స్, అమినో యాసిడ్స్, మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉంటాయి. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉన్నట్లైతే ఎండుద్రాక్షలను తీసుకోవడం ద్వారా శరీరంలో రక్తకణాల సంఖ్య పెరిగి రక్తహీనతను తగ్గుముఖం పడుతుంది.

గుండె పదిలంగా ఉంటుంది

గుండె పదిలంగా ఉంటుంది

ఎండు ద్రాక్షల్లో విటమిన్ బి, ఫాస్పరస్ పుష్కలంగా ఉన్నందున గుండెను పదిలంగా ఉంటుందని... కాబట్టి వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా తీసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇవి వెంట్రుకలు రాలకుండా సహాయపడతాయి. దీనిలో ఐరన్ ఎక్కువగా ఉంటుట వల్ల గాయాలు అయినప్పుడు రక్తం గడ్డ కడుతుందని, వెంట్రుకలు రాలకుండా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.

బరువు పెరుగుతారు

బరువు పెరుగుతారు

వీటిలో ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉండటం ద్వారా బక్కపలచగా ఉన్నవారు తీసుకోవచ్చు. తద్వారా బరువు పెరుగుతారని న్యూట్రీషన్లు చెప్తున్నారు. క్రీడాకారులు తన శరీరానికి బలం చేకూర్చుకోవాలంటే ఎండుద్రాక్షల్ని తీసుకోవడం మంచిది. ఎండుద్రాక్షల్లోని ధాతువులు, కొలెస్టరాల్, విటమిన్లు, పీచు వంటివి శరీరానికి పోషకాలను అందిస్తాయి. వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి.

హై బీపీ తగ్గించుకోవచ్చు

హై బీపీ తగ్గించుకోవచ్చు

ఎండుద్రాక్షలో ఉండే యాంటీయాక్సిడెంట్లు క్యాన్సర్ కణాలను దూరం చేస్తాయి. హైబీపీని నివారిస్తాయి. గుండెను పదిలంగా ఉంచుతాయి. ఎండుద్రాక్షల్లో పొటాషియం రక్తనాళ్లాల్లో ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇంకా వీటిలో విటమిన్ బి కాంప్లెక్స్, ఐరన్ ఉండటం ద్వారా రక్తకణాల ఉత్పత్తికి ఎంతగానో ఉపకరిస్తాయి.

నరాలకు బలం

నరాలకు బలం

అలాగే రక్తం శుభ్రపడటానికి నరాలకు బలము చేకూరటానికి పది కిస్‌మిస్ పండ్లను నీళ్ళలోవేసి బాగా వుడకబెట్టి గుజ్జుగా వేసి తాగడం చేయాలని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు. పిల్లలు రాత్రపూట పక్క తడుపుతుంటే వారికి వారంపాటు ప్రతిరోజూ రాత్రి రెండు ఎండు ద్రాక్ష పొలుకులను ఇవ్వండి. ఈ వారంలో వారికి చలవచేసే వస్తువులు, పెరుగు, మజ్జిగలాంటి పదార్థాలను ఇవ్వకండి. దీంతో పక్క తడిపే అలవాటునుంచి ఉపశమనం కలుగుతుంది.

గొంతు వ్యాధితో బాధపడేవారు

గొంతు వ్యాధితో బాధపడేవారు

గొంతు వ్యాధితో బాధపడేవారు ఎండు ద్రాక్షను తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది . ఎందుకంటే ఈ ఎండు ద్రాక్ష శరీరంలోని శ్వాసనాళికలో పేరుకుపోయిన కఫాన్ని తొలగిస్తుంది. దీంతో ఉపశనం కలుగుతుంది మలబద్దకంతో బాధపడేవారు ప్రతిరోజూ రాత్రపూట పడుకునేముందు ఎండుద్రాక్షతోబాటు సోంపును కలిపి తీసుకుంటే మలబద్దకంనుంచి ఉపశమనం కలుగుతుంది.

జీర్ణశక్తి బాగా వృద్ధి

జీర్ణశక్తి బాగా వృద్ధి

ఎండు ద్రాక్షను బాగా వేడి చేసిన నీళ్ళలో నానబెట్టి తర్వాత పిల్లలకు ఇస్తే వారిలో జీర్ణశక్తి బాగా వృద్ధి అవుతుంది. కాకపోతే నానబెట్టే ముందు వీటిని పొడిగా చేయాల్సి ఉంటుంది. దీనివల్ల పండ్లలోని రసం నీటిలో బాగా కలిసి పోయి పిల్లలకు పోషకాలు అందుతాయి.

నానబెట్టి ఉదయాన్నే పరుగడుపు తింటే ఎన్నో లాభాలు

నానబెట్టి ఉదయాన్నే పరుగడుపు తింటే ఎన్నో లాభాలు

అయితే కిస్‌మిస్‌ను ఓ గుప్పెడు మోతాదులో తీసుకుని రాత్రంతా నీటిలో నాన‌బెట్టి ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తీసుకుంటే వాటితో ఎన్నో ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు న‌య‌మ‌వుతాయి. ఈ కింద ఇచ్చిన ప్రయోజనాలు మొత్తం కిస్‌మిస్‌ను రాత్రంతా నీటిలో నాన‌బెట్టి ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తింటే కలుగుతాయి.

జ్వరం రానీయకుండా చేస్తుంది

జ్వరం రానీయకుండా చేస్తుంది

నాన‌బెట్టిన కిస్‌మిస్ పండ్లను తర‌చుగా తినడం వల్ల‌ శరీరంలో పులుపును స్వీకరించే శక్తి గల ఆమ్లాలను సమానం చేసి జ్వరం రానీయకుండా చేస్తుంది. 200 మిల్లీగ్రాముల పాలతో 50 గ్రాముల కిస్‌మిస్ పండ్లు తినడం వలన నరాల నిస్సత్తువ, రక్తపోటు, దీర్ఘకాల వ్యాధులు నయమవుతాయి.

మలబద్దకం ఉండదు

మలబద్దకం ఉండదు

నాన‌బెట్టిన కిస్‌మిస్ పండ్ల‌ను రోజూ తింటుంటే మ‌ల‌బ‌ద్ద‌కం సమ‌స్య ఉండ‌దు. జీర్ణ శ‌క్తి బాగా పెరుగుతుంది. కిస్‌మిస్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి శ‌క్తి బాగా ల‌భిస్తుంది. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. ఎంత ప‌నిచేసినా అంత త్వ‌ర‌గా అల‌సిపోరు. చిన్న పిల్ల‌ల‌కు తినిపిస్తే వారిలో ఎదుగుద‌ల బాగా ఉంటుంది. వారు చదువుల్లో చురుగ్గా ఉంటారు.

ఐరన్ ఎక్కువ

ఐరన్ ఎక్కువ

ఇక నానబెట్టిన ఎండు ద్రాక్ష‌ల్లో ఐర‌న్ ఎక్కువగా ఉంటుంది. ఇది ర‌క్త‌హీన‌త‌ను నివారిస్తుంది. నిత్యం కొన్ని ఎండు ద్రాక్ష‌ల‌ను తింటుంటే దాంతో ర‌క్తం బాగా త‌యార‌వుతుంది. విట‌మిన్ బి, పొటాషియం వంటి పోష‌కాలు కిస్ మిస్ పండ్ల‌లో ఉన్నాయి. ఇవి గుండె సంబంధ వ్యాధుల‌కు అడ్డుగోడ‌గా నిలుస్తాయి.

సంతానం లేని స్త్రీలకు...

సంతానం లేని స్త్రీలకు...

సంతానం లేని స్త్రీలు కిస్‌మిస్ పండ్లు తింటే అండాశయములోని లోపాలు తొలగిపోయి సంతానం కలుగుతుంది. మీకు సంతానం కలగలేదని బాధగా ఉంటే మీ మిస్సెస్ ను కిస్‌మిస్ తినమని కోరండి. మీకు త్వరలో పిల్లలు పుట్టే అవకాశం ఉంది. అలా మీ మిస్సెస్ కిస్‌మిస్ తింటే మీరు త్వరలోనే శుభవార్త వింటారు. మీకు తెలిసిన ఈ విషయాన్ని మిస్ కాకుండా మీ ఆవిడతో ట్రై చేయించండి. అలాగే మహిళలు ప్రతిరోజూ కిస్‌మిస్ పండ్లు తిన‌డం వ‌ల్ల మూత్రాశ‌యంలో అమ్మోనియా పెరగకుండా రాళ్ళు చేరకుండా కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

English summary

Amazing Benefits Of Eating Soaked Raisins Kishmish

Amazing Benefits Of Eating Soaked Raisins Kishmish
Story first published: Wednesday, May 16, 2018, 13:00 [IST]