TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
తమలపాకుతో చాలా ప్రయోజనాలు, కానీ తమలపాకును అలా తింటే పిల్లలు పుట్టరు జాగ్రత్త
తమలపాలకులతో చాలా ప్రయోజనాలున్నాయి. చాలా మంది రకరకాల తలనొప్పులతో ఇబ్బందులుపడుతుంటారు. మీరు కాస్త లేతగా ఉండే తమలపాకులను కాసేపు నుదుటిపై పెట్టుకోండి. ఆటోమేటిక్ గా మీ తలనొప్పి తగ్గిపోతుంది.
సాధారణంగా శుభకార్యాల్లో తాంబూలంగా ఇచ్చే తమలపాకులో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
ఎముకలు గట్టి పడేందుకు కావాల్సిన కాల్షియంతో పాటు ఫోలిక్ యాసిడ్స్ తమలపాకులో ఎక్కువగా ఉంటాయి.
ఫంగస్ రాకుండా
రోగ నిరోధక శక్తిని పెంచే గుణం కూడా తమలపాకుకు ఉంటుంది. త్వరగా వృద్ధాప్యపు చాయలు కనిపించకుండా ఉండాలంటే తమలపాకులు తింటూ ఉండండి. ఇందులో ఎస్సెన్షియల్ ఆయిల్ ఎక్కువగా ఉంటుంది. అది ఫంగస్ రాకుండా చేయగలదు.
బోధకాలు
బోధకాలు వ్యాధితో బాధపడేవారురోజూ కొన్ని తమలపాకుల్ని కాస్త ఉప్పు వేసి దంచినట్లుగా చేసి ఆ మిశ్రమాన్ని నీళ్లలో కలుపుని తాగితే మంచింది. దీంతో త్వరగా ఉపశమనం లభిస్తుంది.
అధిక బరువు తగ్గాలంటే
అధిక బరువును తగ్గించేందుకు కూడా తమలపాకులు బాగా ఉపయోగపడతాయి. రోజూ ఒక ఆకును కొన్ని మిరియాలతో కలపి తీసుకుంటే బరువు తగ్గొచ్చు. అది తిన్న వెంటనే చల్లనీళ్లు తాగాలి.
ముక్కులో వేసుకోండి
బాగా తలనొప్పితో ఇబ్బంది పడుతుంటే కాస్త తమలపాకు రసాన్ని ముక్కులో వేసుకోండి. వెంటనే ఆ సమస్య నుంచి బయటపడొచ్చు.
చుండ్రు పోతుంది
చుండ్రు ఎక్కువగా ఉంటే తమలపాకులను మెత్తగా నూరుకుని ఆ మిశ్రమాన్నితలకు పట్టించండి. తర్వాత స్నానం చేయండి. చుండ్రు పోతుంది.
సంతానంకలగకపోవొచ్చు
అయితే తమలపాకు తొడిమను మాత్రం అస్సలు తినకండి. తింటే సంతానంకలగకపోవొచ్చు. మోకాలి నొప్పులు దూరం కావాలంటే తమలపాకుల రసం తాగుతూ ఉండండి.