For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అపెండిసైటిస్ గురించి మీరు తెలుసుకోవలసిన పూర్తి వివరములు

|

కడుపుభాగంలో ముఖ్యంగా నాభిప్రాంతంలో ఎప్పుడైనా తీవ్రమైన నొప్పిని కలిగి ఉన్న అనుభూతికి లోనయ్యారా? లేదా తరచూ వికారంతో కూడిన అనుభూతికి లోనవుతూ, వాంతులతో ఇబ్బందికి గురయ్యారా? ఆకలిని కోల్పోతూ, సరిగ్గా తినలేకపోతున్నారా?

మీ సమాధానం అవును అయితే, బహుశా ఇది అపెండిసైటిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ముఖ్యంగా యువతలో తరచుగా కనిపించే ఈ అపెండిసైటిస్, తీవ్రమైన నొప్పితో ఆరోగ్యం మీద పెనుప్రభావాన్ని కూడా చూపగలదు. సరైన సమయంలో గుర్తించని ఎడల ప్రాణాలు కోల్పోయే అవకాశాలు కూడా లేకపోలేదు.

Appendicitis: Causes, Symptoms, and Treatment

ఏమిటీ అపెండిసైటిస్?

అపెండిక్స్ లేదా ఉండుకం వాపును అపెండిసైటిస్ అని వ్యవహరిస్తారు. చిన్ని వేలు అంతటి పరిమాణంలో పౌచ్ వలె ఉండే ఈ ఉండుకం, పెద్దపేగుకు అనుసంధానించబడి ఉంటుంది. ఎప్పుడైతే శరీరంలోని వ్యర్ధాల కారణంగా ఈ అపెండిక్స్ లేదా ఉండుకానికి అవరోధం ఏర్పడుతుందో, క్రమంగా వాపు మొదలై ఎర్రబారడం, సరైన రక్తసరఫరా లేక చీలిక ఏర్పరడం కారణంగా అపెండిసైటిస్ సమస్యకు దారితీస్తుంది.

అపెండిసైటిస్ సమస్యలో ప్రధానంగా ఉండుకం, చీముతో నిండిపోవడం, చీము కారడం వంటి సమస్యలు ఉంటాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్.ఐ.హెచ్), అమెరికా వారి ప్రకారం, అపెండిసైటిస్ అనేది తీవ్రమైన ప్రధాన ఆరోగ్యసమస్యలలో ఒకటి, మరియు భాదాపూరితమైన ఉదరనొప్పికి కారణంగా ఉంటుంది. దీనికి శస్త్రచికిత్స అవసరం. ప్రతి 10 మందిలో ఒకరు వారి జీవితంలో ఏదో ఒకసమయంలో ఈసమస్యకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా.

అపెండిసైటిస్ సమస్యకు వయసుతో సంబంధం లేదు, అనగా ఏ వయసులోనైనా సంభవిస్తుంది, కానీ ఇది సాధారణంగా 10-30 ఏళ్ల వయస్సు మద్యలో ఉన్న యువతలోనే ఎక్కువగా కనిపిస్తుంది.

అపెండిసైటిస్ కారణాలు:

అపెండిసైటిస్ కారణాలు:

నిజానికి అపెండిసైటిస్ సంబంధించి ప్రత్యేకమైన కారణాలు ఇప్పటివరకూ తెలీదు. కానీ ఫీకల్(మలద్వార సంబంధిత అవశేషాలు) బాక్టీరియా వలన వస్తుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. బాక్టీరియా, ఫంగస్, వైరస్ మరియు పరాన్నజీవుల సంక్రమణ ద్వారా ఉండుకం కణజాల వాపుకు దారితీస్తుంది. అందుకే ఎక్కువగా ఆహారవిషయంలో జాగ్రత్తలు తీసుకోమని చెప్పేది.

ఉదరగోడకు సంబంధించిన కణజాలం యొక్క వాపు అయిన పెర్టోనిటిస్ కూడా అపెండిసైటిస్ సమస్యకు కారణం కావచ్చు.

అపెండిసైటిస్ లక్షణాలు:

అపెండిసైటిస్ లక్షణాలు:

అపెండిసైటిస్ యొక్క లక్షణాలు పూర్తిగా బయటపడడానికి 4 నుంచి 48 గంటల సమయం పట్టవచ్చు. మొదటి లక్షణం నాభి లేదా ఎగువ ఉదరభాగం సమీపంలో నొప్పిగా ఉంటుంది. ఇది నెమ్మదిగా దిగువ ఉదరభాగానికి కదులుతుంది.

అపెండిసైటిస్ ఇతర సాధారణ లక్షణాలు ఇలా ఉంటాయి:

• వికారం మరియు/లేదా వాంతులు

• ఆకలి లేకపోవడం

• తేలికపాటి జ్వరం కూడా, నెమ్మదిగా పెరుగుతుంది

• ఉదరవాపు లేదా కడుపు ఉబ్బరం

• మలబద్ధకం లేదా అతిసారం

• దగ్గుతున్నప్పుడు లేదా పనిచేస్తున్నప్పుడు వికారమైన నొప్పి

లక్షణాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారుతూ ఉంటాయి మరియు కొందరిలో లక్షణాల తీవ్రత అంతగా లేకపోయినా కూడా, కొందరిలో మాత్రం బహుళ సంకేతాల కలయికను కూడా చూడవచ్చు.

మీరు అపెండిసైటిస్ సమస్య ఉన్న అనుమానాన్ని కలిగి ఉంటే, లాక్సావిటీస్ లేదా విరోచనాకారులను తీసుకోవడం మానివేయాలి. ఇవి ఉండుకం పగులుటకు కారణం కావొచ్చు.

వైద్య సహాయం కోరడం:

వైద్య సహాయం కోరడం:

జ్వరం లేదా వాంతులతో కూడుకుని కడుపు ప్రాంతంలో తీవ్రమైన నొప్పి యొక్క ప్రారంభ లక్షణాలు ఉంటే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ వైద్యుని సంప్రదించండి. ఈ లక్షణం నాలుగుగంటల కన్నా ఎక్కువసేపు కొనసాగితే, తక్షణం నిర్ధారణకై వైద్య పరీక్షలు జరగాలి.

నిర్ధారణ:

నిర్ధారణ:

అపెండిసైటిస్ వ్యాధి నిర్ధారణ ఒక గమ్మత్తైన పనిగా ఉంటుంది, ఎందుకంటే ఈ లక్షణాలు ఇతర ఉదరసమస్యల వలె కనిపించడం, ముఖ్యంగా:

• మలబద్దకం

• గ్యాస్ట్రోఎంటెరిటీస్

• మూత్రాశయం లేదా మూత్ర సంక్రమణ వ్యాధి

• చికాకుపెట్టే పేగు సంబంధిత వ్యాదులు.

అపెండిసైటిస్ సమస్యను నిర్ధారించడానికి, వైద్యులు మీ లక్షణాల గురించి అడగడం మరియు మీ ఉదరభాగాన్ని పరిశీలించడం జరుగుతుంది. మీ లక్షణాలు ఒక విలక్షణ స్వభావాన్ని కలిగి ఉన్నా, లేదా నొప్పి లక్షణాల దృష్ట్యా వివిధ పరీక్షలను నిర్వహించడం, మొదలైనవి ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా :

•మీ నొప్పిని అంచనా వేయడానికి శారీరిక పరీక్ష - మీ వైద్యుడు నొప్పిని అంచనా వేయడానికి మరియు పొత్తికడుపు కండరాల యొక్క దృఢత్వం మరియు సామర్ధ్యాన్ని తనిఖీ చేయడానికి మీ ఉదరం మీద సున్నితంగా నొక్కి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు.

•రక్త పరీక్ష - తెల్లరక్తకణాల సంఖ్యను తెలుసుకునే క్రమంలో ఇది నిర్వహించబడుతుంది, ఇది ముఖ్యంగా సంక్రమణ సంకేతాలను సూచించవచ్చు.

• మూత్ర పరీక్ష - మీ వైద్యుడు, మూత్రాశయ సంక్రమణం వ్యాధులు లేదా మూత్ర మార్గ సంక్రమణ సమస్యలు లేదా మూత్రపిండాలలో రాళ్ళు మొదలైన సమస్యల ద్వారా, మీరు నొప్పిని కలిగి ఉన్నారేమో అని తెలుసుకునే ప్రయత్నంలో ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది.

• ఇమేజింగ్ పరీక్షలు - మీ నొప్పి యొక్క కారణం గుర్తించడానికి ఉదర భాగాన ఎక్స్- రే లేదా ఒక కంప్యూటర్ టొమోగ్రఫీ(సి.టి) స్కాన్ లేదా ఉదర అల్ట్రాసౌండ్ స్కాన్ చేయడం జరుగుతుంది.

• కటి పరీక్షలు - మీ వైద్యుడు, మీకేమైనా కటి సంబంధిత వ్యాదులు లేదా ఏవైనా పునరుత్పత్తి సంబంధిత సమస్యలు ఉన్నాయో లేదో నిర్ధారించుకునే క్రమంలో ఈ పరీక్షలు సహాయపడుతాయి.

• మహిళలకు గర్భ పరీక్ష - ఎక్టోపిక్ గర్భధారణ అవకాశాలను నిర్ధారించుకునే క్రమంలో ఈ పరీక్ష చేపట్టడం జరుగుతుంది.

రోగ నిర్ధారణ ఖచ్చితంగా లేకపోతే, మీ వైద్యుడు, లక్షణాలు పెరుగుదల లేదా తగ్గుదల అంశాలను గమనించడానికి 24గంటల వరకు వేచి ఉండాలని మిమ్మల్ని సిఫార్సు చేయవచ్చు. కావున ఈ వ్యాధిని 24గంటల నొప్పిగా కూడా వ్యవహరిస్తుంటారు.

అపెండిటిటిస్ చికిత్సకు ఉత్తమమైన మార్గం ఏది? మరియు ఎందుకు?

అపెండిటిటిస్ చికిత్సకు ఉత్తమమైన మార్గం ఏది? మరియు ఎందుకు?

అపెండిసైటిస్ రోగానికి చికిత్స, ప్రతి రోగి యొక్క వివిధస్థాయిల మీద ఆధారపడి ఉంటుంది. కానీ, సాధారణంగా అనుసరించే, మరియు ప్రామాణిక చికిత్స, అపెండెక్టమీ.

అపెండిసైటిస్ సమస్య ఉన్నప్పుడు, శస్త్రచికిత్స చేసి దానిని తొలగించుటయే ఉత్తమ మార్గంగా ఉంటుంది. రోగనిర్ధారణ అనేది ఖచ్చితంగా తెలియకపోయినా కూడా, అపెండక్టమీ అనుసరించడానికే వైద్యులు ఇష్టపడతారు. ఎందుకంటే, ప్రభావం అధికంగా లేకపోయినా కూడా, చిన్నపాటి చీలిక కూడా, భవిష్యత్ సమస్యలకు కారణ భూతాలుగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మరియు ఈ అపెండిసైటిస్ శస్త్రచికిత్స ద్వారా, ఉండుకం తొలగించడం ద్వారా ఎటువంటి ఇతర సమస్యలు కూడా పునరావృతం కావు. నిజానికి శరీరంలో అవసరం లేని భాగంగా వైద్యులు చెప్తుంటారు.

ఉండుకం యొక్క విధులకు స్పష్టమైన వివరణలు లేనందున, అది తీసివేసిన తర్వాతకూడా మీ శరీర కార్యాచరణలను ప్రభావితం చేయదు. ఉండుకానికి సంబంధించిన సమస్య ఉంటే మాత్రం, ఇది ఇతర ఉదర సమస్యలకు దారి తీస్తుంది మరియు మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావొచ్చు.

అపెండక్టమీ ద్వారా ఉండుకం తొలగించడం ద్వారా, భవిష్యత్లో ఇటువంటి కడుపునొప్పి వచ్చే ఆస్కారమే లేదు కూడా. ఈ శస్త్ర చికిత్స తర్వాత కొంతనొప్పి ఉన్నా, కొద్దికాలానికి నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. కావున అపెండిసైటిస్ సమస్యకు అపెండక్టమీ ఉత్తమ ఉపాయంగా ఉంటుందని వైద్యులు సూచిస్తుంటారు.

కానీ, ఈ విషయంలో మీ స్వంత నిర్ణయం తీసుకోవడం ఎన్నటికీ మంచిది కాదు మరియు తదుపరి దశల గురించిన నిర్ణయాలకు మీ వైద్యుని సలహాలను పాటించడమే ఉత్తమం.

అపెండిసైటిస్ సమస్యకు ప్రభావితం కాకుండా ఉండుటకు :

అపెండిసైటిస్ సమస్యకు ప్రభావితం కాకుండా ఉండుటకు :

అపెండిసైటిస్ సమస్యను రాకుండా చేయడం అనేది జరగని పని, దీనికి అనేక అంశాలు కారణాలుగా ఉంటాయి. కానీ, మీ ఆహారంలోని అధిక ఫైబర్ సహాయంతో, సమస్య కలిగే ప్రమాదం నుండి కొంతమేర బయటపడవచ్చని నిపుణుల అభిప్రాయం. ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్థాలైన ఓట్ మీల్, గోధుమ గడ్డి, గోధుమ బియ్యం, కిడ్నీ బీన్స్, పండ్లు మొదలైనవి అధికంగా తీసుకోవలసి ఉంటుంది.

English summary

Appendicitis: Causes, Symptoms, and Treatment

Appendix is a small intestinal protrusion from the large intestine and its inflammation is called appendicitis. It affects people belonging to the ages between 10 & 30 years. As per the National Institutes of Health (NIH), this is one of the major problems that causes severe abdominal pain & requires a surgery.
Story first published: Wednesday, August 8, 2018, 20:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more