Latest Updates
-
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు! -
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం! -
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా? -
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే.. -
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రెషర్ కుక్కర్ మూత పక్కల నుండి ఆవిరి లీక్ అవుతోందా? ఈ చిట్కాతో ఆ సమస్యకు చెక్! -
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు -
నవరాత్రి ఉపవాస స్పెషల్.. నానబెట్టే పనే లేకుండా అప్పటికప్పుడు సగ్గుబియ్యం వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా..
అన్నంలో విషం కలిపితే కూడా తెలిసిపోతుంది, అరటి ఆకులో భోజనంతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు
తెలుగు వాళ్లందరికీ అరటి ఆకు భోజనం గురించి తెలుసు. ఇప్పుడున్న జనరేషన్ వాళ్లు ప్లేట్స్ లలో తింటున్నారుగానీ గతంలో ఏ శుభకార్యం అయినా లేదంటే ఇంటికి అతిథులు ఎవరైనా వచ్చిన అరటి ఆకుల్లోనే భోజనం వడ్డించేవారు.
తెలుగు వాళ్లందరికీ అరటి ఆకు భోజనం గురించి తెలుసు. ఇప్పుడున్న జనరేషన్ వాళ్లు ప్లేట్స్ లలో తింటున్నారుగానీ గతంలో ఏ శుభకార్యం అయినా లేదంటే ఇంటికి అతిథులు ఎవరైనా వచ్చిన అరటి ఆకుల్లోనే భోజనం వడ్డించేవారు.
మనకు ఇన్ని రకాల ఆకులున్నా అరటి ఆకుల్లోనే భోజనం చేయడానికి చాలా కారణాలున్నాయి. ఆ ఆకులతో భోజనం చేస్తే చాలా ఉపయోగాలూ ఉన్నాయి.

వెంటనే జీర్ణం అవుతుంది
ఫస్ట్ పాయింట్ అరటి ఆకులో అన్నం తింటే అది వెంటనే జీర్ణం అవుతుంది. మెమోరీ పవర్ కూడా పెరుగుతుంది. కూల్ గా ఉండగలుగుతారు.మీకు బాగా ఆకలి వేసేందుకు కూడా అరటి ఆకు ఉపయోగపడుతుంది. మీ శరీరానికి ఎన్నో రకాల మేలును అరటి ఆకు చేకూరుస్తుంది.

పేగుల్లోని క్రిములు చనిపోతాయి
అరటి ఆకుల్లో అన్నం తింటే పేగుల్లోని క్రిములు చనిపోతాయి. పూర్వం పగవారికి ఇంటికి వెళ్లినప్పుడు వారు అరటి ఆకులోనే భోజనం పెట్టించుకుని తినేవారు. పాత కక్షలను మనస్సులోని పెట్టుకుని తాము తినే ఆహారంలో ఎక్కడ విషం కలుపుతారోనని వారి భయం.

నల్లగా మారిపోతుంది
విషం కలిపిన అన్నాన్ని అరటి ఆకులో వడ్డిస్తే ఆ ఆకు మొత్తం కూడా నల్లగా మారిపోతుంది. దీంతో అన్నంలో విషం కలిసిందని తెలుస్తుంది. అందుకే పగోడి ఇంట్లో కూడా అరటి ఆకులో ఏ భయం లేకుండా భోజనం చేస్తారు.

అన్నంలో కలిసిపోతుంది
ఇక వేడిగా ఉండే ఆహారాన్ని అరటి ఆకుపై పెట్టగానే దానిపై ఉండే ఒక పొర కరిగి అన్నంలో కలిసిపోతుంది. ఇది అన్నానికి ఒకరకమైన రుచిని ఇస్తుంది.

దీర్ఘాకాలిక వ్యాధులు కూడా నయం
అరటి ఆకులో రోజూ భోజనం చేయడం వల్ల చాలా రకాల దీర్ఘాకాలిక వ్యాధులు కూడా నయం అవుతాయి. క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులు కూడా అరటి ఆకులో భోజనం చేయడం వల్ల తగ్గిపోతాయి.

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
రోగ నిరోధక శక్తి పెరిగేందుకు కూడా తోడ్పడుతుంది. అంతేకాదు ప్లాస్టిక్ ప్లేట్లోలో కాకుండా అరటి ఆకుల్లో భోజనం చేయడం వల్ల పర్యావరణానికి కూడా ఎలాంటి హాని కలగదు. అరటి ఆకులలో ఇతరులకు భోజనం పెడితే వారిపై మనకు ఎంతో గౌరవం ఉన్నట్లు అర్థం.

శుభకార్యాలప్పుడైనా
పూర్వకాలపు మనుషులు అరటి ఆకుల్లో రోజూ భోజనం చేయడం వల్లే బాగా ఆరోగ్యంగా ఉండేవారు. అందుకే అప్పుడప్పుడైనా అంటే శుభకార్యాలప్పుడైనా సరే అరటి ఆకులో భోజనం చేస్తూ ఉండండి.



Click it and Unblock the Notifications
