For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యాక్నే విషయంలో బెస్ట్ అండ్ వరస్ట్ ఫుడ్స్ ఇవే

కొన్ని సార్లు మీరు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకున్నా కూడా కొన్ని రకాల ఆహారపదార్థాల వలన యాక్నే బ్రేకవుట్స్ సమస్య తలెత్తుతుంది. చర్మంపై ఇంఫ్లేమేషన్ ఎదురవుతుంది.

|

మీరు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటున్న సంగతి మీ చర్మసౌందర్యం ద్వారా ప్రతిబింబిస్తుంది. కొన్ని సార్లు మీరు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకున్నా కూడా కొన్ని రకాల ఆహారపదార్థాల వలన యాక్నే బ్రేకవుట్స్ సమస్య తలెత్తుతుంది. చర్మంపై ఇంఫ్లేమేషన్ ఎదురవుతుంది. ఈ ఆర్టికల్ లో యాక్నే కి సంబంధించిన బెస్ట్ మరియు వరస్ట్ ఫుడ్స్ గురించి చర్చించుకోబోతున్నాము.

తినే ఆహార ప్రభావం చర్మంపై పడుతుంది. కొన్ని ఆహారపదార్థాలు ఫ్రీ రాడికల్స్ ని న్యూట్రలైజ్ చేస్తాయి. దాంతో చర్మం ఇరిటేట్ అవుతుంది. తద్వారా, ఇంఫ్లేమేషన్ సమస్య ఎక్కువవుతుంది. ఇంఫ్లేమేషన్ అనేది ప్రీ మెచ్యూర్ ఏజింగ్ కు మాత్రమే సంబంధించినది కాదన్న సంగతి మీరు గుర్తించాలి.

anti acne foods

ఆహారం విషయం పక్కన పెడితే, మరి కొన్ని ఫ్యాక్టర్స్ వలన కూడా యాక్నే సమస్య వేధిస్తుంది. సెబమ్ మరియు కేరాటిన్ ఉత్పత్తి, హార్మోన్స్, యాక్నేకి దారి తీసే బాక్టీరియా, బ్లాక్డ్ పోర్స్ మరియు ఇంఫ్లేమేషన్ వంటివి యాక్నే సమస్యకు దారితీస్తాయి.అధ్యయనాల ప్రకారం డైట్ అనేది యాక్నే డెవెలప్మెంట్ కు తనదైన పాత్ర పోషిస్తుందని తేలింది. కాబట్టి, యాక్నే విషయంలో బెస్ట్ మరియు వరస్ట్ ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. బెస్ట్: ఫ్యాటీ ఫిషెస్

1. బెస్ట్: ఫ్యాటీ ఫిషెస్

ఫ్యాటీ ఫిషెస్ లో సల్మాన్, సార్డైన్స్, ట్యూనా వంటి ఒమేగా 3 ఫ్యాటీ ఏసిడ్స్ లభ్యమవుతాయి. ఈ హెల్దీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి సెల్స్ ని నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఆరోగ్యకరమైన సెల్స్ నిర్మాణాన్ని మీరెంతగా ప్రోత్సహిస్తే మీ చర్మం అంత కాంతివంతంగా అంత ఆరోగ్యకరంగా మారుతుంది.

ఒక అధ్యయనం ప్రకారం ఫిష్ ఆయిల్ ను తీసుకోవడం వలన చర్మం నిగారింపు అనేది మెరుగైందని తేలింది. ఫిష్ ఆయిల్ అనేది ఇంఫ్లేమేషన్ ను నియంత్రించే సామర్థ్యం కలిగివుండటం వలన చర్మం కాంతిని సంతరించుకుందని వెల్లడైంది.

2. వరస్ట్ : స్కీమ్డ్ మిల్క్:

2. వరస్ట్ : స్కీమ్డ్ మిల్క్:

స్కీమ్డ్ మిల్క్ ను మీరెంతగా తీసుకుంటే యాక్నే బ్రేకవుట్స్ సమస్య అంతగా పెరుగుతుంది. ఎందుకంటే స్కీమ్డ్ మిల్క్ లో గ్రోత్ హార్మోన్స్ లభిస్తాయి. ఇవి పాశ్చరైజేషన్ తరువాత కూడా మీ శరీరంలో మిగిలి ఉంటాయి.

ఈ హార్మోన్స్ అనేవి శరీరంలో ఉండే ఇన్సులిన్ వంటి కొన్ని హార్మోన్స్ పై ప్రభావం చూపుతాయ. తద్వారా ఆయిల్ ప్రొడక్షన్ పెరిగి బ్రేకవుట్స్ సమస్య తలెత్తుతుంది. స్కీమ్డ్ మిల్క్ కి బదులు ఆల్మండ్ మిల్క్ లేదా మిల్క్ పౌడర్ ను మీరు ఎంచుకుంటే యాక్నే సమస్య తగ్గుముఖం పడుతుంది.

3. బెస్ట్: దోసకాయ మరియు వాటర్ మెలన్:

3. బెస్ట్: దోసకాయ మరియు వాటర్ మెలన్:

ఈ రెండిటిలో వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. తద్వారా, శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. చర్మ సౌందర్యానికి ఇది ముఖ్యమైన అంశం. చర్మం పొడిబారటం వలన యాక్నే సమస్య తలెత్తుతుంది. కొన్ని స్కిన్ ప్రోడక్ట్స్ ని వాడటం వలన చర్మం పొడిబారుతుంది. కాబట్టి, చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడం ఎంతో ముఖ్యం. తగినన్ని దోసకాయ మరియు వాటర్ మెలన్ ని తీసుకోవడం ద్వారా చర్మం హైడ్రేటెడ్ గా ఉంటుంది. హైడ్రేటెడ్ గా ఉండడం వలన చర్మ సమస్యలు దరిచేరవు.

4. వరస్ట్: రిఫైండ్ కార్బోహైడ్రేట్స్:

4. వరస్ట్: రిఫైండ్ కార్బోహైడ్రేట్స్:

కుకీస్, కేక్స్, క్రాకర్స్, మఫిన్స్ మరియు వైట్ బ్రెడ్ లో రిఫైండ్ కార్బోహైడ్రేట్స్ లభ్యమవుతాయి. వీటిలో యాడెడ్ షుగర్ కూడా లభ్యమవుతుంది. ఒక అధ్యయనం ప్రకారం, ఈ హై గ్లైసెమిక్ ఫుడ్స్ అనేవి యాక్నేకి దారితీస్తాయి. బ్లడ్ షుగర్ ని తగ్గించడానికి ఎక్కువ ఇన్సులిన్ ని శరీరం ఉత్పత్తి చేసినప్పుడు చర్మంపై ఆయిల్ ని ఉత్పత్తి చేసే హార్మోన్స్ పై ప్రభావం పడుతుంది.

5. బెస్ట్: జీడిపప్పు:

5. బెస్ట్: జీడిపప్పు:

ఒక ఔన్స్ జీడిపప్పును తీసుకోవడం ద్వారా తగినంత జింక్ అందుతుంది. ఈ విషయం మీకు తెలుసా? అధ్యయనాల ప్రకారం జింక్ శాతం తక్కువైనప్పుడు యాక్నే సమస్య మొదలవుతుంది. జింక్ లో యాంటీ ఇంఫ్లేమేటరీ ప్రాపర్టీలు కలవు. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. జీడిపప్పు, లాబ్స్టర్ మరియు బీఫ్ ను మీ డైట్ లో భాగంగా చేసుకోవచ్చు.

6. వరస్ట్: శ్యాచురేటెడ్ ఫ్యాట్స్:

6. వరస్ట్: శ్యాచురేటెడ్ ఫ్యాట్స్:

బర్గర్స్, ఫ్రైడ్ చికెన్ మరియు ఫాస్ట్ ఫుడ్ లో లభించే శాచురేటెడ్ ఫ్యాట్స్ వలన బ్రేకవుట్స్ సమస్య ప్రేరేపించబడుతుంది. వీటిలో హై ఫ్యాట్ కంటెంట్ ఉండడం వలన ఇలా జరుగుతుంది. ఎక్కువగా శాచురేటెడ్ ఫ్యాట్ ని తీసుకునే వారిలో యాక్నే సమస్య ఒక మోస్తరు నుంచి తీవ్రంగా మారుతుంది. యాక్నేకి దారితీసే కొన్ని ఫ్యాక్టర్స్ కి శాచురేటెడ్ ఫ్యాట్స్ తోడ్పడతాయి.

7. బెస్ట్: ప్రోబయాటిక్ ఫుడ్స్:

7. బెస్ట్: ప్రోబయాటిక్ ఫుడ్స్:

పెరుగు అనేది చక్కటి ప్రోబయాటిక్ ఫుడ్. ఇందులో గట్ ఆరోగ్యాన్ని సంరక్షించే మంచి బాక్టీరియా లభిస్తుంది. ప్రోబయాటిక్ ఫుడ్స్ ని తీసుకోవడం ద్వారా ఇంఫ్లేమేటరీ ప్రోటీన్స్ విడుదలను అరికట్టవచ్చు. సెబమ్ ప్రొడక్షన్ అలాగే క్లాగ్డ్ పోర్స్ సమస్య కూడా నివారించబడుతుంది.

8. వరస్ట్: పిజ్జా

8. వరస్ట్: పిజ్జా

పిజ్జాలో శాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా లభ్యమవుతుంది. ఇది గట్ హెల్త్ పై దుష్ప్రభావం చూపుతుంది. ఇంఫ్లేమేషన్ కి దారితీస్తుంది. హెల్తీ గట్ అనేది ఇంఫ్లేమేషన్ ను అరికడుతుంది. ఇంఫ్లేమేషన్ అనేది యాక్నేకి దారితీస్తుంది. అలాగే, ఎగ్జిమా మరియు మిగతా స్కిన్ ప్రాబ్లెమ్స్ కూడా ఇంఫ్లేమేషన్ వలన తలెత్తుతాయి.

9. బెస్ట్: ఎగ్ యోల్క్:

9. బెస్ట్: ఎగ్ యోల్క్:

ఎగ్ యోల్క్ అనేది ఆరోగ్యానికి హానికరమని చాలా మంది భావిస్తారు. అయితే, ఇది నిజం కాదు. అనేక అధ్యయనాల తరువాత ఎగ్ యోల్క్ అనేది బ్లడ్ లోని కొలెస్ట్రాల్ పై దుష్ప్రభావం చూపదన్న సంగతి వెల్లడైంది. ఎగ్ యోల్క్ లో విటమిన్స్ అధికంగా లభ్యమవుతాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడతాయి. అలాగే, ఇందులో బయోటిన్ అనే బ్యూటీ విటమిన్ కూడా లభిస్తుంది. అధ్యయనాల ప్రకారం బయోటిన్ విటమిన్ వలన యాక్నే, రాషెస్ మరియు డ్రై నెస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందని తెలుస్తోంది.

10. వరస్ట్: వైట్ బ్రెడ్

10. వరస్ట్: వైట్ బ్రెడ్

వైట్ బ్రెడ్ ను తీసుకునే బదులు హోల్ గ్రెయిన్ బ్రెడ్ ను తీసుకుంటే చర్మం కాంతివంతంగా అలాగే ఆరోగ్యంగా మారుతుంది. వైట్ బ్రెడ్ అనేది హై గ్లైసెమిక్ ఫుడ్. అంటే ఇది బ్లడ్ షుగర్ అలాగే ఇన్సులిన్ లెవల్స్ పై ప్రభావం చూపుతుంది. కాబట్టి, వైట్ బ్రెడ్ కు బదులుగా హోల్ గ్రెయిన్ బ్రెడ్ ను బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవడం మంచిది. ఈ ఆర్టికల్ మీకు నచ్చితే ఈ ఆర్టికల్ ను షేర్ చేయండి!

English summary

10 Best And Worst Foods For Acne

If you follow a healthy diet, it reflects on your skin. Even if you are on a healthy diet, there might be some unknown foods that could trigger acne breakouts and cause inflammation on your skin. In this article, we will be discussing the best and worst foods for acne.
Story first published:Wednesday, June 6, 2018, 16:20 [IST]
Desktop Bottom Promotion