For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వీటి ద్వారా యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి

ఆక్సిడేషన్ ప్రాసెస్ ని ఆపే మాలిక్యూల్స్ అనేవి యాంటీ ఆక్సిడెంట్స్. ఆక్సిడేషన్ ప్రక్రియ అనేది శరీరంలోని సెల్స్ ని డేమేజ్ చేస్తుంది. అందువలన, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభించే ఫుడ్స్ ని తీసుకోవడం ద్వార

|

ఆక్సిడేషన్ ప్రాసెస్ ని ఆపే మాలిక్యూల్స్ అనేవి యాంటీ ఆక్సిడెంట్స్. ఆక్సిడేషన్ ప్రక్రియ అనేది శరీరంలోని సెల్స్ ని డేమేజ్ చేస్తుంది. అందువలన, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభించే ఫుడ్స్ ని తీసుకోవడం ద్వారా ఆక్సిడేషన్ ప్రాసెస్ ను నిలిపివేయవచ్చు. తద్వారా, సెల్స్ ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా కలిగిన ఫుడ్స్ ని తీసుకోవడం ద్వారా శరీరం నుంచి టాక్సిన్స్ అలాగే ఫ్రీ రాడికల్స్ అనేవి తొలగిపోతాయి. తద్వారా, క్యాన్సర్ వంటి తీవ్ర ప్రమాదకర వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. ఈ విధంగా, యాంటీ ఆక్సిడెంట్స్ వలన ఏజింగ్ ప్రాసెస్ వాయిదా పడుతుంది. వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు.

యాంటీఆక్సిడెంట్స్ ద్వారా గుండె నొప్పులను కూడా అరికట్టవచ్చు. రోగనిరోధక శక్తిని మెరుగుపరిచి ఫ్రీ రాడికల్స్ ని శరీరం నుంచి బయటకు పంపించివేస్తాయి.

యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్న ఆహారాలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. తగు మోతాదులో పండ్లను అలాగే కూరగాయలను ఆహారంలో భాగంగా చేసుకోవాలి.

Antioxidants are molecules that stop the process of oxidation

లెమన్, నట్స్, చెర్రీస్, టమాటో, జామకాయ, ఫిష్, బ్రౌన్ రైస్, క్రేన్ బెర్రీ వంటి వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి.

కాబట్టి, ఈ రోజు, బోల్డ్ స్కై లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభించే కొన్ని ఆహార పదార్థాలు గురించి వివరంగా తెలియచేసాము. ఈ ఫుడ్స్ యొక్క జాబితాను మీరు పరిగణలోకి తీసుకుని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

నిమ్మకాయ:

నిమ్మకాయ:

సిట్రస్ పండు నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. దీనిని యాంటీ ఆక్సిడెంట్స్ కి నిలయంగా చెప్పుకోవచ్చు. సిట్రస్ ఫ్రూట్స్ ని ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా రోగనిరోధక వ్యవస్ధను మెరుగుపరచుకోవచ్చు. తద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు.

నట్స్:

నట్స్:

నట్స్ లో విటమిన్ ఈ పుష్కలంగా లభిస్తుంది. అందువలన, యాంటీ ఆక్సిడెంట్స్ కి ఇది గొప్ప నిలయం. విటమిన్ ఈ అనేది లివర్ లో ఫ్యాట్ ఓ పాటుగా నిల్వ ఉంటుంది. ఆల్మండ్స్, పిస్తాచియోస్, పీనట్స్ వంటివి యాంటీ ఆక్సిడెంట్స్ కు సంబంధించిన మరికొన్ని సోర్సులు.

బ్రొకోలీ:

బ్రొకోలీ:

విటమిన్ సి బ్రొకోలీ లో పుష్కలంగా లభిస్తుంది. అందువలన, బ్రొకోలీలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయని పేర్కొనవచ్చు. విటమిన్ సి తో పాటు బ్రొకోలీలో సెలీనియం అనేది లభ్యమవుతుంది. ఇది ఫ్రీ రాడికల్స్ ద్వారా అయ్యే డేమేజ్ ను అరికడుతుంది.

చేప:

చేప:

సెలీనియం అనేది చేపలలో పుష్కలంగా లభ్యమవుతుంది. ఇవి శరీరంలోని సెల్స్ ని ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడుతుంది. వివిధ రకాల చేపలను ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా యాంటీ ఆక్సిడెంట్స్ ను తగిన మోతాదులో పొందవచ్చు.

బ్రౌన్ రైస్:

బ్రౌన్ రైస్:

బ్రౌన్ రైస్ లో పోషకవిలువలు అధిక మోతాదులో లభ్యమవుతాయి. దీనిని తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పొందవచ్చు. కేలరీలు తక్కువగా ఉండడంతో పాటు గ్లూటన్ కూడా ఇందులో ఉండకపోవడం వలన బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి మంచిది. ఇందులో లభించే పోలీఫెనాల్స్ అనేవి ఆక్సిడేషన్ ప్రాసెస్ ని అడ్డుకుంటాయి.

క్రేన్ బెర్రీ:

క్రేన్ బెర్రీ:

క్రేన్ బెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇందులోనున్న అధిక ఫ్లెవనాయిడ్ కంటెంట్ వలన శరీరంలోని యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ మెరుగవుతుంది.

English summary

best sources of antioxidants

The best way to get more antioxidants is with the help of an antioxidant-rich diet. One should eat lots of fresh fruits and vegetables.Lemon, nuts, cherries, tomatoes, guavas, fish, brown rice, cranberry, etc, are some of the good sources of antioxidants. Therefore, in this article, we at Boldsky will be listing out some of the best sources of antioxidants that one needs to know about. Take a look at the list of foods that are rich in antioxidants.
Story first published:Thursday, January 25, 2018, 18:33 [IST]
Desktop Bottom Promotion