మ‌హిళ‌ల్లో మూత్రాశ‌య క్యాన్స‌ర్: 10 భ‌యంక‌ర వాస్త‌వాలు

Posted By: sujeeth kumar
Subscribe to Boldsky

క్యాన్స‌ర్ అనే పేరు విన‌గానే మ‌నకు సాధార‌ణంగా బ్రెస్ట్ క్యాన్స‌ర్‌, బ్రెయిన్ క్యాన్స‌ర్ లాంటివి గుర్తొస్తుంటాయి. సాధార‌ణ జ‌నాలు చాలా ర‌కాల అరుదైన క్యాన్స‌ర్ల గురించి ఎప్పుడూ విని ఉండ‌రు. అలాంటివి ఒక‌టి ఉంటాయ‌ని క‌ల‌లో కూడా ఊహించి ఉండ‌రు. క్యాన్స‌ర్ పేరు చెప్ప‌గానే ఎవ‌రికైనా వెన్నులో వ‌ణుకు పుట్టాల్సిందే. మ‌రి సున్నిత‌మైన భాగాల్లో వ‌స్తే?

ఏటా ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారి వేల ప్రాణాల‌ను తీసేస్తుంది. దీనిని న‌యంచేయ‌గ‌ల అవ‌కాశం ఉన్నా తిరిగి వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. క్యాన్స‌ర్ న‌యం అయిన‌వాళ్ల‌లోనూ కొన్ని నెల‌ల త‌ర్వాత తిరిగి వ‌చ్చి రెండోసారి ఎంత చికిత్స తీసుకున్నా ఫ‌లితం లేక‌పోయింది.

Facts About Bladder Cancer In Women

క్యాన్స‌ర్ వ్యాధి కార‌ణంగా శ‌రీరంలో అసంఖ్యాక‌మైన రీతిలో క‌ణాల వృద్ధి జ‌రుగుతుంద‌న్న విష‌యం తెలిసిందే. సాధార‌ణంగా బ్రెస్ట్‌క్యాన్స‌ర్‌, బ్రెయిన్ ట్యూమ‌ర్‌, లంగ్ క్యాన్స‌ర్‌, బ్ల‌డ్ క్యాన్స‌ర్‌, గొంతు క్యాన్స‌ర్ లాంటివి ఎక్కువ‌గా వ‌స్తుంటాయి. ఐతే క్యాన్స‌ర్ ఏ భాగానికైనా రావొచ్చు. అది క‌ను గుడ్లు, చెవులు, మ‌ర్మాంగాలు, మూత్ర‌నాళాలు త‌దిత‌రాలు.

మూత్ర నాళ క్యాన్స‌ర్ ల‌క్ష‌ణాలు మ‌గ‌వారికి, ఆడ‌వారికి విభిన్నంగా ఉంటాయి. ఇప్పుడు మ‌హిళ‌ల్లో వ‌చ్చే మూత్ర‌నాళ క్యాన్స‌ర్ గురించి తెలుసుకుందాం...

1. సున్నిత‌మైన ల‌క్ష‌ణాలు

1. సున్నిత‌మైన ల‌క్ష‌ణాలు

బ్రెయిన్ ట్యూమ‌ర్ లాంటివాటిలో తీవ్ర‌మైన త‌ల‌నొప్పి వ‌స్తుంది. అదే మూత్రాశ‌య క్యాన్స‌ర్‌లో అలా ఉండ‌దు. సాధార‌ణ స‌మ‌స్య‌గా మూత్ర మార్గంలో నొప్పి లేదా వాపుగా జ‌నాలు భావించే అవ‌కాశం ఉంది. అందుకే ఎర్లీ స్టేజ్‌లో దీన్ని డిటెక్ట్ చేయ‌డం క‌ష్టం.

2. ప్ర‌ధాన ల‌క్ష‌ణాలు

2. ప్ర‌ధాన ల‌క్ష‌ణాలు

మూత్రం పోసేట‌ప్పుడు నొప్పి క‌ల‌గ‌డం, మ‌ర్మాంగాల్లో మంట‌, మూత్రం ముదురు రంగులో ఉండ‌టం, ర‌క్తం ప‌డ‌టం, త‌ర‌చూ మూత్ర విస‌ర్జ‌న లాంటివ‌న్నీ ప్ర‌ధాన ల‌క్ష‌ణాలే.

3. ఆడ‌వారిలో మ‌ర‌ణ రేటు ఎక్కువ‌

3. ఆడ‌వారిలో మ‌ర‌ణ రేటు ఎక్కువ‌

సాధార‌ణంగా మూత్రాశ‌య క్యాన్స‌ర్ ఎక్కువ‌గా మ‌గ‌వారికే వ‌స్తుంది. ఐతే ఆడ‌వారికి వ‌స్తే మాత్రం మ‌ర‌ణ రేటు అధికంగా ఉంటోంది. ల‌క్ష‌ణాలు చాలా సున్నితం, అవి అడ్వాన్స్ ద‌శ‌కు వ‌చ్చే దాకా మ‌హిళ‌ల్లో గుర్తించ‌డం క‌ష్టం.

4. ఇన్ఫెక్ష‌న్ల‌తో సంబంధం లేదు

4. ఇన్ఫెక్ష‌న్ల‌తో సంబంధం లేదు

మూత్ర సంబంధ ఇన్ఫెక్ష‌న్లు ఎక్కువ‌గా వ‌చ్చే వారు ఈ ర‌క‌మైన క్యాన్స‌ర్‌కు గుర‌య్యే అవ‌కాశం ఉంటుంద‌ని సాధార‌ణ అపోహ‌. వాస్త‌వానికి అలాంటిదేమీ లేద‌ని ప‌రిశోధ‌కులు వెల్ల‌డించారు.

5. పొగ‌తాగ‌డం

5. పొగ‌తాగ‌డం

వివిధ కార‌ణాలున్నా, పొగ‌తాగ‌డం వ‌ల్ల ఈ ర‌క‌మైన క్యాన్స‌ర్ వ‌చ్చేందుకు అవ‌కాశాలెక్కువ‌. సిగరెట్ల‌లో ఉండే హానికార‌క ప‌దార్థాల మూలంగా మూత్ర‌కోశ క్యాన్స‌ర్ వ‌చ్చే ప్ర‌మాదం ఉంటుంది.

6. వాటి ప‌ట్ల నిర్ల‌క్ష్యం వ‌ద్దు

6. వాటి ప‌ట్ల నిర్ల‌క్ష్యం వ‌ద్దు

మూత్ర‌నాళాల్లో ఇన్ఫెక్ష‌న్లు వ‌చ్చినంత మాత్రాన క్యాన్స‌ర్ రాద‌ని ఇది వ‌ర‌కు చెప్పుకున్నాం. ఐతే వీటిని మ‌హిళ‌లు నిర్ల‌క్ష్యం చేయ‌వ‌ద్దు. దీర్ఘ‌కాలంపాటు ఇలాంటి ఇన్ఫెక్ష‌న్లు కొన‌సాగితే మాత్రం అనుమానించాల్సిందే.

7. వంశ‌పారంప‌ర్యంగా...

7. వంశ‌పారంప‌ర్యంగా...

మీ కుటుంబంలో అమ్మ‌మ్మ‌, అమ్మ‌, మేన‌త్త లాంటివారెవ‌రైనా మూత్ర‌కోశ క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డిన‌ట్ట‌యితే మీకూ ఆ క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది.

8. చికిత్స‌

8. చికిత్స‌

క్యాన్స‌ర్ ఉంద‌ని తెలియ‌గానే అది ఎంత మేర‌కు విస్త‌రించి ఉన్న‌ది అన్న‌దాన్ని బ‌ట్టి చికిత్స మొద‌లుపెట్టాలి. రేడియేష‌న్ థెర‌పీ, కీమోథెర‌పీ, స‌ర్జ‌రీ లాంటివెన్నో ప‌ద్ధ‌తులున్నాయి.

9. సంతానోత్ప‌త్తిపై...

9. సంతానోత్ప‌త్తిపై...

చాలా మంది ఈ వ్యాధి బారిన ప‌డిన మ‌హిళ‌ల‌కు చికిత్స అయితే విజ‌య‌వంతంగా జ‌రిగింది. కానీ, వారి సంతానోత్ప‌త్తిని కోల్పోయారు.

10. వైట్ డిశ్ఛార్జి

10. వైట్ డిశ్ఛార్జి

మూత్ర‌కోశ క్యాన్స‌ర్‌లో ఇది చాలా అరుదైన ల‌క్ష‌ణం. మ‌హిళ‌ల్లో విప‌రీత‌మైన వైట్ డిశ్ఛార్జిని గ‌మ‌నించ‌వ‌చ్చు. ఇది ఈస్ట్ ఇన్ఫెక్ష‌న్తో పొర‌బ‌డే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి దీన్ని నిర్ల‌క్ష్యం చేయ‌రాదు.

English summary

Facts About Bladder Cancer In Women

Facts About Bladder Cancer In Women,Here are a few facts about urinary bladder cancer that every woman must pay heed to!