కార్డియాక్ అరెస్ట్ వెర్సెస్ గుండెపోటు : మీరు వీటి గురించి తెలుసుకోవాల్సినవి ఇవే

Written By: DEEPTHI T A S
Subscribe to Boldsky

చాలామంది గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ ఒకటే అనుకుంటారు, కానీ నిజానికి అవి రెండు చాలా తేడాతో ఉన్న వేర్వేరు గుండె సమస్యలు.

గుండె కండరాలకి రక్తాన్ని పంపే ధమనిలో ఏదైనా అడ్డు వచ్చి, గుండెకి సమయానికి రక్తం చేరకపోతే గుండెపోటు వస్తుంది, దీనివల్ల కొన్ని ముఖ్య భాగాలలో కణజాలాలు చచ్చిపోతాయి. అదే మరోవైపు, హఠాత్తుగా వచ్చే కార్డియాక్ అరెస్ట్ లో గుండె పనితీరు మొత్తం మీద అస్తవ్యస్తంగా అయి, గుండె కొట్టుకోవటం ఊహించనివిధంగా ఠక్కుమని ఆగిపోతుంది.

ఈ రెండు స్థితుల గురించి మీరు తెలుసుకోవాల్సిన అన్ని విషయాలు ఈ ఆర్టికల్ లో ఉన్నాయి, చదవండి.

మీకు గుండెపోటు ఎందుకు వస్తుంది?

అన్నిరకాల గుండెపోట్లకి అసలు కారణం కరోనరీ ఆర్టరీకి వచ్చే వ్యాధి.

Cardiac Arrest vs Heart Attack: Here’s What You Need To Know

కరోనరీ ఆర్టరీ వ్యాధిలో, మీ గుండెలో ఉండే కరోనరీ ధమనులు (ఆక్సిజన్, ఆహారపోషకాలను రక్తం ద్వారా గుండె కండరాలకి పంపే రక్తనాళాలు) ఎంతో కాలంగా పేరుకుపోతున్న కొవ్వు, కొలెస్టెరాల్ కారణంగా ఇరుకుగా మారిపోతాయి.

ఈ పేరుకుపోయిన కొవ్వు మీద కణాలు ఒక టోపీలాగా దాన్ని కవర్ చేస్తాయి, అది మరీ పెద్దగా అయినప్పుడు రక్తప్రవాహంతో వచ్చే వత్తిడి వల్ల దానిపై చిల్లిపడుతుంది. ఈ చిల్లిని పూడ్చటానికి ప్లేట్లెట్లు, గడ్డకట్టించే కణాలు అక్కడకి చేరి, అక్కడి రక్తం గడ్డకడుతూ పోతుంది. దీనివలన రక్తనాళం మరింత ఇరుకుగా మూసుకుపోతుంది.

Cardiac Arrest vs Heart Attack: Here’s What You Need To Know

ఈ గడ్డకట్టిన రక్తం పెద్దగా ఉంటే, రక్తనాళం పూర్తిగా మూసుకునేలా చేస్తుంది, దాని వల్ల గుండెలో మిగతా భాగాలకి, ఈ భాగానికి రక్తం పంపిణీ జరగదు. అందుకే ఈ భాగం చచ్చిపోవటం మొదలవుతుంది. ఒక భాగం గుండె కండరం ఇలా తీవ్రంగా పాడయి రక్తం ప్రసరించేలా చేయలేనప్పుడు మీకు గుండెపోటు వస్తుంది.

శాస్త్రీయంగా దీన్ని మైయోకార్డియల్ ఇన్ఫారక్షన్ అంటారు.

కార్డియాక్ అరెస్ట్ లు ఎందుకు జరుగుతాయి?

Cardiac Arrest vs Heart Attack: Here’s What You Need To Know

కార్డియాక్ అరెస్ట్ హఠాత్తుగా నాడీ వ్యవస్థలో లోపాల వల్ల గుండె కొట్టుకోకపోతే వస్తుంది. దీనివలన శరీరంలో ముఖ్యభాగాలైన మెదడు వంటివాటికి రక్తం సరఫరా జరగక స్పృహ కోల్పోవటం, నాడీ అందకపోవటం జరుగుతాయి.

ఇది గుండె కండరాల ఎదుగుదలలో లోపాలైన వెంట్రిక్యులార్ ఫైబ్రిలేషన్, కార్డియాక్ మయోపతి, వాల్వులార్ లేదా పుట్టుకతో వచ్చే గుండెజబ్బులు, హార్ట్ ఫెయిల్యూర్ వంటి వాటి వలన వస్తుంది.

హఠాత్తుగా వచ్చే కార్డియాక్ అరెస్ట్ వైద్యపరంగా ఒక అత్యవసర స్థితి, దీనికి వెంటనే సిపిఆర్ లేదా ఎలక్ట్రికల్ డీఫైబ్రిలేషన్ చేయటం అవసరం. ఇవి చేయలేకపోతే కార్డియాక్ అరెస్ట్ ప్రాణాంతకమవుతుంది.

కార్డియాక్ అరెస్ట్ వర్సెస్ గుండెపోటు ; ఈ రెండింటికీ లింక్ ఉందా?

గుండెపోటు ఎక్కువసేపు ఉంటే గుండెలోని ముఖ్యభాగాలలో కండరాలు చచ్చిపోవటం వల్ల అది కార్డియాక్ అరెస్ట్ కి దారితీయవచ్చు. ఇదొక్కటే ఈ రెండు స్థితుల మధ్య లింక్ గా చెప్పుకోవచ్చు.

అందుకే గుండెపోటు కలిగించే ఏ స్థితులైనా కార్డియాక్ అరెస్ట్ రిస్క్ ను కూడా పెంచుతాయి, కానీ కార్డియాక్ అరెస్ట్ గుండెపోటుతో సంబంధం లేకుండా కూడా నేరుగా రావచ్చు.

Cardiac Arrest vs Heart Attack: Here’s What You Need To Know

గుండెపోటుకి రిస్క్ ను పెంచే కారణాలు

ఈ కింద కారణాలు కరోనరీ ఆర్టరీ వ్యాధి ఇంకా గుండెపోటు రిస్క్ ను పెంచుతాయి. అవేంటో తెలుసుకుని మీ జీవనశైలిలో ఏమన్నా మార్పులు చేసుకోవాలా అని నిర్ణయించుకోండి.

డయాబెటిస్

పొగతాగడం

అధిక రక్తపోటు

ఎక్కువ కొలెస్ట్రాల్

స్థూలకాయం

కదలిక లేని జీవనశైలి

ఎక్కువగా తాగటం

గుండెపోటు లేదా కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఏం చేయాలి

గుండెపోటు ప్రాథమిక లక్షణం హఠాత్తుగా, ఛాతీలో గుచ్చుకుంటున్నట్టు వచ్చే నొప్పి మీ ఎడమ భుజం, చేయి, మెడవైపు త్వరగా పాకుతుంది.

ఇతర లక్షణాలు వికారం, చల్లగా మారిపోయి చెమట పట్టడం, హఠాత్తుగా చాలా భయం వేయటం మొదలైనవి.

అందుకని ఈ లక్షణాలు మీకు వస్తున్నాయి అన్పించినా, ఎవరికైనా వస్తున్నా వెంటనే అంబులెన్స్ ను పిలిపించండి లేదా సాయం కోసం పెద్దగా అరవండి.

కార్డియాక్ అరెస్ట్ విషయానికొస్తే, వైద్యసాయం కోసం సమాచారం ఇచ్చేసి, వారు వచ్చేలోగా పేషెంట్ గుండె కొట్టుకోవడం ఆగకుండా సిపిఆర్ చేయండి.

గుర్తుంచుకోండి ; గుండెపోటు లేదా హఠాత్తుగా వచ్చే కార్డియాక్ అరెస్ట్ విషయంలో ప్రతి నిమిషం విలువైనదే.

English summary

Cardiac Arrest vs Heart Attలck: Here’s What You Need To Know

You get a heart attack when a block in an artery supplying the muscles of the heart prevents blood from reaching your heart on time, causing tissue death in some vital parts. On the other hand, a sudden cardiac arrest is an electrical malfunction that causes the heart to stop beating unexpectedly and suddenly. So, here's everything you need to know about the two conditions.