For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాత్రిపూట లవంగాలను నోట్లో పెట్టుకుంటే ఆ సామర్థ్యం.. దాంతో పాటు ఇంకా చాలా ప్రయోజనాలు

లవంగాలను తినడం వల్ల జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది.లవంగాల్లో యాంటీ బాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. లవంగాలను రోజూ తినడం వల్ల వాటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు లివర్‌ను శుద్ధి చేస్తాయి.

|

మన దేశంలోనే కాదు అనేక దేశాల్లోనూ లవంగాలను మసాలా దినుసుగా వాడుతారు. వీటిని వంటల్లో వేస్తే వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. ఇక లవంగాలు వేయకుండా నాన్ వెజ్ వంటలను వండరు. ఇవి అంతలా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

విచ్చీవిచ్చని పూమొగ్గలే లవంగాలు. అందుకే మనం వీటిని ముద్దుగా లవంగమొగ్గలనీ పిలుస్తుంటాం. ఇండొనేషియాలోని స్పైస్‌ ఐల్యాండ్స్‌గా పిలిచే మొలక్కస్‌ దీవులే వీటి స్వస్థలం. ప్రస్తుతం వీటిని బ్రెజిల్‌, ఇండియా, వెస్టిండీస్‌, మారిషస్‌, జాంజిబార్‌, శ్రీలంక, పెంబా దేశాల్లోనూ పండిస్తున్నారు.

అద్భుతమైన ఔషధం

అద్భుతమైన ఔషధం

లవంగాలనే వంటలకే కాక ఇవి మనకు పలు ఆరోగ్యకర ప్రయోజనాలను ఇచ్చే అద్భుతమైన ఔషధంగా కూడా పనిచేస్తాయి. ఈ క్రమంలోనే రోజూ 3 పూటలా భోజనం తరువాత ఒక లవంగాన్ని నమిలి తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది

జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది

లవంగాలను తినడం వల్ల జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది. జీర్ణాశయం, పేగులు శుభ్రమవుతాయి. గ్యాస్, అసిడిటీ, వికారం, అజీర్ణం తగ్గిపోతాయి. మలబద్దకం పోతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.

యాంటీ బాక్టీరియల్ గుణాలు పుష్కలం

యాంటీ బాక్టీరియల్ గుణాలు పుష్కలం

లవంగాల్లో యాంటీ బాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక రకాల సూక్ష్మ క్రిముల నుంచి, ఇన్‌ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షిస్తాయి. శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఫ్లూ, దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధులను నయం చేస్తాయి.

క్యాన్సర్ బారి నుంచి తప్పించుకోవచ్చు

క్యాన్సర్ బారి నుంచి తప్పించుకోవచ్చు

ఊపిరితిత్తుల క్యాన్సర్ మొదటి దశలో ఉంటే అలాంటి వారు లవంగాలను రోజూ తింటే క్యాన్సర్ బారి నుంచి తప్పించుకోవచ్చని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. లవంగాల్లో ఉండే యాంటీ కార్సినోజెనిక్ గుణాలు క్యాన్సర్ కణాలతో పోరాడి వాటిని నాశనం చేస్తాయి.

లివర్‌ను శుద్ధి చేస్తాయి

లివర్‌ను శుద్ధి చేస్తాయి

లవంగాలను రోజూ తినడం వల్ల వాటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు లివర్‌ను శుద్ధి చేస్తాయి. మెటబాలిజంను మెరుగు పరుస్తాయి. దీంతో కొవ్వు కరుగుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి.

డయాబెటిస్

డయాబెటిస్

డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నవారు నిత్యం తమ ఆహారంలో లవంగాలను చేర్చుకుంటే దాంతో అద్భుతమైన ఫలితం ఉంటుందని సాక్షాత్తూ వైద్యులే చెబుతున్నారు. లవంగాల్లో ఉండే ఇన్సులిన్ వంటి గుణాలు రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలను క్రమబద్దీకరిస్తాయి. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది.

ఎముకలను రక్షిస్తాయి

ఎముకలను రక్షిస్తాయి

లవంగాల్లో యుజెనాల్, ఫ్లేవోన్స్, ఐసో ఫ్లేవోన్స్, ఫ్లేవనాయిడ్స్ అని పిలవబడే ఫీనోలిక్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఎముకలను రక్షిస్తాయి. దీంతో వయస్సు మీద పడడకం కారణంగా వచ్చే ఆస్టియో పోరోసిస్ (ఎముకలు గుల్లబారిపోవడం)ను తగ్గిస్తాయి.

దంతాలు, చిగుళ్ల సమస్యలు పోతాయి

దంతాలు, చిగుళ్ల సమస్యలు పోతాయి

లవంగాల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కూడా పుష్కలంగానే ఉంటాయి. ఇవి నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. శరీరంలో నీరు ఎక్కువగా చేరకుండా చూస్తాయి. లవంగాలను తినడం వల్ల దంతాలు, చిగుళ్ల సమస్యలు పోతాయి. దంతాలు దృఢంగా మారుతాయి. నోటి దుర్వాసన పోతుంది. లవంగాలను తినడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. పాలలో చిటికెడు లవంగాల పొడిని కలుపుకుని తాగితే తలనొప్పి ఇట్టే తగ్గిపోతుంది.

మద్యం తాగాలన్న కోరిక కలగదు

మద్యం తాగాలన్న కోరిక కలగదు

లవంగాల్లోని యుజెనాల్ అనే రసాయనానికి అద్భుత ఔషధ, పోషక విలువలు ఉన్నాయి. యుజెనాల్ కఫానికి విరుగుడుగా పనిచేస్తుంది. రెండు లవంగాల్ని బుగ్గనపెట్టుకుని నమిలితే మద్యం తాగాలన్న కోరిక కలగదు.

తగ్గుముఖం పడతాయి

తగ్గుముఖం పడతాయి

లవంగాలను నీళ్లలో మరిగించి తాగడం వల్ల అజీర్తి, తలతిరగడం, వాంతులు, అలసట వంటివి తగ్గుతాయి. అంతేకాదు, ఫ్లూ, జలుబు, సైనసైటిస్, ఆస్తమా, దగ్గు, బ్రాంకైటిస్ వంటివి కూడా తగ్గుముఖం పడతాయి.

పెద్ద పేగులోని పరాన్నజీవుల్నీ

పెద్ద పేగులోని పరాన్నజీవుల్నీ

లవంగనూనెలో దూదిని ముంచి దంతాలు, చిగుళ్లులో నొప్పి వచ్చేచోట పెడితే ఇట్టే తగ్గిపోతుంది. పెద్ద పేగులోని పరాన్నజీవుల్నీ సూక్ష్మ జీవుల్నీ లవంగంలోని 'యుజెనాల్' నాశనం చేస్తుంది. అందుకే డయేరియా, నులిపురుగులు, జీర్ణసంబంధిత రుగ్మతలకి లవంగం మంచి మందుగా ఉపయోగపడుతుంది.

గుండెల్లో మంట

గుండెల్లో మంట

రెండుమూడు లవంగాలకు కొంచెం పంచదార చేర్చి నూరి చల్లటినీళ్లలో కలిపి తాగితే గుండెల్లో మంట వెంటనే తగ్గుతుంది. జలుబుతో బాధ పడేవాళ్లు కర్ఛీఫ్‌మీద రెండుమూడు చుక్కల లవంగనూనెని చల్లి వాసన పీలిస్తే వెంటనే తగ్గిపోతుంది.

ఆ నీటిని తాగేస్తే

ఆ నీటిని తాగేస్తే

ఏడు మొగ్గల్ని కొద్దినీళ్లలో మరిగించి దాని నుంచి వచ్చే ఆవిరిని పీల్చి చల్లారిన తరవాత ఆ నీటిని తాగేస్తే జలుబుతో మండిపోతున్న ముక్కుకి హాయిగా ఉంటుంది.లవంగాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి హానికలిగించే ఫ్రీరాడికల్స్‌ను అడ్డుకోవటడంతో బాటు క్యాన్సర్లు, హృద్రోగాలు, డయాబెటిస్, ఆర్థ్రైటిస్, అల్జీమర్స్‌ను నిరోధిస్తాయట.

నూనె తీయనివి

నూనె తీయనివి

లవంగాల నుంచి నూనె తీయనివి ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.గొంతునొప్పి, జలుబులను తగ్గించేందుకు లవంగాల కషాయం దివ్యౌషధంగా పనిచేస్తుంది.

తెల్ల రక్త కణాలు

తెల్ల రక్త కణాలు

ఎక్కువగా దప్పిక వేసినప్పుడు లవంగ పలుకులు తింటే దప్పిక తీరి ఉపశమనం కలుగుతుంది. లవంగనూనెలో దూదిని ముంచి దంతాలు, చిగుళ్లులో నొప్పి వచ్చేచోట పెడితే ఇట్టే తగ్గిపోతుంది.లవంగాలు తెల్ల రక్త కణాలను పెంపొదిస్తుంది. అలాగే జీవిత కాలాన్ని పెంపొందించే గుణాలు ఇందులో ఉన్నాయి.ఇది వ్యాధి నిరోధక శక్తిగా కూడా ఉపయోగపడుతుంది.

చర్మ సంబంధ వ్యాధులు

చర్మ సంబంధ వ్యాధులు

ఎలాంటి చర్మ వ్యాధినైనా లవంగాలు ఇట్టే మాయం చేసేస్తాయి. దీనిని చందనంతోపాటు రుబ్బుకుని లేపనంలా చర్మానికి పూస్తే చర్మ వ్యాధులు మటుమాయమంటున్నారు వైద్యులు. లవంగాలను చైనీయులు వెక్కిళ్ల నివారణా ఔషధంగా ఉపయోగిస్తారు. అంతేగాకుండా వీటితో తామర లాంటి చర్మ సంబంధ వ్యాధులు. ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు బాగా తగ్గుతాయని వారు చెబుతుంటారు.

తలనొప్పి తగ్గుతుంది

తలనొప్పి తగ్గుతుంది

పాలలో లవంగం పొడి, ఉప్పు కలిపి నుదుటమీద ప్యాక్ వేసినచో తలనొప్పి తగ్గుతుంది. దీనికి రక్తాన్ని శుద్ధి చేసే గుణము ఉన్నందున శరీరము లో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.లవంగాలను తేనెతోపాటు తీసుకుంటే వికారం, వాంతులు తగ్గడంతోపాటు జీర్ణశక్తి పెరుగుతుంది.

రూమ్ ఫ్రెషర్స్‌కు బదులు

రూమ్ ఫ్రెషర్స్‌కు బదులు

కెమికల్స్‌ కలిసిన రూమ్ ఫ్రెషర్స్‌కు బదులు.. లవంగ నూనె, నీటితో కలిపిన మిశ్రమాన్ని స్ప్రేచేస్తే సరి. మీ గార్డెన్లో లవంగాలు మొక్కలు వేసుకుంటే.. కీటకాల సమస్య ఉండదు. కిచెన్‌లో ఈగల సమస్య ఎక్కువగా ఉంటే ఒక గిన్నె నిండ లవంగాలు తీసుకుని గది మధ్యలో ఉంచండి

చీమల సమస్య ఎక్కువగా ఉంటే దాల్చిన చెక్క, లవంగాల పొడి మిశ్రమాన్ని నీటిలో కలిపి స్పే చేయండి.

బాగా సెక్స్ చేయొచ్చట

బాగా సెక్స్ చేయొచ్చట

ఇక మీరు సెక్స్ లో పాల్గొనే ముందు లవంగాలను తింటే అవి మీ శరీరాన్ని వేడెక్కించి మీ భాగస్వామితో బాగా సెక్స్ చేసే సామర్థ్యాన్ని ఇస్తాయి. ఎక్కువ సేపు సెక్స్ చేయొచ్చు. రాత్రిపూట లవంగాలను నోట్లో పెట్టుకుంటే బాగా సెక్స్ చేయొచ్చట. ఇలా లవంగాలతో ఎన్నో ప్రయోజనాలున్నాయి.

English summary

clove benefits and facts that will blow your mind

clove benefits and facts that will blow your mind
Story first published:Saturday, June 2, 2018, 16:53 [IST]
Desktop Bottom Promotion