For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  థైరాయిడ్ సమస్యలను కలిగించే మీ ఇంటిలోని 8వస్తువులు

  |

  థైరాయిడ్ వ్యాధి మరియు అతుక్కోని రసాయనాలకి దానితో సంబంధం తిరిగి వార్తల్లో ప్రాచుర్యమైనది. మళ్ళీ ఒకసారి ఇంట్లో ఈ రసాయనాలు దాక్కున్న చోట్లను తిరిగి స్కానింగ్ చేయాల్సిన అవసరం తెలియచేసింది.

  2014లో జరిగిన అధ్యయనంలో, జర్నల్ ఆఫ్ ఎపిడమాలజీలో ప్రచురితమైనదాని ప్రకారం, శాస్త్రవేత్తలు 10శాతం మంది ప్రజలు పర్ ఫ్లూరోక్టానిక్ యాసిడ్ (లేదా పిఎఫ్ ఓఎ, డౌ కెమికల్ తో తయారయినది) ఉన్న నీటినే తాగుతున్నారని, వారికి ఏదో ఒకరకమైన థైరాయిడ్ సమస్య వస్తున్నట్లు తెలిపారు. రక్తస్థాయిలు మరియు ఈ రసాయనంకి ఎక్స్ పోజ్ అయిన ఏళ్ల సమయం పోల్చిచూసి, శాస్త్రవేత్తలు ఎక్కువ పిఎఫ్ ఓఎ తీసుకున్నవారిలో ఎక్కువ థైరాయిడ్ సమస్యలు వస్తున్నట్లు తేల్చారు. ఈ అధ్యయనం 30,000 మందికన్నా ఎక్కువమందిలో జరిగింది.

  పిఎఫ్ ఓఎ అనే సమస్యాత్మక నాన్ స్టిక్ రసాయనం పెర్ ఫ్లూరినేటడ్ కాంపౌండ్స్ (పిఎఫ్ సిలు) విభాగం కిందకి వస్తుంది, ఈ విభాగంలో ఏ పదార్థం అంటుకోని ప్రత్యేక లక్షణాలు కల ఫ్లోరైడ్ ఉండే రసాయన సమ్మేళనాలు ఉంటాయి. సమస్య ఏంటంటే, ఈ పదార్థాలు సులభంగా విఛ్చిన్నం అవక, మన శరీరాలలో పేరుకుని అలా ఉండిపోవచ్చు. థైరాయిడ్ వ్యాధితో పాటు, వివిధ పిఎఫ్ సిలు క్యాన్సర్, సంతానలేమి, పుట్టుకతో లోపాలు, బలహీనపడ్డ రోగనిరోధకత ఇవన్నిటికీ కారణమవచ్చు. ఈ నాన్ స్టిక్ రసాయనాలు ఉండే 9 సాధారణ ఇంటిలోని వాడే వస్తువుల లిస్టు ఇక్కడ ఇవ్వబడింది, చదివి వాటిని వాడటం మానేయండి.

  పళ్ళలో పాచిని తొలగించే డెంటల్ ఫ్లాస్

  పళ్ళలో పాచిని తొలగించే డెంటల్ ఫ్లాస్

  కొన్ని సంస్థలు పాచిని తొలగించే పోగుల్లాంటి ఈ వస్తువుకి అతుక్కోకుండా ఉండే రసాయనాలను జతచేయవచ్చు, దాని వలన పళ్ళ మధ్య అది సులభంగా కదలగలిగే అవకాశం ఉంటుంది.

  దూరంగా ఉండండిః పళ్ళను శుభ్రపర్చుకోటం మానవద్దు - అది ముఖ్యం. దాని బదులు, సహజమైన రకాలను ఎంచుకోండి. రేడియస్ వంటివి.

  గిన్నెలు మరియు పెనాలు

  గిన్నెలు మరియు పెనాలు

  నిజమే, వంట తర్వాత నాన్ స్టిక్ గిన్నెలు మరియు పెనాలను అంత రుద్ది కడగక్కర్లేదు. కానీ వాటిమీద పడే అన్ని గీతలు, పైన మెటల్ లేచిపోవడం ఇవన్నిటి అర్థం మీరు మీ ఆహారంతో పాటు ఆ రసాయనాలను కూడా తినేస్తున్నారని.

  దూరంగా ఉండండిః ఈ అందంగా కన్పించే నాన్ స్టిక్ వంటపాత్రలను అమెరికాలో తయారయిన ఇనుము, ఎనామెల్, గాజు లేదా స్టెయిన్ లెస్ స్టీల్ గిన్నెలు మరియు పెనాలతో మార్చేయండి.

  వర్షంకు సంబంధించిన వస్తువులు

  వర్షంకు సంబంధించిన వస్తువులు

  నాన్ స్టిక్ రసాయనాలు నీటిని దూరంగా ఉంచటంలో చాలా బాగా పనిచేస్తాయి, అందుకే వర్షానికి సంబంధించిన వస్తువులైన బూట్లు, గొడుగులు మరియు రెయిన్ కోట్ల తయారీలో వాడతారు.

  దూరంగా ఉండండిః బయట సురక్షితమైన వస్తువుల వాడకానికి, పాలీయురెథేన్ తో తయారయిన జాకెట్లను కొనుక్కోండి, అంతేకానీ నాన్ స్టిక్ రసాయనాలతో చేసినవి కాదు. మైనం పూతతో ఉండే బట్టలు మరియు రబ్బర్ నుంచి తయారయిన బూట్లు సురక్షితమైన ఎంపికలుగా పాపులర్ అవుతున్నాయి.

  పిజ్జా బాక్సులు మరియు ఫాస్ట్ ఫుడ్ ను పెట్టిచ్చే పాత్రలు

  పిజ్జా బాక్సులు మరియు ఫాస్ట్ ఫుడ్ ను పెట్టిచ్చే పాత్రలు

  వీటికి దూరంగా ఉండటానికి మరో కారణం కూడా కావాలా? అయితే ఇదిగోండి. చాలా ఫాస్ట్ ఫుడ్ ను పెట్టిచ్చే పాత్రల గోడలకు నాన్ స్టిక్ రసాయనాలు ఆహారం అతుక్కోకుండా ఉండేందుకు, సులభంగా తీసుకోడానికి వచ్చేసేందుకు పూస్తారు. ( మీరు ఆ మొదటి 5 పౌండ్ల బరువు తగ్గాక మాకు థ్యాంక్స్ చెప్పుకోండి! )

  ఫర్నీచర్ మరియు కార్పెట్లు

  ఫర్నీచర్ మరియు కార్పెట్లు

  నాన్ స్టిక్ రసాయనాలు సాధారణంగా స్కాచ్ గార్డ్, టెఫ్లాన్ , స్టెయిన్ మాస్టర్ అలాంటి పేర్లతో వస్తుంటాయి. మీరు అనుకోకుండా సోఫాలపై ఏదన్నా పడేస్తే ఆ మరకలను తొలగించే ప్రక్రియలో చాలా నాన్ స్టిక్ రసాయనాలను వాడతారు. సులభంగా అయిపోతుంది అన్పిస్తుంది కానీ అది తెచ్చే రోగాలు తెలిసాక అలా అనుకోరు.

  దూరంగా ఉండండిః మీరు ఫర్నీచర్ కొనేటప్పుడు, దాని మీద మరకలను పడనివ్వని కోటింగ్ కానీ మరే ఇతర నాన్ స్టిక్ ప్రక్రియ చేయలేదని నిర్థారించుకోండి. మీరు మార్కెట్లో కొత్త ఫ్లోరింగ్ చేయిద్దామని వెళ్ళినప్పుడు, కార్పెట్లకి దూరంగా ఉండి, ఏ చికిత్సా జరగని గట్టి కలపనేలకే ప్రాధాన్యతనివ్వండి, దానిపై వెర్మాంట్ సహజ కోటింగ్స్ తో పనిని పూర్తి చేయండి.

  కాగితం ప్లేట్లు

  కాగితం ప్లేట్లు

  ప్రతి ఏడాది ఊహించలేని స్థాయిలో 64 బిలియన్ల పేపర్ కప్స్ మరియు పళ్ళేలు వాడేసి పడేయబడుతున్నాయి. చెత్త పేరుకుపోవటం సమస్య మాత్రమే కాక, వాటిల్లో చాలావాటికి లీక్ అవకుండా నాన్ స్టిక్ రసాయనాలతో పూత పూయబడుతుంది కూడా.

  దూరంగా ఉండండిః మామూలు గ్లాసులు, పళ్ళేలు వాడండి. తినటం తాగటం అవగానే నీటిని పొదుపు చేసేందుకు వాటిని డిష్ వాషర్లో శుభ్రపర్చుకోండి.

  షాంపూలు

  షాంపూలు

  నాన్ స్టిక్ రసాయనాలు మన వ్యక్తిగత సంరక్షణా ఉత్పత్తుల్లో కూడా దాగివుండొచ్చు. అదృష్టవశాత్తూ, బట్టలు, ఫర్నీచర్ లాగా కాకుండా వ్యక్తిగత సంరక్షణా ఉత్పత్తులకు వాడే పదార్థాల లిస్టు ఉండి తీరాలి.

  దూరంగా ఉండండిః పర్ ఫ్లూరో అని మొదలయ్యే పదార్థాలు ఏమన్నా ఉన్నాయా అని లేబుల్స్ లో చెక్ చేయండి- వెంటనే వాటికి దూరంగా ఉండండి.

  మీరు ఎంత నాన్ స్టిక్ రసాయనాలకి దూరంగా ఉండాలని ప్రయత్నించినా, అవి మన దుమ్ము, ధూళిలో ఎలాగో వచ్చి చేరతాయి ఎందుకంటే వాటిని చాలా రకాల ఉత్పత్తుల్లో వాడతారు. ఇంట్లో వచ్చే దుమ్ములో దారుణమైన ప్లాస్టిక్ రసాయనాలు, బిపిఎ మరియు మంట వ్యతిరేక పదార్థాలు కూడా ఉంటాయి.

  English summary

  Causes For Thyroid

  Thyroid disease, in simple terms, can be described as the malfunction of the thyroid gland, which is located in the back of our neck.There are various types of thyroid related diseases, such as, hypothyroidism, hyperthyroidism, goiter, thyroiditis and thyroid cancer.So, here are a few common things at our home, that could be causing thyroid diseases; have a look.
  Story first published: Friday, February 9, 2018, 14:30 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more