For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుండెపోటు మరియు స్ట్రోక్ మధ్యగల వ్యత్యాసాలను తెలుసుకోండి.

|

గుండె పోటు మరియు స్ట్రోక్ మధ్య వ్యత్యాసాలను తెలుసుకోవడం అత్యంత ముఖ్యమైన విషయం, ఇవి కొంతమేర ఒకేలా ఉన్న కారణాన రెండూ ఒకటే అని అపోహపడుతుంటారు కూడా. గుండె పోటు మరియు స్ట్రోక్ రక్త నాళాలలో రక్త ప్రవాహానికి కొవ్వు ఫలకాలు లేదా గడ్డకట్టిన రక్తం అడ్డుపడడం మూలంగా కలిగే సమస్యలుగా ఉంటాయి. ఈ రెండింటి మద్య వ్యత్యాసం అవి శరీర జీవక్రియలను, ఇతరత్రా అవయవాల మీద చూపే ప్రభావాలను అనుసరించి ఆధారపడి ఉంటుంది.

గుండె పోటు మరియు స్ట్రోక్ మద్య లక్షణాలు కూడా భిన్నంగా ఉంటాయి. గుండె పోటు ఛాతీనొప్పితో మొదలవుతుంది మరియు రెండవది ఆకస్మికంగా, మరియు శక్తివంతమైన తలనొప్పితో మొదలవుతుంది.

Difference Between Heart Attack And Stroke

స్ట్రోక్ మరియు గుండె పోటు యొక్క లక్షణాల తీవ్రత, మీ వయసు, మీ ఆరోగ్యం మరియు మీ లింగం (హార్మోన్స్, మెనోపాజ్ మొదలైన అంశాల ఆధారితంగా) మీద కూడా ఆధారపడి ఉంటాయి. ఇక్కడ చర్చ కేవలం గుండె పోటు మరియు స్ట్రోక్ మధ్య గల తేడా.

గుండె పోటు :

గుండె పోటు :

గుండె కండరాలలో బ్లాకేజ్ లేదా ప్రతికూల సమస్యల కారణంగా కొరోనరీ ఆర్టరీ (ధమనుల) లో రక్త ప్రసరణ తగ్గడం లేదా నిరోధించబడడం మూలంగా గుండె పోటు సంభవిస్తుంది. కరోనరీ ఆర్టరీ బ్లాకేజ్ గుండె కండరాలలోని కణజాలాలకు ప్రాణవాయువును నిరోధిస్తుంది.

ఎక్కువ సందర్భాలలో, హృదయ ధమనులలో రక్తం గడ్డకట్టడం, తద్వారా గుండె కండరాలకు రక్త ప్రవాహం ఆగిపోవడం వంటివి జరగడం కారణాన, ఛాతీ నొప్పి మరియు ఇతర గుండె పోటు లక్షణాలకు దారితీస్తుంది.

గుండెపోట్లు గుండె కండరాలకు బలహీనత మరియు శాశ్వత నష్టాన్ని కలిగిస్తాయి. క్రమంగా వ్యక్తి మరణానికి కూడా కారణమవుతుంది. ఈకారణంగానే రెండు లేదా మూడవ గుండె పోటును ఎదుర్కోవడం అత్యంత క్లిష్టమైన అంశంగా వైద్యులు చెప్తుంటారు.

స్ట్రోక్ :

స్ట్రోక్ :

మెదడుకు రక్తం సరఫరా చేసే ధమనులలో రక్తం గడ్డకట్టడం జరిగినప్పుడు స్ట్రోక్ కలుగుతుంది. మెదడు కణజాలాలకు ప్రాణవాయువు సరిగ్గా అందకపోవడం కారణంగా కణజాలం నష్టం మరియు వ్యక్తి మరణానికి దారితీస్తుంది. స్ట్రోక్ అనేది తరచుగా శరీరంలో ఒక వైపు సామర్ధ్యం కోల్పోవడంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది.

స్ట్రోకులు ప్రధానంగా మూడు విధాలుగా ఉంటాయి :

స్ట్రోకులు ప్రధానంగా మూడు విధాలుగా ఉంటాయి :

1. మెదడులో రక్తస్రావం. దీనిని బ్రెయిన్ హెమరేజ్ అని వ్యవహరిస్తుంటారు.(హెమరాజిక్ స్ట్రోక్)

2. రక్తం గడ్డకట్టడం వలన ఏర్పడిన స్ట్రోక్ : ఇస్కీమిక్ స్ట్రోక్.

3. మెదడుకు రక్తాన్ని అడ్డుకుంటున్న ధమనిలోని బ్లాకేజ్, ధమనుల బలహీనతకు కూడా కారణమవుతుంటాయి. ఈ పరిస్థితిని ట్రాన్సియంట్ ఇస్కీమిక్ అటాక్ అని వ్యవహరిస్తారు.

Most Read: పరిపూర్ణమైన సిక్స్-ప్యాక్ ఆబ్స్ కోసం అనుసరించదగిన ఆరోగ్యకర ఆహార చిట్కాలు

ఒక వ్యక్తి హార్ట్ ఎటాక్ లేదా స్ట్రోక్ గురయ్యాడు అని తెలుసుకోవడం ఎలా ?

ఒక వ్యక్తి హార్ట్ ఎటాక్ లేదా స్ట్రోక్ గురయ్యాడు అని తెలుసుకోవడం ఎలా ?

గుండె పోటుకు సంబంధించిన హెచ్చరిక సంకేతాలు :

1. ఛాతీనొప్పి లేదా ఛాతీలో అసంతృప్తి

2. నెమ్మదిగా భుజాలు, చేతులు, వెన్ను, ఉదరం లేదా దంతాలకి నొప్పి తరలడం.

3. అధికంగా చమటలు పట్టడం

4. ఊపిరి సమస్యలు లేదా శ్వాస అందక పోవడం.

5. వికారం లేదా వాంతులు

6. తలనొప్పి లేదా మూర్ఛ

స్ట్రోక్ సంబంధించిన హెచ్చరిక సంకేతాలు :

స్ట్రోక్ సంబంధించిన హెచ్చరిక సంకేతాలు :

1. శరీరంలో కేవలం ఒకవైపునే చేతులు మరియు కాళ్ళు బలహీనతకు లోనవడం.

2. ముఖం శుష్కించుకుని పోవడం

3. మాట్లాడడంలో తడబాటు, లేదా కష్టతరం.

4. స్పృహ కోల్పోవడం

5. ఆకస్మికంగా తీవ్రమైన తలనొప్పి

6. దృష్టిపరమైన సమస్యలు

 హార్ట్ అటాక్ మరియు స్ట్రోక్ యొక్క ప్రమాద కారకాలు :

హార్ట్ అటాక్ మరియు స్ట్రోక్ యొక్క ప్రమాద కారకాలు :

ఈ రెండు పరిస్థితులకు ప్రమాదకర కారకాలు ఇంచుమించు ఒకేలా ఉంటాయి :

1. ధూమపానం

2. కుటుంబ చరిత్ర, వంశపారంపర్యం

3. ఊబకాయం

4. డయాబెటిస్

5. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు

6. రక్తపోటు

7. ఒత్తిడి

8. శారీరక స్తబ్ధత, వ్యాయామం లేకపోవడం.

Most Read: మా ఆయన మా అక్కతో సంబంధం పెట్టుకున్నాడు, నా ముందే అందులో పాల్గొన్నారు

హార్ట్ ఎటాక్ మరియు స్ట్రోక్ యొక్క నిర్ధారణ :

హార్ట్ ఎటాక్ మరియు స్ట్రోక్ యొక్క నిర్ధారణ :

స్ట్రోక్ విషయంలో, మీ డాక్టర్ శారీరిక సమస్యల లక్షణాలు మరియు మెడికల్ హిస్టరీ గురించి అడుగడం జరుగుతుంది. తరువాత మెదడుకు CT స్కాన్ ఇమేజింగ్ పరీక్ష ఉంటుంది. CT స్కాన్ మెదడు ప్రాంతాలలో రక్తప్రవాహం హెచ్చుతగ్గులు, లేదా రక్తస్రావం గుర్తించడంలో సహాయం చేస్తుంది. అంతేకాకుండా మెదడుకు MRI(మాగ్నెటిక్ రిసోనెన్స్ ఇమేజింగ్ ) కూడా చేయబడుతుంది.

గుండెపోటును నిర్ధారించడానికి, కొన్ని ఇతరత్రా పరీక్షలు కూడా జరుగుతాయి. కానీ ముందుగా, మీ డాక్టర్ మీ శారీరిక, మానసిక లక్షణాలను మరియు వైద్యచరిత్రను పరిశీలిస్తాడు. మరియు, గుండె కండరాల ఆరోగ్యం గురించిన అవగాహన కోసం ఎలక్ట్రో కార్డియోగ్రామ్ టెస్ట్ కూడా జరుగుతుంది. గుండె పోటును సూచించే ఎంజైముల పరిస్థితులను తనిఖీ చేసేందుకు, రక్త పరీక్ష జరుగుతుంది. రక్త నాళాలలో బ్లాకేజ్ కారణంగా హృదయానికి రక్త ప్రవాహం తగ్గడం లేదా నిరోధించబడడం గురించిన అవగాహన కోసం, కార్డియాక్ కాథెటరైజేషన్ జరుగుతుంది. రక్త నాళాలలోనికి ఒక ట్యూబ్ పంపడం ద్వారా ఈ పరీక్ష జరుపబడుతుంది.

హార్ట్ ఎటాక్ మరియు స్ట్రోక్ చికిత్స ఎలా?

హార్ట్ ఎటాక్ మరియు స్ట్రోక్ చికిత్స ఎలా?

గుండె పోటు చికిత్స :

గుండె పోటుకు అత్యవసర చికిత్సగా, ప్రభావిత వ్యక్తి పల్స్ కోల్పోయిన పరిస్థితుల్లో, కార్డియోపల్మోనరీ రిససిటేషన్ జరుగుతుంది. కొవ్వు ఫలకాలతో నిరోధించబడిన ధమనులను తెరవడానికి, రోగులకు క్లాట్-బ్లస్టింగ్(బ్లాకేజ్ నిరోధించగల) మందులను ఇవ్వబడతాయి. అదేవిధంగా, కొన్నిసందర్భాలలో గుండె పోటుకు కారణమైన అడ్డంకులను తొలగించే ప్రక్రియలో భాగంగా, అత్యవసర చికిత్సగా కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ అవసరమవుతుంది. ఈ శస్త్రచికిత్స ద్వారా గుండె ధమనులలో అడ్డుపడే బ్లాకేజ్లు కలిగిన నాళాలను తొలగించి, శరీరంలోని ఇతర ప్రాంతాల నుండి సంగ్రహించిన బహిరంగ రక్త నాళాలతో భర్తీ చేయబడతాయి.

స్ట్రోక్ చికిత్స :

స్ట్రోక్ చికిత్స :

రోగి రక్తస్రావ సంభందిత స్ట్రోక్ కలిగి ఉంటే, దెబ్బతిన్న రక్త నాళాలను మరమ్మత్తు చేసేక్రమంలో భాగంగా శస్త్రచికిత్స అవసరమవుతుంది. రోగి ఇస్కీమిక్ స్ట్రోక్ కలిగి, ఆసుపత్రికి సకాలంలో చేర్చిన ఎడల, స్ట్రోక్ కలిగిన కొన్ని నిమిషాల్లోనే శస్త్ర చికిత్స ప్రారంభించిన పక్షంలో, టిష్యూ ప్లాస్మినోజెన్ యాక్టివేటర్ అని పిలిచే ఒక ఔషధాన్ని ఇచ్చే అవకాశం ఉంది, ఇదిగడ్డకట్టిన రక్తాన్ని లేదా కణజాలాన్ని విచ్చిన్నం చేస్తుంది.

Most Read: మగవాళ్లు ఈ పనులు చేస్తే కాలిపోతారంటున్న చాణక్యుడు..!!

హార్ట్ ఎటాక్ మరియు స్ట్రోక్ కలుగకుండా తీసుకోవలసిన చర్యలు :

హార్ట్ ఎటాక్ మరియు స్ట్రోక్ కలుగకుండా తీసుకోవలసిన చర్యలు :

నివారణ పద్ధతులను అనుసరించడం ద్వారా స్ట్రోక్ మరియు గుండె పోటు సమస్యలు రాకుండా నివారించవచ్చు :

1. మీ కొలెస్ట్రాల్ మరియు రక్తపోటు స్థాయిలను క్రమపద్ధతిలో తనిఖీ చేయడం.

2. ధూమపానం మానివేయడం.

3. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం.

4. శరీరానికి ఏమాత్రం ఉపయోగపడని ఆల్కహాల్ త్యజించడం.

5. మీ రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రణలో ఉంచడం.

6. వ్యాయామాలు చేయడం.

7. సంతృప్త కొవ్వులు, సోడియం తక్కువగా కలిగిన, మరియు తక్కువ చక్కెరలతో కూడిన ఆహార ప్రణాళిక అనుసరించడం.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆరోగ్య, జీవన శైలి, ఆహార, ఆద్యాత్మిక, జ్యోతిష్య, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Difference Between Heart Attack And Stroke

A heart attack occurs when a sudden damage happens to the heart muscles usually from the lack of blood flow in the coronary artery. A stroke occurs when there is a formation of a blood clot causing blockage in the arteries that supply blood to the brain. Heart attack starts with chest pain and stroke starts with a sudden, powerful headache.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more