8గంటలు నిద్ర ఉన్నా కూడా అలసినట్లు ఉన్నారా? అయితే మీ నిద్రకు తీసుకోవలసిన చర్యలు ఇవే.

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

ఒక్కోసారి నిద్ర తక్కువైనా, ఎక్కువ సేపు నిద్రపోయినా కూడా నిద్ర చాల్లేదు అన్న భావన కలుగుతుంది, తద్వారా రోజంతా బేజారుగా, మగతగా, నీరసంగా, అలసటగా ఉండడం సర్వసాధారణంగా ఉంటుంది. సినిమాలు, డిన్నర్లు, పార్టీలు, డేట్ ఇలాంటి ఎన్నో మీ నిద్రకు ప్రతిబంధకాలుగా ఉంటాయి అనడం ఆశ్చర్యం లేదు. ఇలాంటి వాటి వలన తాత్కాలిక సంతోషం ఉన్నా కూడా, మరుసటిరోజు కొన్ని ప్రతికూల పరిస్థితులను కూడా ఎదుర్కొనక తప్పని పరిస్థితులు నెలకొంటాయి.

నిజంగా ఇది ఆందోళన పడాల్సిన విషయమే. రోజంతా మగతగా ఉండడం నెమ్మదిగా మీ ఆరోగ్య పరిస్థితులపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది ఎక్కువయ్యే కొలది, డిప్రెషన్ వంటి మానసిక రోగాలకు కూడా కారణం అవుతుంది. కావున అన్ని వేళలా నిద్రకు సమయం తగ్గకుండా కేటాయించడం ముఖ్యం. ఒక్కోసారి మీరు గమనించేఉంటారు. ఒక్కరోజు మగతగా ఉన్న వేళల్లో, నెమ్మదిగా తలనొప్పులకు కూడా దారితీస్తుంటుంది.

Do You Feel Tired Despite 8 Hours Of Sleeping? Heres How You Can Sleep Better

మీ నిద్ర సమయం మద్యలో ఒక్కోసారి మేలుకుంటూ ఉంటారు, కొందరికి మద్యలో మూత్రవిసర్జన చెయ్యాల్సి వస్తుంది. కానీ, వెంటనే నిద్రపోతుంటారు. కానీ, కొందరు ఒక్కసారి మేలుకొంటే నిద్ర పట్టని స్థితిలో ఉంటారు. లేదా మరేదైనా కారణం చేత నిద్రకి అంతరాయం కలిగించి, పనులకు పూనుకోవడం కూడా రోజంతా మగతకు అలసటకు కారణం అవుతుంటుంది. మీ నిద్ర సమయం కాకుండా మిగిలిన సమయాల్లో నిద్రపోతే అది కునుకు కిందే వస్తుంది, ఆ సమయం నిద్రకు అంతరాయం కలిగినా అంత సమస్య ఉండదు.

మీ ఆరోగ్యానికి సరైన నిద్ర చక్రం అవసరం. ఆ నిద్రకు అంతరాయాలు కలగకుండా చూసుకోవడం ద్వారా అనేక సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. మీ ఆరోగ్యానికి విలువిచ్చి, మీ నిద్ర చక్రం సరిగ్గా ఉండాలని మీరు భావిస్తే, మీ నిద్ర అతలాకుతలంగా ఉంటే మీ నిద్రకు అంతరాయం కలుగని సమయం ఎంచుకుని, కేటాయించవలసి ఉంటుంది. తద్వారా సమయం కేటాయించుకుని, కనీసం 8గంటలు ఉండేలా చూస్కుని నిద్రకు ఉపక్రమించడం మంచిది. మనిషి కనీసం నిద్ర 8గంటలుగా సూచించబడింది.

Do You Feel Tired Despite 8 Hours Of Sleeping? Heres How You Can Sleep Better

మరియు ఒక్కోసారి తీసుకునే ఆహార పదార్ధాలు కూడా నిద్రమీద ప్రభావం చూపిస్తాయి. రాత్రి వేళలయందు, నిద్ర సమయంలోనే కాలేయం ఎక్కువ పని చేస్తుందని అందరికీ తెలుసు. కావున రాత్రివేళల యందు నిద్రకు ఉపక్రమించే ముందు కనీసం 3,4 గంటల ముందు ఆహారం ఉండేలా చూసుకోవడం కనీస భాద్యత. మరియు రాత్రి వేళల తీసుకునే ఆహారం మితంగా ఉండేలా, తేలికైన ఆహారపదార్ధాలు తీసుకునేలా ఉండాలి. మరియు కాఫీ, కార్భోహైడ్రేటెడ్ ఆహారపదార్ధాలు, అధిక చక్కెర ఇల్వలు కలిగిన ఆహారపదార్ధాలు, క్రొవ్వు పదార్ధాల జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఒకవేళ తీసుకోవలసిన పరిస్థితులు వస్తే మితంగా తీసుకోవడమే మంచిది.

2017లో ఒక అద్యయనం ప్రకారం, నిద్రకు ఉపక్రమించే తీరు కూడా నిద్రాభంగానికి, మగతకు కారణం అవుతుందని తేల్చారు. నిజం, మీ నిద్రకు ఉపక్రమించే తీరు, పద్దతి కూడా రోజంతా మగతకు కారణంగా ఉంటాయి అనడంలో ఆశ్చర్యం లేదు. గమనించిన రోజున వాటిని మార్చాల్సిన అవసరం ఉన్నది.

Do You Feel Tired Despite 8 Hours Of Sleeping? Heres How You Can Sleep Better

నిద్రకు ఉపక్రమించడానికి సరైన పద్దతులు ఏవి?

1)Foetal(గర్బస్థ పిండం) పద్దతి: ఎక్కువగా మహిళలు ఈ పద్దతికి మొగ్గుచూపుతుంటారు. ఇది సాధారణంగా నిద్రకు ఉపక్రమించే పద్దతుల్లో ఒకటిగా ఉంది.

2) సోల్జర్ పద్దతి: వినడానికి నవ్వు తెప్పిస్తున్నా, ఈ పద్దతిలో అనేకులు నిద్రకు ఉపక్రమిస్తుంటారు, ఈ పద్దతిలో వెల్లకిలా నిటారుగా పడుకుని రెండు చేతులూ పక్కగా లేదా తల మీదుగా ఉంటాయి.

3)ఫ్రీ-ఫాల్ పద్దతి: ఈ పద్దతిలో పొట్ట కిందుకు పచ్చేలా ఉంటుంది. మరియు ఒక పక్కగా ఉన్నట్లు పడుకుని, రెండు చేతులు పక్కలుగా కానీ తల దగ్గర ఉండేలా కానీ ఉంటుంది.

4)లాగ్-పద్దతి: ఈ పద్దతిలో మనిషి పక్కకు తిరిగి పడుకుంటారు. కుడి ఎడమ పక్కలుగా నిద్రకు ఉపక్రమిస్తుంటారు.

మీరు 1,3,4 పద్దతులలో నిద్రకు ఉపక్రమిస్తున్న ఎడల. మీకు రోజంతా మగత ఉండే అవకాశాలు ఉండడం సర్వసాధారణం. పక్కకు తిరిగి పడుకోవడం వలన బుజాలు మరియు తొంటి బాగం అసౌకర్యానికి గురవుతూ ఉంటాయి. ఒక్కోసారి తొంటి భాగాన నొప్పి వేధిస్తుంటే, ఈ పద్దతి మరింత అసౌకర్యానికి గురిచేస్తుంటుంది. ఒక్కోసారి foetal పద్దతి ఎక్కువగా పాటిస్తున్న ఎడల, గుండె సంబంధిత సమస్యలకు కూడా దారి తీస్తుంది.

Do You Feel Tired Despite 8 Hours Of Sleeping? Heres How You Can Sleep Better

పొట్ట కిందుకు వచ్చేలా పడుకోవడం, లేదా బోర్లా పడుకోవడం వలన మీ శరీరానికి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. శరీరంలోని అంతర్గత అవయవాల అసౌకర్యానికి కూడా ఇవి కారణం అవుతుంటాయి. నిద్ర చక్రం సమయంలో శరీర అంతర్గత భాగాలు కూడా విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి(కొన్ని తప్ప, అవి పని చేయకుంటే శాశ్వత నిద్రే), కానీ ఇలా బోర్లా పడుకోవడం వలన, విశ్రాంతి తీసుకోవలసిన అవయవాలు కూడా ఒత్తిడికి లోనవుతూ అసౌకర్యానికి గురవుతూ ఉంటాయి. నెమ్మదిగా ఇవి జీవక్రియల మీద ప్రభావాన్ని చూపిస్తాయి. ఇవి కండరాల నొప్పులకు మరియు తిమ్మిర్లకు గురై ప్రతి గంటకి ఒకసారైనా పద్దతి మార్చుకోవలసిన అవసరం ఏర్పడుతుంది.

సోల్జర్ పొజిషన్: కొందరు ఈ పద్దతిలో సౌకర్యాన్ని ఫీల్ అవుతుంటారు. ఇది ఒకరకంగా మంచి పద్దతనే చెప్పాలి, ఎటువంటి శరీర అవయవాలు ఒత్తిడికి లోనవకుండా చూస్తుంది ఈ పద్దతి. మరియు రోజంతా శరీరం ఉత్సాహంగా ఉండేలా చూస్తుంది. నిద్ర పద్దతుల వలన కలిగే సమస్యలు ఈ పద్దతిలో అస్సలు ఉండవు. గుండెల్లో మంట, అసౌకర్యానికి గురవడం వంటి సమస్యలు ఇందులో ఉండవు. వెల్లకిలా పడుకోవడం వలన ఎటువంటి ఒత్తిడి కూడా అంతర్గత భాగాలకు లేకపోవడం వలనే ఈపద్దతి మంచి పద్దతిగా సూచించబడింది.

ఈపద్దతి అలవాటు లేకపోతే , అలవాటు పడడం మంచిది. జీవనశైలి లో మార్పులు పరిస్థితులను బట్టి కొన్ని వేళల అవసరమే. మరియు దైనందిక వ్యాయామాలు, సరైన ఆహార ప్రణాళికలు కూడా మంచి నిద్రకు అవసరం. దేని సమయం దానికి కేటాయించి ముందుకు సాగితే, మానసికంగా, భౌతికంగా ఆరోగ్యం మీ సొంతమవుతుంది.

English summary

Do You Feel Tired Despite 8 Hours Of Sleeping? Here's How You Can Sleep Better

Sleeping is important for our body and we should have at least 6 to 8 hours of sleep. But if you wake up feeling tired, it could be because of your position. The best way to get rid of this issue is sleeping on your back, doing so helps in reducing the chances of getting body pain and heart burn.Do you ever feel like you never got enough sleep last night?
Story first published: Saturday, April 14, 2018, 8:00 [IST]