For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మైగ్రేన్ సమస్యతో భాదపడుతున్నారా? అయితే మైగ్రేన్ నొప్పితో సంబంధం ఉండే ఈ వ్యాధుల గురించి తెలుసుకోవడం అవసరం.

మైగ్రేన్ సమస్యతో భాదపడుతున్నారా? అయితే మైగ్రేన్ నొప్పితో సంబంధం ఉండే ఈ వ్యాధుల గురించి తెలుసుకోవడం అవసరం.

|

మీరు మైగ్రేన్ తలనొప్పితో భాదపడుతున్నట్లయితే, అది అనేకములైన ఇతర అనారోగ్య పరిస్థితులకు కూడా కారణం కావొచ్చు. ఒక అధ్యయనం ప్రకారం. మీరు భవిష్యత్తులో ఎదుర్కోబోయే కొన్నిరకాల ఆరోగ్య పరిస్థితులను కూడా మైగ్రేన్ తలనొప్పి సూచిస్తుంది. పెరిగే ప్రమాదం కూడా ఉంటుందని తేలింది. ఈ మైగ్రేన్ తలనొప్పిని పార్శ్వపు తలనొప్పిగా కూడా వ్యవహరిస్తారు.

మైగ్రెయిన్ తలనొప్పులు, డిప్రెషన్ నుంచి ఆస్థమా, గుండె జబ్బులకు సంబంధించిన పలు సమస్యలతో ముడిపడి ఉంటుంది.

మైగ్రెయిన్ సమస్యకు దారితీసే మార్గాలు అనేకం ఉంటాయి. ఈ మార్గాలు వ్యక్తి వ్యక్తికి భిన్నంగా ఉంటాయి. క్రమంగా ఈ సమస్యను ఎదుర్కోవడం కొంచం క్లిష్టతరంగా ఉంటుంది. సమస్యకు కారణం తెలుసుకోవడం ద్వారా పార్శ్వపు తలనొప్పికి సరైన చికిత్స చేయవచ్చు. అందరికీ ఒకేరకమైన చికిత్స అంటూ మైగ్రేన్ సమస్యలో ఉండదు. చికిత్స, మైగ్రేన్ తలెత్తడానికి గల కారకాల మీద ఆధారపడి ఉంటుంది.

Do You Have Migraine? These Are The Diseases That Are Linked To Migraine

మీరు మైగ్రెన్ తలనొప్పి సమస్యను కలిగి ఉన్న ఎడల, మీకు ప్రభావితం కాగల అనేక ఇతర అనారోగ్య పరిస్థితుల గురించిన అవగాహన అవసరం. ఈ భిన్న ఆరోగ్య సమస్యల గురించిన అవగాహన కలిగి ఉండడం ద్వారా మైగ్రేన్ సమస్యతో పాటుగా, మైగ్రేన్ కారక అనారోగ్య సమస్యకు కూడా చెక్ పెట్టవచ్చు.

ఈ వ్యాసంలో, పార్శ్వపు నొప్పికి సంబంధించిన ఇతర వ్యాధుల గురించిన వివరాలను తెలుసుకుందాం. మరిన్ని వివరాలకోసం ముందుకు సాగండి.

1. డిప్రెషన్ :

1. డిప్రెషన్ :

మీరు తరచుగా మైగ్రెయిన్ సమస్యను అనుభవిస్తున్నట్లయితే, అది డిప్రెషన్ సమస్యను సైతం రెట్టింపు చేస్తుంది. సమస్యను గుర్తించని పక్షంలో, తీవ్ర పరిస్థితులకు కూడా దారితీస్తుంది. మైగ్రెయిన్ నొప్పి సంబంధించిన అగ్రవ్యాధుల్లో డిప్రెషన్ కూడా ఒకటి.

2. ఆందోళన :

2. ఆందోళన :

దీర్ఘకాలిక పార్శ్వపు నొప్పి ఉన్న వ్యక్తులు ఆందోళనల సమస్యను అధికంగా కలిగి ఉంటారు. ఆందోళన కలిగి ఉన్న రోగులు మైగ్రెయిన్స్ ఎలా కలిగి ఉంటారో, మైగ్రేన్ నొప్పి ఉన్నవాళ్ళు ఆందోళనలను కూడా అలాగే కలిగి ఉంటారు.

3. స్ట్రోక్ :

3. స్ట్రోక్ :

అనేక అధ్యయనాలు, స్ట్రోక్ మరియు మైగ్రేన్లు మధ్య సంబంధాలు ఉన్నట్లుగా తేల్చాయి. అంతేకాకుండా సాధారణ ప్రజలతో పోల్చితే మైగ్రేన్లు తలెత్తినప్పుడు కలిగే లైట్ సెన్సిటివిటీ ఉన్న వ్యక్తులు రెట్టింపు స్ట్రోక్ ప్రమాదాన్ని కలిగి ఉంటారని తేలింది.

Most Read:కడుపు ఉబ్బరం సమస్యలతో భాదపడుతున్నారా? అయితే కడుపు ఉబ్బరానికి కారణమయ్యే ఈ 7 ఆహార పదార్ధాల గురించి తెలుసుకోండి. Most Read:కడుపు ఉబ్బరం సమస్యలతో భాదపడుతున్నారా? అయితే కడుపు ఉబ్బరానికి కారణమయ్యే ఈ 7 ఆహార పదార్ధాల గురించి తెలుసుకోండి.

4. మూర్ఛ :

4. మూర్ఛ :

మూర్చ (ఎపిలెప్సీ) మరియు పార్శ్వపు నొప్పి రెండూ తీవ్రస్థాయిలో మానసిక మార్పులను ప్రభావితం చేస్తాయి. వీటిలో ఏ సమస్య తలెత్తినా, మరొకటి కూడా తోడుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

5. గుండె సంబంధిత సమస్యలు :

5. గుండె సంబంధిత సమస్యలు :

మైగ్రెయిన్స్ అధికంగా ఉండే పురుషులు మరియు మహిళలు అధికంగా గుండె వ్యాధుల ప్రమాదాన్ని కలిగి ఉంటారని చెప్పబడింది. గుండె పోటు, అధిక రక్తపోటు, మధుమేహం వంటివి, మైగ్రెయిన్ బాధితులకు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఒక అధ్యయనంలో తేలింది.

6. ఆస్థ్మా

6. ఆస్థ్మా

ఆస్థ్మా మరియు మైగ్రేన్ రెండింటికి ఇన్ఫ్లమేషన్ (వాపు) సమస్య కూడా కారకంగా ఉంటుంది. మెదడు వెలుపల ఉన్న రక్తనాళాల వాపు, నొప్పిని కలిగించగలదు. ఇది మైగ్రెయిన్ యొక్క సంకేతంగా ఉంటుంది. పార్శ్వపు నొప్పికి సంబంధించిన ప్రధానమైన వ్యాధులలో ఇది కూడా ఒకటి.

Most Read:నేను రాత్రి డ్యూటీకి వెళ్తే నా భార్య మరొకరితో గడిపేది, గంట సేపు బయటే వెయిట్ చేయించేదిMost Read:నేను రాత్రి డ్యూటీకి వెళ్తే నా భార్య మరొకరితో గడిపేది, గంట సేపు బయటే వెయిట్ చేయించేది

7. ఊబకాయం :

7. ఊబకాయం :

మీరు పార్శ్వపు నొప్పి కలిగి ఉంటే, మీ అధిక బరువు, సమస్యను మరింత తీవ్రతరం చేయవచ్చు. మీరు పార్శ్వపు నొప్పిని తరచుగా కలిగిఉన్న ఎడల, ఊబకాయం మైగ్రేన్ సమస్యను పెంచే ట్రిగ్గర్ వలె ఉంటుంది. ఊబకాయంతో భాద పడేవారికి మైగ్రేన్ సర్వసాధారణ విషయంగా ఉంటుందని చెప్పబడింది.

8. దీర్ఘకాలిక నొప్పులు :

8. దీర్ఘకాలిక నొప్పులు :

ఫైబ్రోమైయాల్జియా మరియు మెడ, వెన్నుమరియు భుజాల యొక్క దీర్ఘకాలిక నొప్పులతో సహా అనేక నొప్పి సంబంధిత సమస్యలు మైగ్రేన్లకు కారణాలుగా ఉన్నాయి.

9. జీర్ణ సమస్యలు :

9. జీర్ణ సమస్యలు :

పార్శ్వపు నొప్పి కలిగిన వ్యక్తులకు జీర్ణ సంబంధ సమస్యల ప్రాబల్యం అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా కడుపు ఉబ్బరం, ప్రేగు వాపు వ్యాధి మరియు ఉదరకుహర వ్యాధి ప్రధానంగా ఉన్నాయి.

Most Read:వేరే వాళ్లతో పిల్లల్ని కని తండ్రివి నువ్వేనని చెబుతా, నువ్వు మగాడివేనా, పుట్టించలేవా? #mystory313Most Read:వేరే వాళ్లతో పిల్లల్ని కని తండ్రివి నువ్వేనని చెబుతా, నువ్వు మగాడివేనా, పుట్టించలేవా? #mystory313

10. రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్(RLS) :

10. రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్(RLS) :

ఈ సమస్యతో ఉన్నవాళ్ళు, కాళ్ళు కదిలించడానికి కూడా సమస్యను కలిగిఉంటారు. క్రమంగా ఇది రోజూవారీ కార్యకలాపాల మీద మరియు, నిద్ర మీద ప్రభావాన్ని కలిగి ఉంటుంది. RLS మరియు పార్శ్వపు నొప్పి మధ్యగల సంబంధం, డోపమైన్ అనే న్యూరోట్రాన్స్మిటర్ హార్మోన్ విడుదల మీద ప్రభావాన్ని కలిగి ఉంటాయి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవన శైలి, ఆహార,హస్త సాముద్రిక, ఆద్యాత్మిక, జ్యోతిష్య, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Do You Have Migraine? These Are The Diseases That Are Linked To Migraine

Migraines have been linked to several issues ranging from depression to asthma to heart disease. There are several pathways that can lead to migraines and these pathways differ from person to person. Migraines are linked to depression, anxiety etc.
Desktop Bottom Promotion