మంచినీటికి గ‌డువు తేదీ ఉంటుందా?

Posted By: sujeeth kumar
Subscribe to Boldsky

మీరెప్పుడైనా బ‌య‌ట వాట‌ర్ బాటిల్ కొన‌ప్పుడు దాని మీద ఎక్స్‌పైరీ( గ‌డువు )తేదీని గ‌మ‌నించారా? క‌చ్చితంగా ఉంటుంది. ఈ సారి ప‌రిశీలించండి.

అనాదికాలంగా భార‌తీయులు బావినీటినో, లేదా భూగ‌ర్భ జ‌లాన్నో తాగుతూ వ‌స్తున్నారు. వాటికి లేని ఎక్స్‌పైరీ తేదీ మంచినీళ్ల బాటిల్‌కు ఎలా వ‌స్తుందో అర్థం కావ‌డం లేదా?

ఈ మ‌ధ్య కాలంలో బ‌య‌ట దొరికే మంచి నీళ్ల బాటిళ్లు అస్స‌లు మంచివి కావ‌ని ర‌క‌ర‌కాల పుకార్లు పుట్టుకొస్తున్నాయి. దేన్ని న‌మ్మ‌లేని ప‌రిస్థితి. ఇలాంటి సంద‌ర్భంలో అస‌లు మంచినీళ్ల‌కు ఎక్స్‌పైరీ తేదీని అంటూ ఒక‌టుంటుందా అన్న సందేహం ఉత్ప‌న్న‌మ‌వుతుంది.

నీటి ఎక్స్‌పైరీ తేదీ గురించిన కొన్ని వాస్త‌వాల‌ను తెలుసుకుందాం..

వాస్త‌వం 1

వాస్త‌వం 1

నీళ్లు ఎప్ప‌టికీ పాడ‌వ్వ‌వు. ఆహార‌ప‌దార్థాలు పాడ‌వుతాయి. ఇందులోనూ ఉప్పు, చ‌క్కెర‌లు చెడిపోవు.

వాస్త‌వం 2

వాస్త‌వం 2

మ‌రి వాట‌ర్ బాటిళ్ల‌పైన ఎక్స్‌పైరీ తేదీల‌ను ఎందుకు ముద్రిస్తారు? బాటిలింగ్ కంపెనీలు కొన్ని నిబంధ‌న‌లు పాటించాల్సి ఉంటుంది. కొన్న మంచినీళ్ల సీసా ఎప్ప‌టిలోగా ఉప‌యోగిస్తే మంచిద‌నే విష‌యాన్ని వినియోగ‌దారుల‌కు తెలియాలి. అందుకే ఆ తేదీని వేస్తారు.

వాస్త‌వం 3

వాస్త‌వం 3

గ‌డువు తేదీ రాయ‌డానికి మ‌రో కార‌ణం ర‌సాయ‌నిక చ‌ర్య‌లు. అవును! ప్లాస్టిక్ సీసా ర‌సాయ‌నాల‌ను ఉత్ప‌న్నం చేయ‌గ‌ల‌వు. ఎక్కువ కాలంపాటు నీటిని ఉంచితే ర‌సాయ‌నిక చ‌ర్య‌ల ఫ‌లితంగా నీళ్లు క‌లుషితం అవ్వొచ్చు.

వాస్త‌వం 4

వాస్త‌వం 4

ర‌సాయ‌నాలు నీటితో క‌లిశాక‌, దాని తాజాద‌నాన్ని కోల్పోతుంది.

వాస్త‌వం 5

వాస్త‌వం 5

కూర‌గాయ‌లు, మాంసం లాగా నీరు అనేది చెడిపోదు. నీళ్లు ఎప్ప‌టికీ మంచివే. అయితే అది ఉన్న పాత్ర శుభ్ర‌మైన‌దై ఉండాలి. సుర‌క్షిత‌మైన‌, అసుర‌క్షిత‌మైన నీటికి అక్క‌డే తేడా ఉంటుంది.

వాస్త‌వం 6

వాస్త‌వం 6

ఇవి కాకుండా వేడికి, ర‌సాయనాల‌కు, ఉంచే పాత్ర‌లు త‌దిత‌రాల‌న్నీ నీటి శుద్ధ‌త‌ను దెబ్బ తీసే ప్ర‌మాద‌ముంది.

అందుకే ఈ సారి మంచి నీళ్ల సీసా కొనేప్పుడు దానిపైన ఎక్స్‌పైరీ తేదీని గ‌మ‌నించ‌డం మ‌ర్చిపోకండి.

English summary

Does Water Have An Expiry Date

Many Indians still use ground water or well-water whose age could be centuries! Does water have an expiry date? How long is bottled water safe to drink? Does water in glass bottles expire? Read on to know.
Story first published: Monday, February 5, 2018, 11:00 [IST]