For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ ఎనిమిది వస్తువులను మీరు సరిగ్గా శుభ్రం చేస్తున్నారా?

|

మీరు ఇంట్లోని అన్ని వస్తువులని జాగ్రత్తగా శుభ్రం చేస్తూ ఉండవచ్చు. మీ బిజీ షెడ్యూల్ లో కూడా మీరు వస్తువులను శుభ్రంగా ఉంచుకోవడంపై దృష్టి పెడుతూ ఉండవచ్చు. అయితే, కొన్ని సార్లు కొన్ని వస్తువులలో హానికర బాక్టీరియా నివాసం ఉంటుంది. అటువంటి సమయంలో మీరు ఆయా వస్తువుల శుభ్రతపై మరింత శ్రద్ధ కనబరచాలి. హానికర బాక్టీరియా మీ కంటికి కనిపించదు. మీరు రోజూ వాడే వస్తువులలోనే ఇది దాగుని ఉంటుంది. ఉదాహరణకు జిమ్ బ్యాగ్ లో పొంచి ఉంటుంది. కాబట్టి, మీకు సాధ్యమైనంత వరకు ఈ హానికర బాక్టీరియాల ద్వారా వ్యాప్తి చెందే ఇన్ఫెక్షన్స్ ను అరికట్టాలి. అలాగే, ఫ్లూ సీజన్ దగ్గర్లోనే ఉంది కాబట్టి వారానికి ఒకసారి శుభ్రం చేసే వస్తువులని జాగ్రత్తగా పరిశీలించుకోండి.


ఈ చిన్నపాటి కృషితో మీరు ఆరోగ్యకరమైన రోగనిరోధక శక్తిని పెంపొందించుకున్నవారవుతారు. తద్వారా, ఆరోగ్యంగా అలాగే ఆనందంగా మీ కుటుంబంతో జీవనాన్ని సాగించగలుగుతారు.

మేకప్ బ్రషెస్:

మేకప్ బ్రషెస్:

మీకు మేకప్ ని అప్లై చేసుకోవడానికి ఎక్కువ సమయం లేకపోతే, మీ బ్రషెస్ పై ముద్దలా పేరుకుపోయిన ఫౌండేషన్ ను పట్టించుకోకుండా అదే బ్రష్ తో మేకప్ చేసుకుంటారా? అయితే, మీరు మరింత శ్రద్ధ వహించాలి. ఇటువంటి బ్రష్ లు మీ చర్మానికి ఇబ్బందులను తీసుకువస్తాయి. నూనె, డెడ్ స్కిన్ సెల్స్ వంటివాటిని తమలో పేర్చుకుని ఈ మేకప్ బ్రష్ లు హానికర బాక్టీరియాకి నిలయంగా మారతాయని సర్టిఫైడ్ డెర్మటాలజిస్ట్ సింథియా బైలీ చెప్తున్నారు. క్రమంగా, ఈ మేకప్ బ్రష్ ల వల్ల చర్మంపై కలిగే అనర్థాలను అద్దంలో గమనించి బాధపడతారు. స్కిన్ ఇరిటేషన్స్ దగ్గరనుంచి మేజర్ బ్రేకవుట్ సమస్యల వంటివి మీ చర్మ సౌందర్యాన్ని దెబ్బతీస్తాయి. (మేకప్ టూల్స్ ని సరిగ్గా శుభ్రం చేయకపోతే ఈ 5 నష్టాలు జరుగుతాయి)

బెడ్డింగ్:

బెడ్డింగ్:

మీరు బెడ్డింగ్ విషయంపై గమనించని అంశమేంటంటే మీరు హాయిగా నిద్రించి రిలాక్స్ అయ్యే బెడ్ పై అనేక క్రిములు కూడా నివాసముంటాయన్న సంగతి. మీ బెడ్డింగ్ ను ఉతికి ఎన్నాళ్ళయిందో చెప్పగలరా? అధ్యయనాల ప్రకారం 26 గ్యాలన్ల చెమట మానవ శరీరం నుంచి బెడ్ పై పేరుకుంటుంది. అటువంటి తేమ వాతావరణంలో క్రిములు త్వరత్వరగా పుట్టుకొచ్చి విస్తరిస్తాయి. ఇది, ఫంగస్ పెరిగేందుకు అనువైన ప్రదేశం. అంతే కాకుండా, శరీరంలోంచి నూనె, యానిమల్ డాండెర్, పోలెన్ మరియు ఫుడ్ పార్టికల్స్ వల్ల బెడ్డింగ్ పై క్రిములు స్థిరనివాసం ఏర్పరచుకుంటాయి. ఒకవేళ మీకు బెడ్ పై స్నాక్స్ తినే అలవాటు ఉంటే మీ బెడ్డింగ్ ని తక్షణమే శుభ్రం చేసుకోవాలి. అలాగే, ఆ అలవాటును మానుకోవాలి.

సెల్ ఫోన్:

సెల్ ఫోన్:

ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్ అనేది జీవితంలో ఒక భాగం అయిపొయింది. రాత్రి పగలూ సెల్ ఫోన్ లేనిదే పనులు జరగటం లేదు. కొంతమంది టాయిలెట్ లో కూడా సెల్ ఫోన్ ను వాడతారు. శుభ్రంగా లేని చేతులతో సెల్ ఫోన్ ని వాడటం ద్వారా క్రిములను సెల్ ఫోన్ పైకి పంపిస్తున్నారు. అందుకే, సెల్ ఫోన్స్ ని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదని బైలీ చెప్తున్నారు.

వాటర్ బాటిల్:

వాటర్ బాటిల్:

రోజంతా హైడ్రేటెడ్ గా ఉండేందుకు రీయూజబుల్ వాటర్ బాటిల్ ని డెస్క్ దగ్గర ఉంచుకోవడం మంచి అలవాటే. డిస్పోజబుల్ బాటిల్స్ కంటే రీయూజబుల్ బాటిల్స్ ని వాడటం పర్యావరణానికి కూడా మంచిది. బాటిల్ నీటిగానే ఉంటుందిలే అని అనుకునే కంటే ఎప్పటికప్పుడు బాటిల్ ని శుభ్రం చేసుకోవడాన్ని అలవాటుగా చేసుకోవాలి. తద్వారా, నీటిద్వారా కూడా బాక్టీరియా మనల్ని చేరదు. బాటిల్ ని సిప్ చేసి తాగే అలవాటు ఉన్నవారు బాటిల్ ని మరింత జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలి. లేదంటే, బాక్టీరియా అనేది బాటిల్ లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది.

అండర్వేర్

అండర్వేర్

ప్రతి రోజూ శుభ్రమైన అండర్వేర్ ని ధరించాలి. కొంతమందికి ఈ అలవాటు ఉంటుంది. మరికొంతమంది రెండో గ్రూప్ కి చెందినవారు. వీరు అండర్వేర్ ని అంత త్వరగా మార్చరు. అండర్వేర్ లో చెమట, క్రిములు అలాగే డిశ్చార్జ్ లు పేరుకుంటాయి. కొన్ని సార్లు ఫెసల్ మెటీరియల్ కూడా పేరుకుంటుందని చెప్తున్నారు బైలీ. ఇది, డిస్కస్ చేసుకునేంత గొప్ప సబ్జెక్టు కాకపోయినా అండర్వేర్ హైజీన్ అనేది తప్పనిసరని బైలీ సూచిస్తున్నారు. అయితే, వాషింగ్ మెషిన్ లో వేసినంత మాత్రాన అండర్వెర్స్ లోని బాక్టీరియా నశిస్తుందని భావిస్తే మీ అభిప్రాయం తప్పే, బాక్టీరియాని నశింపచేసేది వేడి. కాబట్టి, వేడినీటిని ఉపయోగించి అండర్వెర్స్ ని శుభ్రపరచాలి. సాధారణంగా ఉతికితే మీరు ఉతికినందువలన మీకు తేడా ఏమీ కనిపించదు. ఒక అధ్యయనంలో వాషింగ్ మెషిన్ లో ఉతకడానికి ముందు ఉతికిన తరువాత కాటన్ ఫాబ్రిక్స్ పై ఉండే జెర్మ్స్ ని పరిశీలించారు. ఏమీ తేడా కనిపించలేదు. కాబట్టి, వేడి నీటితో అండర్వెర్స్ ని ఉతికే అలవాటును పెంపొందించుకోండి. (140 డిగ్రీల ఫారెన్హీట్ నీటిని శుభ్రపరిచేందుకు ఉపయోగిస్తే అద్భుత ఫలితాలు పొందవచ్చు.) తద్వారా, హానికర బాక్టీరియా నుంచి దూరంగా ఉండండి. ఒకవేళ, రోజులకొద్దీ మీరు ఒకే అండర్వేర్ ని ధరిస్తే పరిస్థితులు మరింత కఠినమవుతాయి. బాక్టీరియా విజృంభిస్తుంది. దురదలు వస్తాయి. స్కిన్ ఇరిటేషన్ సంభవిస్తుంది. తద్వారా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఈస్ట్ ఇన్ఫెక్షన్ కు గురవుతారు. (ఈ ఎనిమిది అలవాట్లు మీకు ఈస్ట్ ఇన్ఫెక్షన్ ను కలిగిస్తాయి).

కిచెన్ స్పాంజెస్:

కిచెన్ స్పాంజెస్:

అమాయకంగా సింక్ వద్ద కూర్చుని ఉన్న కిచెన్ స్పాంజ్ బాక్టీరియాకి ఫెవరేట్ స్పాట్ అన్న విషయాన్ని మీరు గుర్తించాలి. ఇంటి మొత్తంలో అతి దుర్మార్గమైన బాక్టీరియా కిచెన్ స్పాంజ్ లోనే తిష్టవేసుక్కూర్చుంటుంది. నిజానికి, 2017లో జరిగిన ఓ అధ్యయనంలో కిచెన్ స్పాంజ్ లో 362 వివిధ రకాల బాక్టీరియాను గుర్తించారట. 45 బిలియన్పెర్ స్క్వేర్ సెంటీమీటర్ డెన్సిటీలో ఉంటాయట. అంటే, కంటికి కనిపించకుండా స్పాంజ్ మొత్తాన్ని తమ ప్యాలస్ గా మార్చుకుంటాయి ఈ బాక్టీరియా. భూమిలో, అంత డెన్సిటీలో పేరుకుపోయిన బాక్టీరియా మరెక్కడా ఉండదు. దురదృష్టవశాత్తు, మీరు ఒవేన్ లో కిచెన్ స్పాంజ్ ని ప్రతి కొన్ని వారాలకు ఉంచినా బాక్టీరియా కాలనీలను మీరు నశింపచేయలేరు. (స్పాంజ్ తో పాటు, మీరు డిషెస్ ని వాష్ చేసేటప్పుడు ఈ 8 మిస్టేక్స్ ను అవాయిడ్ చేయండి.)

యోగా మాట్స్:

యోగా మాట్స్:

వారానికి ఒకసారి జరిగే హాట్ యోగా క్లాసెస్ లో మీకు చెమటపెట్టకపోయినా, మీ యోగ మ్యాట్ అనేది బాక్టీరియాను ఆకర్షిస్తూ బాక్టీరియాకు ఏకంగా కాలనీని ఏర్పాటు చేస్తుంది. బేర్ ఫీట్ మరియు చేతులతో మీరు అనేకరకమైన బాక్టీరియా వృద్ధికి అవసరమైన మెటీరియల్ ను అందిస్తున్నారు. ఒకవేళ మీరు కమ్యూనిటీ యోగా మ్యాట్స్ ను ఉపయోగిస్తే మీరు మరిన్ని క్రిములను మీతో పాటు మీ ఇంటికి తెచ్చుకుంటున్నారు. ఈ కారణాల వల్ల కొందరిలో ర్యాషెస్ తో పాటు మరిన్ని భయంకర చర్మ సమస్యలు వేధిస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

బాత్ టవల్స్:

బాత్ టవల్స్:

ఒకే బాత్ టవల్ ని రోజుల తరబడీ వాడుతున్నట్టయితే మీరు స్నానం చేసినా అందుకు తగిన ఫలితాన్ని పొందలేరు. ఎందుకంటే, స్నానం చేసి బాక్టీరియాను తొలగించుకునే మీరు ఒకే బాత్ టవల్ ని ఉతకకుండా మళ్ళీ మళ్ళీ వాడుతూ ఉంటే బాక్టీరియా మళ్ళీ మీ ఒంటిపై చేరుతుంది. వాడిన తరువాత బాత్రూంలోనే టవల్ ను వేలాడదీస్తే పరిస్థితి మరింత భయంకరంగా మారుతుంది. 2013లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం ఈ కోలీ బాక్టీరియా 25 శాతం బాత్ రూమ్ టవల్స్ లోనే వృద్ధి చెందుతుందట. ఒకవేళ మీరు బాత్ రూమ్ టవల్ ని ఇంకొక వ్యక్తితో పంచుకుంటే వేరే క్రిములు కూడా మీ శరీరానికి ట్రాన్సర్ అవుతాయి. ఆ విధంగా, స్కిన్ ఇరిటేషన్స్ తలెత్తుతాయి. (మిమ్మల్ని అనారోగ్యానికి గురిచేసే బాక్టీరియా మీ షవర్ హెడ్ పై ఉందా?)

English summary

Eight Things You're Not Washing Nearly Enough

Even if you’re a total neat freak, there are probably still a few things you use every day that may escape your notice or that you simply let slide, because hey, life gets busy sometimes.
Story first published:Saturday, February 3, 2018, 16:44 [IST]
Desktop Bottom Promotion