వింటర్ బ్లూస్ ని బీట్ చేయడంలో సహాయపడే 10 బెస్ట్ ఫుడ్స్!

Posted By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

మనం ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విధంగా శీతాకాలం చలిని ఈ సంవత్సరం అనుభవిస్తున్నాము మరియు మనలో కొంతమంది ఈ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉండగా, అందరూ ఈ శీతాకాలానికి అభిమానులు కాకపోవచ్చు, అవునా ,కాదా?

మనలో ఎలాగైతే ఒక్కొక్కరికి ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఛాయస్ ఉన్నట్లుగానే, వాతావరణ పరిస్థిల మీద కూడా ఒక్క్కొక్కరికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది మరియు ఇది సాధారణమైనది కూడా.

ఇందులో సాధారణమైన విషయం కానిదేదంటే కొంతమంది ఈ శీతాకాలంలో డిప్రెషన్ లోకి వెళ్లిపోవడం లేకపోతే సరైన కారణం లేకుండానే ఈ శీతాకాలం అంతా మూడీ గా ఉండటం లాంటివి.

10 Best Foods That Can Beat Back Winter Blues

అవును మీరు చదివింది కరెక్టే, ఇలాంటి పరిస్థితి చాలా నిజమైనది మరియు మీరు దీనిగురించి పట్టించుకోకుండా వదిలేసినప్పుడు చాలా తీవ్రమైనది గా మారవచ్చు. దీనినే" వింటర్ బ్లూస్" లేదా సీసనల్ మూడ్ డిజార్డర్ అని పిలుస్తారు.

ఈ అనారోగ్యం మీద అనేక పరిశోధనా అధ్యయనాలు నిర్వహించబడుతున్నాయి మరియు ఉష్ణోగ్రత నిటారుగా పడకపోవడం వలన కొంత మంది వ్యక్తులలో సెరోటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గించగలదని, ఫలితంగానే శీతాకాలంలో సీసనల్ మూడ్ డిజార్డర్ రావడానికి కారణమని, దీనివలన ఎలాంటి అల్లెర్జి ఉండదని అభిప్రాయపడ్డారు.

శీతాకాలంలో మెదడు కి మరింత సెరోటోనిన్ను ఉత్పత్తి చేయడానికి అనుమతించబడే, "వింటర్ బ్లూస్" ను తగ్గించటానికి సహాయపడే కొన్ని సహజమైన ఆహారాల పదార్థాలు వున్నాయి.

కాబట్టి, "వింటర్ బ్లూస్" ని దూరంగా ఉండటంలో మీకు సహాయపడే 10 ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1. స్పినాచ్

1. స్పినాచ్

బచ్చలికూర, ఆకుకూరలలో ముఖ్యమైనది, ఇది పోషకాలను సమృద్ధిగా కలిగి ఉంటుంది. అందువలన బచ్చలికూర చాలా ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఐరన్ మరియు కాల్షియం బచ్చలి కూరలో కనిపించే ముఖ్య పోషకాలు; అయితే, పాలకూరలో ఫోలిక్ ఆమ్లం కూడా ఉంటుంది, ఇది మీ మెదడు కణాలను పెంచుతుంది మరియు "వింటర్ బ్లూస్" ను తగ్గించేందుకు సెరోటోనిన్ బ్యాలెన్స్ను గా ఉంచడంలో మీకు సహాయపడుతుంది.

2. వోట్స్

2. వోట్స్

వోట్స్ అనేది చాలా ఆరోగ్యకరమైన మరియు ఫిట్నెస్-చైతన్యవంతుల కోసం ప్రత్యేకరమైన ఆహరం. ఇది వారి వర్కౌట్స్ సమయంలో వారిని శక్తివంతులను చేసి మరియు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. వోట్స్లో కనిపించే పోషకాలు సీసనల్ మూడ్ డిజార్డర్లను తగ్గించటానికి సహాయపడతాయి ఎందుకంటే సెరోటోనిన్ ఉత్పత్తిని ప్రేరేపించటానికి మెదడులో రక్త ప్రసరణను పెంచుతాయి.

3.అల్లం

3.అల్లం

అల్లం ప్రతి వంటింట్లో కనిపించే మరొక ఔషధ పదార్ధంగా ఉంది, దీనిలో అద్భుతమైన ఔషధ లక్షణాలను కలిగి వున్నాయి మరియు అనేక రోగాలకు చికిత్స చేయవచ్చు. అనేక సాంప్రదాయ రూపాల ఔషధాల ప్రకారం, అల్లం కొన్ని ఎంజైమ్లను కలిగి ఉంటుంది, ఇది "వింటర్ బ్లూస్" చికిత్సకు మెదడులోని సెరోటోనిన్ స్థాయిలను పెంచుతుంది.

4.అవోకాడో

4.అవోకాడో

అవోకాడో సూపర్ ఫ్రూప్ట్స్ అని చెప్పవచ్చు అందులో ఎలాంటి అనుమానం లేదు. దానిలో వుండే అనేక ఆరోగ్య ప్రయోజనాల కారణంగా బాగా ప్రసిద్ధి చెందింది. అవెకాడోస్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్లో పుష్కలంగా ఉంటుంది, ఇవి మెదడు ని ఆరోగ్యకరంగా మరియు బాగా పోషించటానికి అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగివుంటుంది. కాబట్టి, అవకాడొ సీసనల్ మూడ్ డిజార్డర్లను తగ్గించడానికి కూడా సహాయపడతాయి.

5. టమోటో

5. టమోటో

మెదడులోని సెరోటోనిన్ యొక్క ఆరోగ్యకరమైన స్థాయిల ఉత్పత్తిని ప్రేరేపించగల లైకోపీన్ అనే ఎంజైమును కలిగి ఉండడంతో, "వింటర్ బ్లూస్" ను తగ్గించడానికి టొమాటోస్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో, శీతాకాలంలో తాజా టమోటా రసంని తీసుకోవడం చాలా మంచిది.

6. గుడ్లు

6. గుడ్లు

గుడ్లు ని మరొక ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ఫుడ్ గా చెప్పవచ్చు. గుడ్లు ప్రోటీన్ మరియు పొటాషియం వంటి ఇతర ఆరోగ్యకరమైన, ముఖ్యమైన పోషకాలతో నిండి ఉంటుంది.గుడ్లు లో ప్రోటీన్ కంటెంట్ మెదడు లో న్యూరోట్రాన్స్మిటర్ల ఉత్పత్తి మెరుగుపరచడానికి మరియు "వింటర్ బ్లూస్" నుండి దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది.

7. జీడిపప్పు

7. జీడిపప్పు

మనందరికీ బాగా తెలుసు,నట్స్ అనేవి ఆరోగ్యానికి చాలా మంచివని. ముఖ్యంగా జీడిపప్పులు, అవి అనేక పోషకాలతో నిండి ఉంటాయి. అనేక పరిశోధనా అధ్యయనాలు జీడిపప్పులో ఉన్న ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ సీసనల్ మూడ్ డిజార్డర్లను సమర్థవంతంగా చికిత్స చేయవచ్చని పేర్కొన్నాయి.

8. బీన్స్

8. బీన్స్

బీన్స్, లేదా రాజ్మా, ప్రోటీన్ విషయంలో చాలా సమృద్ధిగా ఉన్న ఆరోగ్యకరమైన ఆహారాలు. మరియు ఎలాగైతే గుడ్లు లో వున్న ప్రోటీన్ మీ మెదడు కణాలు పోషించుట లో మరియు సెరోటోనిన్ ఉత్పత్తి మెరుగుపరచడానికి ఎలా సహాయపడుతుందో అలానే బీన్స్ లో వుండే ప్రోటీన్ కూడా "వింటర్ బ్లూస్" చికిత్స కోసం ఇదే ప్రభావాన్ని కలిగి కలిగివుంటుంది.

9. పార్స్లీ

9. పార్స్లీ

పార్లీ ఇంకొక ఆకుపచ్చ ఆకుకూర రకం, బరువు తగ్గడం, మధుమేహాన్ని సమానంగా నిర్వహించడం మొదలైన అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది, పార్స్లీ లో విటమిన్ B లో సమృద్ధిగా ఉంటుంది, కనుక సీసనల్ మూడ్ చికిత్సకు మెదడులోని సెరోటోనిన్ ఉత్పత్తిని మెరుగుపరచగల సామర్థ్యాన్ని కలిగివుంటుంది. మానసిక రుగ్మత మరియు మెమరీ సమస్యలను కూడా తగ్గించగలదు.

10. డార్క్ చాక్లెట్

10. డార్క్ చాక్లెట్

మనకి బాగా తెలుసు చాక్లెట్ మనల్ని చాలా సంతోషంగా ఉంచుతుందని! దాని వెనుక ఉన్న

ఒక శాస్త్రీయ కారణం వుంది, కేవలం రుచి ఏ కాకుండా, డార్క్ చాక్లెట్ విషయానికి వస్తే ఒక ప్రత్యేక లక్షణాలను కలిగివుంటుంది. డార్క్ చాక్లెట్ లో ఉన్న గొప్ప అనామ్లజనకాలు మీ మానసిక స్థితి ని పెంచుతాయి మరియు మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచుతాయి కాబట్టి, "వింటర్ బ్లూస్" ను నిరోధించడంలో సహాయపడుతాయి.

English summary

10 Best Foods That Can Beat Back Winter Blues

10 Best Foods That Can Beat Back Winter Blues, What may not be normal is the fact that some people getting depressed or experiencing constant low moods during the winters, without any apparent cause!