పిరియడ్స్ సమయంలో రక్తస్రావం మెరుగుపర్చే ఆహారపదార్థాలు

Written By: DEEPTHI T A S
Subscribe to Boldsky

ఆడవారికి సవాలక్ష ఆరోగ్య సమస్యలు ఉంటాయి, కదా? అన్నిటికన్నా చెత్త సమస్య, 90 శాతం స్త్రీలు ఎదుర్కొనేది పిరియడ్స్ సమయంలో తక్కువ రక్తస్రావం జరగటం లేదా పిరియడ్స్ యే రాకపోవటం.

జీవన విధానంలో మార్పులు, మానసిక వత్తిడి, తప్పుడైట్ పాటించటంవలన, ఆడవాళ్ళు ఈ పిరియడ్స్ సమస్యల వలయంలో చిక్కుకుపోతారు.

కానీ, మీ రోజువారీ జీవితాన్ని మెరుగ్గా మార్చుకునే శక్తి మీకుంటే, ఈ సమస్యలేవీ ఇక మిమ్మల్ని బాధించవు.

రక్తస్రావం సరిగ్గా పెరిగి, ఈ సమస్య ఉన్న పిరియడ్స్ నయమవ్వాలంటే మీరు చేయాల్సిందల్లా సరిగ్గా తినటం. ఐరన్ లేని ఆహారపదార్థాలు తినటం కన్నా, రోజూ ఐరన్ ఉన్న ఆహారాన్నే తినటం అలవాటు చేసుకోండి.

Foods That Increase Blood Flow During Periods

మరోవైపు, మీరు శారీరకంగా కూడా ఫిట్ గా ఉండాలి, ఫిట్ గా యాక్టివ్ గా ఉండటం వలన రక్తప్రసరణ శరీరం మొత్తం మెరుగవుతుంది.

అందుకని, అమ్మాయిలూ, మీ డైట్ మార్చుకుని పిరియడ్స్ ను సరిచేసుకోవాలనుకుంటే, ఆరోగ్యంగా ఉండాలనుకుంటే, మీ పిరియడ్ డేట్ వచ్చే వారం ముందునుంచి ఈ కింద పదార్థాలు తినాల్సివుంటుంది.

కానీ మీ పిరియడ్స్ సాధారణంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పదార్థాలు రోజూ తినటం మంచిది.అందుకని మీ పిరియడ్ సమయంలో రక్తస్రావం మెరుగుపర్చే 10 ఆహారపదార్థాలేంటో కింద చదవండి.

బీట్ రూట్

ఆడవారికి బీట్ రూట్ తినటం ఆరోగ్యకరం. ఈ కూరలో ఐరన్ మరియు ఇతర పోషకాలుండి, రక్తప్రసరణ పెరిగేలా చేసి, పిరియడ్స్ సమయంలో రక్తస్రావం సరిగ్గా జరిగేలా చేస్తుంది.

పాలకూర రసం

పాలకూర రసం కూడా ఆరోగ్యమైనదే, ఎందుకంటే ఈ ఆకుకూరలో విటమిన్ కె ఉండి రక్తాన్ని గడ్డకట్టేలా ప్రోత్సహిస్తుంది. అందుకని మీకు రక్తస్రావం తక్కువగా అవుతుంటే, ఇది మీ రక్తస్రావాన్ని వెంటనే క్రమబద్ధీకరిస్తుంది.

చాక్లెట్

చాక్లెట్ ఆడవాళ్లకి చాలా రకాలుగా సాయపడుతుంది. పిరియడ్స్ సమస్యలను నయం చేసే మేటి మందు ఇది. మీకు పిరియడ్స్ ఆలస్యంగా వస్తుంటే, ఈ చాక్లెట్ ను తింటే మీ పిరియడ్స్ వచ్చేస్తాయి.

బెల్లం

మన పెద్దవాళ్ళండరూ బెల్లాన్నే సూచిస్తారు, ఎందుకంటే ఇది వేడిచేసే పదార్థం. మీరు బెల్లం తిన్నప్పుడు కొబ్బరి బోండం నీళ్ళు తాగటం మర్చిపోవద్దు. ఎందుకంటే బెల్లం ఎక్కువైతే కడుపులో సమస్యలు పెరగవచ్చు.

ఎండుకొబ్బరి

తక్కువ రక్తస్రావాన్ని మామూలుగా మార్చటానికి వేగవంతమైన, సురక్షితమైన పదార్థం ఎండుకొబ్బరి. ఎండుకొబ్బరిని బెల్లంతో కలిపి ఒక మందుబిళ్ళలా తయారుచేయండి. ఈ రెండు శక్తివంతమైన ఆహారపదార్థాలతో చేసిన బిళ్ళను పిరియడ్స్ ఉన్న రోజుల్లో పొద్దునే తినండి.

నువ్వులు

నువ్వులను,బెల్లాన్ని ఒక చిన్న బౌల్ లో కలపండి. ఈ తీపిపదార్థాన్ని పిరియడ్స్ కు ముందుగా కానీ లేదా పిరియడ్స్ సమయంలో కానీ తినవచ్చు. రెండూ వేడిచేసే పదార్థాలే కాబట్టి, అవి రక్తస్రావాన్ని పెంచి క్రమబద్ధీకరిస్తాయి. మీరు నువ్వులను నీళ్ళతో కలిపి మింగేయవచ్చు ఇంకా బెల్లాన్ని కూడా వెంటనే తినవచ్చు.

ఆలోవెరా రసం

ఆలోవెరా రసం పిరియడ్స్ సమయంలో రక్తస్రావం తక్కువగా అవుతున్నప్పుడు,దాన్ని సరిచేయటానికి సురక్షితమైనది,ఎక్కువ ప్రభావం చూపేదిగా భావిస్తారు. ఈ రసం తయారుచేసేటప్పుడు, ఒక చెంచా తేనె కూడా వేస్తే రుచి బాగుంటుంది.

బొప్పాయి

పిరియడ్స్ సరిగ్గా రాకపోతుంటే బొప్పాయి మరో పరిష్కారం. బొప్పాయిని రోజుకి రెండుసార్లు తినాలి. ఈ వేడి చేసే పదార్థంతో పాటు,ఎక్కువగా కొబ్బరిబోండాలు తాగుతుంటే కడుపులో సమస్యలను నయం చేయవచ్చు.

మెంతులు

ఒక కప్పు నీళ్ళను మరిగించి,ఒక చెంచా మెంతులు అందులో వేయండి. ఈ ఆరోగ్యమైన డ్రింక్ ను మీ పిరియడ్స్ సమయంలో తాగండి.ఈ డ్రింక్ తక్కువగా వచ్చే పిరియడ్స్ ను నయం చేయటమేకాక, చాలా ఇతర సమస్యలు కూడా తగ్గిస్తుంది.

English summary

Foods That Increase Blood Flow During Periods

Are you have a problem of scanty periods? Well then you must add some of these foods to help you increase the blood flow during your periods, take a look.
Story first published: Sunday, May 6, 2018, 12:00 [IST]