For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నల్లని బాహుమూలల (అండర్ ఆర్మ్స్) నుండి వారం రోజుల్లో సెలవు తీసుకోండి.

నల్లని బాహుమూలల (అండర్ ఆర్మ్స్) నుండి వారం రోజుల్లో సెలవు తీసుకోండి.

|

నల్లని బాహుమూలలు కొన్నిసార్లు మనలో చాలామందికి ఇబ్బందికరంగా అనిపిస్తాయి. దీనివలన మనం స్లీవ్ లెస్ దుస్తులు ధరించడానికి తగిన ఆత్మవిశ్వాసం కోల్పోతాము.

చర్మం కొన్ని పరిస్థితులలో అతిగా స్పందించడం మూలంగా బాహుమూలలు నల్లగా మారతాయి. షేవింగ్, అధిక స్వేదం, బాహుమూలలకు గాలి సోకకుండా ఉండటం, డియోడరంట్ల వాడకం, మృతకణాలు పేరుకుపోవడం మొదలైనవి నల్లబడటానికి కారణాలు.

కొన్ని సందర్భాలలో, ఎకాంథోసిస్ నైగ్రికన్స్ వంటి వైద్య సంబంధిత పరిస్థితుల వలన, ఇన్సులిన్ నిరోధకత, ఊబకాయం, హార్మోన్ల అసమతుల్యత, కొన్ని రకాల మందులు వాడటం మరియు కేన్సర్ వలన బాహుమూలలు నల్లగా మారవచ్చు.

Get Rid Of Dark Armpits In 7 Days

కనుక, ముందుగా ఇలా జరగడానికి గలా కారణాన్ని నిర్ధారించుకుని, తదనుగుణంగా చికిత్స తీసుకోవాలి. ఒకవేళ వైద్య సంబంధిత కారణాల వలన అయితే వైద్యుని సంప్రదించి, తగిన మందులు వాడాలి.

ఒకవేళ ఇటువంటి కారణాలేవి లేనట్లయితే, సహజ వనరులను ఉపయోగించడం అత్యుత్తమం. ఇక్కడ మీ కోసం అటువంటి కొన్ని పదార్థాలను గురించిన సమాచారం అందిస్తున్నాం. వీటిని ఉపయోగిస్తే పదిరోజుల లోగానే మీ బాహుమూలలు కాంతివంతంగా మారుతాయి.

నిమ్మరసం:

నిమ్మరసం:

నిమ్మకాయ సహజ బ్లీచ్ గా పనిచేయడమే కాక యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీసెప్టిక్ గుణాలను కలిగి ఉంటుంది.

ముందుగా, నిమ్మకాయను రెండు ముక్కలు చేయండి. ఒక ముక్కను తీసుకుని నేరుగా ఆ ప్రదేశంలో రుద్దండి.తరువాత పది నిమిషాల పాటు అలా వదిలేయండి.తరువాత చల్లని నీటితో కడుక్కోండి.

బేకింగ్ సోడా:

బేకింగ్ సోడా:

బాహుమూలల వద్ద చర్మాన్ని తెల్లగా మార్చుకోవడానికి మన ఇంట్లో లభించే బేకింగ్ సోడా మంచి పరిష్కారం. కొంచెం నీరు తీసుకుని వంట సోడాను బాగా కలపి ముద్దగా చేయండి. ఈ ముద్దను చర్మంపైగట్టిగా రుద్దండి. కొన్ని నిమిషాల పాటు ఆరనిచ్చి గోరువెచ్చని నీళ్లతో కడిగేయండి. ఇలా క్రమంగా చేస్తూ ఉంటే మంచి ఫలితముంటుంది.

బంగాళదుంప:

బంగాళదుంప:

బంగాళదుంప మంచి బ్లీచింగ్ ఏజంట్ గా పనిచేసి, చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. ఒక బంగాళదుంప ముక్కను తీసుకుని బాహుమూలలలో రుద్దండి. లేదంటే బంగాళదుంపను తురిమి, ఆ ప్రదేశంలో పూసుకుని 15-20 నిమిషాల పేస్టు ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో కడిగేయండి.

తేనె:

తేనె:

తేనె పలు సౌందర్య సమస్యల చికిత్సలో ఉపయోగపడుతుంది. కొంచెం తేనెను తీసుకుని బాహుమూలల వద్ద పూసుకోవాలి. దీనిని పాలు, కలబంద గుజ్జు లేదా కొబ్బరినూనెతో కలిపి ఉపయోగిస్తే మరీంత ప్రభావవంతంగా పనిచేస్తుంది.

టొమాటో:

టొమాటో:

బాహుమూలల వద్ద ఉండే నల్లని మచ్చలను తెల్లబరచడానికి వారానికి ఒకసారి టొమాటోను ఉపయోగించవచ్చు. టొమాటోలోని తాజా రసాన్ని పిండి, ప్రభావిత ప్రదేశాల్లో షేవింగ్ చేసుకున్నాక పూసుకోండి. ఇలా వారం రోజుల పాటు రోజుకు రెండు మూడు సార్లు చేయాలి.

దోసకాయ:

దోసకాయ:

దోసకాయ అద్భుతమైన సహజ బ్లీచింగ్ ఏజంట్ గా పనిచేస్తుంది. దీనిని సురక్షితంగా బాహుమూలల వద్ద నల్ల మచ్చలను తొలగించడానికి వినియోగించవచ్చు. దోసకాయ రసాన్ని తీసుకుని, దానికి కొంచెం పసుపు మరియు నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమాన్ని నల్లబడిన ప్రదేశం వద్ద రాసుకోండి. కొంత సమయం తరువాత నీటితో కడిగేయండి. ఇది ఒక్కసారి మాత్రమే కాక పలుమార్లు చేస్తూ ఉంటే, ఫలితం త్వరగా కనిపిస్తుంది.

నిమ్మరసం మరియు పంచదార స్క్రబ్:

నిమ్మరసం మరియు పంచదార స్క్రబ్:

ఈ అద్భుతమైన స్క్రబ్ మీ బాహుమూలల ఛాయను తెలికపరుస్తుంది. ఒక టేబుల్ స్పూన్ పంచదార మరియు కొన్ని చుక్కలు నిమ్మరసం కలిపి మృదువుగా నల్లబడిన ప్రదేశంలో రుద్దండి. తరువాత పది నిమిషాలు పాటు ఆగి మామూలు నీటితో కడిగేయండి.

English summary

Get Rid Of Dark Armpits In 7 Days

Get Rid Of Dark Armpits In 7 Days,Dark underarms are often embarrassing for many among us, especially if we're not able to flaunt our bodies with sleeveless tops. The best way to treat them is by using natural remedies. Here are some natural remedies to brighten your underarms in less than 10 days.
Story first published:Wednesday, May 30, 2018, 11:07 [IST]
Desktop Bottom Promotion