For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆవుపాల వల్ల కలిగే 7 ఆరోగ్య ప్రయోజనాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి

ప్రతిరోజూ ఆవుపాలు తాగడం వల్ల కలిగే 7 ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది.

By Lakshmi Bai Praharaju
|

ఆవుపాలు ప్రపంచంలో అత్యంత విరివిగా ఉపయోగించే పాలు.

గొర్రే, ఒంటె, గేదె, మేకపాలు కూడా ప్రసిద్ది చెందినవి అయినప్పటికీ (ప్రపంచంలో ఏ ప్రదేశం గురించి మాట్లాడుతున్నారో దాని పై ఆ ప్రదేశంపై ఆధారపడి), అద్భుతమైన పోషక విలువలు, ఇతర లక్షణాలు కలిగిన ఆవుపాలను మాత్రమే ప్రజలు ఎక్కువగా ఇష్టపడతారు.

ప్రతిరోజూ ఆవుపాలు తాగడం వల్ల కలిగే 7 ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది:

దయచేసి గమనించండి: మీకు లాక్టోస్ తక్కువగా ఉంటె, ఈ కింది పాయింట్లు మీకు వర్తించవు ఎందుకంటే మీ శరీరం పాలను అరిగించడానికి అవసరమైన లాక్తోజ్ అనే ఎంజైమ్ ను ఉత్పత్తి చేయదు కనుక.

#1 ఇవి మీ ఎముకలను గట్టిపరుస్తాయి

#1 ఇవి మీ ఎముకలను గట్టిపరుస్తాయి

ఆవుపాలు కాల్షియం, ఫాస్ఫరస్, మీ ఎముకల ఆరోగ్యానికి అవసరమైన ఇతర మినరల్స్ ని అధికంగా కలిగి ఉంటాయి. అందుచేతనే ప్రభుత్వం వారు ప్రపంచం మొత్తం పిల్లలు, పెద్దలు ఇద్దరూ ఆవు పాలను ప్రతిరోజూ తీసుకోవాలని సిఫార్సుచేస్తున్నారు.

#2 ఇవి మీ పళ్లకు ఎంతో మంచివి

#2 ఇవి మీ పళ్లకు ఎంతో మంచివి

మీ ఎముకల లాగే పళ్ళకు కూడా ఆరోగ్యంగా, గట్టిగా ఉంచే కాల్షియం కూడా చాలా అవసరం. కాబట్టి ఆవుపాలు రోజూ తాగడం అనేది మీ ఆరోగ్యానికి మంచిది!

#3 ఇది మీ గుండెకు మంచిది

#3 ఇది మీ గుండెకు మంచిది

మంచి ఆహారాన్ని తీసుకునే ఆవులు పేలవమైన వంటల కంటే నాణ్యతకలిగిన పాలను ఇస్తాయి, అందువల్లే వైద్యులు మిమ్మల్ని కేవలం గడ్డితినే ఆవుపాలు మాత్రమే తాగమని సిఫార్సుచేస్తారు.

ఎందుకంటే మంచి నాణ్యత కలిగిన ఆవుపాలలో ఒమేగా-3 ఫాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయి, ఇవి మీ రక్తంలోని కొవ్వు స్థాయిని నియంత్రించి, ఎక్కువకాలం మీ గుండె ఆరోగ్యంగా ఉండేట్టు చేస్తుంది.

#4 బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి

#4 బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి

ఇది నిజం! ఆవుపాలు తాగేవారిలో రోజులో తీసుకునే క్యాలరీలను తగ్గిస్తుంది, కాబట్టి ఈ పాలలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేట్టు చేస్తుంది.

#5 కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది

#5 కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది

కండరాల అభివృద్ధికి మీ శరీరానికి ప్రోటీన్లు చాలా అవసరం. దాని కోసం ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న ఆవుపాలు మీకు మంచిది.

#6 మధుమేహాన్ని అరికడుతుంది

#6 మధుమేహాన్ని అరికడుతుంది

ప్రతిరోజూ ఆవుపాలు తాగడం, మధుమేహం నుండి రక్షణ ఈ రెంటి మధ్య సంబంధాన్ని అనేక అధ్యయనాలు గమనించాయి.

ఎందుకంటే ఆవుపాలో వివిధ రకాల పోషకాలు, మినరల్స్ అధికంగా ఉంటాయి, అవి మీ జీర్ణశక్తిని మెరుగుపరిచి, మీ రక్త ఇన్సులిన్ స్థాయిని కూడా నియంత్రిస్తాయి.

#7 ఇందులో విటమిన్ D ని అధికంగా ఉంటుంది

#7 ఇందులో విటమిన్ D ని అధికంగా ఉంటుంది

విటమిన్ D కేవలం మీ ఎముకలను బలంగా ఉంచుకోవడానికి మాత్రమె ముఖ్యం కాదు. ఇది సెరొటోనిన్ ఉత్పత్తికి కూడా చాలా ముఖ్యమైనది, ఈ హార్మోన్ సరైన నిద్రకు, మీ మనసు ప్రభావానికి, మీ ఆకలిని పెంచడానికి కూడా బాధ్యత వహించే హార్మోన్.

ఆవుపాలు వితమిన్లతో నిండి ఉన్నప్పటికీ, వీటిని ప్రతిరోజూ తాగడం అనేది ఆరోగ్యంగా ఉండడానికి మంచి మార్గం.

English summary

These 7 Health Benefits of Cow Milk Will Blow Your Mind

Cow milk is the most-widely consumed milk variety in the world. It is rich in calcium, phosphorus, and other minerals important for strengthening your bones and teeth. It also contains omega-3 fatty acids that are great for the health of your heart.
Story first published:Wednesday, January 10, 2018, 19:00 [IST]
Desktop Bottom Promotion