For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ దంతాల ఆరోగ్యం మీ పూర్తి ఆరోగ్యంపై చూపే ప్రభావాల గురించి తెలుసుకోండి.

|

మీ దంతాల ఆరోగ్యం మీ పూర్తి ఆరోగ్యాన్ని సైతం ప్రభావితం చేస్తుందని ఎప్పుడైనా కలలో అయినా ఊహించారా ? దంతాల ఆరోగ్యం, శరీర ఆరోగ్యంపై చూపే ప్రభావాల గురించి, మీకున్న అనుమానాలన్నింటినీ ఈ వ్యాసం చర్చిస్తుంది.

మన శరీరంలోని అన్ని అవయవాలు, మరియు వాటి పనితీరు వివిధ మార్గాల్లో ఉన్నప్పటికీ, ప్రతి ఒక్క అవయవం యొక్క పనితీరు, విధివిధానాలు పరస్పరం అనుసంధానించబడి ఉంటాయి. ఉదాహరణకు, మీ జుట్టు మామూలు రోజులతో పోల్చినప్పుడు, ఎక్కువగా రాలిపోవడం జరుగుతున్న ఎడల, కాలేయ సమస్యకు ఇది సంకేతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా, మీ నోటి ఆరోగ్యం కూడా మీ శరీర ఆరోగ్యం గురించిన సంకేతాలను అందివ్వగలదని చెప్పబడింది.

నోటి ఆరోగ్యం ఎందుకు ముఖ్యమైనది ?

మీ చిగుళ్ళు మరియు దంతాల గురించి తీసుకునే జాగ్రత్తలను అనుసరించి, మీ శరీర ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మీ నోటి ఆరోగ్యం పట్ల చూపే అజాగ్రత్త, బ్యాక్టీరియా పెరుగుదలకు కారణమవుతుంది. రోజువారీ బ్రషింగ్ మరియు ఫ్లాసింగ్ ఈ బాక్టీరియాను నియంత్రణలో ఉంచి, దంత క్షయం మరియు గింజివిటిస్, నోటి పుండ్లు, చిగుళ్ళు దెబ్బతిని దంతాలు కదలడం, మొదలైన గమ్ వ్యాధుల అవకాశాలను తగ్గిస్తాయి.

నోటి అనారోగ్యాలకు గల ప్రధాన కారకాలు ఏమిటి ?

మధుమేహం మరియు దంత క్షయం, నోటి అనారోగ్యాలకు గల రెండు ప్రధాన కారణాలుగా చెప్పబడినవి. దంత క్షయం అనేది పిల్లలలో అత్యంత సాధారణమైన విషయంగా ఉంటుంది. అదేవిధంగా వయసు ప్రభావం కూడా దంతాల నష్టానికి అత్యంత సాధారణ కారకం. దంతాల ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యత గురించి అమెరికాలోని ఓరల్ హెల్త్ జర్నల్లో హైలైట్ చేయబడింది : సర్జన్ జనరల్ యొక్క నివేదిక ప్రకారం, నోటి ఆరోగ్యం అనేది సాధారణ ఆరోగ్యానికి మరియు శరీర శ్రేయస్సుకు ముఖద్వారమని వెల్లడించింది.

దంత సమస్యల వలన కలిగే, కొన్ని ఆరోగ్య సమస్యల గురించిన వివరాలు ఇక్కడ పొందుపరచబడినవి.

1. డయాబెటిస్ :

1. డయాబెటిస్ :

డయాబెటిస్ మరియు పీరియోడోoటల్ వ్యాధులు అనుసంధానించబడి ఉంటాయి. మీ నోరు వాపుకు గురికాబడినప్పుడు, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే శరీర సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది. మధుమేహ రోగులు, అధిక ఇన్సులిన్ కారణంగా చక్కెరలను శోషించుకోవడంలో సమస్యను కలిగి ఉంటారు. హార్మోనులు, చక్కెరలను శక్తిగా మారుస్తుంది. మరియు రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతున్నప్పుడు, ఇది క్రమంగా గమ్ ఇన్ఫెక్షన్లకి దారి తీస్తుంది.

2. కార్డియోవస్క్యులర్ డిసీజ్ :

2. కార్డియోవస్క్యులర్ డిసీజ్ :

గమ్ వ్యాధి మరియు గుండె జబ్బు అనుసంధానించబడి ఉంటుంది. విస్కాన్సిన్ డెంటల్ అసోసియేషన్ వెబ్సైట్లో పేర్కొన్న నివేదిక ప్రకారం, పీరియోడోoటల్ సమస్యతో భాద పడుతున్న మరియు గుండె జబ్బులు లేని 66 శాతం మంది వ్యక్తులతో పోల్చినప్పుడు, 91 శాతం హృదయ వ్యాధిగ్రస్తులు పీరియోడోoటల్ సమస్యను అధికంగా కలిగి ఉన్నట్లుగా తేల్చింది. నోటిలో ఉన్న మిలియన్ల కొద్దీ బ్యాక్టీరియా కూడిన ఫలకాలు మరియు కాలిక్యులస్, శరీరంలోని రక్త నాళాల గుండా రక్తప్రవాహంలోకి చేరుతుంది. గుండె మరియు ఇతర శరీర భాగాలకు రక్త ప్రవాహ స్థాయిలను పెంచుతుంది. క్రమంగా గుండెపోటు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. అంతేకాకుండా అధిక రక్తపోటుకు కూడా ప్రధాన కారణం అవుతుంది.

3. ఎండోకార్డిటిస్ :

3. ఎండోకార్డిటిస్ :

ఎండోకార్డిటిస్ అనేది ఒక సంక్రమణ వ్యాధి, ఇది గుండె గదులలో, గుండె కవాటాల లోపలి భాగంలో సంభవిస్తుంది. మీ దంతధావనం లేదా ఇతర మౌఖిక చర్యల కారణంగా కలిగే గం బ్లీడింగ్ మీ నోటిలో లక్షలాది బ్యాక్టీరియా లేదా ఇతర జెర్మ్స్ ఏర్పడడానికి కారణమవుతాయి. ఈ బాక్టీరియా రక్తప్రవాహంలోకి ప్రవేశించి, మీ గుండెకు చేరడం కారణంగా, హృదయ కవాటాలలో ఎండోకార్డిటిస్ సమస్యకు దారితీస్తుంది.

Most Read:నాతో ఒక్కసారి సెక్స్ లో పాల్గొను, ఒక్కరోజు రూమ్ కు వస్తావా నేను హెల్ప్ చేస్తాను #mystory269

4. శ్వాసకోశ వ్యాధులు :

4. శ్వాసకోశ వ్యాధులు :

డెంటల్ హెల్త్ ఫౌండేషన్ ప్రకారం, నోటిలోని బ్యాక్టీరియా ఊపిరితిత్తుల వ్యాధికి అనుబంధంగా ఉన్నందున, శ్వాసకోశ వ్యాధులకు నోటి అపరిశుభ్రత మరొక కారణంగా ఉందని చెప్పవచ్చు. ఏల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ వారు చెప్పిన నివేదిక ప్రకారం, నోటిలో జరిగే బ్యాక్టీరియా మార్పులు, ఆసుపత్రులలోని రోగులు, లేదా దీర్ఘకాలిక వ్యాధులతో భాదపడుతున్న వారిలో న్యుమోనియా వ్యాధి పెరుగుదలకు కారణంగా కూడా ఉందని కనుగొన్నారు.

5. ఊబకాయం :

5. ఊబకాయం :

అమెరికన్ డెంటల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ ప్రకారం, ఊబకాయం మరియు నోటి ఆరోగ్యం మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఇది పీరియోడోoటల్ వ్యాధి మరియు దంత క్షయం సమస్యల నుండి, నోరు మరియు మాక్సిల్లోఫేషియల్ శస్త్రచికిత్సా విధానాల వరకు ఉంటుంది. స్వీడన్ డెంటల్ జర్నల్లో ప్రచురించబడిన ' స్వీడిష్ పిల్లలు మరియు యువకులలో బిఎమ్ఐ స్థాయిలు మరియు సంక్రమణల ప్రాబల్యం' అనే అధ్యయనం ప్రకారం, కౌమార మరియు యుక్తవయసు దశలలో ఊబకాయం మరియు దంత క్షయాల మధ్య బలమైన సంబంధం ఉన్నట్లుగా కనుగొంది.

6. బోలు ఎముకల వ్యాధి (ఆస్టియోపొరాసిస్) :

6. బోలు ఎముకల వ్యాధి (ఆస్టియోపొరాసిస్) :

బోలు ఎముకల వ్యాధి, కాళ్ళు మరియు చేతుల్లోని ఎముకలను ప్రభావితం చేస్తుంది. అదేవిధంగా గం వ్యాధి దవడ ఎముకను ప్రభావితం చేస్తుంది. దవడ ఎముక బలహీన పడిన సందర్భంలో, క్రమంగా దంతాల నష్టానికి గురయ్యే అవకాశాలు లేకపోలేదు. దంతాలకి మద్దతు ఇచ్చే దవడ ఎముక యొక్క భాగాన్ని అల్వియోలార్ ప్రాసెస్ అని పిలుస్తారు. మరియు www.bones.nih.gov లో పేర్కొన్న వివరాల ప్రకారం, దవడ ఎముక యొక్క నష్టం, మరియు దంతాల నష్టానికి మధ్య బలమైన సంబంధం ఉన్నట్లు కనుగొనబడింది. బోలు ఎముకల వ్యాధి ఉన్న మహిళలు ఈ వ్యాధి లేని వారి కన్నా మూడు రెట్లు అధికంగా దంతాల నష్టాలకు గురయ్యే అవకాశాలను కనుగొన్నారు.

Most Read: దసరా నవరాత్రులు: దుర్గా దేవి 9 అలంకరణ రూపాలు ...

7. గర్భం :

7. గర్భం :

పీరియోడోoటల్ ఇన్ఫెక్షన్లు పిండం-ప్లాసెంటల్ యూనిట్ ప్రాంతానికి ముప్పును కలిగిస్తాయి మరియు గర్భధారణకు ప్రతికూల ఫలితాలను కలిగిస్తాయి. ప్రత్యుత్పత్తి ఔషధ ఆధారిత ఇరానియన్ జర్నల్లో ప్రచురించిన 'మాతృసంబంధ పీరియోడోoటల్ వ్యాధి మరియు తక్కువ బరువుతో పుట్టిన నవజాత శిశువులకు మధ్య గల సంబంధాలు', అను కథనం ప్రకారం, దీర్ఘకాలిక వ్యాధులతో భాదపడుతున్న తల్లులు తక్కువ బరువుగల బిడ్డలకు జన్మనిస్తున్నారని చెప్పడం జరిగింది. ఈ వ్యాధి శరీరంలో శోథనిరోధకత(ఇన్ఫ్లమేటరీ మెకానిజం) తగ్గడానికి, క్రమంగా దీర్ఘకాలిక వాపు వంటి సమస్యలు పెరగడానికి కారణమవుతుంది, మరియు నెలలు నిండకుండా పిల్లలు పుట్టే అవకాశాలను పెంచుతుందని తేల్చింది.

 8. జీర్ణ సమస్యలు :

8. జీర్ణ సమస్యలు :

యాసిడ్ రిఫ్లక్స్ మరియు మలబద్ధకం మాత్రమే జీర్ణ సమస్యలకు కారణమని మీరు భావిస్తున్నట్లయితే, అది ఖచ్చితంగా తప్పు. గమ్ వ్యాధులు కూడా కడుపు సమస్యలను కలిగిస్తాయి. నోటిలోని చెడు బ్యాక్టీరియాల ఉనికి క్రమంగా చిగుళ్ళలో గం-వ్యాధికి దారితీస్తుంది. అటువంటి సందర్భంలో, మీరు ఆహారాన్ని నమలడం మరియు మింగడం కారణంగా, చెడు బ్యాక్టీరియా ఆహారంతోపాటు జీర్ణవ్యవస్థలోకి చేరుతుంది. క్రమంగా జీర్ణ వ్యవస్థలో అసమతుల్యతను కలిగిస్తుంది.

నోటి ఆరోగ్యంతో ముడిపడిన ఇతర పరిస్థితులుగా ఊపిరితిత్తుల సమస్యలు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, మరియు ఆస్టియోపెనియా వంటి సమస్యలు కూడా ఉన్నాయి.

Most Read: ఆ ఇంట్లోకి వెళ్తే మాత్రం నరకమే, ఇళ్లంతా రక్తసిక్తం, చిత్రవధలకు గురయ్యే మనుషులను చూస్తారు

English summary

How Dental Health Affects Your Overall Health

Taking poor care of your gums and teeth leads to poor hygiene which causes bacteria build-up. Periodontal disease and dental caries are the two most prevalent causes of oral health diseases. Periodontal disease also has an impact on heart disease, pregnancy, respiratory infections, etc.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more