బ్రెస్ట్ క్యాన్సర్ ను అరికట్టడానికి ఫిష్ ఎలా తోడ్పడుతుంది

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

తమ జీవితకాలంలో ప్రతి ఎనిమిది మంది మహిళల్లో ఒకరు బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ముప్పై మందిలో ఒక్కరు బ్రెస్ట్ క్యాన్సర్ తో చనిపోవడం జరుగుతోంది. యువతులతో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉందని ఇటీవలి సర్వేలు తెలుపుతున్నాయి. ఎందుకంటే, బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడే యావరేజ్ ఏజ్ కాస్తా 50 ఏళ్ళ నుంచి 30 ఏళ్లకు షిఫ్ట్ అవడం జరిగింది. ఈ ఆర్టికల్ లో, బ్రెస్ట్ క్యాన్సర్ ను అరికట్టేందుకు ఫిష్ ఏ విధంగా తోడ్పడుతుందో తెలుసుకుందాం.

2017లో పబ్లిష్ అయిన ఓ అధ్యయనం ఇండియాలోని బ్రెస్ట్ క్యాన్సర్ అవెర్నెస్ ను పరిశీలించింది. ఈ అధ్యయనం ప్రకారం, 2012లో బ్రెస్ట్ క్యాన్సర్ తో 70,000 మంది మహిళలు చనిపోయినట్లు తెలుస్తోంది. 2020 కల్లా ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది.

How Fish Can Prevent Breast Cancer

బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏంటి?

బ్రెస్ట్ లోని సెల్స్ నియంత్రణ లేకుండా పెరగుతున్నప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ సమస్య తలెత్తుతుంది. ఈ సెల్స్ అనేవి ట్యూమర్ గా ఫార్మ్ అవుతాయి. ఇది ఎక్స్ రే లో ఒక లంప్ గా కనిపిస్తుంది.

బ్రెస్ట్ లో లంప్స్, నిపుల్స్ లోంచి రక్తస్రావం, నిపుల్స్ లేదా బ్రెస్ట్ యొక్క షేప్ లేదా టెక్స్చర్ లో మార్పులు బ్రెస్ట్ క్యాన్సర్ కి చిహ్నాలు.

పిల్లల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదం

పిల్లల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదం

15 నుంచి 39 ఏళ్ళ వయసున్న స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్ సమస్య ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఈ ఏజ్ గ్రూప్ లో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది తీవ్రతరంగా ఉండటం వలన ఈ సమస్యను నయం చేయడం కూడా కష్టతరంగా మారుతుంది. బాలికల్లో ల్యూకేమియా, లింఫోమియా, సాఫ్ట్ టిష్యూ సార్కోమా మరియు రాబ్డోమియోసార్కోమా వంటి సమస్యలు ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడే ప్రమాదం మరింత పెరుగుతుంది.

బ్రెస్ట్ క్యాన్సర్ ని అరికట్టేందుకు ఫిష్ ఎలా తోడ్పడుతుంది?

బ్రెస్ట్ క్యాన్సర్ ని అరికట్టేందుకు ఫిష్ ఎలా తోడ్పడుతుంది?

ఇటీవలి ప్రయోగాత్మక అధ్యయనాల ప్రకారం, చిన్నప్పటినుంచి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ను తీసుకోవడం ద్వారా జీవితంలోని తదుపరి దశలలో బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడే ప్రమాదపు స్థాయిలు తగ్గుతాయి.

ప్లాంట్ మరియు సీ ఫుడ్ సోర్సెస్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సాధారణంగా లభిస్తాయి. ఈ ఫ్యాటీ యాసిడ్స్ తగినంత శరీరానికి అందకపోతే క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది.

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ద్వారా కలిగే బెనిఫిట్స్ కు సీ ఫుడ్ లో లభించే ఈకోసపెంటెనోయిక్ యాసిడ్ (ఈపీఏ) మరియు డొకోసహేక్సయినోయిక్ యాసిడ్ (డీహెచ్ఏ)లు కారణమవుతాయి. ఫ్లాక్స్ సీడ్స్ మరియు కెనోలా ఆయిల్ వంటి ప్లాంట్ బేస్డ్ సోర్సెస్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. దీనిని అల్ఫాలినొలెనిక్ యాసిడ్(ఏ ఎల్ ఏ) అంటారు. ఇవి తక్కువ సామర్థ్యం కలిగినవి.

సీ ఫుడ్ ద్వారా లభించే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మరింత సమర్థవంతంగా పనిచేసి బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడే ప్రమాదాన్ని తగ్గిస్తాయని ఇటీవలి అధ్యయనంలో శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. తద్వారా, ఈ వ్యాధి వచ్చే అవకాశాలున్నవారికి సీ ఫుడ్ ద్వారా లభించే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఒక వరంలా పనిచేస్తాయి.

బ్రెస్ట్ క్యాన్సర్ కై ఒమేగా-3 డొసేజ్

బ్రెస్ట్ క్యాన్సర్ కై ఒమేగా-3 డొసేజ్

ఈపీఏ మరియు డీహెచ్ఏలతో రోజుకి 1000 ఎంజీల ఒమేగా-3 అనేది రికమెండేడ్ డొసేజ్. ఇది క్యాన్సర్ తో పాటు అనేక వ్యాధుల నుంచి రక్షణ అందిస్తుంది.

ఈపీఏ మరియు డిహెచ్ఏ ను ఆహారం ద్వారా ఎక్కువగా తీసుకోవడం వలన ఆరోగ్యం మెరుగుపడి క్రానిక్ డిసీజ్ ల బారిన పడే ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 433 నుంచి 600 మిల్లీగ్రాముల ఈపీఏ మరియు డీహెచ్ఏను 1 నుంచి 8 ఏళ్ళలోపు పిల్లలు తీసుకోవాలని డిహెచ్ఏ/ఈపీఏ ఒమేగా 3 ఇన్స్టిట్యూట్ రిపోర్ట్స్ సూచిస్తున్నాయి.

ఆయిలీ ఫిష్ ను తీసుకోవడం వలన కలిగే హెల్త్ బెనిఫిట్స్:

ఆయిలీ ఫిష్ ను తీసుకోవడం వలన కలిగే హెల్త్ బెనిఫిట్స్:

సాల్మన్, మ్యాకేరల్, హలీబట్, సార్డీన్, ట్యూనా, ఈల్స్ మరియు హెర్రింగ్ వంటి కోల్డ్ వాటర్ ఫిష్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయని తెలుస్తోంది. వీటిని తీసుకోవడం వలన ఇంఫ్లేమేషన్ తగ్గడంతో పాటు గుండె జబ్బులు బారిన పడే ప్రమాదం కూడా తగ్గుతుంది. అలాగే క్యాన్సర్ తో పాటు అర్త్రైటిస్ బారిన పడే ప్రమాదపు స్థాయిలు కూడా తగ్గుతాయి. లీన్ ప్రోటీన్ అనేది ఆయిలీ ఫిష్ లో సమృద్ధిగా లభిస్తుంది.

ఫిష్ ను తీసుకోవడం వలన కలిగే ఇతర బెనిఫిట్స్:

ఫిష్ ను తీసుకోవడం వలన కలిగే ఇతర బెనిఫిట్స్:

ఆయిలీ ఫిష్ ను తరచూ తీసుకోవడం ద్వారా వివిధ కార్డియోవాస్క్యూలర్ వ్యాధుల నుంచి రక్షణను పొందవచ్చు. అమెరికన్ సైకలాజికల్ సొసైటీలో పబ్లిష్ అయిన ఒక అధ్యయనం ప్రకారం ఫ్యాటీ యాసిడ్స్ ను తీసుకోవడం ద్వారా మానసిక ఒత్తిడి వలన కలిగే గుండె జబ్బుల నుంచి కూడా రక్షణను పొందవచ్చు.

2. డిమెన్షియా:

2. డిమెన్షియా:

వారానికి ఒక సారి ఫిష్ ను తీసుకోవడం వలన డిమెన్షియా బారిన పడే ప్రమాదం తగ్గుతుంది. సాల్మన్, మ్యాకేరల్ లేదా సార్డీన్ వంటి ఆయిలీ ఫిష్ లను తీసుకుంటే అల్జీమర్స్ వంటి వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. ఫిష్ లో లభించే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి రోగ్ ప్రోటీన్స్ ను నశింపచేసే సామర్థ్యం కలిగినవి. తద్వారా, మీ ఆలోచనా శక్తి అలాగే జ్ఞాపకశక్తి దెబ్బతినవు.

3. ర్యుమటాయిడ్ ఆర్తరైటిస్:

3. ర్యుమటాయిడ్ ఆర్తరైటిస్:

రోజూ కనీసం 0.21 గ్రాముల ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ను తీసుకుంటే ర్యుమటాయిడ్ ఆర్తరైటిస్ బారిన పడే ప్రమాదం 52 శాతం తగ్గుతుందని ఒక అధ్యయనం స్పష్టం చేస్తోంది.

4. మౌత్ మరియు స్కిన్ క్యాన్సర్లు:

4. మౌత్ మరియు స్కిన్ క్యాన్సర్లు:

ఆయిలీ ఫిష్ ను తీసుకోవడం వలన ఓరల్ మరియు స్కిన్ క్యాన్సర్ల నుంచి రక్షణ పొందవచ్చు. క్యాన్సర్ ప్రారంభ మరియు చివరి దశలలో కూడా ఆయిలీ ఫిష్ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు తోడ్పడుతుందని అధ్యయనాలు తెలుపుతున్నాయి. నార్మల్ సెల్స్ గ్రోత్ పై ప్రభావం చూపకుండా కేవలం కాన్సర్ కారక ప్రాణాంతక సెల్స్ గ్రోత్ ని అడ్డుకోవడంలో ఫ్యాటీ యాసిడ్స్ ప్రముఖ పాత్ర పోషిస్తాయి.

5. పోస్ట్ పార్టం డిప్రెషన్ -

5. పోస్ట్ పార్టం డిప్రెషన్ -

ప్రెగ్నెన్సీ సమయంలో ఆయిలీ ఫిష్ ను తీసుకుంటే పోస్ట్ పార్టం డిప్రెషన్ ప్రమాదం తగ్గే అవకాశాలున్నాయని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. వారానికి రెండు లేదా మూడు సార్లు ఫిష్ ను తీసుకోవడం వలన ప్రయోజనం ఉంటుంది.

6. విటమిన్ డి సమృద్ధిగా లభిస్తుంది -

6. విటమిన్ డి సమృద్ధిగా లభిస్తుంది -

సాల్మన్ మరియు హెర్రింగ్ వంటి ఫ్యాటీ ఫిష్ లలో విటమిన్ డి సమృద్ధిగా లభిస్తుంది. 113 గ్రాముల కుక్డ్ సాల్మన్ లో 100 శాతం వరకు సిఫార్సు చేయబడిన విటమిన్ డి మోతాదు లభిస్తుంది.

చిన్నప్పటి నుంచి ఆహారంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ను భాగం చేయడం ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ కి గురయ్యే ప్రమాదం తగ్గుతుంది. అలాగే వివిధ క్రానిక్ డిసీజ్ ల నుంచి కూడా రక్షణ లభిస్తుంది.

English summary

How Fish Can Prevent Breast Cancer

Breast cancer can occur in females aged 15 to 39 years. In this age group, breast cancer is more aggressive and difficult to treat than in older women. The recent study conducted by scientists resulted in omega-3 fatty acids from seafood sources significantly helping reduce the breast cancer risk and improving prognosis in study subjects.
Story first published: Friday, May 11, 2018, 14:30 [IST]