For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  పురుషులలో వంద్యత్వ నివారణకు సహజ సిద్దమైన పద్దతులు ఇవే

  |

  అనేకమంది మానసిక క్రుంగుబాటుకి పరోక్ష కారణం వంద్యత్వ సమస్య. అనగా వీర్యనష్టం. అనేక సందర్భాలలో ఇది సంబంధాలను కూడా నాశనం చేస్తుంది. తద్వారా కొన్సెలింగ్ ను ఆశ్రయిస్తూ ఉంటారు.

  వంద్యత్వ సమస్యల గురించి చర్చించడానికి ఏ పురుషుడు కూడా సిద్దంగా ఉండరు. మరియు అది నిషిద్దమైన అంశంగా భావిస్తూ మాట్లాడుటకు కూడా అయిష్టతను ప్రదర్శిస్తుంటారు. తద్వారా అనేక మందికి పరిష్కారం కాని సమస్యగానే మిగిలిపోతూ ఉంది. కానీ ఇది ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది పురుషులను తెలియకుండా వేధించే సమస్యల్లో ఒకటిగా ఉంది. సుమారుగా 15 నుండి 20మిలియన్ల భారతీయ జంటలు ప్రతి సంవత్సరం ఈ వంద్యత్వ సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం ఇందులో 51.2 శాతం పురుషులే ఉండడం గమనార్హం.

  How To Boost Your Sperm Count Naturally?

  ఈ లెక్కలు అనేక ప్రశ్నలకు కారణమవుతూ ఉన్నాయి. ముఖ్యంగా భారతదేశం వంటి దేశాలలో వంద్యత్వం అనగానే స్త్రీల మీదకే తోసెయ్యడం అలవాటుగా మారింది. మరియు అనేకమంది పురుషులు, కనీసం పరీక్షలు చేయించుకోవడానికి సిద్దంగా ఉండకపోవడం విచారకరం. దీనికి సరైన అవగాహన లేకపోవడమే ప్రధానకారణంగా ఉంది.

  ఇప్పటికైనా కళ్ళు తెరిచి అవగాహన చర్యలు ప్రారంభించి, వంద్యత్వ నివారణా చర్యల దృష్ట్యా పురుషులు ఆలోచనలు చేస్తే, కనీసం కొంతలో కొంత అయినా ఈశాతం తగ్గుతుంది.

  పురుషులలో వీర్యకణాల వృద్దికై చర్చించుకునే ముందు, అసలు వీటికి గల కారణాల గురించిన అవగాహన తెచ్చుకోవడం ముఖ్యం.

  ముందుగా వీర్య కణాల నష్టం, వంద్యత్వం ఒకటి కాదని తెలుసుకోవాలి. కాకపోతే రెండింటికీ అవినాభావ సంబంధం ఉంటుంది. వంద్యత్వం అనగా పునరుత్పక్తి వ్యవస్థ నెమ్మదిగా తగ్గుముఖం పట్టడమే. మరియు వీర్య వృద్ది తగ్గుదలకు గురవడం, ఇలాంటి అంశాలలో ఒకటిగా ఉన్నది.

  ఇదే కాకుండా వంద్యత్వ సమస్యలకు కారకాలుగా అనేక అంశాలు ఉన్నాయి:

  1.లిబిడో: సంబంధంలో ఉన్నప్పుడు లిబిడో పెరుగుదల సరిగ్గా ఉండక ప్రతిబంధకంగా ఉంటుంది కొందరిలో.

  2.మానసిక, ఆరోగ్య సమస్యల దృష్ట్యా సంబంధాల పట్ల నిస్తేజం. తద్వారా సంబంధంలో అనాసక్తి.

  3.వీర్యచలనం: వీర్యకణాల చలనం సరిగ్గాలేని పక్షంలో కూడా వంద్యత్వ సమస్యలు వస్తుంటాయి. చలనం సరిగ్గా ఉంది అంటే, ఆరోగ్యంగా ఉన్నట్లే లెక్క.

  4.టెస్టోస్టీరాన్ హార్మోన్: ఈ హార్మోన్ లోపం ఉన్న ఎడల సహజంగానే వంద్యత్వానికి దారితీస్తుంది. ఈ హార్మోన్ సరిగ్గా ఉందో లేదో పరీక్షల ద్వారా తెలుసుకుని చికిత్సను ప్రారంభించవలసి ఉంటుంది.

  5. చివరిగా వీర్యకణాల తగ్గుదల: వీర్యం నాణ్యత సరిగ్గా ఉంది అంటే వీర్యకణాల వృద్ది స్థాయిలు అధికంగా ఉన్నట్లే. అవి తగ్గుదలకు గురైతే సమస్యలు తీవ్రంగా ఉంటాయి.

  మీకు వంద్యత్వ సమస్యల గురించిన కారకాలపై అవగాహన ఉంది. ఇప్పుడు సాధారణంగా కొందరు తరచుగా అడిగే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం.

  1.ఆరోగ్యకరమైన వీర్యకణాల సంఖ్య అన్నిటికన్నా ముఖ్యం. ముఖ్యంగా దంపతులిద్దరూ బిడ్డకు జన్మనివ్వాలని భావిస్తున్న తరుణంలో, ఖచ్చితంగా చేయించుకోవలసిన పరీక్ష వీర్యకణాల పరీక్ష. ఒకవేళ తక్కువగా ఉన్న ఎడల సరైన చికిత్స తీసుకోవలసి ఉంటుంది. ఆ క్రమంగానే గర్భధారణ అవకాశాలు ఉంటాయి.

  2.గర్భధారణకు ముఖ్యంగా ఒక అండం, ఒక శుక్రకణం ముఖ్యం. కానీ శుక్రకణం ఎక్కువగా అవసరం అవుతుంది. శుక్రకణాల సంఖ్య పెరిగే కొలదీ, గర్భధారణ అవకాశాలు అంత మెండుగా ఉంటాయి కాబట్టి. సెమిన్ పరీక్షలో వీర్యకణాల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు ఉంటే, అండాన్ని శుక్రకణం కలవడంలో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

  మామూలుగా సెమెన్ లో ప్రతి మిల్లీమీటర్ ద్రావణంలో 40-300 మిలియన్ల వీర్యకణాలు ఉంటాయి. కానీ కణాల సంఖ్య తగ్గుదల 10-20 మిలియన్లు ఉన్నా కూడా గర్భధారణ ప్రకారం సరిపోతుంది. కానీ, అవకాశాలు పెరగాలంటే ఆరోగ్యకరమైన నిష్పత్తి ఉండాల్సిందే అని నిపుణులు సూచిస్తుంటారు.

  ఇలా అనేకరకాల కారకాలు వంద్యత్వానికి కారణం అవుతున్నాయి. ముఖ్యంగా జన్యుపరమైన సమస్యలు, శారీరిక దృఢత్వం, అసహజ ఆహార ప్రణాళికలు, కలుషిత ఆహారపదార్ధాలు మొదలైనవి ఉండగా. ముఖ్యంగా అసహజ జీవనశైలి, ఆహారపు అలవాట్లే ఎక్కువ ప్రతిబంధకాలుగా ఉన్నాయని ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనేకపరిశోధనలలో తేల్చారు.

  సహజ సిద్దపద్దతులలో ఆహార ప్రణాళికలలో, జీవనశైలిలో మార్పులు చేయడం ద్వారా అనేక సత్ఫలితాలను పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఆక్రమంలో భాగంగా మీకోసం కొన్ని చిట్కాలు పొందుపరచబడినవి. ఇక్కడ ముఖ్యంగా 5సహజ సిద్ద పద్దతుల గురించిన వివరాలు ఇవ్వబడినవి. ఇవి ఖచ్చితంగా మీ వంద్యత్వ నిర్మూలన సమస్యను తగ్గుముఖం పట్టించడంలో సహాయం చేస్తాయి.

  1.ఒత్తిడిని తగ్గించుట, మంచి నిద్ర మరియు వ్యాయామం

  1.ఒత్తిడిని తగ్గించుట, మంచి నిద్ర మరియు వ్యాయామం

  ఒక్కోసారి సాధారణ ఒత్తిడులు కూడా శరీరంలో అనేక మార్పులకు కారణం అవుతుంటాయి. తద్వారా శరీరం నిస్తేజితం అవ్వడం, వంద్యత్వానికి గురవడం వంటి సమస్యలు కూడా చోటు చేసుకుంటాయి. కావున ఒత్తిడులులేని విధంగా జీవనశైలిలో మార్పులు చేయవలసి ఉంటుంది. క్రమంగా రోజూవారీ ప్రణాళికలలో భాగంగా వ్యాయామం చేయడం, కంటికి సరైన నిద్రని ఇవ్వడం ఎంతో మంచిది.

  2.మత్తుపదార్ధాలకు, ధూమపానానికి, డ్రగ్స్ కు దూరంగా ఉండండి

  2.మత్తుపదార్ధాలకు, ధూమపానానికి, డ్రగ్స్ కు దూరంగా ఉండండి

  అనేక నివేదికల సారాంశం ప్రకారం, మద్యపానం, ధూమపానం మరియు డ్రగ్స్ వినియోగవలన లాభాలు లేకపోగా అత్యధిక శాతం ఈ వంద్యత్వ సమస్యలకు గురవుతున్నారు. ఈ మత్తుపదార్ధాలు శరీరాన్ని నాశనం చేయడంతో పాటు, వీర్యకణాల ఆరోగ్యoపై కూడా ప్రభావాన్ని చూపగలవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

  3. విటమిన్-డి, మరియు కాల్షియం మీ శరీరానికి అందేలా చూసుకోండి:

  3. విటమిన్-డి, మరియు కాల్షియం మీ శరీరానికి అందేలా చూసుకోండి:

  వీర్యకణాల ఆరోగ్యం బాగుండాలి అంటే శరీరానికి అవసరమైన మోతాదులో విటమిన్-డి మరియు కాల్షియం నిల్వలు తప్పనిసరి. ఆహార ప్రణాళికలలో మార్పుల ద్వారా శరీరానికి అవసరమైన నిష్పత్తిలో పొందవచ్చు.

  4.క్రొవ్వు పదార్ధాలకు దూరంగా ఉండడం మంచిది

  4.క్రొవ్వు పదార్ధాలకు దూరంగా ఉండడం మంచిది

  క్రొవ్వు పదార్ధాలు ఎక్కువగా తీసుకోవడం వలన, జీవక్రియలు సరిగ్గా పని చేయని స్థాయిలోకి వెళ్లిపోతాయి. తద్వారా అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది . క్రొవ్వుపదార్ధాలు ఎక్కువగా తీసుకునే కొలదీ, నెమ్మదిగా వంద్యత్వ సమస్యలకు కూడా కారణ భూతమవుతుంటాయి. క్రొవ్వు రహిత పాల పదార్ధాలు, ఒమేగా-3, ఒమేగా-6 ఆరోగ్యకర కొవ్వుపదార్ధాలు తీసుకోవడం మూలంగా వీర్యకణాల వృద్దిరేటును సాధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

  5.సురక్షితమైన పరిసరాలు అన్నిటికన్నా ముఖ్యం

  5.సురక్షితమైన పరిసరాలు అన్నిటికన్నా ముఖ్యం

  నగరాలు కాలుష్యకోరలకు గురయ్యి తెలీకుండా అనేక సమస్యలను చాపకింద నీరులా విస్తరింపజేస్తున్నాయి. ఇలాంటి ప్రతికూల ప్రభావిత అంశాల వలన సహజంగానే వంద్యత్వ సమస్యలు దాపురిస్తున్నాయి. కావున కాలుష్యానికి దూరంగా ఉండేలా అమర్పులు చేసుకోవడం అన్నిటికన్నా ముఖ్యం.

  పైన చెప్పినవన్నీ ఉత్తమమైన మార్గాలే,

  పైన చెప్పినవన్నీ ఉత్తమమైన మార్గాలే,

  పైన చెప్పినవన్నీ ఉత్తమమైన మార్గాలే, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఆహారప్రణాళికలలో మార్పులు కూడా అన్నిటికన్నా ముఖ్యం. కావున మీకోసం మరికొన్ని.

  1.గుడ్లు: విటమిన్-ఇ, ప్రోటీన్ ఎక్కువగా ఉన్నందువలన వీర్యకణాల వృద్దికి దోహదపడుతుంది. మరియు శరీరంలో రోగ నిరోధక తత్వాలు పెరుగుతాయి.

  2.పాలకూర:

  2.పాలకూర:

  పాలకూరలో ఎక్కువగా ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది వీర్యకణాలకు స్నేహితులే.

  3.అరటి పండ్లు:

  3.అరటి పండ్లు:

  ఇందులో విటమిన్-ఏ, విటమిన్-బి1, విటమిన్-సి నిల్వలు ఎక్కువగా ఉంటాయి. ఇవి వీర్యకణాల వృద్దిలో సహాయం చేస్తాయి.

  4.డార్క్ చాకోలేట్:

  4.డార్క్ చాకోలేట్:

  ఈ డార్క్ చాకోలేట్ లో ఉండే అమినో యాసిడ్ వంద్యత్వ సమస్యలకు చెక్ పెట్టగలదు.

  5.బ్రొకోలి:

  5.బ్రొకోలి:

  ఇందులో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది పురుషుల్లో వీర్యవృద్దికి దోహదం చేస్తుంది.

  6.దానిమ్మ పండ్లు:

  6.దానిమ్మ పండ్లు:

  ఇందులో అధిక మోతాదులో ఉండే రోగ నిరోధక తత్వాలు, పోషకాలు శరీరానికి రోగ నిరోధక వ్యవస్థను పెంచడమే కాకుండా, వీర్యవృద్దికి సహాయపడుతాయి.

  7.వాల్నట్స్ :

  7.వాల్నట్స్ :

  ఇందులో ఒమేగా-3 నిల్వలు ఎక్కువగా ఉంటాయి, వృషణాలకు రక్తప్రసరణ సజావుగా సాగడంలో సహాయం చేయడమే కాకుండా, వీర్య వృద్దికి దోహదం చేస్తాయి.

  8.తెల్లగడ్డ:

  8.తెల్లగడ్డ:

  ఇందులో విటమిన్ - బి6 మరియు, సెలీనియం, ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యకర వీర్యవృద్దికి సహాయం చేస్తుంది.

  9.ఆయిస్టర్స్:

  9.ఆయిస్టర్స్:

  ఇందులో ఎక్కువగా జింక్ నిల్వలు ఉంటాయి, ఆరోగ్యకర వీర్యానికి , టెస్టో స్టీరాన్ హార్మోన్ వృద్దికి ఎంతగానో మేలు చేస్తాయి.

  10.అశ్వగంధ

  10.అశ్వగంధ

  వీర్య వృద్దికి సహాయం చేసే ఉత్తమమైన లక్షణాలు కలది. వైద్యుని సూచన మేరకు మోతాదును మించకుండా తీసుకొనవలసి ఉంటుంది.

  ఈ వంద్యత్వ సమస్య ప్రపంచ సమస్యగా పరిణమిస్తున్న ఈరోజుల్లో, మీరు కూడా వీరిలో ఒక భాదితునిగా మిగిలిపోకుండా, మీ ఆరోగ్య ప్రణాళికలపై దృష్టి సారించి ఉత్తమ ఫలితాలను పొందుతారని ఆశిస్తున్నాం. ఇక్కడ పొందుపరచిన ఆహార ప్రణాళిక మీకు ఎంతగానో ఉపయోగపడుంది.

  English summary

  How To Boost Your Sperm Count Naturally?

  Sperm count refers to the total number of sperms present in a sample and many men suffer from a low sperm count. The condition can be improved by following healthy lifestyle and diet. Exercising, lowering stress, including vitamin D and calcium, stopping the consumption of unhealthy fat, drugs, alcohol and smoke can help in increasing the sperm count.
  Story first published: Wednesday, April 18, 2018, 19:30 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more