రాత్రిపూట మంచినిద్రకోసం ఈ అయిదు సింపుల్ చిట్కాలను పాటిస్తే సరి

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

ఇన్సోమ్నియా అనేది ఇప్పుడు ప్రజల జీవితాలతో ఆడుకుంటోంది. స్మార్ట్ ఫోన్స్ కి చాలా మంది అడిక్ట్ అయ్యారన్న విషయం తెలిసిందే. ఈ డివైస్ కూడా ఇన్సోమ్నియా పెంపుకు సహకరిస్తుంది. ఒక్క నిమిషం కూడా ఫోన్ నుంచి దూరంగా ఉండలేకపోతున్నారు.

మీకు కూడా ఇన్సోమ్నియా నుంచి ఉపశమనం పొందాలని ఉంటే ఈ ఐదు చిట్కాలను పాటించి మంచి నిద్రను పొందండి. రాత్రిపూట మంచి నిద్రను పొందటం వలన ఆరోగ్యంగా ఉంటారు.

1. మెలకువగా ఉండేందుకు ప్రయత్నించండి:

1. మెలకువగా ఉండేందుకు ప్రయత్నించండి:

నిద్రపోవడానికి ప్రయత్నించినప్పుడు నిద్ర అస్సలు పట్టదు. ఈ విషయం మనలో చాలా మందికి అనుభవమే. అందువలన, నిద్రపోకుండా మెలకువగా ఉండేందుకు బెడ్ మీద నడుం వాల్చి కళ్ళు వెడల్పుగా చేసి ప్రయత్నించండి. మెలకువగా ఉండేందుకు ప్రయత్నిస్తే ఆటోమేటిక్ గా నిద్రలోకి జారుకుంటారు. కాసేపటికి మంచి నిద్ర మిమ్మల్ని వరిస్తుంది. హాయిగా నిద్రలో సేదతీరుతారు.

అయితే, ఈ ప్రాసెస్ ను ప్రయత్నిస్తున్నప్పుడు మీ గాడ్జెట్స్ ను దూరంగా ఉంచాలి. గదిని చీకటిగా ఉంచుకోవాలి.

2. స్పైస్డ్ మిల్క్ ను తీసుకోండి:

2. స్పైస్డ్ మిల్క్ ను తీసుకోండి:

డిన్నర్ ముగించిన మూడు గంటల తరువాత పాలను తీసుకుంటే మంచి నిద్ర కలుగుతుంది. టర్మరిక్, నట్ మెగ్, సినామన్ వంటి వాటిని మిల్క్ లో కలిపి తాగితే మరింత ఉత్తమ ఫలితం దక్కుతుంది. ఇవన్నీ ఇమ్మ్యూనిటీని అలాగే డైజెషన్ ను పెంపొందించడానికి ఉపయోగపడతాయి.

3. 4-7-8 టెక్నీక్

3. 4-7-8 టెక్నీక్

బెస్ట్ సెల్లింగ్ రచయిత డాక్టర్. ఆండ్రూ వీల్ కనిపెట్టిన ఈ 4-7-8-పద్దతిని పాటిస్తే మంచి నిద్ర కలుగుతుంది. ఈ సింపుల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది మీకు తగినంత నిద్రను కలిగిస్తుంది.

మీరు చేయవలసిందల్లా కళ్ళు మూసుకుని 4 సెకండ్ల పాటు ముక్కు ద్వారా శ్వాసను తీసుకోవాలి.

ఆ తరువాత 7 సెకండ్ల పాటు శ్వాసను హోల్డ్ చేయాలి. ఆ తరువాత నోటి ద్వారా 8 సెకండ్ల పాటు శ్వాసను వదలాలి.

ఈ సీక్వెన్స్ మొత్తాన్ని మూడు లేదా నాలుగు సార్లు రిపీట్ చేస్తే ప్రయోజనం ఉంటుంది.

4. మీ పాదాలను వెచ్చగా ఉంచుకోండి

4. మీ పాదాలను వెచ్చగా ఉంచుకోండి

వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటే ఒక జత సాక్సులతో మీ పాదాలను కవర్ చేయండి. ఇలా చేస్తే మీరు త్వరగా నిద్రలోకి జారుకుంటారు. గమనిక: ఈ ట్రిక్ సమ్మర్స్ లో పనిచేయదు. బాగా వేడిగా ఉన్నప్పుడు చెమట పడుతున్నప్పుడు ఈ చిట్కాను పాటిస్తే ప్రయోజనం ఉండదు.

 5. బబుల్స్ ని ఊదండి

5. బబుల్స్ ని ఊదండి

ప్రతి ఒక్కరికీ బబుల్స్ ని ఊదడం అంటే ఇష్టం. ఇది చాలా ఆసక్తికరమైన యాక్టివిటీ. అలాగే, మీకు తక్షణ ఉపశమనం అందించే యాక్టివిటీ ఇది. మీ మనస్సును ప్రశాంతపరుస్తుంది.

కాబట్టి, నెక్స్ట్ టైం మీకు నిద్రపట్టనప్పుడు, మీకు నిద్రపట్టేవరకు బబుల్స్ ని ఊదండి.

మీకిటువంటి చిట్కాలేమైనా తెలుసా?

English summary

How to Fall Asleep at Night – 5 Simple Tricks

Overuse of smartphones has led to an insomnia epidemic around the world. And the way to combat this is a little counterintuitive: lie down on your bed and try to force yourself to stay awake. This reduces the anxiety caused by sleeplessness and lulls you naturally into sleep.
Story first published: Friday, March 2, 2018, 18:30 [IST]