ఇవి తింటే కంటిచూపు మెరుగుపడుతుంది.. కళ్లద్దాలు వాడాల్సిన అవసరం లేదు

Written By:
Subscribe to Boldsky

ఇప్పుడు ప్రతి ముగ్గురిలో ఒకరు కచ్చితంగా కళ్లజోడు పెట్టుకుంటూ ఉంటారు. రోజురోజుకి కళ్ళజోడు పెట్టుకునే వారి సంఖ్య పెరిగిపోతుంది, సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల చాలా మందికి కంటి చూపు మందగిస్తుంది, చాలామంది చిన్నప్పటి నుండే ఎక్కువ సైట్ కలిగిన కళ్ళద్దాలని వాడుతున్నారు. కంటిచూపు మనదగించడం వల్ల వేరే కంటి సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది.

మన తాతల కాలంలో ఎలాంటి కళ్లజోడులు లేవు. వారు సరైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండేవారు. మనం మాత్రం ఏది పడితే అది తిని, విటమిన్లు లేని ఆహారాన్నే తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.

విటమిన్ల లోపం వల్లనే

విటమిన్ల లోపం వల్లనే

కంటిచూపు విటమిన్ల లోపం వల్లనే వస్తుంది. చాలా మంది లేజర్ ఆపరేషన్లు చేయించుకొని కంటిచూపుని సరి చేసుకుంటున్నారు, ఆ ఆపరేషన్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. కేవలం కొన్ని వారాలలో మీ కంటిచూపు సహజంగా మెరుగు పరిచే ఒక అద్భుతమైన పరిష్కారం ఈ క్రింద ఇవ్వబడింది. నమ్మకంతో ప్రయత్నించి విశేష లాభాలను పొందండి.

వయసు మీద పడుతున్నా చూపు మెరుగవుతుంది

వయసు మీద పడుతున్నా చూపు మెరుగవుతుంది

కంటి చూపును మెరుగుపరుచుకోవాలంటే.. ఉసిరికాయ, తానికాయ, కరక్కాయను సమానంగా తీసుకుని మెత్తగా దంచాలి. వీటి మెుత్తాలను కలిపి దీనికి సమానంగా పంచదార కలిపి రోజూ ఒక చెంచా పొడిని పాలలో కలిపి తీసుకుంటే వయసు మీద పడుతున్నా కూడా కంటిచూపు మెరుగవుతుంది. ఇంకా శరీరం కాంతివంతంగా తయారవుతుంది. ఇంకా ముడతలు తగ్గిపోతాయి. చర్మ సౌందర్యం మెరుగవుతుంది.

కుంకుమ పూల ద్వారా

కుంకుమ పూల ద్వారా

కుంకుమ పూల ద్వారా కంటి చూపును మెరుగుపరుచుకోవొచ్చు. ఇది ఒక సహజ నివారణ మార్గంగా చెప్పవచ్చు. సిల్వియా బిస్టీ అనే ప్రముఖ శాస్త్రవేత్త, కుంకుమ పువ్వు కంటిచూపు మెరుగుపరచగలదని, దీనిని క్రింది విధంగా వాడటం వల్ల తక్కువ సమయంలో దృష్టిని మెరుగుపరుచుకోవచ్చని ప్రకటించారు.

తయారీ ఇలా

తయారీ ఇలా

కావలసిన పదార్థాలు : ఒక కప్పు తాగునీరు, ఒక గ్రాము కుంకుమ పువ్వు. తయారీ చేసే విధానం : ఒక పాత్రలో కప్పు నీరు పోసి మరిగించండి. నీరు వేడైన తరువాత అందులో కుంకుమ పువ్వు వేయండి. కేవలం ఒక నిమిషం పాటు ఆ మిశ్రమాన్ని తక్కువ మంటలో మరిగించండి. తర్వాత స్టవ్ ఆపివేసి, ఆ మిశ్రమం పూర్తిగా చల్లబడే వరకు ఆగి, వడగట్టండి. చివరగా, మీకు కావలసినంత తీయదనం ఉండేలా ఆ మిశ్రమంలో తేనె కలపండి. ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు ఈ కుంకుమ టీ తాగండి. ఇలా చేసినట్లయితే కొన్నిరోజుల్లోనే మీ కంటిచూపు మెరుగుపడుతుంది

మునగ ఆకుల ద్వారా..

మునగ ఆకుల ద్వారా..

మునగ ఆకుల్లోనూ, కాడల్లోనూ, క్యాల్షియం, విటమిన్-ఎ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇది ఎముకలకు బలం కలిగిస్తుంది. నేత్రవ్యాధులు రాకుండా కాపాడుతుంది. దీని ఆకులను దంచి రసం తీసి ఒక చెంచా మోతాదులో సమానంగా తేనే, లేక చక్కెర కలిపి రోజూ సేవిస్తే కండరాలు, ఎముకలు దృఢంగా ఉంటాయి. కంటిచూపు అమోఘంగా ఉంటుంది. చర్మరోగాలు రాకుండా నివారితమవుతాయి. దీని ఆకుల్ని పప్పులో కలిపి ఉడికించి తింటారు. కాడల్ని సాంబారులో వేస్తారు.

విట‌మిన్-సి ఉన్న పండ్లు

విట‌మిన్-సి ఉన్న పండ్లు

అలాగే నిత్యం ఆహారంలో విట‌మిన్-సి ఉన్న పండ్లను భాగంగా చేసుకుంటే కంటిచూపు మెరుగుప‌డుతుంది. ద్రాక్ష‌, నారింజ, స్ట్రాబెర్రీ, బ్రొకోలి, గ్రీన్ పెప్ప‌ర్స్‌, బ్లూబెర్రీల‌ను తింటే చూపు స‌మ‌స్య‌లు త‌గ్గ‌డంతో పాటు క‌ళ్ల‌లో వాపులు, దుర‌ద‌, మంట‌లు నివారించ‌బ‌డ‌తాయి. ఈ పండ్లు కంటికి ఎంతో సంర‌క్షిస్తాయి.

పొన్నగంటికూర

పొన్నగంటికూర

మనం వీలయినంత తరచుగా పొన్నగంటికూర,మునగాకు ఆహారంలో భాగం చేసుకోవాలి. ఈ రెండురకాలఆకులతో పప్పు చేసుకోవచ్చు.పెసర,కంది పప్పులు కొంచెం ఉడికించి,ఉల్లిపాయ,పచ్చి మిర్చి వేసి వేపుడు చేసుకోవచ్చు. కారట్ ఏదోఒకరూపంలో అంటే రసం,హల్వా,కూర ఎలాగైనా ఎక్కువగా తినాలి.బాదంపాలు రోజు రాత్రిపూట తాగాలి.

కంటి వ్యాయామం

కంటి వ్యాయామం

దీనితోపాటు కంటి వ్యాయామం కూడా చెయ్యాలి. కనుబొమలు కొంచెం నొక్కాలి.కొంచెం గోరు వెచ్చటి నీళ్ళల్లో కర్చీఫ్ పిండి 5 ని.లు కళ్ళమీద పెట్టుకోవాలి. నువ్వులనూనె 2 చుక్కలు కళ్ళ చుట్టూ రాయాలి. కళ్ళు పైకి, కిందికి, పక్కకు, గుండ్రంగా తిప్పాలి. ఇవన్నీచేస్తుంటే తప్పకుండా కంటిచూపు మెరుగుపడుతుంది. వీటితోపాటు ఆరునెల్లకు ఒకసారయినా పిల్లలు,పెద్దవాళ్ళు కూడా కంటివైద్యునితో పరీక్ష చేయించుకోవటం తప్పనిసరి.

English summary

how to improve your eyesight naturally

how to improve your eyesight naturally
Story first published: Friday, May 11, 2018, 15:00 [IST]