ఈ 12 న్యాచురల్ మార్గాల ద్వారా చెడు కొలెస్ట్రాల్ ను ఎంత వేగంగా తగ్గించుకోవచ్చో తెలుసుకోండి..

Posted By: Mallikarjuna
Subscribe to Boldsky

చాలా మందిలో కొలెస్ట్రాల్ కామన్ ప్రాబ్లమ్ . 80శాతం మంది కొలెస్ట్రాల్ వల్ల గుండె సంబంధిత వ్యాధులతో బాధపడటం లేదా చనిపోవడం జరుగుతున్నది. అధిక కొలెస్ట్రాల్ వల్ల హార్ట్ సమ్యలు పెరుగుతాయి. ఇవి ప్రాణాంతకంగా మారుతాయి.

శరీరంలో ఉండే ఎల్ డిఎల్ కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ ఇది హార్ట్, కిడ్నీలు, ధమనులు బ్లాక్ అవ్వడం వంటి సమస్యలకు గురిచేసి, ప్రాణాంతకంగా మారుతుంది. శరీరంలో కొవ్వు ఎక్కువగా నిల్వచేరడం వల్ల అనేక సమస్యలు వస్తాయి.

కొలెస్ట్రాల్ నీటితో కరగదు, మరియు ఇది రక్తనాళాల్లోకి చేరడం వల్ల శరీర ఆరోగ్యం రిస్క్ లో పడుతుంది. శరీరానికి ఎంతో కొంత కొవ్వు అవసరం అవుతుంది. అందుకనీ రోజూ జంక్ మరియు ఫాస్ట్ పుడ్స్ తినాల్సిన అవసరం లేదు.

కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించుకోవడానికి కొన్ని ఆరోగ్యకరమైన మార్గాలున్నాయి.

How To Reduce Cholesterol Levels Quickly With These 12 Natural Ways

1. ఆరెంజ్ జ్యూస్ తాగాలి

రెండు గ్లాసుల ఆరెంజ్ జ్యూస్ ను రోజూ ఉదయం తాగడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గడానికి ఉత్తమమైన మార్గం. ఫ్రెష్ గా తయారుచేసిన ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల శరీరంలో ఆరోగ్యకరమైన రక్తనాళాలను కలిగి ఉంటుంది. షుగర్ మానేయాలి. షుగర్ కు ప్రత్యామ్నాయంగా తేనె ఉపయోగించవచ్చు.

2. మితాహారం తీసుకోవాలి

2. మితాహారం తీసుకోవాలి

రోజుకు 6 లేదా 7 సార్లు మితాహారం తీసుకునే వారిలో వేగంగా కొలెస్ట్రాల్ తగ్గినట్లు కనుగొన్నారు. మితాహారం తీసుకోవడం వల్ల కరోనరీ డిసీజెస్ 10 నుండి 20 శాతం తగ్గుతుంది.

3. ఒక గ్లాస్ రెడ్ వైన్ తాగాలి

3. ఒక గ్లాస్ రెడ్ వైన్ తాగాలి

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను వేగంగా తగ్గించుకోవాలంటే, ఒక గ్లాస్ రెడ్ వైన్ తాగాలి. పరిశోధన ప్రకారం రెడ్ వైన్ హెచ్ డిఎల్ కొలెస్ట్రాల్ వెవల్స్ ను పెంచుతుంది. రెడ్ వైన్ లో ఉండే సాపోనిన్స్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి పాజిటివ్ ఎఫెక్ట్ ను కలిగి ఉంటుంది.

4. త్రుణ ధాన్యాలు

4. త్రుణ ధాన్యాలు

వైట్ బ్రెడ్ కు బదులుగా బ్రౌన్ బ్రెడ్ ను తీసుకోవాలి. ఇది హెచ్ డి ఎల్ లెవల్స్ ను పెంచుతుంది. త్రుణ ధాన్యాలు ఎక్కువ డైరీ ఫ్రైబర్ ను కార్డీయో వ్యాధులను నివారిస్తుంది. బ్రౌన్ రైస్ మరియు హోల్ వీట్ పాస్తాలలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది.

5. సలాడ్ డ్రెస్సింగ్ కోసం ఆలివ్ ఆయిల్

5. సలాడ్ డ్రెస్సింగ్ కోసం ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్లో మోనో శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉంటుంది. ఇది మెటబాలిక్ సిండ్రోమ్ లేదా డయాబెటిస్ తో బాధపడే వారిలో ఎల్ డిఎల్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది.

6. దాల్చిన చెక్క

6. దాల్చిన చెక్క

టైప్ 2 డయాబెటిస్ త బాధపడే వారు , రోజుకు 6 గ్రాముల దాల్చిన చెక్కతో కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు. ఈ బహుప్రయోజనాలందించే మసాలా దినుసును కర్రీ, డిజర్ట్స్, రైస్ తయారీలో ఉపయోగించుకోవచ్చు. దాల్చిన చెక్క చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ ను త్వరగా తగ్గిస్తుంది. బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది.

7. ఓట్ మీల్

7. ఓట్ మీల్

ఓట్ మీల్ లో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందులో సోలబుల్ ఫైబర్, బీటా గ్లూకాన్ ఉండటం వల్ల ఎల్ డిఎల్ కొలెస్ట్రాల్ ను 12 నుండి 24 శాతం తగ్గిస్తుంది. రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో కొలెస్ట్రాల్ తింటుంటే త్వరగా బరువు తగ్గుతారు.

8. గ్రేప్ ఫ్రూట్

8. గ్రేప్ ఫ్రూట్

హైకొలెస్ట్రాల్ లెవల్స్ తో ఎవరైతే బాధపడుతుంటారు వారు గ్రేఫ్ ఫ్రూట్ తీసుకోవచ్చు. వీటిలో సోలబుల్ ఫైబర్ అధికంగా ఉంటుంది. అలాగే ఇందులో కొలెస్ట్రాల్ తగ్గించే పెక్టిన్ కాంపోనెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు కూడా బెర్రీస్, యాపిల్స్ తీసుకుంటే హై కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది.

9. షుగర్ కు బదులు తేనె తీసుకోవాలి

9. షుగర్ కు బదులు తేనె తీసుకోవాలి

సహజసిద్దమైన తేనెలో కొలెస్ట్రాల్ తగ్గించే కాంపోనెంట్స్ ఉండటం వల్ల ఇది హార్ట్ సమస్యలను , స్ట్రోక్ ను నివారిస్తుంది. తేనె తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది కొలెస్ట్రాల్ లెవల్స్ ను ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది. తేనెను స్మూతీస్, డిజర్ట్స్, పండ్ల రసాల్లో ఉపయోగించుకోవాలి.

10. ఓమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్

10. ఓమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్

ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో పాలీ అన్ శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉండటం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చేపలు, సాల్మన్, మకరేల్, హెయరింగ్స్, తున ఫిష్ లో అధికంగా ఉంటుంది. ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, చేపల సప్లిమెంట్ లో కూడా ఉంటుంది..

11. వ్యాయామం:

11. వ్యాయామం:

ఆరోగ్యంగా, ఉత్సాహాంగా ఉండాలంటే డైలీ ఎక్సర్ సైజ్ చాలా అవసరం. వ్యాయామం వల్ల మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. రోజూ ఉదయం అరగంట బ్రిస్క్ వాక్ చేయడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ ను అండర్ కంట్రోల్లో ఉంటాయి.

 12. స్మోకింగ్ వదిలేయాలి

12. స్మోకింగ్ వదిలేయాలి

బ్యాడ్ కొలెస్ట్రాల్ ను మరియు గుండె సంబంధిత వ్యాదులను నివారించుకోవాలంటే, స్మోకింగ్ వదిలేయాలి. స్మోకింగ్ మానేయడం వల్ల హెచ్ డిఎల్ కొలెస్ట్రాల్ లెవల్స్ మెరుగుపడతాయి, బ్లడ్ ప్రెజర్ లెవల్స్ తగ్గుతాయి. హార్ట్ అటాక్ రిక్స్ తగ్గుతుంది.

English summary

How To Reduce Cholesterol Levels Quickly With These 12 Natural Ways

How To Reduce Cholesterol Levels Quickly With These 12 Natural Ways,If your cholesterol is creeping upward, then there is a risk of developing heart disease and stroke. To reduce your cholesterol levels, you need to make some changes in your diet. Read to know how to reduce cholesterol levels quickly.