అరటిపండు తొక్కతో దోమకాటును ఇన్స్టెంట్ గా చికిత్సనందించడమెలా?

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

దోమల సమస్య మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తోందా? తరచూ దోమకాటుకు గురవుతున్నారా? మీ సమస్యను మేము అర్థం చేసుకోగలము. మస్కిటో బైట్స్ అనేవి విపరీతమైన ఇబ్బందులకు గురిచేస్తాయి. ప్రతి ఒక్కరూ ఎదో ఒక సమయంలో దోమకాటును ఎదుర్కోక తప్పడం లేదు. అందువలన, చికాకు కలిగించే దోమల నుంచి ఉపశమనం కోసం మార్గాలను అన్వేషించాల్సి వస్తుంది. కానీ, దోమలు కుట్టడం వలన ఏం జరుగుతుంది? చర్మంపై ఒక మచ్చను దోమకాటు మిగుల్చుతుంది. ఇది మరింత చికాకు కలిగించే విషయం. ముఖంపై దోమకాటు మచ్చ లేదా ర్యాష్ కనిపిస్తుంది.

దోమకాటు నుంచి ఉపశమనం కోసం ఎటువంటి పద్దతులను పాటించాలో మీకు తెలుసుకోవాలని ఉందా? మీ సమస్యకు పరిష్కారం దొరికినట్టే. అరటిపండు ఇందుకు పరిష్కారంగా పనిచేస్తుంది. వివరంగా చెప్పాలంటే అరటిపండు తొక్క మీ చర్మాన్ని సంరక్షిస్తుంది. వేరే ఏ పండు తొక్కలో కూడా అరటిపండు తొక్కలో లభించే చర్మసంరక్షణ గుణాలు లభించవని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అలాగే, దోమకాటు వలన ఏర్పడిన ఇంఫ్లేమేషన్ ను తగ్గించేందుకు కూడా అరటిపండు తొక్క తోడ్పడుతుంది.

How To Treat Mosquito Bites Instantly Using A Banana Peel?

దోమకాటును నివారించేందుకు చిట్కాలు

అరటిపండు తొక్కతో దోమకాటు నుంచి ఉపశమనం ఎలా పొందాలన్న విషయంపై మీకు ఆశ్చర్యం కలిగి ఉండవచ్చు. అయితే, మీరు ఈ పద్దతులను తెలుసుకుని తీరాలి.

మెథడ్ 1:

అరటిపండుతో పాటు ఒక నైఫ్ ను తీసుకోండి.

అరటిపండు తొక్కను తొలగించండి.

మళ్ళీ తొక్కను లోపలి నుంచి పీల్ చేయండి.

అరటితొక్కలోంచి పీల్ చేయబడిన పోర్షన్ ను ఒక పాత్రలోకి తీసుకోండి. ఇందులో కొన్ని చుక్కల గ్లిజరిన్ ను జోడించండి.

ఈ రెండిటినీ బాగా కలిపి స్మూత్ పేస్ట్ ను తయారుచేసుకోండి.

ఈ మిశ్రమాన్ని కొద్దిసేపటి వరకు అలాగే ఉంచండి.

ఆ తరువాత ముఖంపై అలాగే ప్రభావిత ప్రాంతంపై ఫేస్ ప్యాక్ లా అప్లై చేసుకోండి.

ఒక గంట పాటు అలాగే ఉండనివ్వండి.

గంట తరువాత, చల్లటి నీటితో రిన్స్ చేసుకోండి. రిన్స్ చేసేటప్పుడు ముఖాన్ని సర్క్యూలర్ మోషన్ లో మసాజ్ చేసుకోండి.

ఇప్పుడు ఒక టవల్ తో ముఖంపైన తడిని తుడుచుకోండి.

ఈ యాక్టివిటీను వారానికి రెండు సార్లు పాటిస్తే ఆశించిన ఫలితాలను పొందుతారు.

అలాగే, ఈ తాజా హోమ్ మేడ్ ప్యాక్ ను అప్లై చేసుకుంటున్నప్పుడు అరటిపండును తినడం ద్వారా హాంగర్ ప్యాంగ్స్ ను సంతృప్తి పరచవచ్చు.

ఇప్పుడు, ఈ మొత్తం ప్రొసీజర్ గురించి మీకు అవగాహన వచ్చింది కదా. ఈ ప్యాక్ ద్వారా మస్కిటో బైట్స్ నుంచి ఉపశమనం పొందే మార్గం మీకు అర్థమైంది. ఈ ప్యాక్ ద్వారా లభించే లాభాలను ఈ కింద వివరించాము.

ఈ అద్భుతమైన ప్యాక్ ద్వారా లభించే లాభాలు:

1. అరటిపండు తొక్కలో నాన్ ఇంఫ్లేమేటరీ ప్రాపర్టీస్ కలవు. ఇవి దోమకాటు వలన కలిగిన వాపును తగ్గించేందుకు తోడ్పడతాయి. కాలక్రమేణా దోమకాటు ఆనవాళ్లు కూడా కనబడవు.

2. దోమకాటు వలన కలిగే దురదను తగ్గిస్తుంది.

3. కూలింగ్ ఏజెంట్ లా పనిచేసి నొప్పిని తగ్గిస్తుంది.

4. ప్రభావిత ప్రాంతంపై గ్లిజరిన్ ను ఉపయోగించడం వలన చర్మం తేమగా మారి డార్క్ స్పాట్స్ సమస్య అరికట్టబడుతుంది.

ఇప్పుడు దోమకాటు నుంచి రక్షణ అందించే మరొక మెథడ్ ని తెలుసుకుందాం. ఇందులో అరటితొక్క, రోజ్ వాటర్ మరియు ఐస్ ను వాడుతున్నాము.

మెథడ్ 2:

ఒక పాత్రను తీసుకుని అందులో అరటితొక్కను ఉంచండి. అరటి తొక్కను ఎలా పీల్ చేయాలో తెలుసుకునేందుకు మెథడ్ 1 ను రిఫర్ చేయండి.

అరటితొక్క మిశ్రమంలో రోజ్ వాటర్ ను కలిపి స్మూత్ పేస్ట్ ను తయారుచేసుకోండి.

ఈ మిశ్రమాన్ని కొద్ది నిమిషాల పాటు అలాగే ఉండనివ్వండి. ఆ తరువాత ప్రభావిత ప్రాంతంపై అప్లై చేయండి.

ఒక క్లాత్ ని తీసుకుని అందులో క్రష్ చేసిన ఐస్ క్యూబ్స్ ను వేయండి. క్లాత్ ను పూర్తిగా కట్టివేయండి. అలా చేయడం ద్వారా ఐస్ క్యూబ్స్ క్లాత్ లోంచి బయటకి రావు.

ప్రభావిత ప్రాంతంపై అరటితొక్క పేస్ట్ ను అప్లై చేసినచోట ఈ క్లాత్ ను ఉంచండి.

ఇలా అరగంట పాటు ఈ క్లాత్ ను ప్రభావిత ప్రాంతంపై ఉండాలి.

ఆ తరువాత ప్రభావిత ప్రాంతాన్ని నీటితో రిన్స్ చేయండి. ఒక తువ్వాలుతో తడిని తుడుచుకోండి.

ఈ యాక్టివిటీను వారానికి రెండు సార్లు పాటించడం ద్వారా ఆశించిన ఫలితాలను పొందవచ్చు.

ఈ ప్యాక్ వలన కలిగే లాభాలు:

1. అరటితొక్కలో ఇంఫ్లేమేటరీ ప్రాపర్టీలు కలవు. ఇవి దోమకాటు వలన కలిగిన వాపు యొక్క సైజ్ ను తగ్గించేందుకు తోడ్పడి కాలక్రమేణా దోమకాటు వలన కలిగే వాపును పూర్తిగా తగ్గిస్తాయి.

2. ఐస్ అనేది దోమకాటు వలన కలిగే దురద మరియు నొప్పిని తగ్గించడానికి తోడ్పడుతుంది.

3. రోజ్ వాటర్ అనేది సూతింగ్ సెన్సేషన్ ను కలిగిస్తుంది. తద్వారా, చర్మాన్ని ఆరోగ్యంగా మార్చి సహజ కాంతిని వెలికితీస్తుంది.

ర్యాషెస్ ను అలాగే దోమకాటు వలన కలిగే రెడ్ నెస్ ను తగ్గించేందుకు ఇంకొక మెథడ్ ఉంది. ఆ మెథడ్ గురించి కూడా తెలుసుకుందామా? చదవండి మరి.

English summary

How To Treat Mosquito Bites Instantly Using A Banana Peel?

Do you suffer from frequent mosquito bites? Well, we can understand your pain. Mosquito bites could be really troublesome and everybody at some point looks for ways to get rid of these annoying mosquitoes. Using banana peel with ice, rosewater, and cucumber can help you get rid of the mosquito bite marks instantly.
Story first published: Saturday, May 5, 2018, 15:00 [IST]