For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ నోటి ఆరోగ్యానికి సూచించదగిన ఆయుర్వేద చిట్కాలు.

|

ఒక వ్యక్తి శ్రేయస్సు, మరియు మానసిక ఆరోగ్యం ఎల్లప్పుడూ, అతని ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది అనడంలో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు. మరియు మంచి ఆరోగ్యం, మానసిక స్థాయిలను ప్రభావితం చేయడమే కాకుండా, సానుకూల దృక్పధాన్ని కూడా అలవడేలా సహాయం చేస్తుంది.

వ్యక్తి యొక్క ఆరోగ్యం గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు, ప్రధానంగా నోటి నుండి మొదలుపెట్టాల్సిందే. దీనికి కారణం తీసుకునే ఆహారమే సగం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి. కావున నోటి ఆరోగ్యం గురించి తెలుసుకునే క్రమంలో మరియు అనారోగ్యాలకు గురైనప్పుడు తీసుకోవలసిన సహజసిద్దమైన నివారణా చర్యల గురించిన వివరాలు అందివ్వడంలో ఈ వ్యాసం మీకు దోహదం చేస్తుంది.

How To Use Ayurveda For Maintaining Oral Health?

విస్తృతంగా మాట్లాడే నోటికి, పరిశుభ్రత పరంగా మూడు ప్రాధమిక అంశాలను పరిగణన లోనికి తీసుకోవలసి ఉంటుంది. ఈ మూడు ప్రధాన భాగాలు, మీ చిగుళ్ళు, పళ్ళు మరియు నోరుగా ఉన్నాయి. ఈ మూడు అంశాల ప్రకారం మీరు తీసుకునే సంరక్షణా చర్యల ఫలితంగా, మీ నోటి పరిశుభ్రత మరియు ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. (దంత క్షయం, గమ్ వ్యాధి, చెడు శ్వాస మొదలైనసమస్యలు ప్రధానమైన ఆరోగ్య సమస్యలుగా ఉన్నాయి)

దంత క్షయం వంటి సమస్యలు తీవ్రమైన నొప్పులు కలుగజేస్తుంటాయి. ఇటువంటి సమస్యలకు దూరంగా, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నట్లయితే, మీరు అనుసరించవలసిన ప్రాధమిక మరియు ముఖ్యసూత్రం ఏమిటంటే నోటి పరిశుభ్రతను పాటించడం.

దీని కోసం, కృత్రిమ రసాయనాల మీద ఆదారపడవలసిన అవసరం లేదు. మార్కెట్లో అనేక కృత్రిమ సాధనాలు అందుబాటులో ఉన్నాయి, వీటిలో అన్నీ క్షేమదాయకం అని చెప్పడానికి లేదు. ఒక్కోసారి, వీటిలోని కృత్రిమ రసాయనాలు కొన్ని దుష్ప్రభావాలకు కూడా కారణమవుతుంటాయి. కావున ఎటువంటి సమస్యలు లేని ఆయుర్వేద శాస్త్రాన్ని వినియోగించుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చని చెప్పబడింది. ఈ వ్యాసంలో నోటి ఆరోగ్యం దృష్ట్యా వినియోగించవలసిన, సహజసిద్ద మూలికలు, పదార్ధాలు మరియు వాటి ప్రయోజనాలను పొందుపరచడం జరిగినది..

ఆయుర్వేదం సహకారంతో నోటి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చు ?

ఆయుర్వేదం సహకారంతో నోటి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చు ?

మీ నోటి ఆరోగ్యానికి సూచించదగిన ఆయుర్వేద చిట్కాలు :

1. మూలికా టూత్పేస్ట్ ఉపయోగించండి

తీయని మరియు తెల్లటి టూత్పేస్ట్ ఉపయోగించడం మూలంగా, కాల్షియం నిక్షేపాల పెరుగుదల జరుగుతుంది (లాలాజలాన్ని గట్టిపరచడం మూలాన). తత్ఫలితంగా టార్టర్ నిర్మాణం కూడా పెరుగుతుంది. కృత్రిమ టూత్ పేస్టులలో, అదనపు బేకింగ్ సోడా నిక్షేపాలు ఉంటాయి. ఇవి చిగుళ్ళను దెబ్బతీయడం, లేదా గం డిసీజ్ సమస్యకు దారితీయడం జరుగుతుంది. కావున, మీ నోటి పరిశుభ్రత దృష్ట్యా, ఇటువంటి తెల్లటి టూత్పేస్టుల జోలికి తరచూ వెళ్ళకుండా, లవంగాలు, సోపు, నిమ్మ వంటి పదార్ధాల నిక్షేపాలు కల్గిన మూలికా టూత్పేస్టుల వినియోగం ద్వారా అదనపు ప్రయోజనాలను పొందవచ్చునని చెప్పబడినది.

2. లికోరైస్ వేరుని నమలడం :

2. లికోరైస్ వేరుని నమలడం :

లికోరైస్ వేరు, ఈ భూమి మీద ఉన్న సహజసిద్ధ సుగంధ ద్రవ్యాలలో ఉత్తమమైన లక్షణాలను కలిగి ఉన్నది. ఇది జీర్ణశయాంతర ప్రేవులలోని స్రావాలను క్రమబద్దీకరించడం లేదా పెంచడం మూలముగా లాలాజలం ఉత్పత్తిని పెంచడంలో కూడా సహాయం చేస్తుంది. ఫలితంగా నోరు శుద్ధి చేయబడడమే కాకుండా, దంతక్షయానికి కారణమయ్యే క్రిములను కూడా తొలగించి వేస్తుంది. మీకు ఇదివరకే దంతక్షయ సమస్యలు ఉన్న ఎడల, ఈ వేరుని నమలడం మూలముగా ప్రభావవంతమైన సానుకూల ఫలితాలను పొందవచ్చు.

3. నువ్వుల నూనె వాడకం :

3. నువ్వుల నూనె వాడకం :

ఆయుర్వేదంలో ప్రధానంగా ఉపయోగించే నూనెల్లో, నువ్వుల నూనె ఉత్తమంగా చెప్పబడుతున్నది. నువ్వుల నూనెను ఒక నిమిషం పాటు నోటిలో ఉంచుకొని, ఆయిల్ పుల్లింగ్ చేయడం ద్వారా మంచి ప్రయోజనాలను పొందగలరని సూచించబడినది. ఈ నువ్వుల నూనె మీ చిగుళ్ళను పునర్నిర్మించడంలో సహాయం చేయడం మూలముగా మీ దంతాలను పటిష్టంగా ఉంచగలవు. ఈ నువ్వుల నూనె వాడకం క్రమం తప్పకుండా అనుసరిస్తున్న యెడల, భవిష్యత్తులో దంత సమస్యలు రాకుండా అడ్డుకోగలదని చెప్పబడింది. నువ్వుల నూనెతో చేసే ఆయిల్ పుల్లింగ్ గమ్ డిసీజ్ రాకుండా కూడా అడ్డుకోగలదు. మరియు జ్ఞాన దంతాలతో కూడిన సమస్యలను అడ్డుకోవడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

నోటి పరిశుభ్రతను నిర్వహించడానికి కావలసిన పదార్ధాలను గురించిన వివరములు వరుస క్రమములో :

నోటి పరిశుభ్రతను నిర్వహించడానికి కావలసిన పదార్ధాలను గురించిన వివరములు వరుస క్రమములో :

లికోరైస్ వేరు, నువ్వుల నూనె, మరియు యాలకులు వంటివి నోటి పరిశుభ్రతను కాపాడడంలో కీలకపాత్రను పోషించగలిగే సహజసిద్ధమైన పదార్ధాలుగా ఉన్నవి. ప్రయోజనకరమైన కలబంద మొక్క యొక్క గుజ్జును కూడా ఉపయోగించవచ్చు‌. మీకు మూలికా టూత్ పేస్ట్ మరియు కర్పూరం వాడకం గురించిన అవగాహన ఉన్న ఎడల, మరింతగా సహాయం చేసే అంశాలుగా చెప్పబడినవి.

గరిష్ట ప్రయోజనాలను పొందే క్రమంలో భాగంగా, ‌సహజసిద్ధ పదార్ధాలను ఉపయోగించడంలో తీసుకోవలసిన మెళకువలు :

గరిష్ట ప్రయోజనాలను పొందే క్రమంలో భాగంగా, ‌సహజసిద్ధ పదార్ధాలను ఉపయోగించడంలో తీసుకోవలసిన మెళకువలు :

మీరు, గత కొన్ని సంవత్సరములగా నోటి ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్న వ్యక్తి అయితే, మీ సమస్యల పరిష్కారానికి సూచించబడిన చిట్కాల గురించిన వివరాలు ఇక్కడ పొందుపరచబడ్డాయి. ఇవి మీ నోటి పరిశుభ్రతను పెంచడంలో మరియు ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో వీలైనంత సహాయాన్ని చేయగలవు.

1.నోటి పూత లేదా నోటి మీద పుండ్లు కలిగి ఉండడం :

త్రిఫల చూర్ణం వినియోగం :

ప్రతిరోజు రాత్రి పడకకు ఉపక్రమించే ముందు, అర టీస్పూన్ త్రిఫల చూర్ణాన్ని, ఒక కప్పు వేడి నీటిలో కలిపి తీసుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందగలరు. అంతేకాకుండా ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన వెంటనే కలబంద గుజ్జును తీసుకుని నోటి పూత లేదా నోటిపై పుండ్లు కలిగిన ప్రాంతంలో పూతలా అప్లై చేయడం మూలముగా ప్రయోజనాలను పొందగలరని చెప్పబడినది. ఉత్తమ ఫలితాల కోసం మూడు నుండి ఐదు రోజులపాటు క్రమం తప్పకుండా ఈ పద్ధతిని అనుసరించడం మంచిది. త్రిపల మరియు కలబంద గుజ్జు యొక్క కలయిక మూలముగా అతి తక్కువ కాలంలోనే పుండ్లు తగ్గుముఖం పడతాయి.

2.కావిటీస్ లేదా పళ్ళు పుచ్చడం :

2.కావిటీస్ లేదా పళ్ళు పుచ్చడం :

కావిటీలు లేదా పళ్ళు పుచ్చడం వంటి సమస్యలకు ఆయుర్వేదములో యాలకులని అద్భుతమైన మూలకముగా చెప్పబడినది. యాలకులు సుగంధద్రవ్యంగా మాత్రమే కాకుండా ఉద్దీపన స్వభావాన్ని కలిగి నోటి పరిశుభ్రతను పెంపొందించడంలో ఉత్తమ ప్రభావాలను చూపగలదు. అంతేకాకుండా ప్రతిరోజు కనీసం రెండు యాలకులను ఓట్మీల్ ద్వారా తీసుకోవడం మూలముగా అదనపు ప్రయోజనాలను పొందవచ్చు.

English summary

How To Use Ayurveda For Maintaining Oral Health?

Oral hygiene is of great importance & ingredients like liquorice root, sesame oil & cardamom can be used to take care of issues like cold sores, cavities, & toothache. Using herbal toothpaste made up of clove, fennel, babool and neem and even gargling your mouth with a few tablespoons of warm sesame oil can help in maintaining healthy teeth and gums.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more