For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ ఆహార ప్రణాళికలో భాగంగా వాల్నట్స్ తీసుకోవడం ద్వారా పొందే ప్రయోజనాలు ఇవే!

మీ ఆహార ప్రణాళికలో భాగంగా వాల్నట్స్ తీసుకోవడం ద్వారా పొందే ప్రయోజనాలు ఇవే!

|

మన బాల్యంలో ఎక్కువ భాగం, రోజుకో ఆపిల్ డాక్టర్ను దూరంగా ఉంచుతుందని విన్నాం. అవునా? కానీ ఇప్పుడు ఆ లైన్ కాస్త మారుతూ ఉంది. ఆపిల్ కన్నా ఎక్కువ ప్రయోజనాలను పొందే ఆహారాలు మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. అయినా కూడా దేని విలువ దానిదే కదా. ఈ వాల్నట్లను అక్రోట్లు అని కూడా పిలుస్తారు.

కొన్ని కొత్త అధ్యయనాల ప్రకారం, మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించే సామర్థ్యాన్ని వాల్నట్స్ కలిగి ఉన్నాయని తేలింది. ఒక వ్యక్తి, తన ఆహార ప్రణాళికలో భాగంగా వాల్నట్, పెకెన్స్, బాదం, మొదలైన వాటిని కనీసం 20 గ్రాముల చొప్పున తీసుకుoటున్న ఎడల, అనేక వ్యాధులను నివారించవచ్చునని తేలింది కూడా.

 Including A Handful Of Walnuts In Your Diet Has These Benefits

వాల్నట్ వలన కలిగే ప్రయోజనాలు:
వాల్నట్స్ మార్కెట్లో విరివిగా లభించే తృణధాన్యాలు. ఇవి హాజెల్ నట్స్, పైన్ నట్స్, బ్రెజిల్ నట్స్, పెకన్లు, పిస్తాచియో మరియు మకాడమియా నట్స్ వంటి కుటుంబానికి చెందినవి. మరియు ఈ నట్స్ అన్నింటిలో ఏది గొప్పది అంటే చెప్పడం కష్టమే, దేని ప్రత్యేకత దానిదే. ప్రతి ఒక్కటి అపారమైన పోషక ప్రయోజనాల సమ్మేళనాలతో కూడుకుని ఉంటాయి. మీ దైనందిక ఆహారపు ప్రణాళికలో భాగంగా ఒక పావు-కప్ వాల్నట్ కూడా ఉంటే, అది మొక్క-ఆధారిత ఒమేగా-3 ఆరోగ్యకర కొవ్వులు, మాలిబ్డినం, రాగి, బయోటిన్ మరియు మాంగనీస్ వంటి ఖనిజాలను శరీరానికి అందించడానికి సహాయపడుతుంది. ఇప్పుడు వాల్నట్స్ యొక్క ప్రయోజనాలు కొన్ని చూద్దాం.

1.క్యాన్సర్ తో పోరాడే గుణాలు :

1.క్యాన్సర్ తో పోరాడే గుణాలు :

క్యాన్సర్ మానవుల ఉనికినే ప్రశ్నార్ధకం చేస్తున్న అత్యంత భయంకరమైన వ్యాధుల్లో ఒకటి. మీరు మీ రోజువారీ ఆహారంలో కొన్ని అక్రోట్లను కలిగి ఉంటే, రొమ్ము మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. అనేక అధ్యయనాల ప్రకారం, వాల్నట్లను వినియోగించడం ద్వారా, ప్రోస్టేట్ క్యాన్సర్ పెరిగే అవకాశాలను సుమారు 40 శాతం వరకూ తగ్గించవచ్చని తేలింది

2. గుండె ఆరోగ్యం:

2. గుండె ఆరోగ్యం:

వాల్నట్ మీ హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అమైనో ఆమ్లం అయిన ఎల్-ఆర్గినైన్ ఉనికిని కలిగి ఉండడం ద్వారా హృదయ సంబంధ సమస్యలతో బాధపడుతున్న లేదా కార్డియాక్ అరెస్ట్ కలిగి ప్రమాదపుటంచులలో ఉన్న వ్యక్తుల ప్రాణాలు నిలబెట్టడంలో గొప్ప ప్రయోజనాలు అందిస్తుంది. కానీ హెర్ప్పెస్ వంటి సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు వాల్నట్లను తీసుకోవడం తగ్గించవలసి ఉంటుంది, ఎందుకంటే ఇది ఆర్గినైన్ స్థాయిని ప్రేరేపించగలదు, ఇది అమైనో ఆమ్ల లైసిన్ ను తగ్గిస్తుంది.

3.అరుదైన మరియు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు:

3.అరుదైన మరియు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు:

యాంటీఆక్సిడెంట్స్ మన శరీరానికి చాలా ముఖ్యమైనవి, ఎందుకంటే శరీరంలో ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి తద్వారా, అనేక రకాల బాక్టీరియా నుండి మనల్ని కాపాడడంలోనూ మరియు మన వయసును నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫ్రీ రాడికల్స్ వయసు ప్రభావం వలన కలిగే అనేక సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది, ముఖ్యంగా చర్మo ముడతలు పడకుండా కాపాడగలదు కూడా. వాల్నట్లో టానిన్, టెల్లిమాగ్రాండిన్, క్వినోన్ జుగ్లోన్, మరియు ఫ్లేవనాల్ మోరిన్ వంటి అరుదైన యాంటీ ఆక్సిడెంట్ల మేలు కలయికగా ఉంటుంది.

4.ఊబకాయం నియంత్రించుటలో:

4.ఊబకాయం నియంత్రించుటలో:

మనలో చాలామంది తృణధాన్యాలు బరువు పెరుగుటకు దారి తీయవచ్చు అనే భావనను కలిగి ఉంటారు. ఈ నమ్మకానికి విరుద్ధంగా, మీ బరువును క్రమబద్దీకరించడానికి వాల్నట్ సహాయం చేస్తుంది. ఆహారప్రణాళికలలో భాగంగా వాల్నట్స్ తీసుకున్న వారు మిగిలిన వారితో పోల్చినప్పుడు, దాదాపు 1.4 అదనపు పౌండ్లు కోల్పోయారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దీని అర్థం మీ శరీరంలోని అర-ఇంచ్ పైన బెల్లీఫాట్ కోల్పోతుంది. అంతేకాకుండా, దీనిలో ఉండే ప్రోటీన్ నిక్షేపాలు, ఆకలికాకుండా చూడడంలో సహాయం చేస్తాయి.

5.పురుషులలో మెరుగైన పునరుత్పత్తి :

5.పురుషులలో మెరుగైన పునరుత్పత్తి :

వాల్నట్లు అందించే ఇతర పోషక ప్రయోజనాల్లో, తక్కువగా తెలిసిన వాస్తవం పురుషుల పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం. ఇది పురుషుల సంతానోత్పత్తి పెంచుతుంది. రోజువారీ ఆహార ప్రణాళికలో భాగంగా వాల్నట్ తీసుకోవడం ద్వారా స్పెర్మ్ నాణ్యత పెరుగుతుందని అనేక అధ్యయనాలు వెల్లడించాయి కూడా.

6. మెదడు ఆరోగ్యం :

6. మెదడు ఆరోగ్యం :

వాల్నట్స్లో మెలటోనిన్, విటమిన్ E, ఒమేగా -3 కొవ్వులు, ఫోలేట్ మరియు అనామ్లజనకాలు కలిగి ఉన్న న్యూరోప్రొటెక్టెక్ కాంపౌండ్స్ ఉనికిలో ఉన్నందున పిల్లలకు కూడా లాభదాయకంగా సూచించబడినది. పెద్దలలో వయసు రీత్యా వచ్చే చిత్త చాపల్యం, బుద్ది మాంద్యం వంటి సమస్యలను తగ్గించడంలో వాల్నట్స్ సహాయం చేస్తాయి.

7. డయాబెటిస్ :

7. డయాబెటిస్ :

డయాబెటిస్ అనేది జనాభాలో మెజారిటీని ప్రభావితం చేసే తీవ్రమైన వ్యాధి. మధుమేహానికి గురైన ప్రజలు తీసుకునే ఆహారం పట్ల అత్యంత జాగరూతులై ఉండాలన్నది జగమెరిగిన సత్యం. ఏమాత్రం వారి ఆహార ప్రణాళికలలో అసాధారణ మార్పులు చోటుచేసుకున్నా శరీరంలో చక్కర నిల్వల మీద ప్రభావం పడి, ఒక్కోసారి ప్రాణాoతకం కూడా కావొచ్చు. ఈ డయాబెటిక్ వ్యాధి గ్రస్తులు ప్రత్యేకమైన ఆహార పరిమితులను కలిగిఉంటారు. అటువంటి వ్యక్తులకు, సాధారణ ఆహార ప్రణాళికలో భాగంగా వాల్నట్స్ ఒక పావు కప్పు తీసుకోవడం ద్వారా అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అది మొక్క ఆధారిత ఒమేగా - 3 కొవ్వులు, మాలిబ్డినం, రాగి, బోయోటిన్ మరియు మాంగనీస్లను అందిస్తుంది.

టైప్-2 మధుమేహం ఉన్న ప్రజల జీవక్రియలను సరళ తరం చేయడంలో వాల్నట్లో ఉన్న ఒమేగా -3 కొవ్వు పదార్ధాలు సహాయపడుతాయి. డయాబెటీస్ మరియు ఊబకాయంతో ఉన్న పెద్దలు రోజువారీ ఆహారంలో ఒక కప్పు వాల్నట్లను తీసుకోవడం ద్వారా చక్కెర స్థాయిలలో గణనీయమైన తగ్గింపు చూపించారని పరిశోధనలో తేలింది.

అటువంటి పోషకమైన లాభాలతో సమృద్ధంగా ఉన్న వాల్నట్లను మీ రోజువారీ ఆహారంలోకి చేర్చడం అత్యవసరం. ఉదయం, మధ్యాహ్నం మరియు రాత్రి సమయాలలో కన్నా సాయంత్రం వేళల్లో వాల్నట్ తీసుకోవడం ఉత్తమంగా చెప్పబడింది. దీని ప్రయోజనాలు పుష్కలంగా పొందాలి అనుకుంటే సాయంత్రం సమయమే మంచిది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే, మీ ప్రియమైన వారితో పంచుకోండి.

English summary

Including A Handful Of Walnuts In Your Diet Has These Benefits

Some new studies have brought to light that consuming nuts can help combat various chronic diseases like cancer, heart ailments and diabetes. Did you know walnuts are a great source of copper, plant-based omega3 fats, molybdenum, manganese and biotin? Eating around 20 g of it regularly can aid in improving male fertility, heart & brain health, etc.
Story first published:Tuesday, May 22, 2018, 15:58 [IST]
Desktop Bottom Promotion