For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ తెలివితేటలను పెంచుకునే 10 సింపుల్ పద్ధతులు

|

ఈ మధ్యకాలం వరకు, ఐక్యూ టెస్ట్ ను మాత్రమే ఒక వ్యక్తి తెలివికి ప్రామాణికంగా తీసుకునేవారు. ఇక అది మారిపోయింది.

ప్రస్తుత పరిశోధనల ప్రకారం మనుషుల తెలివి మెదడుకి సంబంధించి 3 విషయాలపై ఆధారపడివుంటుంది – మీ విశ్లేషణా శక్తి, తక్కువ సమయం ఉండే జ్ఞాపకశక్తి బలం, ఇంకా మీ భాషా నైపుణ్యాలు.

ఈ విషయాలన్నీ మీ మెదడులో మూడు వేర్వేరు విషయాలు,పనితీరు కలిగి ఉండటం వలన, చాలామంది ఒకదాంట్లో ప్రతిభ కనబర్చి ఇతరవాటిలో వెనకబడతారు.

10 Simple Ways To Increase Your Intelligence

అందుకే మీరు తెలివితేటల పట్టికలో ఎక్కడ ఉన్నారన్నది సంబంధం లేకుండా ఇక్కడ మీ తెలివిని సులభంగా పెంచుకునే 10 విధానాలు ఇవ్వడం జరిగింది.

1.నేర్చుకోండి, నేర్చుకోండి, నేర్చుకుంటూనే ఉండండి

1.నేర్చుకోండి, నేర్చుకోండి, నేర్చుకుంటూనే ఉండండి

మనుషుల మెదడుకి సాగే గుణం ఉంటుంది. దానికి సమాచారం ఇస్తూ ఉంటే, మరింత పదునుగా, చురుకుగా తయారవుతుంది. దాని నైపుణ్యాలకి సానబెట్టడం మానేసారో, తుప్పుపట్టిపోతుంది. అందుకని మీ తెలివితేటలని పెంచుకోవాలనుకుంటే,రోజూ కొత్త విషయాలు నేర్చుకునే అలవాటును పెంచుకోండి, అది కేవలం ఒక ఆర్టికల్ చదవడమో లేదా మీకు నచ్చిన రంగంలో చిన్న పాడ్ కాస్ట్ ఎపిసోడ్ ను వినటమో ఏదైనా కావచ్చు.

2.చదవండి

2.చదవండి

ఇది డల్ గా, బోర్ కొట్టే విషయంగా అన్పించవచ్చు, ముఖ్యంగా మీరు అంతగా పుస్తకాలు చదవని వారైతే మరీనూ. కానీ అధ్యయనాల ప్రకారం చదవడం అనేది మెదడుకి చాలా మంచిది. అది మీ ఊహాశక్తి, సృజనాత్మకతను పెంచటమే కాదు, మీ భాషను మెరుగుపరుస్తుంది, మీకు ఇతరుల పట్ల సానుభూతిని పెంచేట్లు చేస్తుంది, మీ రోజువారీ జీవితంలో ఆలోచనలను ఒక క్రమంలో ఉంచుకునేట్లు చేస్తుంది.

3. మీ భావాత్మక తెలివిని మెరుగుపరుస్తుంది

3. మీ భావాత్మక తెలివిని మెరుగుపరుస్తుంది

అనేక పరిశోధనలు కొంచెం కూడా సందేహం లేకుండా నిరూపించినది ఏంటంటే భావాత్మక తెలివితేటలున్నవారే తార్కికంగా ఆలోచించే వారికన్నా మంచి నాయకులు అవుతారని. ఎందుకలా? ఎందుకంటే వారిలో తమను అనుసరించేవారిలో అభిమానాన్ని సృష్టించగలిగి, వారికి ప్రేరణనివ్వగలరు. అందుకని ఈ సమయంలో మీ ఈక్యూ అంతబాగా లేకుంటే, డేనియల్ గోలెమాన్ ప్రసిద్ధ పుస్తకం ఎమోషనల్ ఇంటెలిజన్స్; వై ఇట్ కెన్ మాటర్ మోర్ దాన్ ఐక్యూ చదవడం మొదలుపెట్టండి. మీరు చాలా నేర్చుకుంటారు.

4.మీరు రోజూ చేసే పనులను వేరుగా చేయండి

4.మీరు రోజూ చేసే పనులను వేరుగా చేయండి

ఇది మీ మెదడును చురుకుగా మార్చే మరో సులభమైన పద్ధతి. కేవలం మీరు రోజూ చేసే పనులను వేరేలాగా మార్చి చేయండి.

ఉదాహరణకి మీరు మీ కుడిచేత్తో పళ్ళను తోముకుంటే, కొన్నిరోజుల వరకు ఎడమచేత్తో తోముకోండి. ఇలా చేయటం వలన మీ మెదడు ఎంతో అలవాటున్న రొటీన్ లో కొత్తదనానికి సర్దుకోటానికి కొత్త మార్గాలు సృష్టిస్తుంది.

5.అన్ని సమయాల్లో గూగుల్ పై ఆధారపడకండి

5.అన్ని సమయాల్లో గూగుల్ పై ఆధారపడకండి

గూగుల్, ఇతర సాంకేతిక పరిజ్ఞానం కూడా మన జీవితాల్ని చాలా చాలా సులువుగా మార్చేసాయి, దాంతోపాటు మనం మెదడుని అస్సలు వాడకుండా తయారుచేసాయి.

అందుకని వచ్చేసారి మీరు కొత్త నగరంలో ఎక్కడైనా దారి తెలీక తప్పిపోతే, జిపిఎస్ ఆన్ చేయకుండా స్థానికులను చిరునామా గురించి అడగండి. ఈ చిన్న పని మీ మెదడును బలపరుస్తుంది.

గమనికః మేము మిమ్మల్ని టెక్నాలజీని వాడుకోవద్దని చెప్పటంలేదు. ఈ పద్దతి ఉద్దేశం మీరు మీ మెదడును పదును పర్చుకోటానికి అప్పుడప్పుడు కావాలని కష్టమైన దారి ఎంచుకోమని సూచించటం. ఇది బరువులు ఎత్తడంలాంటిది అన్నమాట. అలా చేసే అవసరం మనకేం ఉండదు, కానీ మనం తప్పక చేస్తాం.

6.మీకు మీరే వివరించుకోండి

6.మీకు మీరే వివరించుకోండి

వచ్చేసారి మీకేదైనా కొత్త విషయం తెలిస్తే, కొద్ది సేపు ఒంటరిగా ఉండి, ఆ విషయాన్ని మీకు మీరే పైకి మాట్లాడుతూ వివరించుకోండి. మీరు దీన్ని అద్దం ముందు కూడా చేయవచ్చు, మీరే టీచర్ అనుకుని అద్దంలో రూపం మీ విద్యార్థి అనుకోండి.

ఇలా చేయటం వలన ఉపయోగం ఏంటంటే, మీ మెదడు విన్న విషయాలు ఎక్కువ గుర్తుపెట్టుకుంటుంది.

7. విషయాలను 140అక్షరాలలోకి కుదించండి

7. విషయాలను 140అక్షరాలలోకి కుదించండి

మీరు ట్విట్టర్ అభిమాని అయితే, ఈ సూచన మీకు నచ్చుతుంది. పెద్ద పెద్ద విషయాలను, సంగతులను 140 అక్షరాలలోకి కుదించండి. దీనివలన మీ ఆలోచనలు మరింత స్పష్టంగా, తక్కువ పదాలతో ఎక్కువ అర్థం వచ్చేందుకు కష్టపడతాయి, ఇంకా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మెరుగవుతాయి.

మీరు ట్విట్టర్ వాడకపోతే, ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ డైరీలో మీ ఆలోచనలు రాయండి (140 అక్షరాలలో మాత్రమే)!

8.మెదడుకి పదును పెట్టే ఆటలు ఆడండి

8.మెదడుకి పదును పెట్టే ఆటలు ఆడండి

21వ శతాబ్దంలో జీవిస్తున్నందుకు అన్నిటికన్నా పెద్దలాభం మన జీవితాలను మెరుగుపర్చే అనేక యాప్ లు మన చుట్టూ ఉండటం. యాప్ లలో వచ్చే మెదడు ఆటలు కూడా ఈ కోవకి చెందినవే.

ఎలివేట్ (గూగుల్ ప్లేస్టోర్ లో ఎడిటర్స్ ఛాయిస్ లో ఎంపికైన యాప్) నుంచి ల్యూమోసిటీ వరకు మీరు అనేక రకాల మెదడుకి చెందిన ఆటలను డౌన్లోడ్ చేసుకుని,ఆడి మీ తెలివికి సంబంధించి వివిధ విషయాలను సానబెట్టుకోవచ్చు

9.మీరెప్పుడూ తెలివైనవారి మధ్యలోనే ఉండేట్లు చూసుకోండి

9.మీరెప్పుడూ తెలివైనవారి మధ్యలోనే ఉండేట్లు చూసుకోండి

మీ చుట్టూ ఉండే ఐదుగురి సగటు మీరవుతారు. అందుకని మీరు మరింత తెలివైనవారు కావాలనుకుంటే, మీ చుట్టూ మీకన్నా తెలివైనవారు ఉండేలా చూసుకోండి. వారు మీకు ఇంకేవిధంగా తెలిసే అవకాశం లేని కొత్త ఆలోచనలు, టెక్నిక్కులు తెలిసేలా చేస్తారు.

ఇంకా, మీ గ్రూపులో మీరే తెలివైనవారైతే, మీ తెలివితక్కువ స్నేహితులలాగానే మీరూ మారటానికి ఎక్కువ సమయమేమీ పట్టదు.

10.హాయిగా ఉంటూ, ఆరోగ్యంగా తినండి

10.హాయిగా ఉంటూ, ఆరోగ్యంగా తినండి

‘మీరు తినేదే మీరవుతారు' ఈ సామెత మీ శరీరంలో ప్రతి అవయవానికి వర్తిస్తుంది, మెదడుకి కూడా.

అందుకని మీరు సరిగ్గా తినకపోతే, ప్రిజర్వేటివ్స్ ఉన్న కృత్రిమ ఆహారపదార్థాలు తింటే మీ మెదడు మెల్లగా పాడవుతూ, సమయంతోపాటు మతిమరుపు అయిన డెమెన్షియాకి దారితీస్తుంది. ఆరోగ్యకరం కాని జీవనశైలికి కూడా అంటే పొగతాగటం వంటి వాటికి కూడా ఇది వర్తిస్తుంది.

అందుకని ఆరోగ్యంగా జీవిస్తూ, మంచి ఆహారం తినండి, అవి నేరుగా మీ మెదడుపై ప్రభావం చూపి, మీ తెలివితేటలను కూడా మెరుగుపరుస్తాయి.

English summary

10 Simple Ways To Increase Your Intelligence

You can increase your overall intelligence by exposing yourself to new information and learning new skills, playing brain games, surrounding yourself with people who are smarter than you, and learning to summarize big concepts in 140 characters!
Desktop Bottom Promotion