For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పార్శ్వపు తలనొప్పి గురించి తెలుసుకోవలసిన ఆసక్తికర నిజాలు.

|

మైగ్రేన్ లేదా పార్శ్వపు తలనొప్పి పూర్తిగా నరాలకు సంబంధించిన సమస్య. తీవ్రమైన తలనొప్పులకు ప్రధానలక్షణంగా ఈ మైగ్రేన్ ఉంటుంది. ఈ పార్శ్వపు తలనొప్పి బాల్యంలోనే అధికంగా ప్రారంభమవుతుంది లేదా బాల్యం నుండి కలగకపోయినా, యుక్తవయసు ప్రారంభం నుండి కలిగే అవకాశాలు ఉన్నాయి. పురుషుల కన్నా మహిళలలోనే ఎక్కువగా ఈ పార్శ్వపు తలనొప్పులు వస్తుంటాయి. ఈ మైగ్రేన్ గురించిన పూర్తి వివరాలు ఈవ్యాసంలో తెలుసుకుందాం.

పార్శ్వపు తలనొప్పి సాధారణంగానే కాదు, జన్యుపరంగా కూడా సంక్రమిస్తుంది. మీ కుటుంబాలలో కానీ, లేదా పూర్వీకులు ఎవరైనా ఈ పార్శ్వపునొప్పిని అనుభవించి ఉంటే, మీకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ మైగ్రేన్ మిగిలిన అన్ని రకాల తలనొప్పుల కంటే భిన్నంగా ఉంటుంది.

Interesting Facts About Migraines You Should Know

సాధారణ తలనొప్పికి పార్శ్వపు తలనొప్పికి తేడా:
ఈ పార్శ్వపు తలనొప్పికి, ఒత్తిడి కారకంగా కలిగే తలనొప్పులకు సమాన పోలికలు ఉంటాయి. కానీ ఒక్కోసారి ఈ నొప్పి తీవ్రంగా పరిణమిస్తుంది. మైగ్రేన్ కలిగినప్పుడు, తలలో ఒకరకమైన బీట్స్ లేదా అదురుగా ఉండడం జరుగుతుంది. తద్వారా మెట్లు ఎక్కుతున్నప్పుడు, ఏదైనా పని చేస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు ఈ లక్షణం పెరుగుతూ తీవ్రంగా కనిపిస్తుంది.

మరోపక్క ఒత్తిడి కారణంగా కలిగే తలనొప్పికి కూడా అనేక అంశాలు ఉంటాయి. రక్తపోటు, వ్యాధులు, మానసిక సమస్యలు, ఒత్తిడి మొదలైన అంశాల కారణంగా కలుగుతుంటుంది. ఒక్కోసారి పెద్ద సమస్య కాకపోయినా, ఒక్కోసారి వైద్యునివద్దకు వెళ్ళాల్సిన పరిస్థితులు నెలకొంటాయి.

మైగ్రేన్, మిగిలిన అన్ని తలనొప్పులకన్నా కాస్త భిన్నంగా ఉంటుంది. దీనికారణంగా వికారం, వాంతులు, కాంతిని చూడలేని సున్నితత్వం, చిన్న పనులకే తట్టుకోలేని తలనొప్పి మొదలైన సమస్యలు మొదలవుతాయి.

వైద్యుల అభిప్రాయం ప్రకారo ఈ పార్శ్వపు తలనొప్పి, మెదడుకు రక్తప్రసరణలో జరిగే అసాధారణ మార్పుల వలన సంభవించవచ్చు.

పార్శ్వపు తలనొప్పికి సంకేతాలేమిటి ?

ఈ పార్శ్వపు తలనొప్పి కలగడానికి ఒకటి రెండు రోజుల నుండే సంకేతాలు ప్రారంభమవుతాయి. దీనిని ఆంగ్లములో ప్రోడ్రోం స్టేజ్ అని వ్యవహరిస్తారు. అనగా వ్యాధికి ముందు స్థితి అని అర్ధం వచ్చేలా. ఈ స్థితిలో ఎక్కువగా ఆహారం మీదకు మనసు వెళ్ళడం, డిప్రెషన్, మానసిక ఆందోళన, తీవ్రమైన అలసట, నిస్సత్తువ లేదా అతి చురుకుతనం, తరచుగా అలసటకు గురవడం, వికారం, మెడ దగ్గర అసౌకర్యం మొదలైనవి దీని ప్రధాన లక్షణాలుగా ఉంటాయి.

ఈ పరిస్థితి అనంతరం, ఒక్కోసారి చూపుకు సంబంధించిన సమస్యలు, మాట్లాడడంలో తడబాటు, అలజడి వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశo ఉంది. తద్వారా సరిగ్గా మాట్లాడలేకపోవడం, ముఖంలో, కాళ్ళలో లేదా చేతులలో అదరడం, కాంతిని చూడలేని తత్వం, మానసిక అలజడి, తాత్కాలికంగా చూపు మందగించడం వంటి సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి.

ఈ పార్శ్వపు తలనొప్పి వలన, కండరాల నొప్పులు, సూదులతో గుచ్చిన లేదా శరీర భాగాలలో ముఖ్యంగా మెదడు భాగంలో భారమైన అనుభూతి, శారీరిక బలహీనత వంటి సమస్యలు సహజoగా తోడవుతాయి. ఈ పార్శ్వపు నొప్పి ముఖ్యంగా నుదురు పైభాగాన మరియు నుదురు చుట్టుపక్కల ప్రాంతాలను ప్రభావితం చేస్తుంది. సాధారణంగా తలలో ఒకపక్కగా ఈ నొప్పి ఉంటుంది, కానీ తలకు ఇరుపక్కలా కూడా మైగ్రేన్ వచ్చే అవకాశాలు లేకపోలేదు.

ఎక్కువశాతం ఈ మైగ్రేన్ 4 గంటల వరకు ఉంటుంది, సరైన చికిత్స తీసుకోని ఎడల వారంలో 72గంటల వరకు గరిష్టంగా ఉండే అవకాశాలు ఉన్నాయి.

పార్శ్వపు తలనొప్పి గురించి చెప్పబోయే ఆసక్తికరమైన నిజాలు, చికిత్సలో మీకు సహాయపడగలవు.

1.వ్యాయామం పార్శ్వపు నొప్పిని తగ్గించడంలో సహాయం చేస్తుంది.

1.వ్యాయామం పార్శ్వపు నొప్పిని తగ్గించడంలో సహాయం చేస్తుంది.

నడక, రన్నింగ్ వంటి రోజూవారీ సాధారణ వ్యాయామాలు, ద్యానం, వామప్ మొదలైనవి పార్శ్వపు తలనొప్పిని తగ్గించడoలో సహాయం చేస్తాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం, స్వీట్స్ ఒత్తిడిని తగ్గించి, హార్మోనుల సమతుల్యానికి దోహదపడి నెమ్మదిగా పార్శ్వపు తలనొప్పిని తగ్గించేలా సహాయపడగలవని వైద్యులు చెప్తున్నారు.

2.మహిళలలో బహిష్టు ప్రక్రియలకు కూడా ఈ పార్శ్వపు తలనొప్పి అనుసంధానమై ఉంటుంది.

2.మహిళలలో బహిష్టు ప్రక్రియలకు కూడా ఈ పార్శ్వపు తలనొప్పి అనుసంధానమై ఉంటుంది.

ఎక్కువమంది మహిళలు వారి మొదటి బహిష్టు ప్రక్రియలో కాని, గర్భిణీగా ఉన్నప్పుడు కానీ ఈ పార్శ్వపు తలనొప్పి సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. బహిష్టు సమయంలో హార్మోనుల హెచ్చుతగ్గులు ఈ పార్శ్వపు తలనొప్పికి ప్రధాన కారకాలుగా ఉన్నాయి.

3.పార్శ్వపు తలనొప్పికి సంబంధించిన ఔషధాలను ఎక్కువగా వాడడం కూడా మంచిది కాదు.

3.పార్శ్వపు తలనొప్పికి సంబంధించిన ఔషధాలను ఎక్కువగా వాడడం కూడా మంచిది కాదు.

అనేకమంది తలనొప్పి అంటే చాలు తలనొప్పి మాత్రలవైపు మొగ్గు చూపుతుంటారు. కనీసం డాక్టర్ పర్యవేక్షణ కూడా లేకుండా. వారంలో 3సార్లు కనీసం ఈ మాత్రలను తీసుకునే వారికి పార్శ్వపు తలనొప్పి అధికంగా వచ్చే ప్రమాదాలు లేకపోలేదు. ఇవి కాలేయంపై కూడా ప్రభావాన్ని చూపగలవు. ప్రతి సమస్యకు మాత్రలవైపు మొగ్గు చూపడం సరైనది కూడా కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు కూడా. ఈ మాత్రల వలన కలిగే తలనొప్పి గరిష్టంగా వారంరోజులు ఉండే అవకాశాలు ఉన్నాయి.

4.డిప్రెషన్ ఔషదాలు కూడా పార్శ్వపు తలనొప్పిని తగ్గించగలవు.

4.డిప్రెషన్ ఔషదాలు కూడా పార్శ్వపు తలనొప్పిని తగ్గించగలవు.

డిప్రెషన్ సంబంధించిన మందులలో ఉండే క్రియాశీల పదార్ధాలు, పార్శ్వపు తలనొప్పికి కారణమయ్యే రసాయనిక లక్షణాల ప్రభావాలను తగ్గించడంలో కీలకప్రాత్ర పోషిస్తుంది.

5.పార్శ్వపు తలనొప్పి, ఎటువంటి ఇతర తలనొప్పులు లేకుండానే రాగలదు.

5.పార్శ్వపు తలనొప్పి, ఎటువంటి ఇతర తలనొప్పులు లేకుండానే రాగలదు.

ఎటువంటి బీటింగ్ మెదడులో లేకపోయినా మైగ్రేన్ కలిగే అవకాశo ఉంది. వాంతులు, వికారాలు, అజీర్ణ సమస్యలు మొదలైన అంశాలు మాత్రం ఖచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తాయి. కొందరు నిపుణుల ప్రకారం జ్వరం, మగత, ఇతర నొప్పులు కూడా తలనొప్పి లేని మైగ్రేన్ కు కారణమవుతుంటాయి.

6.కొన్ని ఆహారాలు కూడా ఈ పార్శ్వపు తలనొప్పులకు ప్రధాన కారణాలుగా ఉంటాయి.

6.కొన్ని ఆహారాలు కూడా ఈ పార్శ్వపు తలనొప్పులకు ప్రధాన కారణాలుగా ఉంటాయి.

ముఖ్యంగా హాట్ డాగ్స్ వంటి ఆహారాల్లో ఉండే నైట్రేట్స్, నాన్వెజ్ సాండ్విచ్, బేకన్, సలామే సాసజేస్, చీజ్ అధికంగా కలిగిన టైరమిన్ ఆహారపదార్ధాలు, స్మోక్డ్ ఫిష్, సోయా పదార్ధాలు వంటివి ఈ మైగ్రేన్ కు ప్రధాన కారకాలుగా ఉన్నాయి. ముఖ్యంగా మోనోసోడియం గ్లూటమేట్ కలిగిన సూప్స్, బ్రోత్స్, ఫాస్ట్ ఫుడ్స్ వంటివి కూడా ఈ మైగ్రేన్ కు ప్రధాన కారకాలుగా ఉన్నాయి.

English summary

Interesting Facts About Migraines You Should Know

Migraine is a neurological condition that can cause multiple symptoms which are characterized by intense, strong headaches. Migraine can begin at childhood or may not occur until early adulthood. Women are more prone to migraine headaches than men. There are many interesting facts about migraines that will tell you all about migraines in this article.
Desktop Bottom Promotion