For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కేరళ వరదలు : వరద నీటి వలన కలిగే వ్యాధుల నివారణా మార్గాలు

కేరళ వరదలు : వరద నీటి వలన కలిగే వ్యాధుల నివారణా మార్గాలు

|

కేరళ, 100 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా అత్యంత తీవ్రమైన వరదలను ఎదుర్కొంటూ ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నది. మృతుల సంఖ్య 350 పైమాటే. క్రమంగా వరదలతో దెబ్బతిన్న రాష్ట్రంలోని ప్రజలు చికెన్గున్యా, డెంగ్యూ వంటి వెక్టర్ బోర్న్ డిసీజుల బారిన పడే ప్రమాదాలు లేకపోలేదు. ఈ క్రమంలో ప్రజా ఆరోగ్య నిపుణులు, టైఫాయిడ్, కలరా, హెపటైటిస్ మరియు లెప్టోపిరోసిస్ వ్యాధుల వ్యాప్తి గురించి హెచ్చరిస్తున్నారు.

కేరళ రాష్ట్రంలోని డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్(డీహెచ్ఎస్) ప్రకారం, ఇప్పటికే రాష్ట్రంలో 225కేసుల్లో లెప్టోస్పిరోసిస్, 846డెంగ్యూ జ్వరాలు, 518మలేరియా కేసులు, 34కేసుల చికెన్గున్యా, 191నుండి 945కేసుల్లో తీవ్రమైన అతిసారవ్యాధి(ఏ.డి.డి) ఉన్నట్లుగా నిర్ధారణకు వచ్చారు.

Kerala Floods: Prevention Of Water-borne Diseases

వరదలు సంభవించిన ప్రాంతంలోని కాలుష్యపూరిత నీటివలన సంభవించే వ్యాధుల గురించిన వివరాలు మీకోసం.

1.లెప్టోస్పిరోసిస్:

1.లెప్టోస్పిరోసిస్:

లెప్టోస్పిరా బాక్టీరియా సంక్రమణ వలన ఏర్పడే వ్యాధి, లెప్టోస్పిరోసిస్. ఈ బాక్టీరియా జంతువుల నుండి మానవులకు మూత్రంద్వారా సంక్రమిస్తుంది. వరదల సమయంలో మట్టి/నీటిలోని బాక్టీరియా వలన వ్యాపిస్తుంది. ఈ లెప్సోస్పిరా మానవశరీరంలోని కళ్ళు, గాయాలు లేదా శ్లేష్మస్థరాల పొరలద్వారా ప్రవేశించవచ్చు.

లెప్టోస్పిరోసిస్ లక్షణాలు:

లెప్టోస్పిరోసిస్ లక్షణాలు:

సంకేతాలు మరియు లక్షణాలు సాధారణంగా వ్యాధి సంక్రమణ తర్వాత 5-14 రోజుల తర్వాత కనిపిస్తాయి. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సి.డి.సి) ప్రకారం, ఒక వ్యక్తి వ్యాధికి గురికావడం మరియు వ్యాధి లక్షణాలకు మద్య సమయం 2రోజుల నుండి 4వారాలవరకు ఉండవచ్చు.

లక్షణాలు:

• రాష్

• విరేచనాలు

• ఎరుపు కళ్ళు

• తీవ్రజ్వరం

• తలనొప్పి

• పొత్తికడుపు నొప్పి

• కామెర్లు

• వాంతులు

• చలి

కండరాల నొప్పులు:

వ్యాధి మరింత తీవ్రమైన సందర్భంలో, మూత్రపిండ వైఫల్యం, కాలేయ వైఫల్యం లేదా మెనింజైటిస్ సమస్యకు దారితీస్తుంది. ఈవ్యాధి కొన్నిరోజుల నుండి 3వారాలు లేదా అంతకన్నా ఎక్కువకాలం కూడా ఉండే అవకాశం ఉంది.

లెప్టోస్పిరోసిస్ చికిత్స:

లెప్టోస్పిరోసిస్ చికిత్స:

డీప్సిసైక్లిన్ మరియు పెన్సిలిన్ వంటి యాంటీబయాటిక్స్ వాడకంతో లెప్టోస్పరోసిస్ చికిత్స చేయవచ్చు. తీవ్రమైన లక్షణాల విషయంలో, యాంటీబయాటిక్స్ నేరుగా సిరల ద్వారా ఎక్కించవలసి ఉంటుంది.

లెప్టోస్పిరోసిస్ నివారించడానికి చిట్కాలు:

జంతువులకు స్నానాదికార్యాలు నిర్వహించిన తరువాత, లేదా వాటితో సమయం వెచ్చించిన తర్వాత, సబ్బు మరియు నీటితో చేతులు కడుక్కోవడం ముఖ్యం.

పెస్ట్ కంట్రోల్:

పెస్ట్ కంట్రోల్:

• చనిపోయిన జంతువులను కేవలం చేతులతో తాకడం రోగాలకు దారితీస్తుంది.

• అన్ని బహిరంగ శరీరగాయాలను శుభ్రంచేయడం మరియు వాటిని వాటర్-ప్రూఫ్-డ్రెస్సింగ్ క్లాత్ ఉపయోగించి కప్పండి.

• వరదలు పడిన తరువాత, ఆ నీటిలో ఈత కొట్టడం, ఆడడం వంటివి చేయకండి.

• వరదనీటితో సంబంధం ఉన్న ఏ పదార్ధాన్ని కూడా తినడం మానుకోండి.

• మీ కుక్కలు లెప్టోస్పిరోసిస్ బాక్టీరియాకు వ్యతిరేకంగా వ్యాక్సిన్ చేయబడ్డాయని నిర్ధారించుకోండి.

2. హెపటైటిస్-ఎ

2. హెపటైటిస్-ఎ

వరదలకు సంబంధించిన మురికినీరు తెలిసోతెలీయకో శరీరంలోకి చేరడం ద్వారా హెపటైటిస్-ఎ సంభవించడం జరుగుతుంది. హెపటైటిస్-ఎ అనేది హెపటైటిస్-ఎ వైరస్ వల్ల కలిగే తీవ్రమైన కాలేయవ్యాధి. ఇది బాక్టీరియా సోకిన ఆహారం లేదా నీటినుండి వ్యాపిస్తుంది.

హెపటైటిస్-ఎ లక్షణాలు:

హెపటైటిస్-ఎ లక్షణాలు:

• అలసట

• వికారం, వాంతులు

• పొత్తికడుపు నొప్పి

• ఆకలి లేకపోవడం

• తేలికపాటి జ్వరం

• కీళ్లనొప్పి

• చిక్కటి మూత్రం

• కామెర్లు

• తీవ్రమైన దురద

హెపటైటిస్-ఎ చికిత్స:

హెపటైటిస్-ఎ చికిత్స:

హెపటైటిస్-ఎ చికిత్సకు ప్రత్యేకమైన చికిత్స అంటూ ఏదీ లేదు, అయినప్పటికీ, క్రింది భద్రతా చర్యలు తీసుకోవడం ద్వారా వ్యాధులు సంక్రమించకుండా నిరోధించవచ్చు.

• ముడి/వండని ఆహార తినడం మానుకోండి.

• పీల్ చేసిన పళ్ళు మరియు కడిగిన కూరగాయలు తీసుకోవడం.

• కొద్దికాలంపాటు మినరల్ వాటర్ బాటిల్స్ పై ఆధారపడడం.

• తినడానికి ముందు పూర్తిగా చేతులను కడగడం.

3. కలరా:

3. కలరా:

కలరా అనేది నిస్సారమైన మరియు ఉప్పునీటిలో నివసిస్తున్న బాక్టీరియా “విబ్రియో కలరా” వలన సంభవించే ఒక తీవ్రమైన అంటువ్యాధి. ఈ బ్యాక్టీరియా సంబంధితవ్యాధి, తీవ్రమైన అతిసారం మరియు నిర్జలీకరణానికి దారితీస్తుంది.

కలరా లక్షణాలు:

కలరా లక్షణాలు:

బాక్టీరియాకు గురైన 12గంటల నుండి 5రోజులు వ్యవధిలో లక్షణాలుకనిపిస్తాయి.

వ్యాధి లక్షణాలు:

• వాంతులు

• కాళ్ళతిమ్మిరి

• నీళ్ళవిరేచనాలతో కూడిన అతిసారం

• నిర్జలీకరణము

కలరా చికిత్స:

కలరా చికిత్స:

కలరా వలన శరీరం అధిక డీహైడ్రేషన్ గురవడం మూలంగా మరణానికి దారితీస్తుంది. కావున, ఓరల్-హైడ్రేషన్-సొల్యూషన్(ఓఆర్ఎస్)తో కలరాకి చికిత్స చేయడం ఉత్తమం. సరైన సంరక్షణ మరియు చికిత్సతో మరణాల రేటు కొంతమేర తగ్గించవచ్చు.

కలరా నివారణా చిట్కాలు:

కలరా నివారణా చిట్కాలు:

సి.డి.సి ప్రకారం, తీసుకోవలసిన ముందస్తు చర్యలు:

• ఒక శుభ్రమైన కంటైనర్లో నీటిని నిల్వ ఉంచుకుని సేవించండి.

• టాప్ వాటర్ వినియోగం అయితే, కాచి చల్లార్చిన నీటిని తాగండి.

• త్రాగడానికి, దంతదావనానికి, శుభ్రతా పరమైన చర్యలకు మరియు ఆహారం కొరకు మినరల్ వాటర్ వినియోగం మంచిది..

• సబ్బు మరియు స్వచ్ఛమైన నీటితో చేతులు కడగడం.

• మలవిసర్జనకు బాత్రూం వినియోగం తప్పనిసరి, ఆరుబయట కార్యాలు మరియు అశుద్దమైన నీటి వినియోగం సరికాదు.

• బాగా ఉడికించిన ఆహారాన్ని మరియు మూతలు పెట్టిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.

4. టైఫాయిడ్:

4. టైఫాయిడ్:

టైఫాయిడ్, సాల్మొనెల్ల-టైఫి బ్యాక్టీరియా వలన కలిగే తీవ్రమైన జ్వరం. ఇది కలుషితమైన ఆహారం లేదా నీటి వినియోగం వలన కలుగుతుంది. ఈ బాక్టీరియా మురికినీటిలో/ఎండిన కాలుష్య ప్రదేశాలలో కొన్ని వారాలపాటు జీవించగలదు.

టైఫాయిడ్ లక్షణాలు:

టైఫాయిడ్ లక్షణాలు:

టైఫాయిడ్ సంకేతాలు/లక్షణాలు బ్యాక్టీరియాకు గురైన తరువాత 6-30 రోజుల మధ్య ప్రారంభమవుతాయి. ప్రధాన లక్షణాలు టైఫాయిడ్ జ్వరం, ఇది 104డిగ్రీల ఫారెన్హీట్ వరకు శరీర ఉష్ణోగ్రతలను పెంచుతుంది. దద్దుర్లు సహజం.

ఇతర లక్షణాలు:

• బలహీనత

• మలబద్ధకం

• పొత్తికడుపు నొప్పి

• తలనొప్పి

• టైఫాయిడ్ చికిత్స

కేవలం సమర్థవంతమైన చికిత్సగా యాంటీబయాటిక్స్ వాడకం ఉంది. సాధారణంగా గర్భిణీ స్త్రీలు కాని వారికి సిప్రోఫ్లోక్ససిన్ మరియు సెఫ్ట్రిక్సాన్ వినియోగిస్తారు.

టైఫాయిడ్ నివారణా చిట్కాలు:

టైఫాయిడ్ నివారణా చిట్కాలు:

• శుభ్రపరచని నీరుత్రాగటం, ముడిపండ్లు మరియు వండని కూరగాయలు తినడం మానుకోండి.

• ఆహారాలు సరిగా ఉడికించినట్లుగా లేదా వండినట్లుగా నిర్ధారించుకోండి.

• తరచుగా వెచ్చని/సబ్బునీటితో చేతులు కడగడం తప్పనిసరి.

• ఆరోగ్యనిపుణులు, వైద్యుల ప్రకారం, టీకాలు వేయించుకోవడం, శుభ్రమైన అలవాట్లను పాటించడం ద్వారా కొంతమేర వీటినుండి బయటపడగలిగే అవకాశాలు ఉన్నాయని సూచిస్తున్నారు.

English summary

Kerala Floods: Prevention Of Water-borne Diseases

According to the Directorate of Health Services (DHS), Kerala, the state has already recorded 225 cases of leptospirosis, 846 cases of dengue fever, 518 cases of malaria, 34 cases of chikungunya, and 191,945 cases of acute diarrhoeal disease (ADD). The public health experts are warning of an outbreak of typhoid, cholera, hepatitis and leptospirosis.
Story first published:Tuesday, August 21, 2018, 12:17 [IST]
Desktop Bottom Promotion