For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  కేరళను అట్టుడికిస్తున్న “నిఫా” : నిఫా వైరస్ సంకేతాలు, చికిత్స మరియు నివారణా మార్గాలు.

  |

  కేరళలో నిఫా వైరస్ (ఎన్.ఐ.వి) సంక్రమణ కారణంగా నేటికి మృతుల సంఖ్య 10 కి చేరింది. ఇంకా పెరిగే అవకాశాలున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మే 22, 2018 మంగళవారం నాటికి ఈ అరుదైన వైరస్ కారణంగా ఐదు మరణాలు సంభవించాయి. అంతకుముందు, ఆదివారం (మే 20, 2018) నాడు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, పూణే ప్రకారం, నిఫా వైరస్ యొక్క ముగ్గురి రక్త నమూనాలను ఇప్పటికే ఇన్స్టిట్యూట్ నకు పంపినట్లు నిర్ధారించింది.

  ఇంతలో, కేరళ ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజీవ్ సదానందన్ ప్రజలను భయపడాల్సిన అవసరం లేదని, త్వరలో దీన్ని తగ్గించగలమని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఇప్పటికే ఈ వైరస్ మీద దృష్టి సారించింది, తద్వారా ప్రజల ఆరోగ్య పరిస్థితులను, వైద్యుల నివేదికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు కూడా. బంగ్లాదేశ్ లో కూడా ఇదే సమస్య ఏర్పడిందని, అది త్వరగానే సర్దుకుందని తెలిపారు.

  Nipah virus outbreak in Kerala: Signs and symptoms of NiV, transmission, treatment, prevention

  ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం, నిపా వైరస్ కొత్తగా అభివృద్ధి చెందుతున్న జునోసిస్ (జంతువుల నుండి మనుషులకు సంక్రమించే వైరస్ వంటిది), ఇది జంతువులలో మరియు మానవులలో తీవ్రమైన వ్యాధికి కారణమవుతుంది. నిఫా వైరస్ ను ఎన్సెఫాలిటిస్ అని కూడా పిలుస్తారు. దీనిని మొట్టమొదటిసారిగా మలేషియా మరియు సింగపూర్లలో 1998 – 1999 లో గుర్తించారు. ఇది పందులలో మరియు మానవులలో వ్యాధికి కారణంగా ఉంటుంది. 1998 - 99 వ్యాప్తి సమయంలో, ఈ వైరస్ 265 మందిని ప్రభావితం చేసింది మరియు ఈ వైరస్ కారణంగా తీవ్రమైన నాడీ సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరిన వారిలో, 40 శాతం మందికి పైగా మరణించారు.

  అసలు ఏమిటీ నిఫా వైరస్ ? ఎలా వ్యాపిస్తుంది ?

  అసలు ఏమిటీ నిఫా వైరస్ ? ఎలా వ్యాపిస్తుంది ?

  నిపా వైరస్ లేదా ఎన్సెఫాలిటిస్ వైరస్, ఆర్.ఎన్.ఏ వైరస్ కలిగిన జీవుల కుటుంబాలైన పారామిక్సోవిరిడే, జెనిపస్ హెనిపవైరస్ నుండి వచ్చింది. నిఫా, హెండ్రా వైరస్ కు దగ్గర పోలికలు కలిగి ఉంటుంది, ఇది చాలా తీవ్రమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఆస్ట్రేలియాలో గుర్రాలు మరియు మనుషులపై తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్యలను తీసుకుని వచ్చింది కూడా.

  ఈ వ్యాధి గబ్బిలాల ద్వారా వ్యాపించింది

  ఈ వ్యాధి గబ్బిలాల ద్వారా వ్యాపించింది

  ఈ వ్యాధి గబ్బిలాల ద్వారా వ్యాపించింది. వీటిని ఎగిరే నక్కలు (ఫ్లైయింగ్ ఫాక్సెస్) అని కూడా పిలుస్తారు. అవి ప్టేరోపస్ అనే జాతికి చెందినవి. నిపా మరియు హెండ్రా వైరస్ యొక్క సహజ నిక్షేపాలు ఈ గబ్బిలాలలోనే ఉంటాయి. మానవులకు సంక్రమణం చెందే వైరస్, నేరుగా వైరస్ కలిగిన గబ్బిలాలు, పందులు లేదా ఇతర నిఫా వైరస్ సోకిన వ్యక్తులతో ప్రత్యక్ష లేదా పరోక్ష సంబంధం ద్వారా కలుగుతుంది.

  ఈ నిఫా వైరస్ వ్యాధి నేరుగా పందుల ద్వారానే మనుషులకు సోకింది.

  ఈ నిఫా వైరస్ వ్యాధి నేరుగా పందుల ద్వారానే మనుషులకు సోకింది.

  మలేషియా మరియు సింగపూర్లలో 1998 - 99 లో ప్రబలిన ఈ నిఫా వైరస్ వ్యాధి నేరుగా పందుల ద్వారానే మనుషులకు సోకింది. అయినప్పటికీ, 2004 లో, మానవులు వైరస్ సోకిన గబ్బిలాలచే కలుషితమైన తాటి కల్లును సేవించడంకారణంగా ఆసియా దేశాలలో అనేకులు ఈ నిఫా బారిన పడ్డారు. మానవుని నుండి మనువునికి బదిలీ అయ్యే నిఫా వైరస్ మాత్రం బంగ్లాదేశ్ మరియు భారతదేశంలోనే గుర్తించారు.

  నిపా వైరస్ యొక్క సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి ?

  నిపా వైరస్ యొక్క సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి ?

  సాధారణంగా, మనుషులలోని నిఫా వైరస్ మెదడు వాపు , జ్వరం, తలనొప్పి, మగతగా ఉండడం, అస్థిరత, మానసిక గందరగోళం, కోమా మరియు ఆకస్మిక మరణం వంటి లక్షణాలతో ముడిపడి ఉంటుంది. సి.డి.సి ప్రకారం, లక్షణాలు 24 నుండి 48 గంటలలో కోమాకి దారితీస్తాయి. కొన్ని సందర్భాల్లో, రోగులు ఇన్ఫెక్షన్ల ప్రారంభ దశలో శ్వాసకోశ సంబంధిత వ్యాధిని కూడా కలిగి ఉండవచ్చు.

  నిపా వైరస్ చికిత్స ఎలా ఉంటుంది, నిఫా వైరస్ కు నివారణ ఉందా ?

  నిపా వైరస్ చికిత్స ఎలా ఉంటుంది, నిఫా వైరస్ కు నివారణ ఉందా ?

  మానవులలో, నిపా వైరస్ సోకిన వారికి ప్రాధమిక చికిత్స అనేది అత్యవసరం. రిబవిరిన్ అనే డ్రగ్, జంతువులలో (విట్రో) లోని వైరస్ కు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పనిచేసింది. అయినప్పటికీ, రిబవిరిన్ యొక్క క్లినికల్ సామర్ధ్యం మానవునిపై ప్రయత్నాలలో ఇప్పటి వరకు అసంపూర్తిగానే ఉంది.

  మానవులు లేదా జంతువులకు టీకా కూడా లేదు.

  మానవులు లేదా జంతువులకు టీకా కూడా లేదు.

  దురదృష్టవశాత్తు, నిఫా వైరస్ కు నిర్దిష్టమైన చికిత్స అంటూ ఏదీ లేదు, మరియు మానవులు లేదా జంతువులకు టీకా కూడా లేదు.

  నిపా వైరస్ సంక్రమణను మీరు ఎలా నివారించవచ్చు ?

  నిపా వైరస్ సంక్రమణను మీరు ఎలా నివారించవచ్చు ?

  నిపా వైరస్ మానవుని నుండి మానవునికి సంక్రమణ చెందుతున్నందువలన, వ్యాధుల వ్యాప్తిని నివారించడంలో కొన్ని ప్రామాణిక వ్యాధి నియంత్రణా పద్ధతులు చాలా సహాయం చేస్తాయి. రోగులను పర్యవేక్షించే ఆసుపత్రి స్టాఫ్, మరియు కుటుంబ సభ్యులు కొన్ని నివారణా చర్యలు తీసుకోవడం ద్వారా జాగ్రత్త పడవచ్చు. ముఖ్యంగా లాబరేటరీ సాంపిల్స్ ప్రయోగశాలకు చేరవేయడంలో జాగ్రత్త తప్పనిసరి. గ్లోవ్స్,మాస్క్ వంటివి వాడడం, క్రమం తప్పకుండా చేతులను శుభ్రపరచడం, సానిటైజర్లు వాడడం వంటివి ముఖ్యంగా తీసుకోవలసిన జాగ్రత్తలు. రోగి పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో, వారిని చూసుకునే కుటుంబ సభ్యులు కూడా అంతే జాగ్రత్తగా మెలగాలి.

  అనారోగ్య ప్రాంతాలు, డంపింగ్ యార్డ్స్ లలో

  అనారోగ్య ప్రాంతాలు, డంపింగ్ యార్డ్స్ లలో

  అనారోగ్య ప్రాంతాలు, డంపింగ్ యార్డ్స్ లలో జబ్బుపడిన పందులు మరియు గబ్బిలాలకు దూరంగా ఉండడం, కుళ్ళిపోయిన తాటికల్లు తాగడం వంటివి చేయరాదు. మరియు నేలపై పడిన పండ్లు తినడం మూలంగా కూడా నిపా వైరస్ సంక్రమిస్తుంది.

  ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే, మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఆరోగ్యసంబంధిత వివరాలకై బోల్డ్స్కీ పేజీని అనుసరిస్తూ ఉండండి.

  English summary

  Nipah virus outbreak in Kerala: Signs and symptoms of NiV, transmission, treatment, prevention

  Nipah virus infection is a zoonosis that causes severe diseases in humans as well as animals. It takes 5 to 14 days for the signs and symptoms like drowsiness, dizziness, vomiting, etc., to start appearing. Prevent Nipah virus by avoiding exposure to sick pigs and bats and avoid drinking raw date palm sap, which can be contaminated by fruit bats.
  Story first published: Wednesday, May 23, 2018, 17:30 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more