For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బావిని శుభ్రం చేయమన్నాడు.. అందులోకి దిగిన కొడుకులు నిపా వైరస్ తో చనిపోయారు

కేరళ బావిలో ఉండే గబ్బిలాల ద్వారా వీళ్లకు ఆ వైరస్ సోకినట్లు పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వెల్లడించింది. ఈ విషయం తెలియగానే ఆ బావిని సీల్ చేశారు. ఆ పక్కనే ఉన్న ఇళ్లలో ఉన్న బావులనూ మూసేశారు.

|

కేరళను నిపా వైరస్ (నిఫా వైరస్ నైఫా వైరస్) వణికిస్తోంది. ఈ వైరస్ బారిన పడి చాలా మంది ఆస్పత్రి పాలయ్యారు. కొందరు మరణించారు. కేరళలోని కోజిక్కోడ్, మలప్పురం జిల్లాల్లో ఇప్పటివరకు ఈ వైరస్ బారిన పడి ఇప్పటి వరకు పది మంది మరణించారు. చికిత్స పొందుతున్న మరో ఇద్దరి పరిస్థితి కూడా కాస్త విషమంగా ఉంది.

ఇద్దరు మరణించారు

ఇద్దరు మరణించారు

కోజికోడ్‌లో చికిత్స పొందుతున్న రాజన్, అశోకన్ అనే ఇద్దరు వ్యక్తులు కూడా నిపా వైరస్ తో మృతిచెందారు. వీరిద్దరూ నిపా వైరస్ బారిన పడినట్లు నిర్ధారించారు. ఈ రోగులకు చికిత్స నందిస్తూ వైరస్ సోకి లీనీ అనే నర్సు కూడా మృతిచెందిన విషయం తెలిసిందే

12 మందికి సోకింది

12 మందికి సోకింది

ఇప్పటివరకు వ్యాధి సోకిన 18 మంది నమూనాలను పరీక్ష నిమిత్తం పంపగా, 12 మందికి నిపా వైరస్ సోకినట్లు నిర్ధారించారు. కాగా ఈ నెల 20న మలప్పురంలో సింధు, సిజితా అనే ఇద్దరు నిపా వైరస్ సోకి మృతి చెందారు. వీరిద్దరూ కోజికోడ్ మెడికల్ కళాశాల ఆసుపత్రికి వచ్చారు.

నిపుణుల బృందం

నిపుణుల బృందం

నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ)కి చెందిన నిపుణుల బృందాన్ని ఇప్పటికే కేంద్రం కేరళకు పంపింది. వీరిలో సంస్థ డైరెక్టర్ డాక్టర్ సుజీత్ కుమార్ సింగ్, ఎపిడమాలజీ చీఫ్ డాక్టర్ ఎస్.కె. జైన్ కూడా ఉన్నారు. ఏఐఎంఎస్‌కు చెందిన అత్యున్నత స్థాయి బృందం కూడా కేరళ చేరుకుంది.

ఒక కుటుంబం నుంచి వ్యాపించింది

ఒక కుటుంబం నుంచి వ్యాపించింది

కోజికోడ్‌లోని ఒక కుటుంబం నుంచి ఈ వైరస్ వ్యాప్తి చెందిందని కొందరు అనుమానిస్తున్నారు. పెరంబరకు చెందిన ఒకే కుటుంబంలోని ఇద్దరు సోదరులు, ఒక మహిళ నిపా వైరస్ సోకి మే 5న మృతి చెందారు. వీరి నుంచే ఈ వైరస్ వ్యాపించినట్లు చెబుతున్నారు.

గబ్బిలాల కళేబరాలు

గబ్బిలాల కళేబరాలు

వీరి ఇంటిముందు గబ్బిలాల మృత కళేబరాలు ఉన్నాయని, బహుశా వాటినుంచి ఈ వ్యాధి వీరికి సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఇప్పటివరకు 94 మందిని ఇళ్లనుంచి బయటకు రావద్దని చెప్పినట్టు తెలుస్తోంది. వివిధ ఆసుపత్రుల్లో 9 మంది చికిత్స పొందుతున్నారు. కాగా చంగరోత్ గ్రామంలోని ఒక కుటుంబం నుంచి ఈ వైరస్ వ్యాపించిందనడానికి బలమైన ఆధారాలున్నాయి.

చంగరోత్ గ్రామంలో మొదట

చంగరోత్ గ్రామంలో మొదట

అయితే కేరళలోని కోజికోడ్ జిల్లా చంగరోత్ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు 15 రోజుల వ్యవధిలో మృత్యువాత పడ్డారు. ఏదో మాయరోగం వాళ్ల ప్రాణాలను బలి తీసుకుంది అనుకున్నారు. ఆ తర్వాత అదే అంతుచిక్కని వ్యాధి కేరళలో మరో 12 మందిని పొట్టన పెట్టుకుంది. అదే నిపా వైరస్.

వలచెకుట్టి మూసా

వలచెకుట్టి మూసా

వలచెకుట్టి మూసా (62) అనే వ్యక్తి ఈ వైరస్ కారణంగానే తన ఇద్దరు కొడుకులు, తన సోదరుడి భార్యను కోల్పోయారు.

ఇప్పుడు మూసాకు కూడా ఆ వైరస్ సోకింది. అతను కూడా వెంటిలేటర్‌పై ఉన్నాడు. వీళ్లకు చికిత్స అందించిన నర్స్.. లీనీ కూడా ఇదే వైరస్ వల్ల చనిపోయింది. అసలు వీళ్ల మరణాలన్నింటికీ కారణం బావే.

ఇంటి వెనుకు బావి

ఇంటి వెనుకు బావి

ఆ బావిని మూసా ఇంటి వెనుక ఉంది. దీనిని శుభ్రం చేయాల్సిందిగా తన పెద్ద కొడుకు సలీయాకు మూసా చెప్పాడు. తన సోదరుల సాయంతో అతను ఈ బావిలోకి దిగి దానిని శుభ్రం చేశాడు. ఆ తర్వాతే వీళ్లు ఈ ప్రాణాంతక నిపా వైరస్ బారిన పడ్డారు.

బావిలోని గబ్బిలాల ద్వారా

బావిలోని గబ్బిలాల ద్వారా

ఆ బావిలో ఉండే గబ్బిలాల ద్వారా వీళ్లకు ఆ వైరస్ సోకినట్లు పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వెల్లడించింది. ఈ విషయం తెలియగానే ఆ బావిని సీల్ చేశారు. ఆ పక్కనే ఉన్న ఇళ్లలో ఉన్న బావులనూ మూసేశారు. కేరళలోని ఈ ప్రాంతంలో గబ్బిలాలు ఎక్కువే. కానీ గతంలో ఎప్పుడూ వీటి వల్ల ఎలాంటి ముప్పు కలిగిన దాఖలాలు లేవు. ఇదే ఇంట్లో ఉండే మూసా భార్య మరియం, మరో కొడుకు ముతాలీఫ్‌కు మాత్రం ఈ వైరస్ సోకలేదు. అయితే వీళ్లను అబ్జర్వేషన్‌లో ఉంచారు.

జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది

జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది

తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు కూడా నిపా వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మీరు కూడా మీ ఇంటి ప్రాగంణంలోని పరిసరాలు మొత్తం శుభ్రంగా ఉంచుకోండి. ఒక వేళ గబ్బిలాలు, పందులు తదితరాలు మీ పరిసరాల్లో సంచరిస్తున్నట్లయితే మీరు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది.

English summary

nipah virus outbreak linked to kerala well with many bats

nipah virus outbreak linked to kerala well with many bats
Desktop Bottom Promotion