For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పామాయిల్ ను ఎవరు వాడవచ్చు &దానికి ఎవరు దూరంగా ఉండాలి

పామాయిల్ ప్రపంచవ్యాప్తంగా వాడే నూనెల్లో ప్రసిద్ధమైనది. ఈ నూనెను వంటకాల నుంచి కాస్మెటిక్స్ వరకూ అన్నిటిలో ఎక్కువగా వాడతారు. చవక అవటం, వాడకానికి సులభంగా ఉండటం పామాయిల్ ను పాపులర్ చేసాయి.

|

పామాయిల్ ప్రపంచవ్యాప్తంగా వాడే నూనెల్లో ప్రసిద్ధమైనది. ఈ నూనెను వంటకాల నుంచి కాస్మెటిక్స్ వరకూ అన్నిటిలో ఎక్కువగా వాడతారు. చవక అవటం, వాడకానికి సులభంగా ఉండటం పామాయిల్ ను పాపులర్ చేసాయి.

కానీ పామాయిల్ ఆరోగ్య లాభాల గురించి కొన్ని వాదనలు ఉన్నాయి. కొంతమంది పరిశోధకులు ఇది వాడటానికి మంచిదే అంటారు కానీ కొన్ని పరిశోధనల్లో పామాయిల్ వాడకం వలన చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయని తేలింది.

palm oil benefits

రెండు పరిశీలనలపై అవగాహన తెచ్చుకోవటం వలన మీరు పామాయిల్ వాడాలో లేదో నిర్ణయించుకోవచ్చు. మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పామాయిల్ వాడటం మీకు మంచిదో కాదో నిర్ణయించుకోండి.

పామాయిల్ లో రెండు వెరయిటీలు ఉంటాయి. తాటిపండు నుంచి తీసిన నూనె, ఇంకోటి తాటిపండు లోపల విత్తనం నుంచి తీసే నూనె. ఈ రెండింటిలోనూ సాచ్యురేటడ్ కొవ్వు ఇంకా క్యాలరీలు బాగానే ఉంటాయి.

పరిమితంగా వాడితే పామాయిల్ అంత హానికారకం ఏమీ కాదు. కానీ ఎవరు తీసుకోవచ్చో ఎవరికి పడదో తెలుసుకోవటం ముఖ్యం.

ఇక్కడ ఈరోజు మనం మీ ఆరోగ్యంపై పామాయిల్ మంచి, చెడు ప్రభావాలను చర్చిద్దాం. దాంతో మీరు మీకు పామాయిల్ పడుతుందో లేదో నిర్ణయించుకోవచ్చు.

పామాయిల్ ఎవరు వాడకూడదుః

గుండె జబ్బులు

గుండె జబ్బులు

పామాయిల్ లో సాచ్యురేటడ్ కొవ్వు ఉంటుంది కాబట్టి, క్రమం తప్పకుండా వాడితే గుండె జబ్బులు వచ్చే రిస్క్ మరింత పెరుగుతుంది. సాచ్యురేటడ్ కొవ్వులు గుండెకి మంచివి కావు. కొలెస్ట్రాల్ పెరిగి, గుండె జబ్బులు వస్తాయి. అందుకని మీకు ఇదివరకే గుండెజబ్బులు ఉన్నా, లేదా కుటుంబంలో ఉన్నా, పామాయిల్ కి దూరంగా ఉండండి.

స్థూలకాయం

స్థూలకాయం

మీరు ఫిట్ నెస్ కోసం ప్రయత్నిస్తుంటే పామాయిల్ వాడవద్దు. పామాయిల్ లో క్యాలరీలు ఎక్కువగా ఉండి స్థూలకాయం వచ్చే అవకాశాన్ని పెంచుతాయి. రోజూ పామాయిల్ వాడటం వలన కొవ్వు కణాలలో కొవ్వు చేరి, బరువు పెరిగేలా చేసి ఊబకాయం వచ్చేలా చేస్తుంది.

మెటబాలిక్ సిండ్రోం

మెటబాలిక్ సిండ్రోం

పామాయిల్ లో ఉండే ఎక్కువ సాచ్యురేటడ్ కొవ్వు మెటబాలిక్ వ్యాధులకి కారణమవుతుంది. పామాయిల్ లో ఉండే పామిటిక్ యాసిడ్ కొవ్వు ఆక్సిడేషన్ వేగం తక్కువ అవటానికి కారణమవుతుంది. దీనివలన మెటబాలిజం తక్కువ జరిగి, కణ శ్వాసక్రియ వ్యాధులు వస్తాయి.

ఎక్కువ రక్తపోటు

ఎక్కువ రక్తపోటు

వండేటప్పుడు, పామాయిల్ ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది. వండటానికి వాడిన పామాయిల్ రక్తపోటు పెరిగే అవకాశాలను ఎక్కువ చేస్తుందని పరిశోధనల్లో తేలింది. కానీ పచ్చి పామాయిల్ రక్తపోటుపై ఏ ప్రత్యేక ప్రభావం చూపించదు.

ఎక్కువ కొలెస్ట్రాల్

ఎక్కువ కొలెస్ట్రాల్

మీకు ఇదివరకే ఎక్కువ కొలెస్ట్రాల్ వంశపారంపర్యంగా వస్తున్నట్లయితే,పామాయిల్ వాడవద్దు. మీరు సాచ్యురేటడ్ కొవ్వును తీసుకున్నప్పుడు, మీ శరీరానికి కొలెస్ట్రాల్ ను ఉత్పత్తి చేయటానికి కావాల్సిన ముడిపదార్థాలను మీరే ఇస్తున్నట్టు. పరిశోధనలు పామాయిల్ కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయని చూపిస్తున్నాయి.

పామాయిల్ ఆరోగ్య లాభాలు ;

క్యాన్సర్ తో పోరాడుతుంది

క్యాన్సర్ తో పోరాడుతుంది

పామాయిల్ లో ఉండే ఎక్కువ టోకోఫెరోల్స్ సహజమైన యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడి అసహజ కణాలు ఏర్పడకుండా నివారిస్తాయి. ఫ్రీ రాడికల్స్ నివారించటం వలన మామూలు కణాలు క్యాన్సర్ కణాలుగా మ్యుటేషన్ జరగకుండా ఆపవచ్చు.

కంటిదృష్టిని మెరుగుపరుస్తుంది

కంటిదృష్టిని మెరుగుపరుస్తుంది

పామాయిల్ లో ఉండే బీటా-కెరోటిన్ మీ కంటిచూపుపై అద్భుతాలు చేస్తుంది. బీటా-కెరోటిన్ కంటిచూపును మెరుగుపర్చటంలో పెద్దపాత్రను పోషిస్తుంది. బీటా-కెరోటిన్ విటమిన్ ఎ(రెటినాల్) తయారవ్వటానికి ముందు ప్రేరకంలా పనిచేస్తుంది. విటమిన్ ఎ మంచి కంటి చూపుకి, కంటి ఆరోగ్యానికి ముఖ్యం.

హార్మోన్ల బ్యాలెన్స్

హార్మోన్ల బ్యాలెన్స్

పామాయిల్ లో ఉండే బీటా-కెరోటిన్ మీ హార్మోన్ల స్థాయిని బ్యాలెన్స్ చేయటంలో పెద్దపాత్రను పోషిస్తాయి.హార్మోన్ల అసమతుల్యతకి సంబంధించిన అనేక వ్యాధులను నివారించటంలో ఇది సాయపడ్తుంది. మీకు హార్మోన్ల సమస్య ఉంటే, కోల్డ్ ప్రెస్డ్ పామాయిల్ ను వాడండి.

వయస్సు మీరకుండా చేస్తుంది

వయస్సు మీరకుండా చేస్తుంది

పామాయిల్ లో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ఇ మీ శరీరం యవ్వనంతో ఉండటానికి కారణమవుతుంది. క్రమం తప్పకుండా పామాయిల్ తీసుకోవటం వలన వయస్సుతో వచ్చే ముడతలు, ఇతర చర్మ సమస్యలు కూడా నివారించబడతాయి. ఇది ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ కూడా.

విటమిన్ ఎ లోపాన్ని నయం చేస్తుంది

విటమిన్ ఎ లోపాన్ని నయం చేస్తుంది

మీకు విటమిన్ ఎ లోపం ఉంటే ఏ సందేహం లేకుండా మీరు పామాయిల్ వాడవచ్చు. మీ రోజువారీ భోజనంలో పామాయిల్ ను వాడటం వలన సరిపోయేంత విటమిన్ ఎ సహజంగా లభిస్తుంది. ఇది పామాయిల్ వాడటం వలన వచ్చే ముఖ్య ఆరోగ్య లాభాల్లో ఒకటి.

English summary

palm oil benefits, drawbacks of palm oil, is palm oil good for health, is palm oil good or bad

Palm oil contains both good as well as bad nutrients. Palm oil contains beta-carotene, saturated fat as well as calories. For those who have a heart problem, consuming palm oil regularly can prove risky.
Desktop Bottom Promotion