బస్సుల్లో అర్జెంట్... ఏం చెయ్యాలో అర్థంకాని పరిస్థితి! ఎందుకీ దుస్థితి!

Written By:
Subscribe to Boldsky

చాలామంది బస్సుల్లో దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తుంటారు. ఒకవేళ మన సొంత వాహనం అయితే ఎక్కడ కావాలంటే అక్కడ ఆపుకుని మనకు కావాల్సిన పనులు పూర్తి చేసుకుని వెళ్లొచ్చు. కానీ బస్సుల్లో మాత్రం అలా కుదరదు. కొన్ని రూట్లలో ఒక స్టాప్ కు మరో స్టాప్ నకు మధ్య దూరం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.

తిండి కూడా సరిగ్గా తినరు

తిండి కూడా సరిగ్గా తినరు

అలాంటి సందర్భంలో అర్జెంట్ అనిపిస్తే ఏం చెయ్యాలో అర్థం కాదు. అందుకే ప్రయాణాలంటే చాలా మందికి ఆందోళనగా ఉంటుంది. కొందరైతే ప్రయాణానికి ముందు నుంచే తిండి కూడా సరిగ్గా తినరు. ఇక బస్సులో సీట్లో కూర్చొన్నప్పటి నుంచి ఎప్పుడు ఇంటికి చేరుతామా అని భయపడుతుంటారు.

కంట్రోల్ చేసుకోగలరు

కంట్రోల్ చేసుకోగలరు

కొందరు మల,మూత్ర విసర్జన మీద పట్టు కలిగి ఉంటారు. అంటే ఆ రెండు వచ్చినా కూడా కొద్ది సేపటి వరకు వాటిని అలాగే రాకుండా కంట్రోల్ చేసుకోగలరు. కానీ కొందరు మాత్రం మల, మూత్ర విసర్జన విషయంలో పట్టు కోల్పోయింటారు.

బాత్రూమ్‌కు వెళ్లాలని అనిపిస్తుంది

బాత్రూమ్‌కు వెళ్లాలని అనిపిస్తుంది

అలాంటి వారికి విసర్జన అవుతున్నట్టు అనిపిస్తే వెంటనే బాత్రూమ్‌కు వెళ్లాలని అనిపిస్తుంది. అలాగే వీరు ఈ సమస్య గురించి ఎవరికీ చెప్పుకోలేక చాలా ఇబ్బందిపడుతుంటారు. మలాన్ని ఆపుకోలేకపోవడం కూడా ఒక తీవ్రమైన సమస్యే. దీన్ని ఫీకల్‌ ఇన్‌కాంటినెన్స్‌ అంటారు.

బిగపట్టుకుని ఉండగలరు

బిగపట్టుకుని ఉండగలరు

కొందరు గంటలు తరబడి మూత్ర, మల విసర్జనను ఆపుకోగలరు. బాత్రూమ్ కు వెళ్లేంత వరకు వీరు బిగపట్టుకుని ఉండగలరు. కానీ కొందరు మాత్రం వన్ వచ్చినా లేదంటే టూ వచ్చినా అస్సలు ఆపుకోలేరు. ఈ సమస్య మనుషుల్ని మానసికంగా కుంగదీస్తుంది. కొందరు ఈ సమస్యతో అసలు జర్నీలు కూడా చెయ్యరు.

లీక్‌ కావడానికి చాలా కారణాలు

లీక్‌ కావడానికి చాలా కారణాలు

కొందరికి మల విసర్జనరాగానే వెంటనే కొంత లీక్ అయిపోతుంటుంది. ఇలాంటి సమస్యను పెద్దదిగా చేసుకోకుండా ముందుగానే పరిష్కరించుకోవాలి. మలం లీక్‌ కావడానికి చాలా కారణాలుంటాయి. మలాన్ని పట్టి ఉంచటానికి తోడ్పడే కండరాలూ బలహీనంగా మారడం వల్ల ఇలాంటి సమస్య వస్తుంది.

మలం లీక్‌ అయ్యే అవకాశం

మలం లీక్‌ అయ్యే అవకాశం

మలద్వారంలోని కండర వలయాలు దెబ్బతినటం, చీరుకుపోవటం వల్ల అవి పూర్తిగా మూసుకుపోవు. దీనివల్ల కూడా మల విసర్జనను అదుపులో పెట్టుకోలేరు. కడుపులోని కండరాలపై, మలాశయంలో ఏమాత్రం ఒత్తిడి పెరిగినా మలం లీక్‌ అయ్యే అవకాశం ఉంటుంది.

మలం జారిపోతూ ఉంటుంది

మలం జారిపోతూ ఉంటుంది

రెక్టమ్‌, కండర వలయాలకు సంకేతాలు అందించే నాడులు దెబ్బతినటం వల్ల మల, మూత్ర విసర్జనను కొందరు ఆపుకోలేరు. మలబద్ధకంతో బాధపడేవారిలో పెద్దపేగు, రెక్టమ్‌ గోడలు బాగా సాగిపోతుంటాయి. అవి బాగా దెబ్బతిని మలం జారిపోతూ ఉంటుంది.

విసర్జనకు వెళ్లాలని

విసర్జనకు వెళ్లాలని

రెక్టమ్‌ గోడలకు గల గ్రాహకాలు స్పందించి, కటిభాగంలోని కండరాలకు సంకేతాలు అందించే ప్యుడెండల్‌ నాడి ద్వారా మెదడుకు ఆ సమాచారాన్ని చేరవేస్తాయి. దీంతో మనకు విసర్జనకు వెళ్లాలని అనిపిస్తుంది.

పీచు పదార్థాలు తీసుకోవాలి

పీచు పదార్థాలు తీసుకోవాలి

కొందరు పలుచటి మలాన్ని అస్సలు ఆపుకోలేరు. ఇలాంటి వారు ఆహారంలో ఎక్కువగా పీచు పదార్థాలు తీసుకోవాలి. దీంతో మలం ఒకదగ్గర ముద్దగా ఏర్పడుతంది. అలాగే కండరాలను బలోపేతం చేసే కీగెల్‌ వ్యాయామాలు చేయాలి. అలాగే పలురకాల సర్జరీలు కూడా అందులో బాటులో ఉన్నాయి.

నవ్వుల పాలైపోతామని

నవ్వుల పాలైపోతామని

ఎంతోమంది స్త్రీలు, కాస్త వయస్సు పైబడ్డ వారు ఇలాంటి సమస్య ఎదుర్కొంటారు. వీరికిది భరించరాని నరకం. బయటకు వెళ్లాలంటే ఎంతో బెరుకుగా వెళ్తారు. ఏ క్షణాన టాయ్‌లెట్‌కు వెళ్లాలనిపిస్తుందో తెలియక సతమతం అవుతుంటారు. వెంటనే వెళ్లలేకపోతే లుగురిలో ఎక్కడ నవ్వుల పాలైపోతామో అని అనుకుంటూ ఉంటారు. చాలా మంది దీన్ని బయటకు చెప్పుకోలేక మౌనంగా కుమిలిపోతుంటారు.

స్త్రీలలోనే ఎక్కువగా ఉంటుంది

స్త్రీలలోనే ఎక్కువగా ఉంటుంది

ఇలాంటి బాధలను పెదవి కింద అదిమి పెట్టుకుని మౌనంగా పైకి ఏమీ తెలియకుండా గుట్టుగా జీవితాన్ని నెట్టుకొని వచ్చేవారు చాలా మంది ఉంటారు. మూత్రం, మలం ఆపుకోలేని బాధ పురుషులతో పోలిస్తే స్త్రీలలోనే ఎక్కువగా ఉంటుంది. దీనికి స్త్రీల పునరుత్పత్తి, మూత్ర అవయవాల నిర్మాణంతో పాటు గర్భాలు, కాన్పులు, ముట్లుడిగిన తర్వాత హార్మోన్ల లోపాల వంటివి కారణం.

అదుపు చెయ్యడం మీవల్ల కాదు

అదుపు చెయ్యడం మీవల్ల కాదు

అయితే ఈ సమస్యను అలాగే దాచిపెట్టుకుని ఉండకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగు సూచనలు, చికిత్స తీసుకోవాడం మంచింది. ఒక్కసారి ఈ సమస్య మీ చేతి నుంచి జారిపోతే దాన్ని అదుపు చెయ్యడం మీవల్ల కాదు.

English summary

reason for frequent urination while travelling

reason for frequent urination while travelling