హోలీ దుష్ప్రభావాలకు ఈ 7 చిట్కాలతో చెక్ పెట్టండిలా

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

హోలీ పండుగను ఎంత ప్రత్యేకంగా జరుపుకుంటామో, పండుగ తర్వాత మైకం , వికారం, ఆకలిని కోల్పోవుట, మైగ్రేన్, తలనొప్పి వంటి అనేకరకాల దుష్ప్రభావాలతో అంతే నష్టాన్ని కూడా చవిచూడవలసి ఉంటుంది.

వీటివలన కొందరు హోలీ ఆడటానికి సైతం భయపడుతారు. అలా అని బయటకు రాకుండా గొళ్ళెం వేసుకుని గదిలో ఉండమని చెప్పగలమా, లేదు కదా. కాని ఆ దుష్ప్రభావాలు దరికిరాకుండా కొన్ని ఉపాయాలు పాటించడం ద్వారా నివారించవచ్చు. అవి ఎలాగో ఇప్పుడు చూద్దాం.

మంచి నీళ్ళే మొదటి దైవం:

మంచి నీళ్ళే మొదటి దైవం:

పండుగ రోజు ఉదయం లేవగానే ఎక్కువ మోతాదులో నీళ్ళు తీసుకోవడం మూలంగా వేడుకలో రోజంతా ఎక్కువ డీహైడ్రేట్ కాకుండా శరీరాన్ని కాపాడుకోవచ్చు. దీనివలన వికారం, తలనొప్పి వంటిసమస్యలు దరికి రాకుండా చూసుకోవచ్చు పైగా రోజంతా ఉల్లాసంగా ఉండేలా శరీరాన్ని చూస్తుంది.

మద్యపానం మొదటి శత్రువు:

మద్యపానం మొదటి శత్రువు:

మద్యపానం సమయాల్లో కొందరు అనాలోచితంగా వోడ్కాను రమ్ మరియు విస్కీలలో కలిపి తాగడం వంటివి చేస్తుంటారు. వాటియొక్క సహజ సిద్దమైన రుచిని కోల్పోవడమే కాకుండా, మీరు ఎక్కువ డీహైడ్రేట్ కు గురవ్వడం లేక కనీసం 3రోజులు తలభారంతో ఉండాల్సిన పరిస్థితులు వస్తాయి. మద్యపానం చేయువారు ఇలా వేరే వేరే రకాలను కలిపి తీసుకోవడం సరైనది కాదు అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

అల్పాహారం బహు ప్రియం:

అల్పాహారం బహు ప్రియం:

ఖాళీ కడుపుతో రోజంతా ఉండడం శ్రేయస్కరం కాదు. కొందరు మద్యపాన ప్రియులు ఆహారం కన్నా మద్యానికే ఎక్కువ మొగ్గు చూపుతుంటారు. దీని కారణాన తలనొప్పులు, వికారం, నిస్సత్తువ వంటి ప్రతికూల ప్రభావాలకు లోనయి పండుగ ఆనందాన్ని ఆస్వాదించలేక పోతుంటారు. కావున పండుగరోజు ఇంట్లో చేసిన రుచికరమైన పదార్ధాలతో అల్పాహారం తీసుకోవడం మూలంగా రోజంతా వేడుకలలో చురుకుగా ఉండడానికి మరియు అసౌకర్యానికి గురికాకుండా మీకు సహాయం చేస్తుంది. వీలయితే మద్యానికి దూరం గా ఉండడమే మంచిది.

కంటి నిండా నిద్ర :

కంటి నిండా నిద్ర :

అలసిపోయిన శరీరం నిద్రని కోరుకుంటుంది. కాని కొందరు నిద్రకి ప్రాధాన్యతను ఇవ్వరు. కళ్ళకి ఎంత నిద్ర అవసరమో అంత నిద్రని ఇవ్వాలి. అప్పుడే శరీరం చురుకుగా ఉండి, వేడుకలో మీ చొరవను పెంచుతుంది. నిద్ర లేని శరీరం అలసత్వంతో కూడుకుని సమస్యని మరింత జఠిలం చేసి వేడుకను జరుపుకోనివ్వకుండా అడ్డుపడుతుంది. కావున కంటి నిండా నిద్రపోవడం శ్రేయస్కరం.

ధూమపానం ఎప్పటికీ శత్రువే:

ధూమపానం ఎప్పటికీ శత్రువే:

వీలయితే ధూమపానానికి దూరంగా ఉండండి. ముఖ్యంగా మద్యంతో కలిపి ధూమపానం చేయడం మూలంగా మీ వికారం, మైకం యొక్క స్థాయిలు అధికంగా పెరుగుతాయి. దీని ప్రభావం పగటి వేళల్లో తీవ్రంగా ఉంటుంది. కావున వీటి కలయిక జోలికి పోకపోవడమే మంచిది.

కాఫీ, టీ లకు బై చెప్పండి:

కాఫీ, టీ లకు బై చెప్పండి:

కెఫీన్ కలిగిన పదార్ధాలు ఎక్కువగా తీసుకోవడం మూలంగా వికారం యొక్క ప్రభావాన్ని పెంచడమే జరుగుతుంది. వీలైన వరకు వీటిని నిరోధించడమే మంచిది. కొందరు గంటకి ఒకసారి చొప్పున తీసుకునేలా అలవాటు పడి ఉంటారు. ఇలాంటి వారికి కడుపుకి సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి.

మద్యపాన ప్రియులకి ముఖ్య గమనిక:

మద్యపాన ప్రియులకి ముఖ్య గమనిక:

మద్యాన్ని సేవించమని ఎవ్వరూ సలహా ఇవ్వరు, దాని దుష్ప్రభావాలు అలా ఉంటాయి కాబట్టి. కాని కొందరు అనాలోచితంగా మద్యపానం వైపు మొగ్గు చూపుతుంటారు. అలాంటి వారు తేలికైనవి తీసుకునేలా ఉండాలి. ప్రతి ఒక్కరి సామర్ధ్యం ఒకేలా ఉండదు, వారివారి సామర్ధ్యాలు వారికే తెలుస్తాయి. కావున వాటిని అనుసరించి తేలికగా ఉండేలా తీసుకోవడమే ఉత్తమం. గొప్పలకు పోయి అధికంగా సేవించడం ఒక్కోసారి ప్రాణాలకే ముప్పుని తెచ్చే అవకాశo ఉంది. కావున ఇక్కడ మీరు చూపే తెలివే ప్రామాణికం అవుతుంది.

English summary

Seven tips to tackle Holi 'Bhangover'

Holi hangover is the worst to handle, especially after a long weekend. The dreadful festive fever can get to the best of us and make us indulge in foodsand drinks we may not otherwise.
Story first published: Thursday, March 1, 2018, 18:30 [IST]