సెక్స్ అండ్ డయాబెటిస్ : రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉండటం మీ సెక్స్ లైఫ్ ను పాడుచేస్తుంది!

Subscribe to Boldsky

చక్కెర అనే కార్బోహైడ్రేట్ జీవితంలో తియ్యదనాన్ని తెస్తుంది. అన్నిచోట్లా చక్కెరలు కన్పిస్తాయి. మనం తినే ఆహారంలో, తాగే డ్రింక్స్ లో, ఇంకా అన్ని ప్రాణం ఉన్న జీవులలో చక్కెర తప్పక ఉంటుంది. మనం ఆహారంలో తీసుకునే చక్కెర, ఒక సంక్లిష్ట చక్కెర, ఫ్రక్టోస్, గ్లూకోజ్ లతో కూడిన ఒక డైసాకరైడ్ (రెండు అణువులు కలిసి ఏర్పడే ఒక పరమాణువు). దాన్ని సుక్రోజ్ అంటారు.

ఇందులో పీచుపదార్థం ఉండదు, పైగా 2% కన్నా తక్కువ నీటిశాతం ఉంటుంది. సగటున ఒక వ్యక్తి ఒక ఏడాదిలో 25-30 కిలోల చక్కెరను తింటాడు, అంటే రోజుకి 300 కేలరీలన్నమాట. మామూలుగా ఆరోగ్యంగా ఉండటానికి ప్రతి వ్యక్తి రోజుకి 1200-1500 కేలరీల ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఇక ఊహించండి, ఆ 1200-1500 కేలరీలలో 300 కేలరీలు కేవలం చక్కెర నుంచే వస్తే మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది?

Sex And Diabetes: High Blood Sugar Can Hamper Your Sex Life! Heres How To Tackle The Issue

మనం తినే ఆరోగ్యకరమైన పండ్లు, కూరలలో కూడా కొంచెం చక్కెర ఏదో ఒక రూపంలో ఉంటుంది. ఇవి తింటే మన శరీరానికి సరిపోయే చక్కెర దొరుకుతుంది. కానీ మనం పొద్దున్నే నిద్రమత్తు వదలటానికి తాగే కాఫీ/టీ సంగతేంటి? ఆ తర్వాత రోజంతా ఎప్పుడో అప్పుడు తాగుతూనే ఉండే సోడాల మాటేమిటి? నిజానికి మన శరీరాన్ని మనం చక్కెరతో నింపేస్తున్నాం.

ఈ సంక్లిష్ట చక్కెర తీసుకున్నప్పుడు సుక్రేసస్ అనే ఎంజైములు వీటిని విఛ్చిన్నం చేస్తాయి. ఈ సుక్రేసులు సుక్రోజ్ ను గ్లూకోజ్ ఇంకా ఫ్రక్టోస్ గా విడగొడతాయి. గ్లూకోజ్ ను రక్తం పీల్చుకుని శరీరం అంతా కణాలలోకి పాకేలా చేస్తుంది. అక్కడ అవి మరింత విడగొట్టబడి శరీర పనులకి శక్తిని అందిస్తాయి.

పాంక్రియాలో(క్లోమంలో) ఉండే ఇన్సులిన్ అనే హార్మోన్ రక్తంలోకి చేరిన గ్లూకోజ్ నిల్వ చేయబడాలా, శక్తి అందించటానికి కణాలలోకి చేరాలా అని నిర్ణయిస్తుంది.

ఎక్కువ ఈ డైసాకరైడ్ తీసుకోవడం వల్ల మీకేం జరుగుతుంది?

ఎక్కువ ఈ డైసాకరైడ్ తీసుకోవడం వల్ల మీకేం జరుగుతుంది?

ఎక్కువగా చక్కెర పదార్థాలు తీసుకోవటం వలన స్థూలకాయం, గుండెజబ్బులు, అల్జీమర్స్ వ్యాధి, పళ్ళు పుచ్చిపోవటం, ఇంకా అందరికీ తెలిసిందే డయాబెటిస్ కూడా వచ్చే రిస్క్ పెరుగుతుంది. కణాలు గ్లూకోజ్ ఇంకా ఫ్రక్టోస్ ను పీల్చుకోకపోతే, విడగొట్టలేకపోతే, రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. ఈ రక్తంలో చక్కెర శాతం పైకి కిందకి మారుతుండటం వలన శరీరంలో చాలా సమస్యలు వస్తాయి.

ఈ ఎక్కువ చక్కెర తీసుకోవటం వలన మీకు వచ్చే సమస్యల్లో ఒకటి మిమ్మల్ని ఆశ్చర్యపర్చవచ్చు. అది మీ బెడ్ రూమ్ లో జరిగేదానిపై ప్రభావం చూపిస్తుంది. అవును, మీరు అనుకుంటోంది నిజమే! అది మీ సెక్స్ సామర్థ్యంపై ప్రభావం చూపిస్తుంది.

ఇది ఎలా జరుగుతుంది?

ఇది ఎలా జరుగుతుంది?

రక్తంలో ఎక్కువ చక్కెర శాతం వలన రక్తనాళాలు, నాడులు పాడవుతాయి, దానివల్ల శరీరంలో సున్నితత్వం తగ్గిపోతుంది. మరి సెక్స్ అంటేనే శరీరంలో మీ ప్రతి అవయవాన్ని ప్రేరేపించటం కాబట్టి,ఇది చాలా కష్టమైన సమస్యగా మారవచ్చు. సున్నితత్వం తగ్గిపోయి, రక్తపోటు పెరిగి, డయాబెటిస్ కూడా పక్కన చేరి, మగవారిలో అంగస్థంభన సమస్యకి దారితీస్తుంది.

ఇది ఆడవారిపై కూడా ప్రభావం చూపిస్తుంది. యోని/వెజైనా, క్లిటోరిస్ కి రక్తం సరఫరా చేసే రక్తనాళాలపై కూడా ప్రభావం పడుతుంది. దీనివలన పొడిదనం పెరిగి, లైంగికంగా కోరిక తగ్గిపోతుంది. కొన్ని కేసులలో నరాలు పాడయి, అసలు మొత్తానికే ఇష్టం పోతుంది.

దీని అర్థం –సున్నితత్వం తగ్గటం, సంతృప్తి తగ్గటం, ఇంకా ఆర్గాజం లేకపోవటం.

దీని అర్థం –సున్నితత్వం తగ్గటం, సంతృప్తి తగ్గటం, ఇంకా ఆర్గాజం లేకపోవటం.

ఏ వ్యక్తి సెక్స్ జీవితంలోనైనా ఇన్ని సమస్యలు ఎక్కువకాలం కొనసాగితే, అది డిప్రెషన్ కు.హార్మోన్ల అసమతుల్యత, ఇంకా ఎక్కువ మానసిక వత్తిడి, మానసిక డిజార్డర్లకి దారితీయవచ్చు.

ఒక పరిశోధనలో ఇద్దరు ఆడవారిని ఎంచుకున్నారు. ఒకరికి ఆమెకి నచ్చిన స్వీట్లు తినిపించారు, మరొకరికి సామాన్య భోజనమైన అన్నం, కూర పెట్టారు. చక్కెర ఎక్కువ తిన్నామెకి తన బాయ్ ఫ్రెండ్ తో ఉన్నప్పుడు అస్సలు లైంగికంగా కోరిక కలగలేదు, ఆమెకి కేవలం నిద్రపోయి, విశ్రాంతి తీసుకోవాలనే అన్పించింది. అదే ఇంకొక అమ్మాయికి అలాంటి సమస్య ఎదురుకాలేదు.

ఆడవారు కూడా ఎక్కువ చక్కెర వలన తమ పిరియడ్ క్రమంగా రాకపోవటం, జుట్టు విచిత్రమైన చోట్లలో పెరగటం, హఠాత్తుగా మొటిమలు, ఈ లైంగిక కోరిక తగ్గటంతో పాటు వస్తున్నాయని తెలిపారు. మగవారిలో టెస్టోస్టిరాన్ స్థాయి తగ్గిపోవటం,దానివలన లైంగిక సామర్థ్యం దారుణంగా దెబ్బతింటోంది. మగవారి స్తనాలు, కండరాల పరిమాణం తగ్గిపోవటం వంటివి ఇతర సైడ్ ఎఫెక్ట్'స్.

 మీకు లైంగికంగా కోరిక తగ్గినట్లు అన్పిస్తే,

మీకు లైంగికంగా కోరిక తగ్గినట్లు అన్పిస్తే,

మీకు లైంగికంగా కోరిక తగ్గినట్లు అన్పిస్తే, డాక్టరు దగ్గరికి వెళ్ళండి. మగవారు వారి పూర్తి ఫ్రీ టెస్టోస్టిరాన్ స్థాయి పరీక్షలు చేయించుకోవచ్చు. ఆడవారు కూడా ఫ్రీ టెస్టోస్టిరాన్ పరీక్ష, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ పరీక్ష, ల్యూటినైజింగ్ హార్మోన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ల పరీక్ష చేయించుకోవాలి.

ఈ హార్మోన్లని తిరిగి శరీరంలో సంతులనం చేయటం మీ డైట్ మార్పులతో సులభంగా సాధ్యపడుతుంది.

ఎక్కువ చక్కెరలు తీసుకోకుండా ఏం చేయవచ్చు?

ఎక్కువ చక్కెరలు తీసుకోకుండా ఏం చేయవచ్చు?

1.ఏం కొంటున్నారో దాని గురించి చదవండి. మీరు సూపర్ మార్కెట్లనుండి ప్రాసెస్ చేసిన ఫుడ్ ప్యాకెట్లను తీసుకెళ్ళేముందు ఏం తీసుకెళ్తున్నారో దానిగురించి తెలుసుకోండి. అందులో మీ బెడ్ రూమ్ ఆనందాన్ని తగ్గించే వస్తువులు వుండవచ్చు.

ఎక్కువ చక్కెరలు తీసుకోకుండా ఏం చేయవచ్చు?

ఎక్కువ చక్కెరలు తీసుకోకుండా ఏం చేయవచ్చు?

2.ఆల్కహాల్ బెట్లకి ఇక దూరంగా ఉండండి ; ఒకటి లేదా రెండు డ్రింక్స్ అంటే సరే, కానీ పూర్తిగా తాగిపడిపోవటం చాలా చెత్త ఆలోచన. ఆల్కహాల్ మీ మెదడుకి చేరాక చాలా జరగవచ్చు, కానీ మంచిగా అన్నీ జరగాలంటే మాత్రం ఈ అలవాటును తగ్గించటం తప్పనిసరి.

ఎక్కువ చక్కెరలు తీసుకోకుండా ఏం చేయవచ్చు?

ఎక్కువ చక్కెరలు తీసుకోకుండా ఏం చేయవచ్చు?

3.తీపి స్నాక్స్, డ్రింక్స్ ; వాటిని మీకు దూరంగా, మీ చుట్టుపక్కల వారికి దూరంగా ఉంచండి. అవి స్లోగా పనిచేసే విషాలు. అవి మెల్లగా మీ శరీరమంతా వ్యాపించి,మెల్లగా మీ ఇన్సులిన్ బ్యాలెన్స్ ను నాశనం చేస్తుంది, ఒక్కమాటలో చెప్పాలంటే మీకు ఇష్టమైన వారిని కూడా దూరం చేస్తుంది.

ఎక్కువ చక్కెరలు తీసుకోకుండా ఏం చేయవచ్చు?

ఎక్కువ చక్కెరలు తీసుకోకుండా ఏం చేయవచ్చు?

4.ఆకుకూరలు ; వీటిల్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది, చక్కెరపదార్థాలలో ఇది అస్సలు ఉండదు. మీ సగం ఆహారంలో ఇవే ఉండాలి ఎందుకంటే ఇవే రక్తంలో చక్కెరస్థాయిని సరిగ్గా నిలిపి వుంచుతాయి. వాటిల్లో అవసరమైన పోషకాలన్నీ ఉంటాయి.

అందుకని ఏం తింటున్నారో ధ్యాస పెట్టండి. ఆహారం మీరు అనుకునేదానికన్నా అనేక మార్గాల్లో మీ పై ప్రభావం చూపించవచ్చు. నేరుగా మీ సెక్స్ జీవితంపై కూడా. నిజానికి అలా అన్నీ పాడుచేసుకోవటం అవసరమా?

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Sex And Diabetes: High Blood Sugar Can Hamper Your Sex Life! Here's How To Tackle The Issue

    Sugar consumption has been linked with diabetes, obesity, heart ailments and tooth decay; but health experts revealed that type-2 diabetes can ruin your sex life. High sugar levels cause erectile dysfunction in men and it can make it hard for women to get orgasms. Cutting down the intake of alcohol, sugary and packaged foods is advised.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more