For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ హార్ట్ కు ట్రబుల్ ఉందని తెలిపే మీరు ఊహించని 9 లక్షణాలు

మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయం గుండె, గుండె నుండి ఇతర అవయవాలకు రక్తంతో పాటు, ఆక్సిజన్ సప్లై అవుతుంది. ఆక్సిజన్ సప్లై సరిగా ఉన్నప్పుడే ఇతర అవయవాలు కూడా చురుకుగా పనిచేస్తాయి.

By Mallikarjuna D
|

బాగా ప్రాచుర్యం పొందిన సామెత ఒకటి ఉంది. ''గుండె వ్యాధులు, ఓడిపోనివ్వండి, హెల్తీ హార్ట్ బీట్ ను అలాగే ఉంచండి!"

ఈ సామెతను ప్రతి ఒక్కరు తప్పకుండా అంగీకరిస్తారు. ఎందుకంటే మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో గుండె ఒకటి. కాబట్టి, హార్ట్ ను భద్రంగా చూసుకుంటే ఎలాంటి రిస్క్ ఉండదు. తెలిసి ప్రమాదం తెచ్చుకోవడం కన్నా, హార్ట్ ను భద్రంగా కాపాడుకోవడం మంచిది.

అయితే , కొంత మంది జీవనశైలి అలవాట్లు వల్ల హార్ట్ రిస్క్ లు తప్పడం లేదు, ఎన్నో తీవ్రమైన గుండె జబ్బులకు దారి తీస్తున్నది.

ఒక్క నిముషం ఆలోచిస్తే ? మన చుట్టుపక్కల వారో లేదా బందువులలోనో హార్ట్ ప్రొబ్లెమ్ తో చనిపోయినట్లు వింటుంటారు , నిజమే కదా?

చాలా సందర్భాల్లో మనకు దగ్గరి వాళ్ళలోనే హార్ట్ సమస్యలున్నట్లు ఏదో ఒక సందర్భంలో వినే ఉంటాము! దీన్ని బట్టి చూస్తే హార్ట్ హెల్తీగా లేకుంటే, శరీరంలో మిగిలిన అవయవాల మీద కూడా ప్రభావం చూపుతుంది.

Unexpected Signs Of Heart Troubles

మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయం గుండె, గుండె నుండి ఇతర అవయవాలకు రక్తంతో పాటు, ఆక్సిజన్ సప్లై అవుతుంది. ఆక్సిజన్ సప్లై సరిగా ఉన్నప్పుడే ఇతర అవయవాలు కూడా చురుకుగా పనిచేస్తాయి.

అదే శరీరంలో ప్రధానమైన గుండె సరిగా పనిచేయకపోతే, శరీరంలో ఇతర అవయవాలకు రక్తప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల అనేక అవయవాలు పనిచేయకుండా ఫెయిల్యూర్ అవ్వడం జరుగుతుంది!

అందువల్ల హెల్తీ హార్ట్ కలిగి ఉండాలంటే, హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. హెల్తీ బ్యాలెన్స్ డైట్ ను అనుసరించాలి. ముఖ్యంగా ఒక రోజులో కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినిరల్స్, ప్రోటీన్స్, ఫైబర్లు అధికంగా ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి.

ఇంకా, రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల ముఖ్యంగా కార్డియో వాస్క్యులర్ వ్యాయామాలు చేయడం వల్ల హార్ట్ హెల్తీగా ఉంచుకోవచ్చు. అలాగే ధూమపానం, మద్యపానంకు దూరంగా ఉంటూ స్ట్రెస్ తగ్గించుకోవడం వల్ల కూడా హార్ట్ హెల్తీగా ఉంటుంది . లేదంటే ఈ చెడు అలవాట్ల వల్ల హార్ట్ రిస్క్ లో పడుతుంది.

ఛాతీలో నొప్పి, అలసట వంటి లక్షణాలు హార్ట్ సమస్యలకు సూచనలు, వీటితో పాటు మరికొన్ని అనూహ్యమైన లక్షణాలు కూడా ఉన్నాయి. వీటి గురించి తెలుసుకున్నట్లైతే గుండె సంబంధిత సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త నివారణ చర్యలు తీసుకోవచ్చు...

1. సెక్స్యువల్ డిస్ ఫంక్షన్

1. సెక్స్యువల్ డిస్ ఫంక్షన్

స్త్రీ లేదా పురుషులు ఎవరైనా సరే పడకగదిలో చురుకుగా లేనట్లైతే ఒత్తిడికి, స్ట్రెక్ కు దారితీస్తుంది. నార్మల్ గా పురుషుల్లో అది అంగస్థంభన లోపాలు , మహిళల్లో స్తబ్ధత అని అనుకుంటారు . ఇతర కారణాల వల్ల కూడా ఈ సమస్యకు దారితీయవచ్చు, వీక్ గా ఉన్న హార్ట్ జననేంద్రియాలకు తగినంత రక్తాన్ని సరఫరా చేయకపోవడం వల్ల కూడా అలా జరగుతుంది.

2. హై బ్లడ్ ప్రెజర్

2. హై బ్లడ్ ప్రెజర్

అధిక రక్తపోటు లేదా హైపర్ టెన్షన్ వల్ల ధమనులకు వ్యతిరేకంగా రక్తం యొక్క ప్రవాహం చాలా ఎక్కువగా ఉంటుంది, దీని వల్ల అనేక ప్రతికూల లక్షణాలుంటాయి. ప్రస్తుతం చాలా మంది హైబ్లడ్ ప్రెజర్ హార్ట్ సమస్యలకు సూచికగా అభిప్రాయపడుతున్నారు,అందువల్ల హైబ్లడ్ ప్రెజర్ ప్రస్తుతం ఉన్న హృదయ స్థితికి సూచనగా ఉంటుంది!

3. తరచూ దగ్గుతుండటం:

3. తరచూ దగ్గుతుండటం:

నార్మల్ గా దగ్గు వైరల్ ఫ్లూకు సంకేతం, శ్వాససంబంధిత సమస్యగా గుర్థిస్తుంటారు, ఇది హార్ట్ కు సంబంధించిన సమస్య అని ఎవ్వరూ ఊహించరు. ఊపిరితిత్తులకు సరైన రక్తప్రసరణ జరగకుండా ఉంటే అది ఊపిరితిత్తులు డ్రైగా మారి, తరచూ దగ్గుతారు

4. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు

4. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు

తరచూ శ్వాస సమస్యలతో ఇబ్బంది పడుతున్నా, చాతీలో ఇబ్బందికరంగా ఉన్నా, శ్వాస సమస్యలు, గుండెకు సరిగా రక్తం ప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల గుండె సంబంధిత సమస్లయు దారితీస్తుంది.

5. శరీరం మీద జుట్టు రాలిపోవడం

5. శరీరం మీద జుట్టు రాలిపోవడం

అవును, ఇది నిజం, మహిళలో శరీరం మీద జుట్టు చాలా తక్కువగా ఉంటుంది కదా; శరీరం మీద అంటే కాళ్ళు, చేతుల మీద సన్నని వెంట్రుకలున్నట్లైతే ఆరోగ్యంగా ఉన్నాట్లు, అదే ఎలాంటి జుట్టు కనబడకపోయి, ఇక పురుషులలో సడెన్ గా జుట్టు రాలడం, చాతీ మీద, కాళ్ళ చేతులు మీద వెంట్రులక రాలిపోవడం వంటి సూచనలు హార్ట్ కు సరిగా రక్తప్రసరణ జరగట్లేదని హార్ట్ ట్రబుల్లో ఉందని సూచిస్తుంది.

6. కాళ్ళ వాపులు

6. కాళ్ళ వాపులు

కాళ్ళు చేతులు వాపులకు అనేక కారణాలుంటాయి, బరువు పెరగడం, ప్రెగ్నెన్సీ, హై బ్లడ్ ప్రెజర్ మొదలగునివి, ఇది హార్ట్ ట్రబుల్ కు సంకేతం కూడా , కాళ్ళకు సరిగా రక్తప్రసరణ జరగకపోవడం వల్ల ఎక్సెస్ ఫ్లూయిడ్స్ చేరడం వల్ల కాళ్ళ వాపులకు దారితీస్తుంది.

8. చిగుళ్ళ వాపులు

8. చిగుళ్ళ వాపులు

చాలా మంది, చిగుళ్ళ సమస్యతో బాధపడుతుంటారు, అందుకు కారణం సరైన దంత శుభ్రత లేకపోవడం లేదా క్యావిటీస్ వల్ల జరగుతుంది. దంతాలకు, చిగుళ్ళకు రక్తప్రసరణ సరిగా లేకపోవడం వల్ల హార్ట్ సమస్యల వస్తాయని గుర్తించాలి.

9. వికారం

9. వికారం

జీర్ణ సమస్యల వల్ల వికారం వస్తుంది, అయితే , ఇది హార్ట్ డిసీజ్ కు సంకేతంగా సూచిస్తుంది, పొట్టకు కూడా సరిగా రక్తప్రసరణ జరగపోతే వికారంకు దారితీస్తుంది, ఇది గుండె సమస్యలకు కూడా ఒక సూచన అని గుర్తించాలి.

English summary

Unexpected Signs Of Heart Troubles

Now, there are certain signs of heart ailments like chest pain, fatigue, etc., that we may be able to recognise. However, there are a few unexpected signs of heart problems too that you must become aware of to be more prepared with the situation; have a look.
Desktop Bottom Promotion