For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిపా వైరస్ గాలి ద్వారా కూడా సోకుంతుందా? నిపా కేవలం వాటి వల్లే సోకుతుంది

కేరళతో పాటు చుట్టుపక్కల ఉండే రాష్ట్రాలను గడగడలాడించే నిపా వైరస్ గురించి చాలా మందికి చాలా భయాలుంటాయి. అయితే ఈ వైరస్‌ గాలి ద్వారా సోకదు. నిపా వైరస్, కేరళలో నిపా వైరస్. నిపా వైరస్.

|

కేరళతో పాటు చుట్టుపక్కల ఉండే రాష్ట్రాలను గడగడలాడించే నిపా వైరస్ గురించి చాలా మందికి చాలా భయాలుంటాయి. అయితే ఈ వైరస్‌ గాలి ద్వారా సోకదు. అప్పటికే వైరస్‌ సోకిన జంతువు లేదా మనిషితో డైరెక్ట్‌ కాంటాక్ట్‌ వల్ల మాత్రమే వ్యాపిస్తుంది. ఈ వైరస్‌ను నియంత్రించే టీకాలు ఇంకా తయారు కాలేదు.

ఇంటెన్సివ్‌ సపోర్టివ్‌ కేర్‌ చికిత్స

ఇంటెన్సివ్‌ సపోర్టివ్‌ కేర్‌ చికిత్స

అయితే ఈ వైరస్‌ను సమర్థంగా చంపగలిగేది ఇంటెన్సివ్‌ సపోర్టివ్‌ కేర్‌ చికిత్స ఒక్కటే! ఈ వైరస్‌ బారిన పడకుండా ఉండాలంటే వైరస్‌ ఉన్న ప్రాంతాల్లో పందులు, గబ్బిళాలు లేకుండా చూసుకోవాలి. చికిత్స చేసే వైద్యులు మాస్క్‌లు, గ్లోవ్స్‌ వేసుకోవాలి.

ఇండియన్ జర్నల్ ఆఫ్ వైరాలజీ

ఇండియన్ జర్నల్ ఆఫ్ వైరాలజీ

ఇక ఇండియన్ జర్నల్ ఆఫ్ వైరాలజీ విశ్లేషణ ప్రకారం.. నిపా వైరస్ మనుషులు , పశువులకు గాలి లేదా లాలాజలం ద్వారా సోకే జునోటిక్ దీన్ని భారత్ లో మొదట కేరళలో కనుగొన్నారు. అంతేకాకుండా పందులు, గబ్బిలాలు తిని వదేలేసిన పండ్లకు ఇది సంక్రమిస్తుందని ఇండియన్ జర్నల్ ఆఫ్ వైరాలజీ శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. దీన్ని మొదట్లో మలేషియాలోని సుంగాయ్ నిపా గ్రామంలో 1998లో తొలిసారిగా గుర్తించారు. ఆ తరువాత ఇది సింగపూర్‌ కు వ్యాపించింది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఈ వ్యాధి దరిచేరకుండా చుట్టుపక్కల పరిసరప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, పందులు, గబ్బిలాలు, ఇతర అపరిశుభ్ర జంతువులను ధరిచేరనీయకూడదు. ఎవరికైనా పై లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.

పందులకు, గబ్బిలాలకు దూరంగా ఉండాలి

పందులకు, గబ్బిలాలకు దూరంగా ఉండాలి

అనారోగ్యంతో ఉన్న పందులకు, గబ్బిలాలకు దూరంగా ఉండటం, పక్వానికి రాని ఖర్జూరం రసాన్ని తాగకుండా ఉండటం ద్వారా ఈ వైరస్ బారిన పడకుండా ఉండొచ్చు. ఈ వైరస్ సోకిన వారిలో జ్వరం, తలనొప్పి, మత్తుగా కనిపించడం, శ్వాస ఆడకపోవడం, కంగారుపడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపించిన 24 నుంచి 28 గంటల్లోనే బాధితులు కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది.

జూనోసిస్

జూనోసిస్

ఇక ఈ వైరస్‌ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్తగా వెలుగులోకొచ్చిన 'జూనోసిస్' (జంతువు నుంచి మనుషులకు వ్యాపించే వైరస్‌)గా ఇంతకుముందే గుర్తించింది. 'ఫ్రూట్‌ బ్యాట్స్' అనే ఒక రకం గబ్బిళాలు నిపా వైరస్‌కు వాహకాలుగా పని చేస్తాయని కూడా గుర్తించారు.

లక్షణాలివే..

లక్షణాలివే..

జ్వరం, తలనొప్పి, మగత, మానసిక సంతులనం తగ్గడం, శ్వాసకోశ ఇబ్బందులు, ఎన్‌సెఫలైటిస్‌ వంటి లక్షణాలు కనిపిస్తాయి. నిపా బారిన పడిన వారిలో 5 నుంచి 14 రోజుల్లో ఈ లక్షణాలు బయటపడతాయి. వ్యాధి లక్షణాలు 3-14 రోజుల వరకు ఉంటాయి. తీవ్రత ఎక్కువైతే 24 నుంచి 48 గంటల్లో కోమాలోకి వెళ్లి మృతి చెందే ప్రమాదం ఉంది. నిపా బారిన పడిన వారి నుంచి మరొకరికి ఈ వైరస్‌ సులువుగా సంక్రమిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ వైరస్‌ సోకిన వారిలో నూటికి 70 శాతం మంది మృత్యువాత పడతారని అంటున్నారు.

ముందుజాగ్రత్తే.. మందు

ముందుజాగ్రత్తే.. మందు

నిపా నివారణకు మందులు లేవని, ప్రాథమిక దశలో గుర్తిస్తే ప్రత్యేక చికిత్సతో నివారించవచ్చని వైద్యులు చెబుతున్నారు. భోజనం చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలని.. పండ్లు, ఫలాలను శుభ్రం చేయకుండా తినవద్దని సూచిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యలు తప్పనిసరి అని అంటున్నారు. మామిడిపండ్లు, జాక్‌ ఫ్రూట్స్‌, రోజ్‌ ఆపిల్స్‌లను గబ్బిలాలు ఆహారంగా ఎక్కువ తీసుకుంటాయని, వీటిని వినియోగించేప్పుడు జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేస్తున్నారు.

చికిత్స

చికిత్స

ఆస్ట్రేలియాలో గుర్రాలకు హెండ్రా అనే వైరస్ సోకినపుడు ఇచ్చే చికిత్సనే ఈ నిపాకు కూడా ప్రస్తుతం ఇస్తున్నారు. . దేశంలో ఇలాంటి వైరస్ ల విషయంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు పూణే లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, ఢిల్లీ లోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్, మణిపాల్ లోని మణిపాల్ సెంటర్ ఫర్ వైరాలజీ అండ్ రీసెర్చ్ లలో చేస్తుంటారు.

కిట్స్, శిక్షణ పొందిన సిబ్బంది లేరు

కిట్స్, శిక్షణ పొందిన సిబ్బంది లేరు

అయితే చాలా రాష్ట్రాల్లో చాలా చోట్ల నిపా వైరస్ కు పరీక్షలకు సంబంధించిన కిట్స్, శిక్షణ పొందిన సిబ్బంది లేరు. అయితే తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు వ్యాధి లక్షణాలు గుర్తించి వెంటనే సమీప ప్రభుత్వ వైద్యులను సంప్రదించాలని వైద్య అధికారులు కోరుతున్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, అవగాహన, చైతన్యంతో ఉండాలని, ప్రాథమిక స్థాయిలోనే ఇలాంటి వ్యాధులను నివారించవచ్చని తెలుగు ప్రభుత్వాలు భరోసానిస్తున్నాయి.

English summary

steps to prevent the spread of nipah virus and symptoms

steps to prevent the spread of nipah virus and symptoms
Desktop Bottom Promotion