For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఊహకు కూడా అందని ఈ 10 అంశాలు, మీ మలబద్దకానికి ప్రధాన కారణాలు కావొచ్చు

|

ప్రతిరోజు టాయిలెట్ సీటు మీద, స్టూల్ పాసింగ్ సరిగ్గా లేక ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారా? మీ స్టూల్స్ పాసింగ్ సమయంలో నరాలు తెగిన అనుభూతికి లోనవుతున్నారా? భాదతో కన్నీళ్లు ఉబికి వస్తున్నాయా? అయితే మీరు తప్పనిసరిగా మలబద్ధకంతో బాధపడుతున్నారనే అర్ధం.

మలబద్దకం జీవనశైలి సంబంధిత వ్యాధి. ఈ సమస్యలో ప్రధానంగా ప్రేగులలో మలం(స్టూల్స్) గట్టిపడుతుంది. క్రమంగా అసమతుల్య మలవిసర్జన, స్టూల్స్ పాసింగ్ సమయంలో భాద, ప్రధానంగా ఉంటుంది. ఒక వ్యక్తి సుదీర్ఘకాలం మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నట్లైతే, అది ఇతర వ్యాధులకు సైతం కారణమవుతుంది. ప్రేగుల్లో వాపు, పొట్టలో పుండ్లు, కడుపునొప్పి, వికారమైన త్రేన్పులు, పైత్యప్రకోపాలు, ఆకలి ఒడిదుడుకులు, పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా మొదలైనవి మలబద్దకం వలన కలిగే సమస్యలుగా ఉన్నాయి.

మారుతున్న జీవనశైలి ప్రకారం, అనేక కారణాలు మలబద్దకానికి కారణం కావచ్చు. కానీ ప్రధానకారణాలలో వ్యక్తి తీసుకునే ఆహారం, వ్యసనాలు మరియు వ్యాయామం చెప్పబడినవి. అనారోగ్యకర ఆహారపు అలవాట్లు మరియు వ్యాయామం సరిగ్గా లేకపోవడం ప్రధానంగా ఒక వ్యక్తి మలబద్ధకానికి గురవడానికి దారితీస్తుందని అనేక పరిశోధనల అధ్యయనాల సారాంశం.

ఇప్పుడు, మనం మలబద్ధక సమస్యలకు గురవడానికి గల అత్యంత అసాధారణమైన, ఆశ్చర్యకరమైన కారణాల గురించి తెలుసుకుందాం.

ఎక్కువసేపు ఒకేచోటున కూర్చుని ఉండడం:

ఎక్కువసేపు ఒకేచోటున కూర్చుని ఉండడం:

డ్రైవర్స్, టైలర్లు, కంప్యూటర్ నిపుణులు మొదలైనవారిలో ప్రధానంగా ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. దీనికి కారణం ఒత్తిడితో కూడుకున్న వృత్తి మాత్రమే కాకుండా, గంటల తరబడి ఒకేచోట కూర్చుని ఉండాల్సిన దుస్థితి ఈ ఉద్యోగాలలో ఎక్కువగా ఉంటుంది. ఎక్కువసమయం ఒకేస్థలంలో కూర్చునే వ్యక్తులు, మలబద్దక సమస్యలకు ఎక్కువగా గురవుతుంటారని చెప్పబడింది.

ఎందుకంటే, ఎక్కువసేపు ఒకేచోట కదలకుండా కూర్చుని ఉన్నప్పుడు శరీర జీవక్రియలు నెమ్మదిగా తగ్గుతాయి, క్రమంగా ప్రేగుకదలికలు తగ్గడం ద్వారా మలబద్ధక సమస్య ఏర్పడుతుంది.

పాలపదార్ధాల అధిక వినియోగం:

పాలపదార్ధాల అధిక వినియోగం:

రోజులో ఎక్కువ మొత్తంలో జున్ను, పాలు, పనీర్ వంటి పాలఉత్పత్తులను అధికంగా వినియోగించే వారికి మలబద్దక సమస్యలు కలుగుతాయని చెప్పబడింది. ఈ పాడిఉత్పత్తులలో కడుపులో అధిక గ్యాస్ ఉత్పత్తిని ప్రేరేపించే సమ్మేళనాల ఉనికి కారణంగా ప్రేగులలో మలం గట్టిపడి మలబద్దకానికి దారితీస్తుంది. ప్రేగులలో, జీర్ణక్రియ సమయంలో కిణ్వప్రక్రియ జరుగుతుంది. క్రమంగా అధిక పాలఉత్పత్తులు తీసుకునే వారికి మలబద్దక సమస్యలు అనేవి సర్వసాధారణంగా ఉంటాయి.

డిప్రెషన్:

డిప్రెషన్:

ఒత్తిడి, డిప్రెషన్ వంటి మానసికస్థితికి దారితీస్తుంది. అనేక పరిశోధనల అధ్యయనాల ప్రకారం, ఈ డిప్రెషన్ మలబద్దకానికి కూడా దారితీస్తుంది. నిరాశతో ఉన్నప్పుడు, మెదడులోని సెరోటోనిన్ అనే హాపీ-హార్మోన్ స్థాయిలు క్రమంగా తగ్గిపోతాయి. తద్వారా జీవక్రియలు మందగించడం, శరీరంలో ఇతర హార్మోనులపై ప్రభావం పడడం కారణంగా జీర్ణసంబంధ సమస్యల నుండి స్ట్రోక్, రక్తపోటు, మలబద్దకం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయని చెప్పబడింది.

ముఖ్యంగా సెరటోనిన్ హార్మోనుల స్థాయిలు తగ్గడం మూలాన, మెదడు నుండి జీర్ణక్రియ మరియు విసర్జన వ్యవస్థకు సరైన సంకేతాలు అందకపోవడం మూలాన మలవిసర్జన సమయాల్లో అవకతవకలు, క్రమంగా మలబద్ధకం ఏర్పడుతుంది.

Most Read: సెక్స్ తర్వాత ఖచ్చితంగా యూరిన్ పాస్ చేయడానికి గల 7 కారణాలు..?

తక్కువ పిండిపదార్ధాలు కలిగిన ఆహారప్రణాళిక:

తక్కువ పిండిపదార్ధాలు కలిగిన ఆహారప్రణాళిక:

తక్కువమొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉండేలా ఆహారప్రణాళికలు అనుసరిస్తున్న వ్యక్తులు తరచుగా ఈ మలబద్ధకం సమస్యలకు గురవుతున్నారని వైద్యులు ధృవీకరిస్తున్నారు. ముఖ్యంగా కీటోడైట్ వంటివి. శరీరానికి సరైనమోతాదులో పోషకాలు అందకపోవడం కారణంగా జీర్ణక్రియలు, జీవక్రియలు సక్రమంగా పనిచేయక మలబద్దకానికి కారణం అవుతుంది.

మీరు తక్కువ కార్బోహైడ్రేట్ డైట్లో ఉన్నప్పుడు, పెద్దప్రేగులో నీటిశాతం మందగిస్తుంది. క్రమంగా మలబద్ధకానికి దారితీస్తుంది. క్రమంగా స్టూల్ పొడిగా మారడం లేదా గట్టిగా మారి మలవిసర్జనను కష్టతరం చేయవచ్చు.

అధిక లాక్సేటివ్ పదార్ధాల వాడకం:

అధిక లాక్సేటివ్ పదార్ధాల వాడకం:

లాక్సేటివ్ పదార్ధాలు మలవిసర్జన సజావుగా సాగడానికి, మరియు స్టూల్స్ మృదువుగా తయారయ్యేందుకు దోహదం చేస్తాయి. వీటిని మందుల రూపంలో లేదా ఆహార పదార్ధాల రూపంలో అందివ్వడం జరుగుతుంది. కానీ అధికంగా లాక్సేటివ్ పదార్ధాల వాడకం, వాటిమీద పూర్తిస్థాయిలో ఆధారపడేలా చేస్తుంది. క్రమంగా అవి లేనిదే, మీకు మలవిసర్జన సజావుగా జరగదు. అధికంగా వీటిని వాడేవారు ఎక్కువగా మలబద్దక సమస్యలతో ఉంటారు.

చాక్లెట్లు ప్రతిరోజు తినడం;

చాక్లెట్లు ప్రతిరోజు తినడం;

అప్పుడప్పుడు తీసుకునే చక్కెర తక్కువగా ఉండే చాక్లెట్స్ కానీ, డార్క్-చాక్లెట్ ముక్క మాత్రమే కాకుండా, రోజువారీ అలవాట్లలో భాగంగా చాక్లెట్లను అధికంగా తీసుకునే వారికి అనేక ఆరోగ్యసమస్యలు తలెత్తడం ఖచ్చితం. వాటిలో ముఖ్యమైనది మలబద్దకం. చాక్లెట్లు అధిక మొత్తంలో చక్కెరలను కలిగి ఉంటాయి, ఇది ప్రేగులలో మలం గట్టిపడడంలో కీలకపాత్ర పోషిస్తాయి, వీటిని రోజువారీ వినియోగం కలిగి ఉన్న ఎడల, కడుపు ఉబ్బరం మలబద్దకం సమస్యలు సర్వసాధారణంగా ఉంటాయి.

Most Read: మీ లైంగిక పటుత్వాన్ని పెంచే 10 ఉత్తమమైన విటమిన్లు మరియు ఖనిజాలు

కొన్నిరకాల మందులు:

కొన్నిరకాల మందులు:

యాంటీ-డిప్రెసెంట్స్, యాంటీబయాటిక్స్, రక్తపోటు మందులు, విటమిన్ మాత్రలు వంటి కొన్ని మందులను క్రమంతప్పకుండా తీసుకుంటున్నప్పుడు, అవి ప్రేగులను పొడిగా తయారు చేస్తాయి. ఇవి ప్రేగులలో మలం గట్టిపడటానికి కారణమవుతాయి, క్రమంగా మలబద్ధకానికి దారితీస్తుంది.

ఇటువంటి సందర్భాల్లో, మీ డాక్టర్ను సంప్రదించి మందుల మోతాదును మార్చడం ద్వారా ఫలితాలను పొందవచ్చు.

 హార్మోన్ల అసమతుల్యత:

హార్మోన్ల అసమతుల్యత:

పిసిఒఎస్(పాలీసిస్టిక్-ఓవరియన్-సిండ్రోమ్), హైపోథైరాయిడిజం, హైపర్-థైరాయిడిజం మొదలైన ఇతర హార్మోన్ల లోపాలతో బాధపడుతున్న వ్యక్తి ఎక్కువగా మలబద్ధకం సమస్యతో ఉంటారని అనేక పరిశోధనల అధ్యయనాలు కనుగొన్నాయి.

ప్రేగులు ఆరోగ్యకరంగా పనిచేసేందుకు కొన్ని హార్మోన్లు కీలకపాత్రను పోషిస్తుంటాయి. కానీ కొన్ని హార్మోన్ సంబంధిత వ్యాధులు శరీరంలోని ఇతర హార్మోన్ల విధులకు కూడా అంతరాయం కలిగించగలవు. క్రమంగా జీర్ణక్రియలు అసమతుల్యానికి లోనై, మలబద్దకం ఏర్పడుతుంది.

బర్త్-కంట్రోల్ మాత్రలు:

బర్త్-కంట్రోల్ మాత్రలు:

అవాంచిత గర్భనిరోధక ప్రక్రియలో భాగంగా అనేకమంది మహిళలు తరచుగా బర్త్-కంట్రోల్ పిల్స్ వాడకం వైపునకు మొగ్గు చూపుతుంటారు. వీటిని కాంట్రాసెప్టివ్ పిల్స్ అని కూడా అంటారు. ఇవి కొన్ని హార్మోనుల చర్యలను అడ్డుకోవడం ద్వారా పిల్లలు పుట్టకుండా నిరోధించగలవు. కానీ అధికంగా వినియోగించడం మూలంగా ప్రేగుల్లో మలం గట్టిపడే అవకాశాలు ఉన్నాయి. క్రమంగా మలబద్ధకం మరియు ఉబ్బరం సమస్యలకు దారితీస్తుంది.

Most Read:వద్దూవద్దంటే శృంగారంలోకి దింపాడు, ఒక్కసారి పాల్గొందామంటూ బుగ్గలు గిల్లేవాడు #mystory243

అధిక వ్యాయామం:

అధిక వ్యాయామం:

మనం వ్యాయామం లేకపోవడం మూలంగా శారీరిక, మానసికపరమైన అనేక సమస్యలను ఎదుర్కొంటామని ఎన్నో వ్యాసాలలో, లేదా అనుభవాల ద్వారా తెలుసుకున్నాం. కానీ ఒక అధ్యయనం ప్రకారం, అధిక వ్యాయామం మలబద్ధకానికి కూడా కారణం కావచ్చని తేల్చింది. అధికంగా వ్యాయామం చేసిన ఎడల, శరీరంలో ఎలెక్ట్రోలైట్స్ మరియు నీటి నష్టం అధికంగా జరగవచ్చు. క్రమంగానిర్జలీకరణ సమస్యలుతోడై మలబద్దకానికి దారితీయవచ్చు.

English summary

10 Surprising Causes For Constipation You Must Know

Constipation is a digestive ailment in which a person finds it difficult to pass stools. There are a number of surprising causes for constipation that one must know in order to prevent it. Some of the major causes are sitting for too long, depression, low carb diet, eating chocolates every day, etc.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more