For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టాన్సిల్ స్టోన్స్ లక్షణాలు, నివారణకై 10 గృహ చికిత్సలు

|

మీ గొంతు సంబంధిత సమస్యలకు ఒక్కోసారి టాన్సిల్ స్టోన్స్ కూడా కారణమయ్యే అవకాశాలు లేకపోలేదు. ఉదాహరణకు, టాన్సిల్ స్టోన్స్ లక్షణాలుగా తరచుగా నోటి దుర్వాసన, చెడు శ్వాస, తీవ్రమైన నొప్పి, సాధారణ పుల్లటి రుచి అనుభూతి లేదా ఒక లోహపు రుచి ఉండే అవకాశాలు ఉన్నాయి. మీరు ఈ లక్షణాలను అనుభవిస్తున్నట్లయితే, మీరు టాన్సిల్ స్టోన్స్ సమస్యతో బాధపడుతున్నారని అర్ధం. తరచుగా వీటి గురించి మీరు వింటూనే ఉంటారు, కానీ లక్షణాలు స్వయంగా అనుభవించే వారే కనుగొనగలరు. టాన్సిల్ రాళ్ల చికిత్స కోసం అనేక సహజసిద్దమైన చికిత్సా మార్గాలు ఉన్నాయి, కాని అన్నిటికంటే ముందుగా లక్షణాలు మరియు నివారణల గురించి తెలుసుకోవడం మంచిది.

టాన్సిల్స్ రాళ్ళు గొంతు వెనుకభాగంలో కండగల భాగంలో ఏర్పడే కాల్సిఫైడ్ పదార్థం యొక్క గడ్డలు వలె ఉంటాయి. ఇవి 0.3 నుండి 42 గ్రాముల మధ్య బరువు కలిగి ఉండే అవకాశాలు ఉన్నాయి, అంతేకాకుండా కాల్షియంనిక్షేపాలను కలిగి ఉంటాయి, అయితే అమ్మోనియా, భాస్వరం, మెగ్నీషియం మరియు కార్బొనేట్ వంటి ఇతర ఖనిజాలు కూడా చిన్న మొత్తాలలో ఉండవచ్చు. అనవసర పదార్ధాలు లేదా చెత్త, టాన్సిల్స్ మరియు కాల్సిఫైస్ భాగంలో చిక్కుకున్నప్పుడు టాన్సిల్స్ రాళ్ళు ఏర్పడుతాయి. ఈ రాళ్ళు బాక్టీరియా, చనిపోయిన కణాలను మరియు శ్లేష్మాన్ని కూడబెట్టుకోగలవు. శరీరంలోని అనవసర పదార్ధాలు సంచితం అయినప్పుడు, తెలుపు రంగులలో పాకెట్స్ ఆకృతులలో తయారయి, దీర్ఘకాలిక చెడుశ్వాస లేదా గొంతునొప్పి వంటి తీవ్రమైన సమస్యలకు కారణమవుతాయి, ఇతర టాన్సిల్ రాళ్ల లక్షణాలతో పోలిస్తే ఈ లక్షణాలే ఎక్కువగా కనిపిస్తుంటాయి.

Tonsil Stones Symptoms and 10 Home Natural Treatments

Imge Source Youtube

క్రింది టాన్సిల్ రాళ్ళ లక్షణాలు ప్రధానమైనవి :

• చెడుశ్వాస

• గొంతు మంట

• నిరంతర దగ్గు

• మ్రింగుటలో సమస్య

• చెవినొప్పి

• టాన్సిల్ వాపు

• టాన్సిల్స్ మీద తెలుపు లేదా పసుపు రంగులో శిధిలాలు పేర్కొనుట

టాన్సిల్ రాళ్ళను నివారించడానికి ఉత్తమ మార్గం, మంచి నోటి పరిశుభ్రతను పాటించడం మరియు సమతుల్య ఆహారాన్ని నిర్వహించడం. నీరు పుష్కలంగా తీసుకోవడంతోపాటు, విటమిన్లు మరియు ప్రోబయోటిక్స్ మీ శరీరానికి అందించడం ద్వారా టాన్సిల్స్ రాళ్ళలోని హానికరమైన బాక్టీరియాతో పోరాడటానికి సహాయపడుతుంది. ఈ బాక్టీరియా, ఆహార కణాలు మరియు ఇతర వ్యర్ధాల సంచితం వలన సంభవిస్తుంది, కాబట్టి మీ దంతాలను తరచూ శుభ్రం చేయడం మరియు క్రమంతప్పకుండా పుక్కిలించడం లేదా గోరువెచ్చని నీటితో గొంతులో గలగరించడం వంటివి కూడా టాన్సిల్స్ రాళ్ళను నిరోధించడానికి సహాయపడగలవు.

టాన్సిల్ రాళ్ల చికిత్స రాళ్ల పరిమాణంపై ఆధారపడి ఉంటుంది మరియు అవి కలిగించే అసౌకర్యం ప్రభావ స్థాయిని సూచిస్తుంది. వీటి నివారణలో, అందుబాటులోనే అనేక గృహ మరియు వైద్య చికిత్సల ఎంపికలు ఉన్నాయి. మీరు టాన్సిల్ రాళ్ళ లక్షణాలను ముందుగానే గమనిస్తే, గృహ నివారణల ద్వారానే సగం తగ్గించవచ్చు.

1. మెడిసిన్ డ్రాపర్

1. మెడిసిన్ డ్రాపర్

ఒక శుభ్రమైన మెడిసిన్ డ్రాపర్ ఉపయోగించి, దాని టిప్ టాన్సిల్స్ దగ్గరలో ఉంచేలా ప్రయత్నించి, మెడికల్ డ్రాపర్లోని రబ్బరు బల్బ్ నొక్కండి. ఇది ఒకసారి టాన్సిల్స్ ప్రాంతాన్ని తగిలాక, రబ్బర్ బల్బ్ నెమ్మదిగా వదిలి టాన్సిల్స్ రాయిని తొలగించవచ్చు. మీరు ఈ పద్ధతిలో సరైన వీక్షణను పొందడానికి ఒక చిన్న మరియు శక్తివంతమైన ఫ్లాష్లైట్ ఉపయోగించాల్సి ఉంటుంది. అంతేకాక మీ ప్రియమైనవారి సహకారం కూడా అవసరం, ఇక్కడ మీకు ఎక్కువ చేతులు అవసరం కావొచ్చు.

2. ఉప్పు నీరు

2. ఉప్పు నీరు

గోరువెచ్చని నీటిని ఒక గ్లాసులోకి తీసుకుని, 1/2 టీస్పూన్ ఉప్పుని కరిగించి, రాళ్లను కరిగించడానికి నోటిలో ఎక్కువసేపు గలగరించండి. గలగరించేటప్పుడు అత్యల్ప ధ్వని చేయడానికి ప్రయత్నిస్తున్నారని నిర్ధారించుకోండి. ఈ పనిచేయడం వలన మీ టాన్సిల్స్ అవతలివైపు ప్రాంతానికి ఈ ద్రావకం చేరుకోవడంలో సహాయపడుతుంది, ఆ ప్రాంతంలో రాళ్ళు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ రాళ్ళు గొంతుసమస్యలకు కారణంగా ఉంటే, ఈ పరిష్కారం నొప్పి నుండి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది

3. వెల్లుల్లి

3. వెల్లుల్లి

వెల్లుల్లి శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఒక ముడి వెల్లుల్లిరెబ్బని రోజులో పలుమార్లు చప్పరించడం ద్వారా టాన్సిల్ రాళ్ళను తొలగించడానికి సహాయపడతాయి. ఒకవేళ అలా చేయడం మీకు కష్టంగా అనిపిస్తే, చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి ప్రయత్నించండి. మిగిలిన భాగాలని గ్లాస్ నీటితో మింగేయవచ్చు.

గొంతు సమస్యల నివారణ కోసం ఈ ముడివెల్లుల్లి, టాన్సిల్ రాళ్ళను తొలగించడంలో ఎంతగానో సహాయపడుతుంది. తాజా వెల్లుల్లి ముక్కలను, స్వచ్చమైన ముడి తేనె మరియు కాయెన్ పెప్పర్తో కలిపి తీసుకోవచ్చు. ఈ బలమైన ఔషధ మిశ్రమం ఎటువంటి సమయంలో అయినా బాక్టీరియా తొలగింపునకు సహాయం చేస్తుంది.

5. నిమ్మరసం

5. నిమ్మరసం

టాన్సిల్ రాళ్లను కరిగించడానికి సహాయంచేసే క్రమంలో నిరంతరాయంగా క్రమంతప్పకుండా నిమ్మరసం తీసుకోవడం ఉత్తమంగా సూచించబడుతుంది. నిమ్మరసం యొక్క సహజ ఆమ్లత లక్షణాలు, టాన్సిల్ రాళ్ళతో సంపూర్ణంగా పోరాడే లక్షణాలను ప్రదర్శిస్తుంది. టాన్సిల్ రాళ్ళు లేదా టాన్సిల్ రాళ్ళ లక్షణాల చికిత్స కోసం, నేరుగా నిమ్మరసం త్రాగడం మంచిదిగా చెప్పబడింది. టాన్సిల్ రాళ్ళను నివారించడానికి మరియు అదనపు ఆరోగ్య ప్రయోజనాల కోసం, మీరు సాధారణంగా తీసుకునే నీటిలో కూడా నిమ్మరసం జోడించవచ్చు. ఇది మీ సాధారణ నీటికి ఒక గొప్ప, రిఫ్రెష్ రుచిని జోడించడమే కాకుండా, టాన్సిల్స్ నొప్పి నుండి ఉపశమనం లభించేలా దోహదం చేస్తుంది.

6. ఆపిల్ సైడర్ వెనిగర్

6. ఆపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్ సైడర్ వెనిగర్ వాడకం, మీ టాన్సిల్ రాళ్ళ సమస్యలను దూరంచేయడంలో సహాయం చేయగలదు. ఇది బలమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉండడమే కాకుండా, బలమైన యాంటీమైక్రోబయల్ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. కొన్ని సేంద్రియ ఆపిల్ సైడర్ వెనిగర్ను మోస్తరు గోరువెచ్చని నీటితో కలిపి, పుక్కిలించడం లేదా గలగరించడం చేయండి. తీవ్రంగా కాకుండా, స్వల్ప ధ్వని వచ్చేలా ఎక్కువ సేపు చేయండి. ఇలా చేయడం ద్వారా మీ టాన్సిల్స్ యొక్క లోతైన భాగాలను చేరుకోవడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ మిశ్రమానికి సహాయపడుతుంది. ఇక్కడ టాన్సిల్ రాళ్లు ఉంటాయి. క్రమంగా వీటి నొప్పి నుండి తక్షణ ఉపశమనం ఇవ్వడానికి సహాయపడగలదు.

7. యోగర్ట్

7. యోగర్ట్

యోగర్ట్ ప్రోబయోటిక్స్ కలిగి చెడు బ్యాక్టీరియా పోరాడటానికి సహాయపడే మంచి బ్యాక్టీరియాని కలిగి ఉంటుంది. టాన్సిల్స్ రాళ్ళను కరిగించడానికి క్రమం తప్పకుండా, స్నాక్స్లో భాగంగా యోగర్ట్ తీసుకోవడం ఉత్తమంగా సూచించబడింది. మీరు ప్రోబయోటిక్ ఎంపికను ఎంచుకుంటున్నారో లేదో నిర్ధారించుకోడానికి, లేబుల్ మీద "లివ్ అండ్ యాక్టివ్ కల్చర్స్" అని రాసి ఉందో లేదో చూడండి. లేదా ఇంగ్రీడెంట్స్ జాబితాలో ప్రోబయాటిక్ ఆప్షన్ చూడడం ద్వారా తెలుస్తుంది. మీరు సౌర్క్రాట్ లేదా కించి వంటి ఇతర ప్రోబయోటిక్ ఆహారాలను కూడా ప్రయత్నించవచ్చు.

8. యాపిల్స్

8. యాపిల్స్

ఆపిల్ మీ కడుపుకు చేరే క్రమంలోనే టాన్సిల్స్ రాళ్ళ మీద ప్రభావాలను చూపే లక్షణాలను ప్రదర్శిస్తుంది, ఆపిల్స్ 'తేలికపాటి ఆమ్లత లక్షణాలను కలిగి బ్యాక్టీరియాను తొలగించే శక్తిని కలిగి ఉంటుంది. క్రమంగా టాన్సిల్స్ రాళ్ళను కరిగించడానికి కూడా సహాయం చేస్తుంది.

9. టూత్ బ్రష్

9. టూత్ బ్రష్

టాన్సిల్ రాయి యొక్క స్థానం గుర్తించండి మరియు అవి తొలగే వరకు టాన్సిల్స్ ఉన్న ప్రాంతంలో టూత్ బ్రష్ కుంచెతో ఒత్తిడిని కలుగజేయండి. ఒత్తిడిని కలుగజేసాక, గోరువెచ్చని నీటిని ఉపయోగించి గలగరించడం ద్వారా తొలగించవచ్చు.

10. కాటన్ స్వాబ్(యియర్ బడ్)

10. కాటన్ స్వాబ్(యియర్ బడ్)

టాన్సిల్స్ మీద సున్నితంగా ఒత్తిడి కలుగజేయడానికి, టాన్సిల్స్ రాళ్ళ ప్రదేశాన్ని గుర్తించడానికి తడి చేసిన కాటన్ స్వాబ్స్ ఉపయోగించవచ్చు. ఈ కాటన్ స్వాబ్స్ టాన్సిల్ గోడల నుండి సున్నితంగా వాటిని తొలగించడంలో సహాయపడగలదు.

English summary

Tonsil Stones Symptoms and 10 Home Natural Treatments

The best way to prevent tonsil stones is to maintain good oral hygiene and a balanced diet. Drinking plenty of water and providing your body with vitamins and probiotics can help fight the harmful bacteria responsible for tonsil stones. This bacteria is caused by an accumulation of food particles and other debris, so brushing your teeth and gargling regularly can also help prevent tonsil stones.
Story first published: Saturday, September 1, 2018, 18:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more