అధిక చెమ‌ట‌ను త‌గ్గించే 10 అద్బుత హెమ్ రెమెడీస్‌

Posted By: sujeeth kumar
Subscribe to Boldsky

చెమ‌ట అనేది స‌హ‌జసిద్ధ‌మైన శారీర‌క ప్ర‌క్రియ‌. అది శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రిచేలా చేస్తుంది. శ‌రీర ఉష్ణోగ్ర‌త‌ను బ్యాలెన్స్ చేయ‌డంలో చెమ‌ట కీల‌క పాత్ర పోషిస్తుంది. వేడికి, భావోద్వేగానికి, తినే తిండి వ‌ల్ల ఎక్కువ‌గా చెమ‌ట ప‌డుతుంటుంది.

ఒక్కొక్క‌రికి ఒక్కోలా సంద‌ర్భాన్ని బ‌ట్టి స్వేదం చిందుతుంది. దీని వ‌ల్ల ప్ర‌త్యేకంగా ఆరోగ్య ప్ర‌యోజ‌నాలంటూ ఉండ‌వు కానీ శ‌రీరం ఎక్కువ వేడి కాకుండా చూసుకుంటుంది. అయితే ఎక్కువ‌గా చెమ‌ట ప‌ట్ట‌డం వ‌ల్ల చిరాకుగా అనిపించొచ్చు.

Top 10 Simple Home Remedies For Sweaty Hands That Will Blow Your Mind

అధికంగా చెమ‌ట ప‌ట్ట‌డాన్నే హైప‌ర్ హిడ్రోసిస్‌గా పిలుస్తారు. దీని వ‌ల్ల‌ అర‌చేతులు, అండ‌ర్ ఆర్మ్స్‌, కాళ్ల‌లో త‌డిత‌డిగా ఉంటుంది. వైద్య‌ప‌రంగా చెమ‌ట పైకి క‌నిపించే రుగ్మ‌త ఇది. సాధార‌ణంగా ఇంత ఎక్కువ‌గా చెమ‌ట అనేది ప‌ట్ట‌కూడ‌దు.

ఎవ‌రినైనా క‌లిసిన‌ప్పుడు త‌డి చేతులతో షేక్ హ్యాండ్ ఇస్తే బాగోదు. అధిక చెమ‌ట‌ మీ బ‌ట్ట‌ల‌ను, మీటింగ్స్‌, సంబంధాల‌ను పాడుచేయ‌గ‌ల‌దు. ఈ స‌మస్య ఒక‌లాంటి సోష‌ల్ ఫోబియాకు దారితీయ‌వ‌చ్చు. దీని వ‌ల్ల ఎవ‌రికైనా షేక్ హ్యాండ్ ఇవ్వాలంటే భ‌య‌మేస్తుంది.

మ‌రి దీనికి ప‌రిష్కారం కోసం చూస్తున్నారా.. ఇక్క‌డ ఈ స‌మ‌స్య‌ను త‌గ్గించుకునేందుకు కొన్ని మార్గాల‌ను సూచిస్తున్నాం. వాటిని ట్రై చేయండి.

1. మొక్క‌జొన్న పిండి

1. మొక్క‌జొన్న పిండి

దీన్ని ఎక్కువ‌గా సూప్‌ల‌లో, సాస్‌లలో చిక్క‌గా అయ్యేందుకు వాడ‌తారు. స‌హ‌జ‌సిద్ధంగా వీటికి నీటిని పీల్చుకునే గుణ‌ముంటుంది. చేతుల్లో కాళ్ల‌లో లేదా అండ‌ర్ ఆర్మ్స్‌లో చెమ‌ట త‌గ్గించేందుకు దీన్ని వాడొచ్చు. కొద్దిగా మొక్క జొన్న పిండి తీసుకొని అప్పుడ‌ప్పుడు చేతుల‌కు రాస్తూ ఉండాలి. దీని వ‌ల్ల ఎలాంటి దుర‌ద క‌ల‌గ‌దు. ఇది న్యాచుర‌ల్ యాంటీ పర్‌స‌పిరెంట్‌గా ప‌నిచేస్తుంది.

2. రోజ్ వాట‌ర్‌

2. రోజ్ వాట‌ర్‌

చ‌లికాలంలోనూ ఎక్కువ‌గా చెమ‌ట‌లు ప‌డుతుంటాయా? కొన్ని ర‌కాల హోమ్ రెమెడీస్‌తో వీటిని న‌యం చేయొచ్చు. ఈ స‌మ‌స్య‌కు రోజ్ వాట‌ర్‌ను ఉప‌యోగించ‌వ‌చ్చు. రోజ్‌వాట‌ర్‌, వెనిగ‌ర్ స‌మ‌పాళ్ల‌లో క‌లుపుకొని రోజు ఉద‌యాన్నే మ‌ర్ద‌నా చేసుకోవాలి. సొంతంగా రోజ్ వాట‌ర్ త‌యారీకి కొన్ని గులాబీ రేకుల‌ను నీళ్ల‌లో వేసి మ‌రిగించాలి. దీన్ని వ‌డ‌క‌ట్టి వాడుకోవ‌చ్చు. చిన్న సైజ్ దూది తీసుకొని ఈ మిశ్ర‌మంలో ముంచి అర‌చేతిపై రుద్దాలి. ఇది శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నాన్ని ఇస్తుంది.

3. బేకింగ్ సోడా

3. బేకింగ్ సోడా

త‌డి చేతుల‌కు ఇది బాగా ప‌నిచేస్తుంది. 3 టేబుల్ స్పూర్ల బేకింగ్ సోడాను గోరు వెచ్చ‌ని నీటితో త‌డ‌పాలి. దీన్ని చేతుల‌కు ప‌ట్టించి 20 నిమిషాలు ఆగాలి. మ‌ధ్య మ‌ధ్య‌లో చేతుల‌ను ఒక‌దానితో ఒక‌టి రుద్దుకోవాలి. ఇలా చేస్తే ఫ‌లితం త్వ‌ర‌లోనే క‌నిపిస్తుంది.

4. ట‌మాట రసం

4. ట‌మాట రసం

ట‌మాట ర‌సంలో ఉండే పోష‌క గుణాలు చెమ‌ట అర‌చేతుల‌ను న‌యం చేయ‌గ‌ల‌వు. ఇది శ‌రీర వేడిని చ‌ల్ల‌బ‌ర్చ‌గ‌ల‌దు. నేరుగా ట‌మాట ర‌సాన్ని తాగినా మంచిదే. కొన్ని నిమిషాలు ట‌మాట జ్యూస్‌లో చేతులను ముంచితే త‌డి పోయి పొడిగా మారుతుంది. ఇందులోని సోడియం వ‌ల్లే ఇది సాధ్య‌మ‌వుతుంది. ఐతే చేతుల‌పై ద‌ద్దుర్లు ఉంటే ఈ ప్ర‌యోగం చేయ‌కండి ఎందుకంటే ట‌మాట‌లో ఆమ్ల గుణం ఎక్కువ‌.

5. ఆల్క‌హాల్‌

5. ఆల్క‌హాల్‌

త‌ర‌చూ చేతుల‌ను ఆల్క‌హాల్‌తో తుడ‌వ‌డం వ‌ల్ల పొర‌లు మూసుకుపోతాయి. త‌ద్వారా చెమ‌ట రావ‌డం త‌గ్గుముఖం ప‌డుతుంది. కాస్త దూది తీసుకొని ఆల్క‌హాల్‌లో ముంచి చేతుల‌కు రాసుకోవ‌చ్చు. ఆఫీసులో దీన్ని ప్ర‌యోగించ‌డం సుల‌భం.

6. బ్లాక్ టీ

6. బ్లాక్ టీ

టీ, కాఫీలో ట్యానిన్‌, కెఫిన్‌లుంటాయి. 5 బ్లాక్ టీ బ్యాగులు తీసుకొని దాన్ని వేడి నీటిలో ముంచండి. బ్యాగులు తీసి వేడి నీటిని ఒక గిన్నెలో వేసుకోండి. ఇది చ‌ల్లారాక దీంట్లో చేతుల‌ను ముంచి ఒక 15-20 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ త‌ర్వాత బ‌య‌ట‌కు తీసి శుభ్రంగా తుడిచేస్తే స‌రి. టీలో ఉండే ట్యానిన్ చేతుల‌ను పొడిగా మార్చేయ‌గ‌ల‌దు.

 7. చ‌ల్ల నీళ్లు

7. చ‌ల్ల నీళ్లు

ప్ర‌తి రోజు అర గంట చెమ‌ట చేతుల‌ను చ‌ల్ల‌ని నీటిలో పెట్ట‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య‌ను త‌గ్గించుకోవ‌చ్చు. దీని వ‌ల్ల 3 గంట‌ల వ‌ర‌కు ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు.

8. నిమ్మ ర‌సం

8. నిమ్మ ర‌సం

నిమ్మ‌లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది న్యాచుర‌ల్ డియోడ‌రెంట్‌గా ప‌నిచేసి స్వేదాన్ని ఆప‌గ‌ల‌దు. అంతేకాదు బ్యాక్టీరియాను త‌రిమేసి చేతుల‌కు సువాస‌న‌ను తీసుకురాగ‌ల‌దు. అర చెక్క నిమ్మ‌కాయ‌ను అర‌చేతుల‌కు రుద్ది ఉంచాలి. రాత్రి మొత్తం ఉంచేసి ఉద‌యాన్నే లేవ‌గానే క‌డిగేసుకోవాలి. నిమ్మ‌ర‌సానికి సెన్సిటివ్‌గా ఉంటే కాస్త నీళ్ల‌తో ప‌ల్చ‌గా చేసుకొని వాడొచ్చు.

9. చంద‌న పొడి

9. చంద‌న పొడి

ఆయుర్వేదంలో వాడే తెల్ల చంద‌నం పొడికి చెమ‌ట‌ను పోగొట్టే అద్భుత‌మైన గుణ‌ముంది. చ‌ర్మంపై ఉండే తేమ‌ను చంద‌నం పీల్చుకోగ‌ల‌దు. 1 టేబుల్ స్పూన్ చంద‌నం పొడి తీసుకొని దాంట్లో నిమ్మ‌ర‌సం క‌ల‌పాలి, దీనికి రోజ్ వాట‌ర్ జ‌త‌చేసి స‌మ‌స్య ఉన్న చోట్ల రాసి 20 నిమిషాల త‌ర్వాత క‌డిగిస్తే స‌రి.

10. ఆలుగ‌డ్డ‌

10. ఆలుగ‌డ్డ‌

అధిక చెమ‌ట‌ను పోగొట్ట‌డంలో ఆలుగ‌డ్డ‌దీ కీల‌క పాత్రే. అర‌చేతుల్లో, కాళ్ల‌లో చెమ‌ట‌ను సుల‌భంగా పీల్చుకోగ‌ల‌దు. ఆలుజ్యూస్ లో దూది ముంచి చేతుల‌కు రుద్దుకోవ‌చ్చు. ఆ త‌ర్వాత కొన్ని నిమిషాల‌తో తుడిచేస్తే స‌రిపోతుంది.

English summary

Top 10 Simple Home Remedies For Sweaty Hands That Will Blow Your Mind

Top 10 Simple Home Remedies For Sweaty Hands That Will Blow Your Mind,These simple home remedies for sweaty hands will definitely blow your mind. Why? Because they are cheap, effective, and do not require much effort. Here’s one: corn starch.