For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ఎండకాలంలో ఈ కాయలు తింటే మీకు ఏ ఖాయాలా రాదు... అన్నీ చల్లబడతాయి

  |

  వేసవిలో కొన్ని రకాల కూరగాయాలు తీసుకోవడం చాలా అవసరం. అవి బాడీలోని ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి. మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే చాలా రకాల ప్రయోజనాలు వాటి వల్ల లభిస్తాయి. నీటిశాతం ఎక్కువగా ఉండే సొరకాయ శరీర ఉష్ణోగ్రతనీ కడుపులో మంటని తగ్గిస్తుంది. చెమట ద్వారా సోడియం పోకుండా చేస్తుంది. మధుమేహాన్ని, బీపీనీ అదుపులో ఉంచుతుంది. శరీరంలోని నీటిశాతాన్ని పెంచుతుంది.

  శరీరానికి చల్లదనం

  శరీరానికి చల్లదనం

  సొరకాయ శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. మన శరీరంలోని అధిక వేడిని బయటకు పంపి మనకు మేలు చేస్తుంది. శరీరం విపరీతమైన వేడితో బాధపడేవారు దీని రసం తాగడం వల్ల శరీరాన్ని కూల్ చేస్తుంది. సొరకాయలో నీటి శాతం అధికంగా ఉండటమే ఇందుకు కారణం. సొరకాయ మెదడు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

  కణాలు ఉత్తేజితం

  కణాలు ఉత్తేజితం

  మెదడులోని కణాలు ఉత్తేజితమవుతాయి. ఈ రోజుల్లో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుండటం, చాలామందికి నిద్రపట్టకుండా కళ్ళు మంటలు వస్తాయి. నువ్వుల నూనెతో సొరకాయ వేపుడు చేసుకుని తింటే నిద్ర సమస్యను అధిగమించవచ్చు. సొరకాయ సులభంగా జీర్ణమవుతుంది. మూత్రనాల జబ్బులకు సొరకాయ చాలా మంచిది. మలబద్థక, కాలేయ సమస్యను ఉన్నవారికి సొరకాయ చాలా మంచిది.

  పొట్లకాయ

  పొట్లకాయ

  పొట్లకాయ శరీరం పొడిబారకుండానూ, చల్లగానూ ఉండేలా చేస్తుంది.ఒకప్పుడు వారంలో రెండు సార్లైనా పొట్లకాయతో కూర చేసేవారు మన పెద్దవాళ్ళు. ఇప్పటిలా ఇంటర్నెట్లు, హెల్త్ వెబ్ సైట్స్ లేకపోయినా వాళ్ళకి అది తినటం వల్ల వచ్చే ప్రయోజనాలేంటో బాగా తెలుసు. రోజులు మారేసరికి కూరగాయల వాడకంలో కూడా మార్పులు వచ్చేసాయి. ఈ రోజుల్లో పిల్లలు పొట్లకాయ తినటానికి అంతగా ఆశక్తి చూపించటం లేదు. దానికి కారణం అందులో ఎన్ని పోషకవిలువలు దాగి ఉన్నాయో తెలియకపోవటమే అయ్యుంటుంది.

  పీచుపదార్ధాలు ఉంటాయి

  పీచుపదార్ధాలు ఉంటాయి

  పొట్లకాయలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇందులో ఎక్కువగా పీచుపదార్ధాలు ఉంటాయి. కేలరీలు అతి తక్కువగా ఉండటం వల్ల సన్నగా, నాజుకుగాతయ్యరవ్వాలనుకునేవారు దీనిని తప్పకుండా తినాలి. ప్రోటీన్లు సమృద్దిగా ఉండే ఈ కాయలో విటమిన్ ఏ,బి, సిలు తగిన పాళ్ళల్లో ఉంటాయట. మెగ్నీషియం, ఐరన్, పొటాషియం కూడా ఉండటం వల్ల మంచి మినరల్ ఫుడ్ అని చెప్పచ్చు.

  శరీరం చల్లబడుతుంది

  శరీరం చల్లబడుతుంది

  ఈ పొట్లకాయని ముఖ్యంగా ఎండా కాలంలో తినటం వల్ల శరీరం చల్లబడుతుంది. ఇది గుండెజబ్బులకి మంచి టానిక్ లాగా పనిచేస్తుంది. ఈ పొట్లపాదు ఆకుల్ని ప్రాకృతిక వైద్యంలో ఎక్కువగా వాడతారట. ఎన్నో వ్యాదుల్ని నయం చేయటమే కాకుండా, కొన్ని జబ్బులు మన దగ్గరికి కూడా చేరనీయకుండా చేసే సామర్ద్యం పోట్లకాయలో ఉంది.

  వాంతుల్ని అరికట్టే శక్తి

  వాంతుల్ని అరికట్టే శక్తి

  పిలల్లో పైత్యం వల్ల వచ్చే జ్వరాలకు పొట్లకాయ ఒక దివ్యౌషదంలా పనిచేస్తుందట. పొట్లకాయ,కొత్తిమీర రసాన్ని బాగా మరిగించి కషాయంలా చేసి మూడుపూటల ఒక స్పూన్ చొప్పున పడితే జ్వరం తగ్గుముఖం పడుతుందిట. దీని ఆకులకి వాంతుల్ని అరికట్టే శక్తి కుడా ఉందిట.

  షుగర్ పేషంట్స్ కి మేలు

  షుగర్ పేషంట్స్ కి మేలు

  పొట్లకాయ షుగర్ పేషంట్స్ కి కూడా చాలా ఉపయోగపడుతుంది. దీనిని ఆహారంలో తీసుకోవటం వల్ల ఎక్కువగా దాహం వెయ్యకుండా ఉంటుందిట. దీనిలో ఉండే నీటి శాతం మనిషికి దాహం వేయకుండా చూస్తుందిట. టైప్ 2 డయాబెటిస్ లో శరీర బరువు తగాతంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

  పరగడుపునే ఈ కషాయం తాగితే..

  పరగడుపునే ఈ కషాయం తాగితే..

  గుండె దడగా ఉన్నా, చాతిలో తరచూ నొప్పి వస్తున్నా పొట్లకాయ ఆకుల్ని రసంలా చేసి మూడుపూటలా 2 స్పూన్స్ చొప్పున ఇస్తే ఆ బాధ తగ్గుతుంది. పచ్చకామెర్లకు కూడా ఇదే చికిత్స మంచిదట. మంచి జీర్ణక్రియ కోసం ఎండబెట్టిన పోట్లకాయతో చేసిన కషాయం ఒక మంచి మందులా పనిచేస్తుంది. పరగడుపునే ఈ కషాయం తాగటం ఇంకా ఉత్తమం. ఇన్ని ఉపయోగాలు దాగి ఉన్న పొట్లకాయని వేసవి కాలంలో మన రోజువారి ఆహారంలో భాగంగా చేసుకుందాం.

  బూడిదగుమ్మడి

  బూడిదగుమ్మడి

  బూడిదగుమ్మడి వడదెబ్బ నుంచి రక్షిస్తుంది. బీపీతో పాటు ఆస్తమా, రక్త సంబందిత వ్యాధులు, మూత్ర సమస్యలూ ఇలా ఎన్నో వ్యాధుల్ని నివారిస్తుంది. తెలుగువారి ఇంటి ముంగిట గుమ్మడిపండును వేలాడదీయడం మనం నిత్యం చూస్తాము. బూడిదగుమ్మడిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. గుమ్మడి కూరగాను వడియాలు గాను వాడతాము. కడుపులో మంటగాని, ఉబ్బరంగాని, అతిదాహం ఉన్నప్పుడు బూడిదగుమ్మడిని తినడం వలన గ్యాస్ ట్రబుల్ నివారించవచ్చు.

  ఏలికపాములు వున్నప్పుడు

  ఏలికపాములు వున్నప్పుడు

  కడుపులో ఏలికపాములు వున్నప్పుడు గుమ్మడి గింజలను ఎండబెట్టి ఆ తరువాత దోరగా వేయించి, మెత్తగా దంచి ఉప్పు, కారం తగినంత కలుపుకొని తినవచ్చు అలా వాడితే కడుపులోని పురుగులు పడిపోతాయి. బూడిదగుమ్మడి రక్తపుష్టిని కలిగిస్తుంది. గర్భాశయ వ్యాధులతో బాధపడే స్త్రీలకు ఇది చలవ చేసి రక్తపుష్టిని కలిగించడానికి దోహదపడుతుంది.

  లివర్ వ్యాధుల నివారణకు

  లివర్ వ్యాధుల నివారణకు

  బూడిదగుమ్మడి లివర్ వ్యాధులన్నింటిలోను అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా కామెర్ల వ్యాధిలో తీవ్రతను తగ్గిస్తుంది. ఊపిరితిత్తుల వ్యాధులలో, టి.బి. వ్యాధిలోను నిస్సత్తువను పోగొడుతుంది. ఊపిరితిత్తులకు బలాన్ని యిస్తుంది. బూడిద గుమ్మడి మూత్రవ్యాధులలో చక్కగా పనిచేస్తుంది. మూత్రంలో మంటను చీము దోషమును తగ్గిస్తుంది.

  బూడిదగుమ్మడి తీసుకుంటే

  బూడిదగుమ్మడి తీసుకుంటే

  మొలలు వ్యాధిలో రక్తం పడుతున్న సందర్భంలో బూడిదగుమ్మడి తీసుకుంటే రక్తం పడటం ఆగుతుంది. మొలల వ్యాధితో బాధపడేవారు తమ చికిత్సలో బూడిదగుమ్మడి కూడా చేర్చితే వ్యాధి త్వరగా తగ్గుతుంది. బూడిద గుమ్మడి మెదడుకు చలువ చేస్తుంది. పిల్లలకు హల్వాలా తయారుచేసి పెడితే మెదడు చురుకుగా పనిచేస్తుంది. మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడి బాధపడుతున్నవారు బూడిదగుమ్మడి కాయతో మినపప్పు బదులుగా ఉలవలుతో వడియాలు పట్టుకుని తింటే మూత్రపిండాలలో రాళ్ళు కరుగుతాయి.

  బీరకాయ

  బీరకాయ

  బీరకాయ రక్తశుద్ధికి, రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. బీరకాయలో ఉన్న మేలెంతో తెలుసుకుంటే.. అస్సలు దాన్ని వదిలిపెట్టరు. సాధారణ, నేతి బీరకాయ- రెండు రకాల కాయల్లోనూ పీచు, విటమిన్‌-సి, జింక్‌, ఐరన్‌, రిబోఫ్లేవిన్‌, మెగ్నీషియం, థైమీన్‌... వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

  రక్తశుద్ధికీ

  రక్తశుద్ధికీ

  బీరకాయలోని పెప్టైడ్స్, ఆల్కలాయిడ్స్ రక్తంలోని, యూరిన్‌లోని చక్కెర నిల్వల శాతాన్ని చాలామటుకు తగ్గించేందుకు తోడ్పడతాయి. బీరకాయ రక్తశుద్ధికీ కాలేయ ఆరోగ్యానికీ కూడా తోడ్పడుతుంది. ఆల్కహాల్‌ వల్ల దెబ్బతిన్న కాలేయాన్నీ రక్షిస్తుంది. మందుబాబుల తీసుకునే ఆహారంలో బీరకాయ చేర్చితే వారి కాలేయానికి ఎలాంటి ఢోకా ఉండదు.

  కామెర్లు వచ్చినవాళ్లు..

  కామెర్లు వచ్చినవాళ్లు..

  కామెర్లు వచ్చినవాళ్లు బీరకాయ రసం తాగడంవల్ల మంచి ఫలితం ఉంటుందనీ దీనివల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లూ రావనీ రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుందనీ తేలింది. అల్సర్లూ మంటలతో బాధపడేవాళ్లకి బీరకాయ దివ్యౌషధంగా పనిచేస్తుంది. బీరకాయలోని విటమిన్‌-ఎ కంటికండరాల బలహీనత కారణంగా తలెత్తే అంధత్వాన్ని నివారిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులోని విటమిన్‌ బి5 చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందట. అంతేగాకుండా బీరకాయల్లోని విటమిన్‌ బి6 అనీమియాను నివారించగలదని కూడా ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

  కాకరకాయ

  కాకరకాయ

  కాకరకాయ చక్కెర వ్యాధిని అదుపులో ఉంచుతుంది. వేడి పొక్కులూ, చెమటకాయలూ, దద్దుర్లు లాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తుంది. కాకరకాయలో హైపోగ్లైసెమిక్‌ పదార్థాలు ఉంటాయి. ఇవి రక్తం, మూత్రంలోని షుగర్‌ లెవల్స్‌ ని తగ్గించడంలో సహాయపడతాయి. రోజూ కాకరకాయ రసాన్ని కొద్దిగా తీసుకుంటే డయాబెటిస్‌ దరిచేరకుండా ఉంటుంది. లివర్‌ శుభ్రపడుతుంది. అంతే కాకుండా రక్తంను శుభ్రపరచడంలో కాకరకాయ చాలా తోడ్పడుతుంది. రక్తంలోని మలినాల వల్ల కలిగే దుష్ప్రభావాలను ఇది నివారిస్తుంది.

  కొంచెం నిమ్మరసం కలుపుకుని

  కొంచెం నిమ్మరసం కలుపుకుని

  కాకరకాయ జ్యూస్‌లో కొంచెం నిమ్మరసం కలుపుకుని ప్రతిరోజు ఉదయం పరగడుపున తాగితే అనారోగ్యం దరిచేరదు. కాకరకాయ ఆకుల నుంచి తీసిన మూడు టీ స్పూన్‌ల రసాన్ని, ఒక గ్లాసు బట్టర్‌మిల్క్‌ తో కలిపి ప్రతి రోజు ఉదయం పరగడపున ఒక నెల రోజుల పాటు తీసుకుంటే పైల్స్‌ సమస్య చాలా వరకు తగ్గిపోతుంది.

  పైల్స్‌ ఉన్న చోట రాస్తే

  పైల్స్‌ ఉన్న చోట రాస్తే

  కాకరకాయ చెట్టు వేళ్లను పేస్టులా చేసి పైల్స్‌ ఉన్న చోట రాసుకుంటే ఉపశమనం లభిస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో కాకరకాయ జ్యూస్‌ బాగా ఉపకరిస్తుంది. ఇన్‌ఫెక్షన్లను ఎదుర్కొవడంలోనూ, రక్తంలోని మలినాలను తొలగించడంలోనూ తోడ్పడుతుంది. ఎండకాలంలో ఈ కాయలు తింటే మీకు ఏ ఖాయాలా అంటే ఏ రోగం రాదు.

  English summary

  top 5 indian vegetables to beat the heat this summer

  top 5 indian vegetables to beat the heat this summer
  Story first published: Saturday, May 12, 2018, 12:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more