For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎక్కువ కాలం బ్రతకాలని వుందా? కాఫీ తాగండి

|

ఒక కొత్త పరిశోధనలో తేలింది ఏంటంటే కొద్ది కొద్ది పరిమాణాల్లో కాఫీ తాగటం వల్ల మరణరేటు తగ్గుతుందని. ఈ అధ్యయనంలో పాల్గొన్న సగం మిలియన్ మంది కాఫీ తాగటం మరణరేటు తగ్గటంలో పాత్ర పోషిస్తుందని ఒప్పుకున్నారు.ఇందులో పాల్గొన్నవారు రోజుకి 1 నుండి 8 కప్పుల కాఫీ తాగేవాళ్ళు ఉన్నారు.

ఈ పరిశోధన కాఫీ రోజూ తాగటం ఆరోగ్యకరమైన డైట్ లో భాగమని నిరూపించటానికి ఆధారాలు సేకరించింది. ఏ కాఫీ అయినా కావచ్చు –పొడి పట్టుకునే కాఫీ, ఇన్స్ స్టంట్ కాఫీ, కెఫీన్ లేని కాఫీ ఏదైనా.

Want To Live Longer? Drink Coffee

అంతేకాదు, ఎక్కువగా కాఫీ తాగటం, ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపిస్తుందనే దానిపై చాలా వాదనలున్నాయి. కానీ కాఫీ తాగనివారిని రిఫెరెన్సు గ్రూపుగా చేసిన పరిశోధన తర్వాత, కాఫీ తాగటం వలన మరణ రేటు తగ్గిందని తేలింది.

అదనంగా, ఈ పరిశోధన గుండెవ్యాధులు,క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధులు సాధారణంగా మరణాలకి దాదాపు 20శాతం, 50శాతం,4శాతం కారణమవ్వచ్చని కనుక్కొంది. కాఫీకి, గుండెజబ్బులకి,క్యాన్సర్లకి పరిశోధకులు విలోమ సంబంధాన్ని కనుగొన్నారు. వీటిల్లో గుండెపోటు,కోలోరెక్టల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఉన్నాయి.

కానీ, పొడిపట్టిన కాఫీ, ఇన్స్ స్టంట్ కాఫీ, కెఫీన్ లేని కాఫీ వీటన్నిటినీ మరణరేటుతో పోల్చినప్పుడు, పొడిపట్టిన కాఫీకి బలమైన సంబంధం ఉన్నదని తేలింది.

ప్రతిరోజూ కాఫీ తాగటం మంచిదేనా?

చాలామందికి కాఫీ తాగటం వల్ల తాత్కాలికంగా చురుకుదనం వస్తుంది. కానీ ఇది ప్రతిఒక్కరికీ ఒక్కోలా ఉంటుంది. నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్ హెచ్ ఎస్) ప్రకారం, కాఫీని పరిమితంగా తీసుకోవాలి, గర్భవతులు 200 మిల్లీగ్రాముల కెఫీన్ కన్నా ఎక్కువ తీసుకోకూడదు

కానీ కాఫీ రోజూ తీసుకోవటం వల్ల ఇతర ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయి, అవేంటో కింద చదవండి.

1.కాఫీలో అవసరమైన పోషకాలుంటాయి

1.కాఫీలో అవసరమైన పోషకాలుంటాయి

కాఫీలో 11 శాతం విటమిన్ బి2, 6శాతం విటమిన్ బి5,2 శాతం విటమిన్ బి1, 2 శాతం విటమిన్ బి3,1 శాతం ఫోలేట్, 3 శాతం మాంగనీస్,3 శాతం పొటాషియం, 2 శాతం మెగ్నీషియం, 1 శాతం ఫాస్పరస్ ఉంటాయి.

2.కాఫీ మెదడు పనితీరును మెరుగుపర్చి మెటబాలిజాన్ని పెంచుతుంది

2.కాఫీ మెదడు పనితీరును మెరుగుపర్చి మెటబాలిజాన్ని పెంచుతుంది

ఒక కప్పు కాఫీలో కెఫీన్ 30 నుంచి 300 మిల్లీగ్రాములు ఉండవచ్చు,కానీ ఒక సగటు కప్పులో 90 నుంచి 100 మిల్లీగ్రాములు ఉంటుంది. కెఫీన్ మెదడు హార్మోన్ అయిన ఒక ఇన్హిబిటరీ న్యూరోట్రాన్స్మిటర్ - అడెనోసిన్ పనిని ఆపే ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది.

ఈ హార్మోన్ పనిని ఆపటం వలన, కెఫీన్ మెదడు పనితీరును పెంచి, ఇతర న్యూరో ట్రాన్స్మిటర్లైన డోపమైన్, నార్ ఎపినెఫ్రైన్ లను విడుదల చేస్తుంది. అందువల్లే మీకు అలసట తగ్గి, వెంటనే చురుగ్గా మారతారు.

కెఫీన్ 3 నుంచి 11 శాతం మెటబాలిజాన్ని పెంచి వ్యాయామం కూడా మెరుగ్గా చేసేలా చేస్తుంది.

3.కెఫీన్ టైప్ 2డయాబెటిస్ రిస్క్ ను తగ్గిస్తుంది

3.కెఫీన్ టైప్ 2డయాబెటిస్ రిస్క్ ను తగ్గిస్తుంది

టైప్ 2 డయాబెటిస్ సాధారణమైన ఆరోగ్య సమస్య, ఇది ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్ల మందిపై ప్రభావం చూపిస్తోంది.పరిశోధనల ప్రకారం రోజూ ఒక కప్పు కాఫీ తాగేవారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం 7 శాతం తగ్గుతుంది. అయితే మరి మీరు కూడా తాగటం మొదలుపెట్టి దాని ఆరోగ్య లాభాలను పొందండి.

4.కాలేయ వ్యాధుల రిస్కు తగ్గిస్తుంది

4.కాలేయ వ్యాధుల రిస్కు తగ్గిస్తుంది

శరీరంలో కాలేయం చాలా ముఖ్యమైన అవయవం, ఇది ఎక్కువ ఆల్కహాల్, ఫ్రక్టోస్ కి పాడవుతుంది. పాడయి సిర్రోసిస్ కి దారితీయవచ్చు.

కాలేయ సమస్యలు కాఫీ తాగేవారికి వచ్చే అవకాశం 84 శాతం తక్కువగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కాలేయ క్యాన్సర్ రెండవ క్యాన్సర్ మరణాలకి కారణం, అదే కాఫీ తాగటం దీన్ని 40 శాతం తగ్గిస్తుంది.

5.డెమెన్షియా రిస్కు తగ్గిస్తుంది

5.డెమెన్షియా రిస్కు తగ్గిస్తుంది

డెమెన్షియాకి అల్జీమర్స్ వ్యాధి ప్రధాన కారణం, అలాగే పరిశోధనల ప్రకారం కాఫీ తాగేవారికి అల్జీమర్స్ వచ్చే అవకాశం 65 శాతం తక్కువగా ఉంటుంది.ఇంకా, పార్కిన్ సన్స్ అనే మెదడుకి సంబంధించిన వ్యాధి వచ్చే అవకాశం కూడా కాఫీ తాగటం వలన 32 నుంచి 60 శాతం తగ్గుతుంది.

కాఫీ సైడ్ ఎఫెక్టులు

కాఫీ సైడ్ ఎఫెక్టులు

కాఫీకి కొన్ని సైడ్ ఎఫెక్టులు కూడా ఉన్నాయి. అవేంటో చూడండి.

1.కాఫీ వల్ల మానసిక ఆందోళన రావచ్చు

కాఫీ మీ నిద్ర నాణ్యతను తగ్గించి నిద్ర సమయాన్ని పాడుచేయవచ్చు. ఎక్కువ కెఫీన్ తీసుకోవడం వల్ల మానసిక ఆందోళన, గుండెదడ, జంకు, భయంలాంటివి రావచ్చు. కానీ ఈ ప్రభావాలు ఒక్కోరికి ఒక్కోలా ఉంటాయి.

2.అతిగా కెఫీన్ తీసుకోవడం వ్యసనానికి దారితీయవచ్చు

2.అతిగా కెఫీన్ తీసుకోవడం వ్యసనానికి దారితీయవచ్చు

కాఫీ తాగే వ్యక్తికి సమయం గడిచేకొద్దీ అది వ్యసనంగా మారవచ్చు. అదే మీరు ఒక్కసారిగా మానేస్తే విత్ డ్రాయల్ లక్షణాలైన తలనొప్పి, అలసట, చిరాకు, ఏకాగ్రత లేకపోవటం వంటివి కొన్నిరోజుల వరకూ ఉండవచ్చు.

English summary

Want To Live Longer? Drink Coffee

A new recent finding came to light saying that moderate coffee consumption has been associated with decreased mortality rate. This study that included of half a million people found that coffee drinking is linked with decreased mortality, including participants who drink 1 or up to 8 cups more per day.
Story first published: Thursday, July 19, 2018, 9:01 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more